👉ఏపీలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు:సీఎం చంద్రబాబు*
*ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లు..
అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీ పై ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎంచంద్రబాబు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘PMAY ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను రాయితీపై అందిస్తాం. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తాం. ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకూ ఎలక్ట్రిక్ వస్తువులపై సబ్సిడీ
ఇస్తాం’ అని చెప్పారు.
👉ఎన్ఎస్ఓ చీఫ్ గా శ్రీనివాసన్*
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి బి.శ్రీనివాసన్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదించినట్టు తెలిపింది. శ్రీనివాసన్ బీహార్ కేడర్ కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రాజ్గర్లోని బీహార్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అతను 2027 ఆగస్టు 31వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
👉ఓవైసి విద్యాసంస్థలకు హైడ్రా టెన్షన్!!..
ఏ క్షణంలోనైనా కూల్చేయవచ్చు!!*
*సలకం చెరువు ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు కట్టిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి.. దాదాపు 12 ఎకరాల చెరువు ఆక్రమణ..ఇప్పటికే రంగంలోకి దిగిన హైడ్రా… ఏ క్షణములోనైనా కూల్చేయొచ్చు! * కానీ విద్యార్థులు భవిష్యత్ దృశ్య ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా
* నిపుణులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంప్రదింపులు..* విద్యార్థులకు నష్టం రాకుండా అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు సమయం ఇవ్వాలన్న యోచనలో హైడ్రా ..* నేడు తేలనున్న ఒవైసి భవితవ్యం
👉హైడ్రాపై హైకోర్టుకు బడాబాబులు..
*ఇప్పటికే 200కు పైగా పిటిషన్లు..
*మొన్న జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ అనుచరుడు..
*తాజాగా నీలిమ విద్యాసంస్థలపై హైకోర్టుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి..*గడిచిన పదేండ్లలోనే అత్యధికంగా అక్రమ నిర్మాణాలు*హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు కొంత మంది బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ హైడ్రా కూల్చివేతలను ఆపే పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. హైడ్రాను తమవైపు రాకుండా అడ్డుకోవాలంటూ ఇప్పటి వరకు 200లకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. మొట్టమొదట కేటీఆర్ ఉంటున్న జన్వాడ ఫామ్ హౌజ్ కు సంబంధించిన ఫిటిషన్ హైకోర్టులో పడింది.
ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన నీలిమ విద్యా సంస్థల నిర్మాణాలపైకి హైడ్రా రాకుండా స్టే ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తరఫున కూడా కూల్చివేతలు ఆపాలంటూ పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తున్నది. చట్ట ప్రకారం హైడ్రా తనపని తాను చేసుకోవచ్చని ఇప్పటికే రెండు పిటిషన్ల విషయంలో హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కూల్చివేతల విషయంలో హైడ్రా కూడా పకడ్బందీగా ముందుకు వెళ్తాంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న క్రమంలో హీరో నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు..
కానీ స్టే ఆర్డర్ వచ్చేలోపు ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లో ని నిర్మాణాన్ని హైడ్రా నేలమట్టం చేసింది. ఎవరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారో వారికి సంబంధించి అక్రమ నిర్మాణాలు ఏ చెరువులో ఎంత ఉన్నాయో స్పష్టమైన ఆధారాలతో నివేదించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.. ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు..
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడంతో దాని ని ఆపడం కోర్టు వల్ల తప్ప ఎవరి వల్లా సాధ్యం కాదని బడాబాబులు భావిస్తున్నారు. హైడ్రా ఏర్పాటై నెలన్నర దాటింది. కేవలం ఈ 10 రోజుల వ్యవధిలోనే కూల్చివేతలు పెరిగాయి. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా తొలుత కోర్టుకు వెళ్లింది జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌజ్ పైనే కావడం గమనార్హం. ఆ ఫామ్ హౌస్ కూల్చవద్దని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ కు హైకోర్టు సూచించింది. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైడ్రా తనకున్న పరిధిలో చట్టప్రకారం నడుచుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతే తప్ప కూల్చివేతలు ఆపాలని చెప్పలేదు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ
పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా హైకోర్టు గడప తొక్కారు.వీరితోపాటు మల్లారెడ్డి, చెరువులు, కుంటలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన ఇతర మాజీ మంత్రులు, ప్రముఖులు కూడా సైలెంట్ గా కోర్టుల్లో పిటిషన్లు వేసినట్లు తెలుస్తున్నది.*కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సపోర్ట్..
అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరిని వదిలేది లేదని.. కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగినట్లే హైడ్రా దూకుడు కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు చెందిన సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి అక్రమ కట్టడాన్ని సైతం హైడ్రా నేలకూల్చింది. దీంతో హైడ్రా కూల్చివేతలు ఆపడం ఎవరి తరం కాదనే మెస్సేజ్ ను ప్రభుత్వం అక్రమార్కులకు బలంగా పంపింది.
నిజానికి హైడ్రా కూల్చివేతలు మొదలుకాగానే కొందరు నేతలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో హైకమాండు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. కానీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి తప్ప ప్రజలకు మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఆపాలని చెప్పవద్దంటూ మందలించడంతో అందరూ సైలెంట్అయిపోయినట్లు అధికార పార్టీలోనూ చర్చ జరుగుతోంది.
*శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి ముస్లిం జేఏసీ..*నంద్యాల:- బీసీ.ఈ కింద శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతి పత్రం అందించడం జరిగిందని నంద్యాల నియోజకవర్గ ముస్లిం జేఏసీ కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం కో కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ఇప్పటికే రెవిన్యూ శాఖ ద్వారా బీసీ.ఈ కింద కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు కానీ అందులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు విద్య అభ్యసించే విద్యార్థులకు ఉద్యోగాల వెళ్లే వారు ఏవైనా ప్రభుత్వ పథకాలు అందుకునే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదురు కుంటున్నారని తెలిపారు.టీడీపీ-జనసేన-బీజేపీ- కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా బీసీ. ఈ కింద ముస్లింలకు కూడా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్లిం జేఏసీ కార్యవర్గ సభ్యులు షేక్ ఇద్రిస్ రెహేమాన్. జుబేర్ పుణ సుహైల్ రానా ముల్లా ఖాజా. సర్దార్ పాల్గొన్నారు
👉నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న తమ బిడ్డపై యాజమాన్య సిబ్బంది జరిపిన అకృత్యం పై ఓ విద్యార్థి తండ్రి ఆవేదన…ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితిలో… ఈ అభ్యర్థన..బాలల హక్కుల సంరక్షణ చట్టం.( చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్)… ఏ ఉపాధ్యాయుడు ఏ కళాశాల యాజమాన్యం ప్రకారం.. పిల్లలను దండిచ్చే హక్కు పదిమందిలో మనస్థాపం కలిగించే లేదు… అలా కల్పించిన వారు చట్టరీత్యా నేరస్తులు పరిగణింప పడతారు…జరిగిన ఘటనపై… ఇంటర్ బోర్డు ఆర్ ఐ ఓ కి ఫిర్యాదు చేయమని కోరినాము…విద్యార్థి తల్లిదండ్రు సిద్ధమైతే పోలీస్ కేసు పెట్టవచ్చునువిద్యార్థి తల్లిదండ్రు సిద్ధమైతే గౌరవ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కి ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ ఐ ఓ గారికి రాష్ట్ర బోర్డు కార్యదర్శికి, చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి.. ఫిర్యాదు చేసేందుకు అసోసియేషన్ సిద్ధంగా ఉంది…ప్రశ్నిద్దాం…. మన పిల్లలకు ఉన్నతమైన హక్కులతో కూడిన విద్యనందిద్దాం…ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్…. విజయవాడ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిపై లెక్చరర్ అమానుష చర్య పై విచారణ జరిపి చర్య తీసుకోవాలని డిమాండ్..విజయవాడ భవానిపురం లో ని నారాయణ జూనియర్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కళాశాల యూనిఫామ్ వేసుకుని రాలేదని సోమవారం నాడు ఆ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ రవిశంకర్ విద్యార్థి శారీరక ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయకుండా 110 కేజీల బరువుతో అనారోగ్యంతో ఉన్న విద్యార్థి చేత 100 గుంజీలు తీయించి అమానుష చర్యకు పాల్పడ్డాడు విద్యార్థిని ఆసుపత్రి పాలు చేశాడు..విద్యార్థి స్కూల్ డ్రెస్ ఆటోలో పోతున్నందువల్ల చినిగిపోయింది.. కొత్త డ్రెస్ కుట్టుకునేందుకు టైలర్ కి ఇచ్చి ఉన్నానని చెబుతున్న విద్యార్థి మాటను పెడచెవిన పెట్టడమే కాకుండా అమానుష ఘటనకు పాల్పడ్డాడు.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇబ్బందులకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా కళాశాల యాజమాన్యం భవానిపురం అడ్రస్ పై ఇంటర్ బోర్డు నుండి జూనియర్ కళాశాల అనుమతులు తీసుకొని బెంజ్ సర్కిల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.ఘటనపై కళాశాల అక్రమ నిర్వహణపై సమగ్ర విచారణ జరపాలని యాజమాన్యం లెక్చరర్ పై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు
👉 హైదరాబాద్ : సీఐలు, ఎస్‌ఐలు బదిలీ..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 19 మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
👉నూజివీడు ట్రిపుల్ ఐటీ.. 800 మందికి అస్వస్థత!..
ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడు తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తెలిపింది. దీని పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి తక్షణమే మెరుగైన చికిత్సల కోసం చర్యలు తీసుకో వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
👉జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైడ్రా.. ఎవరి నోట విన్నా ఇదే మాట ..*ఖమ్మం..అక్రమంగా చెరువులు, శిఖం భూములు, నాలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా దూకుడు పెంచిన విషయం తెలిసిందే.
నిర్మాణం అక్రమమని, కబ్జా చేసి నిర్మించారని తెలిస్తే చాలు బుల్డోజర్ల సాయంతో వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. ఈ విషయంలో పలు రాజకీయ పక్షాలు, నాయకులు హైడ్రా పనితీరును మెచ్చుకోవడమే కాకుండా తమ జిల్లాలకు విస్తరించాలని వినతులు ఇస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ ప్రక్రియ ఒక్క హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా జిల్లాలో ఆక్రమణకు గురైన చెరువులను రక్షించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టిన సీఎం అధికారులు అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..* భూముల ధరలకు రెక్కలు రావడం.. ఎకరా భూమి కోట్ల రూపాయలు పలుకుతుండటంతో అక్రమార్కులు చెరువుల దగ్గర భూములను ఎంచుకుని ఎకరాల కొద్ది కొట్టేసిన విషయం స్పష్టం. హైడ్రా ఒకటి వస్తుందని, రానున్న రోజుల్లో తమకు ఇబ్బందులు తప్పవనే విషయం గుర్తించని అక్రమార్కులు జిల్లాలో అనేక చెరువులను కబ్జా చేశారు. వెంచర్ల పేరిట అనుమతులు తీసుకుని పక్కనే ఉన్న చెరువు భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విక్రయించారు. కొందరు ఏకంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పరిధిలో హైడ్రా ఏర్పాటు చేయడంతో ఇక్కడి అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారా? వస్తే ఎలా ఉంటుంది? ఎవరెవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏ ఏ చెరువులు కబ్జాకు గురయ్యాయి? అనే విషయాల మీద అనేకమంది ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏ ఇద్దరు రియల్టర్లు, రాజకీయ నాయకులు కలిసిన ఈ విషయం మీదే మాట్లాడుకోవడం విశేషం.
*ప్రధానంగా లకారం.. మున్నేరు..*
ఖమ్మంలో ప్రధానంగా లకారం చెరువు దాదాపు 200 పైగా ఎకరాల్లో విస్తరించింది. ప్రస్తుతం అది వంద ఎకరాలకు కుంచించుకుపోయిన ట్లు సమాచారం. లకారం ఖమ్మం నగరం నడిబొడ్డున ఉండటం.. నాలుగు దిశలలో పూర్తిస్థాయిలో వివిధ నిర్మాణాలు చోటుచేసుకోవడం, అంతేకాకుండా ప్రభుత్వ భూమిని సంవత్సరాల కొద్ది లీజు పేరిట తీసుకుని భవనాలు నిర్మించుకుని వ్యాపారాలు చేయడంతో లకారం రూపురేఖలు మారిపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లలో అనేక నిర్మాణాలు జరగడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా వరదలు రావడం వందలాది కుటుంబాలను ప్రతీ ఏటా షెల్టర్లకు తరలించడం సాధారణంగా మారింది. ఈ ఆక్రమణల కారణంగానే ఏ చిన్నపాటి వర్షం వచ్చినా నగరం వరద ప్రవాహంలో మునిగిపోతుందని, అస్తవ్యస్తంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అనేక చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయని, అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులను, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది.
*పార్టీలకతీతంగా మద్దతు..* అక్రమ నిర్మాణాలను కూల్చివేసి..చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. సొంత ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గాలను విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిస్టమ్ ను ఇంప్లిమెంట్ చేయాలని లేఖలు ఇస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా ప్రశంసలు వస్తుండటంతో పాటు పలు సూచనలు కూడా చేస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వినతులతో తమ దగ్గరకు వచ్చిన ప్రజలతో మంత్రులు కూడా ఈ విషయమై ఆరా తీస్తు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ కూల్చివేతల విషయంలో ప్రజలు, యూత్ ఏమనుకుంటున్నారు? పర్యావరణ వేత్తల అభిప్రాయం ఏంటి? భవిష్యత్‌లో జిల్లాలకు విస్తరిస్తే ఎలా ఉంటుంది? అనే విషయమై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు అభిప్రాయం పాజిటివ్‌గానే ఉన్నట్లు టాక్ వస్తుంది. 👉ఖమ్మం నుంచి అనేక ఫిర్యాదులు..ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువులు, కుంటల కబ్జా విషయంలో ఖమ్మం నుంచి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులు ఆక్రమణ విషయంలోనే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించారని, ప్రభుత్వ భూములు ఆక్రమించారని, వాటిని విడిపించే వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేయాలని వినతులు
👉 హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను టార్గెట్ చేయడానికే పెట్టినట్లు ఉంది.హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు.. ముందుగా తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
10-20 ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరుపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌ను కూడా హైకోర్టు ప్రశ్నించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌లో పరిధిలో ఉన్న కావూరి హిల్స్ కాలనీలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి.. కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.అదే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఇనార్బిట్ మాల్, రహేజా టవర్స్‌కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. హైదరాబాద్ మహా నగరంలో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయి. వారందరికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదు.. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారని హైకోర్టు అడిగింది.కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
👉 ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని.. 2 రోజుల్లో చెక్క వంతెన నిర్మించుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రజలు..
ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని.. 2 రోజుల్లో చెక్క వంతెన నిర్మించుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఛత్తీస్‌గఢ్ లోని కంకేర్లో కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని అక్కడి గ్రామస్థులు 15 ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో గ్రామస్థులే ముందుకొచ్చారు. 2 భాగాలుగా ఉన్న ఈ వంతెనను చెక్కలతో 2 రోజుల్లోనే నిర్మించి హౌరా అనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వంతెన నిర్మాణంతో 45 కి.మీగా ఉన్న దూరం 10 కి.మీకు తగ్గింది. వర్షాలకు చినార్ నది పొంగడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు చెప్పారు.
👉 గుంటూరు రేంజ్ లో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్…
గుంటూరు రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్ ఇస్తూ రేంజ్ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన ఆయా సీఐల వివరాలు…
బాపట్ల డీటీసీలో ఉన్న సీహెచ్ సింగయ్యను గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐగా,ఏసీబీలో ఉన్న బి.రవీంద్రబాబును ఫిరంగిపురం సీఐగా,రేంజ్ వీఆర్ లో ఉన్న పి.భాస్కర్ ను గురజాల సీఐగా ,కృష్ణపట్నం పోర్టు సీఐ కె.వెంకటరెడ్డిని,నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సీఐగా,రేంజ్ వీఆర్ లో ఉన్న కె.రామకృష్ణను నెల్లూరు నార్త్ ట్రాఫిక్ సీఐగా నియమించారు.