మీడియా ధైర్యంగా పనిచేయాలి- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..కంగనా వ్యాఖ్యలపై మండిపడిన వీహెచ్..అవినీతి అధికారులపై చర్యలు*సీఎం రేవంత్ రెడ్డి..ఓటుకు నోటు కేసు పూర్తిగా డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు..తప్పు జరిగిన వెంటనే శిక్ష పడాలి : సీతక్క..ప్రకాశం జిల్లాలో నోబెల్ బహుమతి గ్రహీత పర్యటన..ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్..

👉మీడియా ధైర్యంగా పనిచేయాలి*రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..ప్రసారమాధ్యమాలు దైర్యంగా పనిచేయాలని *రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము* సూచించారు.★ పిటిఐ 77 వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం వార్తా సంస్థల ఏడిటర్ల సమావేషంలో ఆమె మాట్లాడారు.★ ఒత్తిళ్లకు లొంగకుండా….ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు.★ దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో *ఫోర్త్ ఎస్టేట్ పాత్ర* అత్యంత కీలకమని పేర్కొన్నారు.★మీడియా ఎల్లప్పుడూ సత్యానికే అండగా ఉండాలి. సత్యం మార్గం నుంచి పక్కకు వెళ్ళొద్దన్నారు.

**కంగనా వ్యాఖ్యలు.. మండిపడిన వీహెచ్..*పీఎస్‌లో కేసు నమోదు..గాంధీ భవన్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ, బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కంగనాపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. కాగా.. రాహుల్ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన వీహెచ్… పాపులారిటీ కావడం కోసమే కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె ఏదున్నా పార్లమెంట్‌లో మాట్లాడాలని సూచించారు. రాహుల్‌కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని.. రాహుల్‌తోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించిందని మండిపడ్డారు.

👉న్యూ ఢిల్లీ*ఓటుకు నోటు కేసు పూర్తి గా డిస్మిస్ చేసిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు…*
👉ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..*
ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసు ట్రయల్‌ని భోపాల్‌కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జగదీష్ రెడ్డి దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణను ముగించింది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని నియమిస్తామని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్ గవాయ్ అన్నారు.కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్‌లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్‌లో కూడా వైఖరి మారిందని జగదీష్ రెడ్డి న్యాయవాది తెలిపారు. ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ని నియమించే వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్ గవాయి తెలిపారు.
పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని.. పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘మా న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం’ అని జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణకు చెందిన తమ సహచరులను సంప్రదించి ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్ గవాయి వెల్లడించారు. పిటిషన్‌పై విచారణను త్రిసభ్య ధర్మాసనం ముగించింది. స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని సుప్రీంకోర్టు నియమిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

👉హైడ్రా గుడ్ వర్క్..

హైదరాబాద్ మహానగరంలో చెరువులు ఇతర జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ భేష్ అని వీహెచ్ పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చక్కగా పని చేస్తున్నారని కితబిచ్చారు. అయితే ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే.. వారికి వేరే చోట డబల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల అక్రమాలు ఉన్నాయని తేలినా.. కూల్చేయా లని చెప్పడం మంచి విషయమని వీహెచ్ అన్నారు.

👉అవినీతి అధికారులపై చర్యలు*సీఎం రేవంత్ రెడ్డి*. హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. కొందరు అధికారులు డబ్బులు డిమాండ్‌ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ, విజిలెన్స్‌ ఫోకస్‌ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు.

👉నేరాలను కట్టడి చేయాలంటే తప్పు జరిగిన వెంటనే శిక్ష పడాలి : సీతక్క*ప్రస్తుతం హైడ్రాపై ఎలా చర్చ జరుగుతుందో.. మహిళల భద్రతపై అంతలా చర్చ జరగాలన్నారు మంత్రి సీతక్క. నేరాలను కట్టడి చేయాలంటే తప్పు జరిగిన వెంటనే శిక్ష పడాలన్నారు. నేరాలు జరగకుండా ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే తరగతి గదుల నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలన్నారు సీతక్క.మాదక ద్రవ్యాల ప్రభావం హత్యలకు కారణం అవుతోందన్నారు సీతక్క. పని ప్రదేశాల్లో మహిళలు క్షేమంగా ఉండాలని చెప్పారు. కోల్ కతా మహిళా డాక్టర్ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిందన్నారు. ఎక్కడైనా ఎవరిపైనా ఏ ఘటన జరిగినా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు. విమెన్ సేఫ్టీ వింగ్ తో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి నేరాల కంట్రోల్ కు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లో చట్టాల గురించి తెలియజేసేలా కృషి చేస్తామన్నారు సీతక్క…

👉 కడప జిల్లా…చాపాడు మండలం లక్ష్మీపేట, వీరభద్రపురం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి… బుదవారం లూ
అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పొలం వద్ద నుండి వస్తుండగా కాపుగాసి కట్టెలు రాళ్లతో సురేంద్రరెడ్డి,చంద్రమోహన్ రెడ్డిలను వెంబడించి కొట్టిన వైనం…బాధితులకు వైసీపీ నాయకులకు మధ్య కొద్దీ సంవత్సరాలుగా పొలం వివాదం..
టిడిపి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతుగా ఉన్నామన్న కక్ష తోనే తమపై దాడి చేశారని తెలిపిన బాధితులు…తలకు తీవ్ర గాయాలు, గాయపడ్డ బాధితులును ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..ఈ ఘటనలో ఏడుగురుపై ఫిర్యాదు విచారణ చేపట్టిన చాపాడు పోలీసులు
👉 దోర్నాలలో మినీ సినిమా ధియేటర్ ప్రారంభించిన కందుల నారాయణ రెడ్డి , ఎరిక్షన్ బాబు*
దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో శ్రీశైల భ్రమరాంబ మినీ సినిమా ధీయేటర్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి , యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు , టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి మరియు టీడీపీ కూటమి నాయకులు.
👉 నోబెల్ బహుమతి గ్రహీత,బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి ప్రకాశం జిల్లా పర్యటన…ఒంగోలు వచ్చిన కైలాష్ సత్యార్థి.

కలెక్టరేట్లో ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఇతర అధికారులు.. కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సత్యార్థి.బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాష్.
👉 ఒంగోలు పట్టణంలో..బంగారు బాల్యం వర్క్‌ షాప్ లొ పాల్గొన్ననోబెల్ శాంతి బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త .కైలాష్ సత్యార్థి,జిల్లా కలెక్టర్  ఏ.తమీమ్ అన్సారియా,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి,జిల్లా ఎస్పీ .దామోదర్
👉 చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పి ఆగ్రహం
పల్నాడు జిల్లా ..ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీస్ అధికారులు..ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా వేడుకల్లో పాల్గొనటoతో ఎస్పి శ్రీనివాసరావు ఆగ్రహంఘటనపై వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ చిలకలూరిపేట టౌన్,రూరల్ సిఐలు సుబ్బనాయుడు, రమేష్ లతో పాటు ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు,చెన్నకేశవులు, బాలకృష్ణలకు మెమోలు జారీ చిలకలూరిపేట ట్రాఫిక్ ఎఎస్సై ప్రసాద్ నాయక్,హోంగార్డు వీరయ్యకు నోటీసులు జారీ కార్యాలయంకి వచ్చి వివరణ ఇవ్వాలని ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాలు.

👉జిల్లా ఆసుపత్రి లో ఖాళీగా వున్న వైద్యుల పోస్టులను భర్తీ చేయండి..*సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ*
*జిల్లా నాయకుడు గాలి రవిరాజ్*
నంద్యాల జిల్లాలో పేరుకే జిల్లా ఆసుపత్రి సమస్యలకు అది నిలయఆసుపత్రి అని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు నంద్యాల జిల్లా ఆసుపత్రి లో ఖాళీగా వున్నా గుండెకు సంబందించిన డాక్టర్ మరియు ఊపిరితిత్తులకు సంబందించిన డాక్టర్ లేకపోవడంతో వాటికి సంబందించిన రోగులు ప్రైవేటు ఆసుపత్రికి పోయి ఆస్తులు గుల్ల చేసుకుంటున్నారని వారు ఆరోపించారు సమస్యలకు నిలయంగా మారిన ఆసుపత్రి బాగోగులు ఎవరికి పట్టవా అని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ అధికారులను నాయకులను సూటిగా ప్రశ్నించారు ఆసుపత్రి ఆవరణలో పందులు కుక్కలు మరియు చెత్త చేదారం పెరుకపోయినా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని వారు ఆరోపించారు ఆసుపత్రి ఆవరణలో బైకులు వాహనాలు సరైన పద్ధతి లో పెట్టకపోవడం గేట్ ఎదురుగా ఆటోలు ఇష్టం వచ్చినట్టు పెట్టడం వలన అంబులెన్సు లకు ఇబ్బందులు పడుతున్నాయని పలుమార్లు విన్నవించుకున్న చెవిటివాడి ముందు శంఖం వూదిన చందంగా తయారైందని వారు ఆరోపించారు పేసెంట్ల పట్ల నిర్లక్ష్య వైఖరి మారాలని వారిపట్ల సంయుకంగా వుండాలని వారు సూసించారు డాక్టర్స్ పనివేళ్లలో పేసెంట్ ను చూసే సమయం లో సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా చూస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి లో నెల కొక సారి జరిపే సమావేశాలకు ప్రజా సంఘాలకు కూడా అవకాశం ఇస్తే అక్కడ వున్నా సమస్యలను తెలియజేసి వాటిని సరిచేసుకోవడానికి వీలుపడుతుందని వారు కోరారు సమస్యలకు నిలయంగా మారిన జిల్లా ఆసుపత్రి లో సమస్యలు పరిష్కరించాలని లేని తరుణం లో ఆసుపత్రి ఆవరణంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు
👉 హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. షంషేర్‌గంజ్‌ ఎస్‌బీఐ మాజీ మేనేజర్‌ మధుబాబు, సందీప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షంషేర్‌గంజ్‌ ఎస్‌బీఐకి చెందిన ఆరు ఖాతాల నుంచి రెండు నెలల్లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బ్రాంచ్‌ మేనేజర్‌ మధుబాబు ఆరుగురు క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు కరెంట్‌ అకౌంట్లు తెరిచినట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్‌ షోయబ్‌ అనే వ్యక్తి ఖాతాలు తెరిపించి ఖాతాదారులకు రూ.20 నుంచి రూ.30వేల వరకు, మధుబాబుకు కమీషన్లు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కేసులోనే రెండ్రోజుల కిందట మహ్మద్‌ షోయబ్‌, అహ్మద్‌ బవజీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
👉 నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్‌ సోదరుడు
2015లో అమర్‌సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశా
కొనుగోలు సమయంలో ఎఫ్‌టీఎల్‌లో ఉందనే సమాచారం లేదుFTLలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి
👉 పల్నాడు జిల్లా..చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పి ఆగ్రహం..ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీస్ అధికారులు..ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా వేడుకల్లో పాల్గొనటoతో ఎస్పి శ్రీనివాసరావు ఆగ్రహం…ఘటనపై వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ..చిలకలూరిపేట టౌన్,రూరల్ సిఐలు సుబ్బనాయుడు, రమేష్ లతో పాటు ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణలకు మెమోలు జారీ..చిలకలూరిపేట ట్రాఫిక్ ఎఎస్సై ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు జారీ
కార్యాలయంకి వచ్చి వివరణ ఇవ్వాలని ఎస్పి శ్రీనివాసరావు ఆదేశాలు.

👉మార్కాపురంలోని పిడిసిసి బ్యాంకులో విధి నిర్వహణలో ఉన్న బ్యాంకు మేనేజర్ గుండెపోటుతో మృతి…. సీసీ టీవీలో నమోదైన దృశ్యాలు.
👉నిజాయితిని చాటుకున్న పాత్రికేయుడు:
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలంలో ప్రజాశక్తి దినపత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షుడు చాట్ల విజయకుమార్ తన నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే విజయకుమార్ కు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఎకౌంట్లో ఒక వ్యక్తి ఫోన్ పే ద్వారా పదివేల రూపాయలు జమా అయ్యాయి. ఇది గమనించి స్ధానిక పోలీసు స్టేషన్ ఎస్ ఐ మోహనరావుకు సమాచారం అందించారు. అనంతరం పోలీసు స్టేషన్ కి ఎస్ ఐ మోహనరావు కు ఆ నగదును అందజేయగా ఎస్ ఐ వివరాలు తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా, నాగుల ఉప్పలపాడు మండలం, కళ్లగొండ్ల గ్రామానికి చెందిన ఓంకారం రామాంజనేయులు కు చెందినవిగా గుర్తించి అతని అకౌంట్ కు జమ చేశారు. అనంతరం పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త చాట్ల విజయకుమార్ ను పోలీసులు అభినందించారు.
👉 గుంటూరు..భ్రమరా టౌన్ షిప్ అధినేత గళ్ళా రామచంద్రరావు కామెంట్స్*భ్రమరా టౌన్ షిప్ లో అనేక చోట్ల వెంచర్లు వేసాం…అనేక మంది వద్ద పొలాలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నాం.ఎమ్మెల్యే భర్త అని కొన్ని మీడియా సంస్థలు నా పై బురద చల్లుతున్నారు.పిడుగురాళ్ల లో వేసిన వెంచర్ లో భూమి చల్లా రమేష్ వద్ద కొనుగోలు చేసాం..వెంకట్రావు తో మాకు ఎటువంటి సమస్య‌‌‌ లేదు.పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సింది రమేష్..నా భార్య ఎమ్మెల్యే కాక ముందు నుండి వ్యాపారం చేస్తున్నాం..వైసీపీ ప్రభుత్వం హయాంలో మేము చాలా నష్టపోయాం..గతం లో వెంచర్ లో వేసిన రోడ్డులు కూడా ప్రొక్లైన్ల తో రోడ్లు ధ్వంసం చేశారు.పోలీసుస్టేషన్ లో రోడ్లు ధ్వంసం చేసిన వారిపై కేసు పెట్టినా నమోదు చేయలేదు.ప్రజలకు సేవ చేసేందుకే మేము రాజకీయాల్లోకి వచ్చాము.పేద కుటుంబం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీలో సిటు తెచ్చుకొని ఎమ్మెల్యే గా గెలిచాం.

**ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్..*

బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ డీజీపీ వ్యాఖ్యలు చేశారు.ద్వారకా తిరుమలరావు కీలకఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందేననిఅన్నారు. ఎంతటి స్థాయి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, వైసీపీనేతలతో పాటు కొందరు ఐపీఎస్లు తనను వేధించారని జెత్వానీ ఆరోపించింది.👉కాదంబరి కేసు.. ఐపీఎస్ లకు టెన్షన్..*అక్రమ కేసులతో కొందరు వైసీపీ నేతలు, ఐపీఎస్లువేధించారని బాలీవుడ్ హీరోయిన్ కాదంబరీ జత్వానీ ఆరోపించింది. దీనిపై ఆమెకు పలువురు మద్దతుప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను వేధించిన నలుగురు ఐపీఎస్లకు ఉచ్చు బిగుస్తోంది. వారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు సిద్ధంఅవుతోందని సమాచారం. ప్రస్తుతం ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

**పెళ్లిలో మటన్ కోసం తలలు పగులగొట్టుకున్నారు..! నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో ‘మటన్ కర్రీ’ చిచ్చు పెట్టింది. పెళ్లికొడుకు తరఫు వారికి మాంసం తక్కువ వేశారని గొడవ మొదలైంది. అది కాస్తా కర్రలు, రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

**నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో కేటరర్స్‌ ప్రక్షాళనకు సర్కార్ అడుగులు. ఆరు హాస్టల్స్‌కి ఫుడ్‌ సప్లై చేస్తున్న ఫైన్‌ కేటరర్స్‌, అనూష కేటరర్స్‌, KMK కేటరర్స్. కేటరర్స్‌పై చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రూ.4.89 లక్షల జరిమానా విధించినా మారని ఫైన్‌ కేటరర్స్‌ తీరు. అనూష కేటరర్స్‌కి రూ.2.83 లక్షలు జరిమానా విధించిన డైరెక్టర్‌. కేటరర్స్‌ను మార్చేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం