ఏపీ ప్రజలకు పవన్ కీలక పిలుపు..
ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం పవన్ మాట్లాడుతూ.. ‘దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలి. వన మహోత్సవంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి. ఇది ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు.’ అన్నారు.
👉 ర్యాగింగ్ భూతానికి ఇంజినీరింగ్ విద్యార్థి బలి… ర్యాగింగ్ భూతానికి ఇంజినీరింగ్ విద్యార్థి బలి అయ్యాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో YSR జిల్లా జీవీ సత్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్(19) ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23న ఇంటికి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు చెప్పలేక మనోవేదన చెంది 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి నిన్న మృతిచెందాడు.
👉మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను సెప్టెంబరు 19 వ తేదీన* నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 7 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 17న నిమజ్జనం ఉన్న విషయం చర్చకు వచ్చిన సందర్భంలో మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి సూచనల మేరకు సమీక్ష అనంతరం ఈ అంశంపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మిలాద్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 16 న మిలాద్-ఉన్-నబీ వేడుకలు నిర్వహించి, ప్రదర్శనలను మాత్రం వాయిదా వేసుకోవడానికి ఈ సందర్భంగా మిలాద్ కమిటీ అంగీకరించింది…
👉 మంత్రి గారి వార్త రాస్తే మర్యాదగా ఉండదు..!!!
*అనంతపురం:*
▪️బీసీ హాస్టల్స్ లో వసతుల కల్పనపై వార్త రాస్తే మంత్రి అనుచరుల బెదిరింపులు.▪️విద్యార్థి మృతి పట్ల విచారణ కావాలి, తల్లీ తండ్రులకు నాయ్యం కావాలని ప్రశ్నిస్తే తప్పా???.▪️విద్యార్థి మృతి పట్ల గళం విప్పిన విద్యార్ధి సంఘాల నాయకులకే ఏకంగా బెదిరింపు కాల్స్.
▪️మంత్రీ గారు పేషి నుండీ మాట్లాడుతున్నాం అంటు కాల్స్ చేస్తున్న మంత్రీ అనుచరులు.
▪️ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రశ్నిస్తే ఆహా… ఓహో … అబ్బో … శభాష్… అధికార పార్టీలో ఉన్నపుడు ప్రశ్నిస్తే మాత్రం తప్పు…??? ▪️బీసీ హాస్టల్స్ లో జరుగుతున్న అవినీతి,ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పై చర్యలు శూన్యం.▪️బీసీ హాస్టల్స్ కనిపించని సిబ్బంది.
▪️ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరో విద్యార్థి ఇలా చేయకుండా సరైన వసతులు కల్పించాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
👉ప్రకాశం జిల్లాలోని సురారెడ్డిపాలెం వద్ద నున్న IOC డిపోని కొనసాగించవలసినదిగా ఢిల్లీలో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ పంకజ్ జైన్ ని కలిసి కోరిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిపరిశ్రమలు తీసుకువస్తాం. పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజలకు సంక్షేమం కూడా అందిస్తాం.
👉కృష్ణ జిల్లా..గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.
* గుడివాడ* :లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ *ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.* కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలలోని విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు. నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షించాలని ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా తక్షణ శిక్షలను అమలు చేయాలనే డిమాండ్ అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం అవుతుంది….
👉తెలంగాణ ఫుట్‌బాల్ టీమ్‌కు ముఖ్యమంత్రి అభినందన*
జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో టైర్ 2 విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ప్రఖ్యాత బీసీ రాయ్ ట్రోఫీలో భాగంగా 2024-25 ఏడాదికిగానూ అస్సాం వేదికగా జరిగిన ఫుట్ బాల్ పోటీల ఫైనల్స్ లో మణిపూర్ జట్టుపై విజయం సాధించిన తెలంగాణ జట్టు ఛాంపియన్షిప్ దక్కించుకుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తెలంగాణ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫుట్‌బాల్ టీమ్, కోచ్ సయ్యద్ అలీ అక్బర్ అబిది ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి విజయానందాన్ని పంచుకున్నారు.
👉 లక్షలు కేటాయించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్..
ఎంపీ లాడ్స్ నిధుల నుంచి హైడ్రా కు రూ.25 లక్షలు కేటాయించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్
చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ హైడ్రాకు ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలను కేటాయించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు. హైడ్రా పని తీరుపై ఎంపీ హర్షం వ్యక్తం చేస్తూ.. నిధుల కేటాయింపునకు సంబంధించిన లేఖను ఆయనకు అందజేశారు. హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.
👉 గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం..సెప్టెంబర్ 7 నుండి మొదలవనున్న గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుందని, ఉత్సవాల్లో పాల్గొనే నగర పౌరులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది హుస్సేన్ సాగర్లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదంటూ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేయగా.. అదే విధానాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని అన్నారు.
👉 అక్రమ కేసులు పెట్టీ నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు..ముంబై సినీనటి జెత్వాని..నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి..నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను..మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి విజయవాడకు బయలుదేరి వెళుతున్నాను..నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను..సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని హాననం చేస్తూ మాట్లాడుతున్నారు..నాకు జరిగిన అన్యాయం పై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను..ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు..
👉ఇకపై రెవెన్యూ నోటీసులే షోకాజ్ నోటీసులు – హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
నగరంలో అక్రమ నిర్మాణాల తొలగింపు నిమిత్తం రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
చెరువుల పరిరక్షణకు అక్రమ నిర్మాణాలపై జారీ చేస్తున్న రెవెన్యూ నోటీసులపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులపై పిటిషనర్లు అన్ని పత్రాలతో సహా ఆధారాలను అధికారులకు సమర్పించాలని వెల్లడించింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని స్పష్టం చేసింది.
పలు పిటిషన్లు దాఖలు : శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంలో 58.08 ఎకరాల్లో 280 ప్లాట్లతో వేసిన లేఔట్‌లో 1998లో ప్లాటు కొనుగోలు చేసి నిర్మించుకున్న ఇళ్లను తొలగించాలంటూ వాల్టా చట్టంలోని సెక్షన్ 23 కింద డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం : పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గుట్టలబేగంలో చేసిన లేఔట్‌లో 1998లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అన్ని అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయని. వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేశారన్నారు. కావూరిహిల్స్‌లోని పలు అపార్ట్మెంట్ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని వాటిని తొలగించాలంటూ ఈనెల 3న నోటీసులు జారీ చేశారన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్లు తెలిపారు.
హైకోర్టు విచారణ : ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించాలంటూ డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్లు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణిస్తామని, నిర్దిష్ట గడువులోగా పిటీషనర్లు వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లలో నిర్మాణాలు, అభ్యర్ధనలు వేర్వేరు అయినప్పటికీ, ఎఫ్‌టీఎల్ ప్రాంతంలోని నిర్మాణాలను తొలగించాలన్నదే నోటీసులో ప్రధానంగా ఉందని పేర్కొంది.అంతేగాకుండా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా కూల్చివేత నోటీసులు ఇవ్వడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్లు జారీ చేసిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించి అధికారులకు అన్ని ఆధారాలను సమర్పించి వివరణ ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అదికారులను ఆదేశిస్తూ, పిటిషన్లపై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
👉 కృష్ణాజిల్లా గుడివాడ ..
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం…. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన…. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.
బాలికల హాస్టల్ వాష్ రూమ్ లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన..సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిల నినాదాలు..
కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై…. దాడికి యత్నించిన సహచర హాస్టల్ విద్యార్థులు.విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్న పోలీసులు….జూనియర్,సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ…. ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు.విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.తెల్లవారు 3.30 గంటల వరకు కొనసాగిన హైడ్రామా.ఫైనల్ ఇయర్ విద్యార్థికు….. మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు.బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ…… ‘ ఎక్స్ ‘ వేదికగా పోస్ట్ లు పెట్టిన విద్యార్థులు.వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను…. ప్రశ్నిస్తున్న విద్యార్థినీలు.వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ స్పందించ లేదంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు.వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న పోలీసులు.
👉 జార్ఖండ్‌లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు..
జార్ఖండ్‌లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్‌బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు
జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇట్కే గ్రామంలో ఫుట్ బాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువ ఫుట్ బాల్ ప్లేయర్లు దీపక్, వీరేంద్ర మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బాలుమత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.
👉రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి*
*అంటువ్యాధులు, విష జ్వరాల భారి నుండి ప్రజలను రక్షించాలి*
*ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి*
*ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు*
*డెంగ్యూ జ్వరంతో చనిపోయిన బాధితులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి*
*ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్*
తెలంగాణ రాష్ట్రంలో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు టైఫాయిడ్, చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విషజ్వరాల బారినపడి ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించవలసిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల, డాక్టర్ల, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషజ్వరాలు, అంటువ్యాధుల భారి నుండి ప్రజలను రక్షించడంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు అన్ని పట్టణాలు, గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పీహెచ్సీ సెంటర్లలో 24గంటలు వైద్యం అందేలా చూడాలన్నారు. అన్ని గ్రామాలలో వైద్య, ఆరోగ్య సిబ్బందిని పంపించి సంచార వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని గ్రామాలకు పారిశుద్ధ్య నిధులు కేటాయించి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అన్ని జిల్లా కేంద్రాలలోని ఆస్పత్రులలో, పిహెచ్సి సెంటర్లలో డెంగ్యూ నిర్ధారణ కిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. డెంగ్యూ వ్యాధి వల్ల మృతి చెందిన కుటుంబాలకు 10లక్షల రూపాయల ఎక్స్-గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
👉నారా లోకేష్ త్రిబుల్ ఐటీ లు ,సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు సందర్శించాలి ..పేద మధ్యతరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి..*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్*డిమాండ్…
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల లలో వరుస గా పేద మధ్యతరగతి విద్యార్థులు ఫుట్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన ఘటనలు నేపథ్యంలో అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్య, వసతి,మౌలిక వసతులు ఆహారం, వైద్య సౌకర్యం, రక్షణ తదితర అంశాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి.
సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న వసతి గృహాలు నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేయాలి.విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు అతిక్రమించిన ఉన్నతాధికార సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలోని ప్రతి వసతి గృహంలో జిల్లా విద్యా వైద్య రెవెన్యూ శాఖల ఉద్యోగులు సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగులు ప్రతిరోజు ఒక వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలి..ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విద్యార్థి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
**ఖాళీ సిలిండర్లు కూడా వస్తున్నాయి జాగ్రత్త..!!! ఇండియన్ గ్యాస్ ఘరానా మోసం*…!!!
అర్ధవీడు మండలంలో ఇండియన్ గ్యాస్ ఘరానా మోసం… ఈ నెల 10-08-2024 వ తేదీన యాచవరం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక దళిత మహిళ వారి గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో గ్యాస్ వెహికిల్ వాళ్ళ దగ్గర నగదు చెల్లించి నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్ తీసుకుంది . ఇంటికి నిండు గ్యాస్ సిలిండర్ తీసుకువెళ్ళి వంటచేసుకొనుటకు గ్యాస్ వెలిగించి చూడగా గ్యాస్ పొయ్యి మండలేదు. కొత్త గ్యాస్ కదా మంట రాకపోవడం ఏమిటని ఇంకో పొయ్యికి సిలిండరును కనెక్ట్ చేసి వెలిగించగా అక్కడ కూడా గ్యాస్ మండక పోవడం తో షాకయ్యారు.. ఈ విషయం ఏజెన్సీ వారికి ఫోన్ చేసి తెలియచేయగా మీరు ఎవ్వరితో చెప్పవద్దు ..రేపు మా గ్యాస్ డ్రైవర్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇంకో సిలిండర్ ఇస్తారు ..కావాలంటే మా డ్రైవర్ ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడి మీరు ఇంకో సిలిండర్ తీసుకోండి.. లేదంటే మా గ్యాస్ వాడటం మానేసి మీరు వేరే ఏ గ్యాస్ అయిన వాడుకోండని చాలా దురుసుగా మాట్లాడటం జరిగిందన్నారు. డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడగా అతను కూడా అలాగే దురుసుగా మాట్లాడుతూ మీ పాలెంలోకి తాము గ్యాస్ బండి తీసుకురావడం జరగదని ,సిలిండర్ కావలసినవారు రోడ్డుమీద సిలిండర్ పెట్టుకొని నిలబడాలని …సిలిండర్ మండకపోతే మేము భాద్యులమా? కంపెని లో నేను ఏమైనా గ్యాస్ తయారు చేస్తున్నానా?మాకు పైనుండి అలాగే వస్తున్నాయి అలాగే తీసుకు వచ్చి మీకు మేము ఇస్తున్నామని చాలా దురుసుగా మాట్లాడినట్లు తెలిపారు.**ఇంకో మహిళ సుమారు ఇరవై రోజుల క్రితం నిండు గ్యాస్ సిలిండర్ తీసుకోగా సరిగ్గా 20 రోజులు కూడా మా గ్యాస్ రాలేదని సిలిండర్ ఊపి చూస్తే సిలిండర్ లో నీళ్ళలాగ శబ్దం వినిపిస్తుందని.. ఏజెన్సీ వారు ప్రజలను ఈ రకంగా మోసం చేయడం ప్రజల శ్రమను ఇలా దోచుకోవడం మంచి పద్దతి కాదు సరైన పద్ధతిలో సరైన గ్యాస్ సిలిండర్ లను ప్రజలకు పంపిణీ చేయాలని ఇలా ప్రజలను మోసం చేస్తున్నందుకు అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అవసరం అయితే మహిళలందరం కలిసి ధర్నాలు చేయడానికి వెనుకడుగు వేయమని గ్రామస్తులు తెలిపారు,మేము ఇలా చేసినందుకు మాకు గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా నిరాకరిస్తే సరైన గ్యాస్ అందించే మరో కంపెనీ గ్యాస్ ఇప్పించేలా భాద్యతలు తీసుకోవాలని తెలియజేస్తూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి వినియోగదారునికి న్యాయం చేయాలని కంభం మండల వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఓ వి నరసింహారావు కోరారు.