👉వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ..* ఇబ్రహీంపట్నం మండలం లోని జూపూడి, కిలేశపురం,మూలపాడు ఇబ్రహీంపట్నం గ్రామాల్లో సియం చంద్రబాబుతో కలిసి మంత్రులు తానేటి వనిత, నారాయణ, కోల్లు రవీంద్ర, యంపి కేశినేని శివనాద్ (చిన్ని) వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు..మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడుకు మంత్రులకు స్వాగతం పలికి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు వారి సమస్యలు గురించి వివరించారు*..సియం చంద్రబాబు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు*,,కృష్ణా నదికి తరుచు వచ్చే వరదలు వలన నదీ పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు జరుగుతున్న నష్టాలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు.*వరదలు అనంతరం జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు అవసరమైన సహయ సహకారాలు అందించడం జరుగుతుందని సియం తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారికి అన్ని విధాలుగా సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను అదేశించారు.
👉ఏపీకి మరో తుఫాన్ ముప్పు!.. వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్పాడిపోతున్నారు. అయితే ఏపీకి మరో ముప్పు రానుంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
👉వందేళ్ళ చరిత్రలో కృష్ణానదికి అతిపెద్ద వరద*.. కృష్ణా నది వరద ఉధృతి..🔸ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..🔸ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు..🔸నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..🔸కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి…పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయకండి.~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
👉 *అమరావతి…”ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు* విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్..నిన్న కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్..బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ..పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం..పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలన్న సీఎం..పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ అందిస్తున్న ప్రభుత్వం..ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ఆహారం సమకూర్చిన ప్రభుత్వం..ముంపు ప్రాంతాల్లో మరో సారి పర్యటనతో సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం..*ఫలితాన్నిస్తున్న ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, మానిటరింగ్.*..సిఎం సూచనలతో, క్షేత్ర స్థాయి పర్యటనలతో వేగం గా కదిలిన యంత్రాంగం*..నిరంతర పర్యవేక్షణతో ఉదయం వరకు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టిన అధికారులు*..ముంపు ప్రాంతాల్లో స్వయంగా సీఎం రాత్రంతా తిరగడంతో వేగం పుంజుకున్న సహాయక చర్యలు* వర్షంలోనే బోటు ఎక్కి బాధితుల వద్దకు వెళ్ళిన ముఖ్యమంత్రి*..అటు సీఎం సమీక్షలు… ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనలతో వరద సాయం పనులు వేగవంతం… ముంపు ప్రాంతంలో కనిపిస్తున్న రిలీఫ్*
👉 వైయస్‌ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ లోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ నివాళులు..నివాళులు అర్పించిన వైయస్ విజయమ్మ, వైయస్ భారతి..వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వైయస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, కడప జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పలువురు నేతలు..
👉విజయవాడలో బుడమేరు వరద బీభత్సం… విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లు రద్దు..93 రైళ్లు దారి మళ్లింపు..తాత్కాలికంగా 9 రైళ్లు రద్దు..కొండపల్లి, రాయనపాడులో రైలుపట్టాలపై వరద..ట్రాక్‌పైనే నిలిచిపోయిన మూడు రైళ్లు..40 ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల తరలింపు..2వేల మందిని బస్సుల్లో తరలించిన అధికారులు..రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఇక్కట్లు..స్టేషన్‌లోనే ప్రయాణికుల పడిగాపులు..
👉 పొదిలి లో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట్ రాంబాబు ఆదేశాల మేరకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పొదిలి లోని విశ్వనాథపురం, పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ సెంటర్లలో వైయస్సార్ విగ్రహాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వాకా వెంకట రెడ్డి, పట్టణ మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు.
👉 జనసేన పార్టీ అధ్యక్షులు, నేత కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పొదిలి పట్టణం నందు హల్చల్ జహీర్ మిత్ర బృందం నాగార్జున అర్జున్ యాదవ్, మదర్ వలి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కందుల విగ్నేష్ మీర్జా అభిద్ ,సయ్యద్ సాదిక్ కేక్ కట్టింగ్ చేసి, డొక్కా సీతమ్మ అన్నదానం కార్యక్రమం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖుద్దుస్, రసూల్, యాసిన్, నారాయణ, గౌస్, రాజు, జనసేన నాయకులు బీరల శ్రీనివాస్ రావు (రాజా), మోసిన్, మన్సూర్, ఎష్, అజీజ్, సూరి, మని, సూర్య, బెనర్జీ, నిఖిల్ మరియు కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేసారు.👉”కంభం పట్టణంలో” జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గోని కేక్ కట్ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు టీడీపీ, జనసేన,బిజెపి కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నరు…
👉 మేతకు వెళ్లిన గేదెను చంపి తిన్న చిరుత పులి.. మార్కాపురం మండలంలోని గొట్టిపాడియా బీట్‌లోని చక్రాల కాలువ లొకేషన్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన గేదెను తిన్న చిరుత పులి .. నిన్న మేత కోసం పశుపోషకులు గేదెను అడవిలోకి వదిలారు. ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం అడవిలో గాలించిన పశువుల కాపరులు చిరుత పులి దాడి చేసి చంపి తిన్నట్లు గుర్తించి గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.,.
👉 తండ్రీ కూతురుని మింగిన ఆకేరు వాగు..
పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగులో గల్లంతైన నూనావత్ మోతీలాల్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రీకూతురు గల్లంతైన విషయం తెలిసిందే. సాయంత్రం బిడ్డ అశ్విని మృతదేహం లభ్యంకాగా, సోమవారం తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, స్థానికులను కంటతడిపెట్టించింది.
👉 కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్ నేరస్థుల జంట అరెస్టు.. కోట్లల్లో డబ్బు కొల్లగొట్టిన సైబర్ నేరస్థుల జంట అరెస్టు…
అన్‌లైన్‌లో దేశ వ్యాప్తంగా ప్రజల నుండి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు సైబర్ నేరగాళ్ళను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సొమవారం అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు చెక్కు బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్ డ్రైవ్‌లను, సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. తాంబరం పట్టణానికి చెందిన జసిల్, ప్రీతి ఈ ఇద్దరు సైబర్ నిందితులని తెలిపారు.
👉ములుగు జిల్లా కేంద్రంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా నికి ప్రయత్నించిన దంపతులు ..లహరి చిట్ ఫండ్ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసిన తోట నరేందర్,లావణ్య దంపతులు..నూనె బిక్షపతి అనే వ్యక్తితో కలిసి గత ఏడు సంవత్సరాలుగా చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్న తోట నరేందర్..వ్యాపారంలో ఇరువురి మధ్య విభేదాలు రావడంతో తనకు రావలసిన డబ్బులు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం..తమకు రావాలిసిన 95 లక్షల రూపాయలతో పాటు రెండు ఫ్లాట్లు (ఇంటి స్థలాలు) ఇవ్వడం లేదంటు దంపతుల ఆత్మహత్య యత్నం..దంపతుల ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకొని పోలీసులకు సామాచారం అందించిన స్థానికులు..ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినా దంపతులను పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు..విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్న పోలీసులు.
👉 ఏపీలో వరదలకు ఇప్పటి వరకు 15 మంది మృతి.. ముగ్గురు గల్లంతు, 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం.. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం.. 34 వేల ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యానపంటలు.. 1067.57 కిలో మీటర్లు మేర దెబ్బతిన్న రోడ్లు
👉 అక్షయపాత్ర సరికొత్త రికార్డు..*అక్షయ పాత్ర ద్వారా రోజుకు 1.70 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించిన దివీస్ ఎమ్.డీ మురళీ కృష్ణ**సుమారు 2.5 కోట్ల వ్యయంతో 5 రోజుల పాటు ఈ సహాయం..ఏపీలో మంగళగిరిలో అక్షయ పాత్ర రికార్డు సరికొత్త సృష్టించింది. ఒకేరోజు 3లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3లక్షల భోజనం.ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డు అని సంస్థలో పనిచేసే వారు అంటున్నారు.
👉విజయవాడ వరద బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ..విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమం అవుతున్నారు. ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
👉ఎన్.బి.కె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఇయర్స్ అయిన సందర్భంగా సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానం మేరకు వేడుకల్లో హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన బి.యన్.రెడ్డి ఫిలిమ్స్ అధినేత బాణా నాగేశ్వర్రెడ్డి* తెలంగాణ రాష్ట్రంలోని హైటెక్ సిటీ లో నవోటల్ ఫంక్షన్ హాల్ నందు ఎన్.బి.కె 50 సంవత్సరాల ఫిలిం ఇండస్ట్రీ లో పురస్కరించుకున్న సందర్భంగా ఈ వేడుకలకు ఆహ్వాన మేరకు హాజరై సినీ హీరో నందమూరి బాలకృష్ణ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన బి.యన్.రెడ్డి ఫిలిమ్స్ అధినేత బాణా నాగేశ్వర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారిని, డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని, కర్ణాటక సినీ హీరోలను శివరాజ్ కుమార్, ఉపేంద్ర, పలు డైరెక్టర్లను నిర్మాతలను పలకరించడం జరిగినది.
👉ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..*ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో “మొక్కలు నాటడం”కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండలో “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల” నందు పెద్దలు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఆ తర్వాత శీలం రాము గారు ఏర్పాటుచేసిన “మెగా బ్లడ్ క్యాంపు” కార్యక్రమాన్ని ఆయన చేతులు మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి మూడు పార్టీల కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు వీరమహిళలు మరియు మెగా కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.
👉గ్రాండ్ గా ఓపెన్ అయిన పాకిస్తాన్ మాల్.. అరగంటలో లూటీ.. తక్కువ ధరలకే వస్తువులు అమ్ముతున్నారు అంటే అక్కడికి ఎక్కువమంది వెళ్తారు.తక్కువ ధరలకే వస్తువులు అమ్ముతున్నారు అంటే అక్కడికి ఎక్కువమంది వెళ్తారు. ఇదే స్ట్రాటజీని ఉపయోగించి మంచి లాభాలు గడించాలి అని ఆశించిన ఒక మాల్ యాజమాన్యం ఇరకాటంలో పడింది. పాకిస్తాన్లోని ఖరాచీలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనలో మాల్ మొత్తం లూటీకి గురయ్యింది. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఓ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించడమే దీనికి ముఖ్య కారణం అని తెలుస్తోంది. సాధారణంగా మాల్స్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక డిస్కౌంట్ ఆఫర్ పెడుతూ ఉంటారు. అదేవిధంగా కరాచీలో నూతనంగా ప్రారంభమైన డ్రీమ్ బజార్ అనే మాల్ లో కూడా ఓ బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. 50 రూపాయల కంటే తక్కువ ధరలకే వివిధ రకాల వస్తువులను ఈ మాల్ లో ఓపెనింగ్ ఆఫర్ కింద అమ్మకానికి పెట్టారు. దీంతో మాల్ కి జనం ఎగబడ్డారు. చివరకు ప్రాణాల మీదకు..! అయితే వెళ్ళింది కొనడానికి కాదు.. తమకు తోచిన వస్తువులు తీసుకొని వెళ్లడానికి. దీంతో ప్రారంభించిన అరగంటలోనే మాల్ మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయింది. అంతేకాదు ప్రారంభించిన రోజే మాల్ పూర్తిగా విధ్వంసం అయింది. పాకిస్తాన్లో ప్రారంభించిన తొలి మెగా సేవింగ్ మాల్ కింద సోషల్ మీడియాలో ఈ మాల్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. ఓపెనింగ్ రోజు సందర్భంగా దుస్తుల దగ్గర నుంచి వివిధ రకాల గృహోపకరణాల వరకు భారీ డిస్కౌంట్ లను ప్రకటించారు. దీంతో మాల్ ఓపెనింగ్ కి భారీ సంఖ్యలో వచ్చిన జనం చేతికి అందిన వస్తువులను బిల్లు కట్టకుండా పట్టుకుపోయారు. ఒక్కసారిగా అంత గుంపు రావడంతో యాజమాన్యం కూడా తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. వాటి ధర ఎంతంటే? సోషల్ మీడియాలో ఈ మాల్ దోపిడీకి సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు ఓ లక్ష మందికి పైగా మాల్ లోకి దూరి ఒక్క వస్తువుని కూడా వదలకుండా తీసుకువెళ్లడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. మాల్లో పరిస్థితి కంట్రోల్ చేయడానికి సిబ్బంది తలుపులను మూయడానికి ప్రయత్నిస్తే.. బయట నుంచి అద్దాలు పగలగొట్టుకొని మరీ లోపలికి వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ మాల్.. మూడున్నర గడిచే సమయానికి చిన్నాభిన్నం అయిపోయింది.
👉ఇంటర్ స్టేట్ కరాటే ఇన్విటేషనల్ ఛాంపియన్ షిప్ లో పాల్గోన్న దామచర్ల, ముత్తుముల*
*ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో సిద్దార్ధ కరాటే డూ అకాడమీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని అకాడమీ నిర్వహించిన ఇంటర్స్టేట్ కరాటే ఇన్విటేషనల్ ఛాంపియన్ షిప్ – 2024 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , మరియు ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరై విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా యువతకు మార్షల్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యంతో కూడిన శిక్షణను అందిస్తూ ప్రతీ యేటా వార్షికోత్సవ వేడుకలలో కరాటే పోటీలను నిర్వహిస్తున్న అకాడమీ యాజమాన్యానికి, నిర్వాహకులకు మరియు కరాటే ఛాంపియన్ షిప్ లో గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలియచేశారు…కార్యక్రమంలో సిద్దార్ధ డూ అకాడమీ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు నల్లూరి మోహన్ రావు, డా. గుండవారపు రాఘవ, టోర్నమెంట్ నిర్వాహకులు మండవ మురళి కృష్ణ, మిల్టన్ శాస్త్రి, కొండ్రు కీర్తన్, కుర్రా భాస్కర్ రావు, మారెళ్ల సుబ్బారావు, జి. రవికుమార్, మాదాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.*