👉👉భగ్గుమన్న మణిపూర్.. ఐదుగురు మృతి..!!*
కుకీ, మెయ్తెయి తెగల మధ్య తీవ్ర ఘర్షణలు, హింసాత్మక పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న మణిపూర్ మరోసారి భగ్గుమంది.*అక్కడ మళ్లీ హింస చెలరేగింది. జిబిరామ్ జిల్లాలోని నంగ్చప్పీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు కాల్చి చంపారు. నిద్రిస్తున్న అతడిని హత్య చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా హింస చెలరేగింది.రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం చోటుచేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరిగాయని పోలీసులు చెప్పారు.ఇక అంతకుముందు రోజు శుక్రవారం కూడా కక్చింగ్ జిల్లాలో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాల్పులు, బాంబు దాడులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఉదయం బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులు జరిగాయి. 4.30 గంటలకు జిల్లాలోని ట్రోంగ్లావోబీ వద్ద జరిగిన దాడిలో రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
*మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి.. సీఎం*
ఏపీ:: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు,అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు….వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు…..రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు… తెలంగాణలో పడే వర్షాల వల్ల ఏపీ కి కొంత వరద వచ్చే అవకాశం ఉందని,దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు…
👉 ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తివేత..!!..కృష్ణా నది వద్ద మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తేశారు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో కృష్ణ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి వరద.. మళ్లీ భయంకరమైన స్థాయిలో పెరిగింది.దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తారు అధికారులు. ఈ నేపథ్యంలోనే 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో ఉన్నవారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
👉నటుడు మురళీ మోహన్‌కు ‘హైడ్రా’ నోటీసులు..సీని యర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు ‘హైడ్రా’ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
👉నటుడు బ్రహ్మాజీకి వైసీపీ నేత వార్నింగ్..!!!విజయవాడ పరిస్థితులపై వైఎస్ జగన్ చేసిన విమర్శలపై సినీ నటుడు బ్రహ్మాజీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. దీనిపై వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింత కౌంటరిచ్చారు. ‘ఒక విషయం గుర్తు పెట్టుకో బఫూన్ బ్రహ్మాజీ. సినిమాల్లో కామెడీ చెయ్.. చిల్లర డబ్బులు రాలుతాయి. కానీ సీరియస్ మ్యాటర్‌లో కామెడీ చేస్తే మూతి పళ్లు రాలుతాయి.’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మాజీ ఎక్స్‌లో వివాదాస్పద పోస్ట్ డిలీట్ చేశారు.
👉ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర? …ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. బోట్ల యజమానులను పోలీసులు గుర్తించారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తులకు చెందిన బోట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బోట్లు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొట్టిన బోట్ల వ్యవహారంలో కీలక ముందడుగు పడింది.గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తులకు చెందిన బోట్లుగా గుర్తించినట్లు సమాచారం. బోట్లు ఢీ కొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. ఈ సమయంలోనే వరద నీటితో పాటుగా బోట్లు కొట్టుకువచ్చాయి. ఈ బోట్లు గేట్లను తాకడంతో.. ప్రకాశం బ్యారేజీ 67,69 గేట్లు కాస్త దెబ్బతిన్నాయి. ఒక బోటు కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టడంతో అది కాస్తా విరిగిపోయింది. అలాగే 67, 68, 69 గేట్లకు రెండు బోట్లు అడ్డుపడ్డాయి. దీంతో ఆయా గేట్ల నుంచి వరద నీటి ప్రవాహం నిలిచిపోయింది. మిగిలిన గేట్ల ద్వారానే అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే దెబ్బతిన్న గేట్ల వద్ద అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో అధికారులు 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్‌లను అమర్చారు. రెండు రోజులపాటు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమించి గేట్ల మరమ్మత్తు పనులు పూర్తిచేశారు. నదిలో నీరు ప్రవహిస్తున్నా, భారీ వర్షం కురుస్తున్నా కూడా లెక్కచేయక మరమ్మత్తు పనులను పూర్తిచేశారు. మరోవైపు వరద ప్రవాహంలో బోట్లు కొట్టుకువచ్చి గేట్లను ఢీకొట్టడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకేసారి నాలుగు పడవలు బ్యారేజీ గేట్లను తాకడం వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నీటిపారుదలశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్ల కింద విజయవాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్ల యజమానులను గుర్తించినట్లు తెలిసింది. బోట్లు గొల్లపూడి, సూరాయపాలెనికి చెందినవారివిగా గుర్తించారు. ఇక ప్రమాదవశాత్తూ ఇవి కొట్టుకువచ్చాయా లేదీ వీటి వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే విషయమై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
👉వరద బాధితుల సహాయార్థం కేఎన్‌ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ ఎండీ కే.నర్సింహారెడ్డి ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. జలంధర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించారు. వారు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు సీఎంగారు వారికి అభినందనలు తెలియజేశారు…
*వరద బాధితుల సహాయార్థం వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్, ఛాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వెల్లూరు వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ గారితో పాటు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారికి కలిసి చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎంగారు వారిని అభినందించారు…
👉 హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా.. ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు!!*: ఖమ్మం జిల్లాలో హైలెర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది.మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంటగంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి కావాల్సిన ఆహార, ఇతర ఏర్పాట్లను చూడలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు.
👉విజయవాడ వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న సేవకులకు రెయిన్ కొట్లు, శానిటైజర్లు పంపిణి చేసిన మంత్రి అచ్చంనాయుడు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి. బ్రహ్మానందరెడ్డి*విజయవాడ చిట్టి నగర్ లో గత వారం రోజులుగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు, వివిధ సంస్థల వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, 46వ డివిజన్ ప్రత్యేక అధికారి రాజబాబు 46 వ డివిజన్లో రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్షం, వరద నీరు, మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న యువత వర్షంలో తడుస్తూ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను అభినందించి వారికి రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రజల కోసం కష్టపడుతున్న యువతను మంత్రి అచ్చెన్నాయుడు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
👉హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా.. ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు!!.. ఖమ్మం జిల్లాలో హైలెర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది.మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంటగంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి కావాల్సిన ఆహార, ఇతర ఏర్పాట్లను చూడలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు.
👉మున్నేరుకు పెరుగుతున్న వరద.. ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం భట్టి..!!*ఖమ్మం: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరువాగు పొంగే అవకాశం ఉండటంతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం బయలుదేరారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉద్ధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. మరోవైపు మున్నేరువాగు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలకు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉద్ధృతి పెరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరదల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని, సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
👉భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ శ్రీనివాస్.. మాధురి పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్..!!!*తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దువ్వాడ ఫ్యామిలీ వివాదం… ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో వివాదం రోజుకో టర్న్ తీసుకుంటుంది. పరిష్కారానికి దారేదనే కన్‌ఫ్యూజనే తప్పా ఎలాంటి క్లారిటీ రావడంలేదు. అయితే లేటెస్ట్‌గా ఈ దువ్వాడ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చేటుచేసుకుంది. వాణి, తన పిల్లలు ఇంట్లోకి వెళ్లొచ్చని కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో… అక్కడికి చేరుకున్న వారికి షాక్ తగిలింది. ఇంటి బాల్కనీలో మాధురిని కనిపించడం అవాక్కయ్యేలా చేసింది.ఇక మాధురిని ఇంట్లో చూసిన వాణి, ఆమె తరుపు బంధువులు… ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను ఇంట్లోకి పంపించాల్సిందేనంటూ అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లోకి వెళ్లే హక్కు తనకు, తన పిల్లలకి ఉందంటూ.. కోర్టు చెప్పినా… ఎందుకు ఇంట్లోకి పంపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఇంటి పవర్‌ను కట్ చేసి… ఇంటి ముందు కూర్చుని ఆందోళన కంటిన్యూ చేశారు వాణి.నా ఇంట్లో నేనున్నాను… వాళ్లెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్లు తనదేనని.. దువ్వాడ శ్రీను ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించారు మాధురి రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదంటోంది దువ్వాడ వాణి. కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటున్నామని తెలిపి… హుటాహుటిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రన తనదైపోదంటున్నారు వాణి. ఇంటి కోసం ఎలాంటి ఫైట్‌కైనా సిద్ధమంటున్నారు. మొత్తంగా… గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్.. ఇంకెంత దూరం వెళ్తుందో… చూడాలి
👉బార్డర్ లో తెలంగాణ యువతి మృతి* ..గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న యువతి*..ఎన్టీపీసీ సుభాష్ నగర్ కు చెందిన బల్ల గంగా భవాని మృతికి గల కారణాలు తెలియవలసి ఉంది..హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డెడ్ బాడీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు….
: 👉ప్రకాశం జిల్లా.. గిద్దలూరు పట్టణంలో నూతన బస్సులను ప్రారంభించిన శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి..ఆర్టీసీ డిపోలో నూతనంగా నాలుగు బస్సులను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి. అనంతరం బస్సు నడిపి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు
👉రెండో తరం సైబర్ క్రైమ్ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై కూర్చొని ఉంటాడు… !!!..
అతని చేతిలో మొబైల్ నంబర్ మరియు పేరు వ్రాసి ఒక స్లిప్ ఉంటుంది మరియు అతను అందరితో ఇలా అంటాడు, సోదరా, దయచేసి దీనికి కాల్ చేయండి, ఇది మా మామ, నాన్న లేదా మా వాళ్ళ సంఖ్య’. మేము విడిపోయాము. అతనికి ఫోన్ చేసిన వెంటనే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. మరియు మీ మొబైల్ డేటా అతనికి వెళ్తుంది, మీరు రైలు కోసం వేచి ఉంటారు, అప్పటి వరకు మీ మొబైల్ జేబులో తన పనిని చేస్తూనే ఉంటుంది. కాబట్టి, అపరిచితుడి నంబర్‌కు డయల్ చేసి మరీ మానవత్వాన్ని ప్రదర్శించవద్దు.* ప్రస్తుతం ఈ ఘటన బనారస్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.
👉ఖమ్మం జిల్లా దంసలాపురంలో…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకొన్న… వరద బాధితులు…*తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు……రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నచ్చి చెప్పడంతో శాంతించిన మహిళలు….
👉APCC నూతన కమిటీలకు ఆమోదం తెలిపిన AICC …25 జిల్లాల డీసీసీలు,13 మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు,10మంది సిటీ ప్రెసిడెంట్లను ప్రకటించిన AICC. 👉మన్యం , అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు- శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు – విజయనగరం – మరిపి విద్యాసాగర్ -విశాఖపట్నం – వెంకట వర్మ రాజు.. అనకాపల్లి – మీసాల సుబ్బన్న..- కాకినాడ – మద్దేపల్లి సత్యానందరావు..- బిఆర్ అంబేద్కర్ కోనసీమ – కొండేటి చిట్టిబాబు..- ఈస్ట్ గోదావరి – TK విశ్వేశ్వర్ రెడ్డి..- వెస్ట్ గోదావరి – హరి కుమార్ రాజు..- ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు..- కృష్ణ – గొల్లు కృష్ణ..-NTR – బొర్రా కిరణ్ గుంటూరు – చిలక విజయ్.. బాపట్ల – ఆమంచి కృష్ణమోహన్..పల్నాడు – అలెక్స్ సుధాకర్- ప్రకాశం – షేక్ సైదా – నంద్యాల – జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్- కర్నూలు – పరిగెల మురళి కృష్ణ అనంతపురం – మధుసూదన్ రెడ్డి …YSR విజయజ్యోతి- శ్రీ సత్యసాయి – హినయ్ తుల్లా ..SPS నెల్లూరు – చేవూరు దేవ కుమార్ రెడ్డి .. తిరుపతి – బాలగురవం బాబు
*చిత్తూరు – పోటుగారి భాస్కర్ *విజయవాడ సిటీ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు..కాకినాడ – చెక్కా నూకరాజు..రాజమండ్రి – బాలేపల్లి మురళీధర్..శ్రీకాకుళం – రెల్లా సురేష్..విశాఖపట్నం – పిరిడి భగత్..తిరుపతి – గౌడపేరు చిట్టిబాబు..చిత్తూరు – టిక్కారాం..ఒంగోలు – నాగలక్ష్మి..కర్నూలు – షేక్ జిలానీ భాషా..కడప – అఫ్జల్ అలీ ఖాన్..