👉బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం.. హోంమంత్రి అనిత వీరి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపుడి అనిత స్పందించారు.
విజయవాడలో వచ్చిన వరదలపై వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఫీల్డ్‌కి వచ్చి చూడాలంటే టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బాధితులకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వడం లేదని వైసీపీ మండిపడుతోంది. పునరావాసంలోనూ సరైన సదుపాయాలు లేవని అంటున్నారు. వీరి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపుడి అనిత స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన పేటీఎం బ్యాచ్ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె విజయవాడలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విపత్తుపై అప్రమత్తం చేస్తూ కాలనీల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. బాధితుల్లో మనోధైర్యం కల్పిస్తున్నారని చెప్పారు. బాధితులకు సైతం ఆహారం, నీరు, పాలు అందిస్తున్నామని తెలిపారు. పులిహోర ప్యాకెట్లు సైతం ఇవ్వలేదని వైసీపీ అధినేత ఆరోపిస్తున్నారని.. బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు చెప్పడం కాదని, క్షేత్రస్థాయిలో వచ్చి చూడాలని సూచించారు. జగన్ పరామర్శకు వచ్చి కనీసం 20 నిమిషాలు కూడా బాధితులతోని గడపలేదని ఆరోపించారు.ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వందల ట్రిప్పుల్లో నీరు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 27వేలకు పైగా ఇళ్లలో అధికారులు బురదను తొలగించారని తెలిపారు. డ్రోన్లతోనూ బాధితులకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. క్లోరినేషన్ కూడా చేపిస్తున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా లక్ష ఆహార ప్యాకెట్లు అందించామన్నారు. చంద్రబాబు పండుగకు సైతం దూరంగా ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు.మంత్రి నిమ్మల రామానాయుడు కూడా మూడు రోజులపాటు బుడమేరు వద్దే ఉండిపోయారని చెప్పారు. నిద్రాహారాలు మాని గండ్లు పూడ్చివేయించారన్నారు. వీటిని చూడకుండా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కావాలనే వైసీపీ బ్యాచ్ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాగే.. మీడియాలో ప్రచారం అవుతున్నట్లు గణేశ్ మండపాలకు ఎలాంటి చందాలను వసూలు చేయలేదన్నారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే.. ఎక్కడ కూడా ఒక్క రూపాయి వసూలు చేయడానికి వీలులేదని ఆదేశించారని తెలిపారు.
**ప్రతి సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే ” మీకోసం ” కార్యక్రమాన్ని ఈనెల తొమ్మిదవ తేదీ సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ప్రకటించారు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది విజయవాడ వెళ్లారని, ఈ నేపథ్యంలో ” మీకోసం ” కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలు రావద్దని కలెక్టర్ సూచించారు.
👉చేయూత మిత్రమండలి బెస్తవారిపేట ఆధ్వర్యంలో చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ & దాతల సహకారంతో ఆదివారం నాడు విజయవాడ లోని ఇబ్రహీంపట్నం నందు వరద బాధితుల సహాయార్ధ0 70 కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, ఒక కేజీ కంది బ్యాళ్ళు, ఒక కేజీ ఉల్లిగడ్డలు, ఒక కేజీ బంగాళాదుంపలు, ఒక లీటర్ నూనె మరియు ఓ ఆర్ ఎస్ పాకెట్ లు కలిపి కిట్ గా అందజేయడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయార్ధం మీకోసం మేము సైతం అనే నినాదం ద్వారా 75000 రూపాయలు సేకరించి ఈ ఉచిత పంపిణీ చేసినట్లు చేయూత మిత్ర మండలి సభ్యులు తెలియజేసారు. ఆర్ధిక సహకారం అందజేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ పంపిణీ కార్యక్రమంలో చేయూత మిత్ర మండలి సభ్యులు, ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ సభ్యులు మరియు పలువురు ఉపాధ్యాయులు, దాతలు పాల్గొన్నారు.. డివిజన్ ఇంచార్జి అస్లాం బేగ్…
👉జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్నీ పది రోజుల క్రిందటే రద్దు చేసాం. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు, జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం ప్రకటించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి, ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క అనుమతికి తీసుకోకూడదని స్పష్టంగా చెప్పారు. గణేష్ ఉత్సవ సమితులు ఏ ఒక్క అనుమతికి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.
👉👉 రాయలసీమలో రెడ్ బుక్ కలకలం *కర్నూల్:*
▪️టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.
▪️నాకూ ఒక రెడ్ బుక్ ఉంది అందులో 100 మంది పేర్లు వున్నాయి ఎవ్వరినీ వదిలి పెట్టను.
▪️ఆధారాలు చూపించి లీగల్ గా అందరి మీద కేసులు పెట్టిస్తా – ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
👉కొండపై నుంచి జారిపడి వ్యక్తి మృతి_
_మడకశిర పట్టణం 9వ వార్డు శివాపురం లో నివాసముంటున్న మంజునాథ అనే వ్యక్తి మతిస్థిమితం లేక మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు తీర కొండపై నుండి జారి కిందపడి మృతి చెందినట్లు ఈరోజు బంధువులు గుర్తించారు_
👉తూర్పు గోదావరి జిల్లా:*బోరన్నగూడెం సమీపంలో అదుపు తప్పి “వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు”.
రాజమండ్రి నుంచి నర్సీపట్నం వెళ్తున్నఆర్టీసీ బస్సు బోరన్నగూడెం సమీపంలోకి రాగానే అదుపుతప్పి వాగులో పడిపోయింది.ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి గాయలైనట్లు సమాచారం.బ్రేక్ ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగిందంటున్న ఆర్టీసీ డ్రైవర్.
క్షతగాత్రులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు.
👉మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా..సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా… తెలంగాణ ఇన్చార్జ్ హైదర్ అలీ..
👉 కర్నూలు జిల్లా….మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కామెంట్స్….హైదరాబాద్ లో హైడ్రా కూల్చిన బల్డింగ్ కు నాకు ఎం సంబందం లేదు..అమీన్ పూర్ లో నాకు ఎలాంటి బిల్డింగ్స్ లేవు..నాకు సంబందించిన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించానునాకు సంబందం లేని ఇష్యూ లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు..hmda,ఇరిగేషన్ అధికారులు నా భూమి బఫర్ లో కాని ftl పరిధిలో లేదని చెప్పారు..అధికారులు నా స్థలం ftl పరిధిలో ఉందని నోటీసు కూడా ఇవ్వలేదు…మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా పోలీసులు,అధికారులు వచ్చి దొర్జన్యంగా మా నిర్మాణాలు కూల్చారు ..టీడీపీ నాయకులు కొంత మంది పానికట్టుకొని దృష్ప ప్రచారం చేస్తున్నారు..మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు,నేను లీగల్ గా వెళ్తాను…లోకేష్ బాబే రెడ్ బుక్ ఉందని చెబుతుంటే , ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడడం ఆశ్చర్యం కాదు ..ఫ్యాక్షన్ రాజకీయాలు చేశాం, చూశాం, ఇవీ వద్దు అనుకొని ప్రజలతో మమేకం అయ్యాము..ఇప్పుడు వీళ్ళ కూడా రెడ్ బుక్ పేరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు చేదాం అని చూస్తున్నారు..భూమా నాగిరెడ్డి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు..పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనిచేస్తున్నారు..కాలం ఇలానే ఉండదు ,ప్రజలే డయపజటం లేదు మా నాయకులు ఎందుకు భయపడతారు….సీతారాంపురంలో అనవసరంగా హత్య చేశారు..వైసీపీ ఇచ్చిన పథకాలు కన్న గొప్పగా మీరు పథకాలు ఇస్తామని చెప్పాలి..రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..కొద్దిరోజులు పోతే ప్రజలే అందరికీ సమాధానం చెపుతారు…
👉*ప్రకాశం జిల్లా…*కొత్తపట్నం తీర ప్రాంతాలను నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..*వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత….**నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అపశ్రుతులు, అవాంతరాలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు…*ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనంకు ప్రతి ఒక్కరూ సహకరించాలి…*ఎవరైనా నిమజ్జనాలలో చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.. జిల్లా ఇన్చార్జ్ షేక్ ఫయాజ్..
👉 వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగహైదరాబాద్ – బాచుపల్లి పరిధిలో ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూను చోరీ చేశాడు…
👉వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..
మండలంలోని వినాయక మండపాలను సందర్శించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులకు సూచించిన సీఐ టి వెంకటేశ్వర్లు, ఎస్సై వి వేమన…వినాయక విగ్రహాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించిన సిఐ వెంకటేశ్వర్లు…పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు తావు లేకుండా వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి…
లేకుంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వేమన…
*👉విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు..*
విజయవాడలో భారీ వరదలతో ప్రజానీకం తల్లడిల్లి పోతుండటంతో ప్రకాశం జిల్లా పొదిలి తహసిల్దార్ ఎం.వి.కృష్ణారెడ్డిఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్.కే సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం 5 వేల ఆహార ప్యాకెట్లనుప్రత్యేక వాహనాల్లో తరలించారు..
ఆహార ప్యాకెట్లను అక్కడ అధికారులు సూచనలకు అనుగుణంగా పంపిణీ చేయడం జరుగుతుందని తహసిల్దార్ ఎం వి కృష్ణారెడ్డి. ఇంచార్జ్ ఆర్ ఐ కె సుబ్బారావు తెలిపారు..ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సిబ్బంది ఉన్నారు.
** లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో విజయవాడ వరద భాదితులకు 500 ఆహార పొట్లాలు శనివారం ప్రత్యేక వాహనం లో పంపించడం జరిగింది. జరిగింది. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ ఎం వి. కృష్ణా రెడ్డి, ఆర్ ఐ లు రమేష్ బాబు, సుబ్బారావు వి ఎస్ మాలిక్, ముల్లా జిలాని లాలీఫౌ డే షన్ ప్రతినిధులు అకీబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
👉పొదిలి,కొనకనమిట్ల, మరిపూడి, మండలాల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఓల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద ముంపుకు భారీగా నష్టపోయిన ప్రాంతాలు వాంబే కాలనీలో మరియు సింగ్ నగర్ లో దుప్పట్లు,చీరలు, శాలువాలు, చిన్నపిల్లలకి బిస్కెట్లు సహాయం అందించడమైనది. ఈ సహాయ కార్యక్రమాల్లో ఓల్డ్ యూనియన్ ప్రెసిడెంట్ రావూరి శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ రాయల్ యూనియన్ సభ్యులు గుంటూరు శ్రీనివాసులు,పి.మల్లికార్జున రావు ఈదుముడి కృష్ణా, సిహెచ్ శ్రీను, వై బాల ప్రసాదు, బి. వెంకటేశ్వర్లు, రావూరి శ్రీధర్, వి, శీను తదితరులు పాల్గొన్నారు.
👉తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన..*
హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి..
గద్వాల, కొమురంభీం, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన..మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్..నల్గొండ, నారాయణపేట, నిర్మల్ జిల్లాకు వర్షసూచన..పెద్దపల్లి,రంగారెడ్డి,సంగారెడ్డి,సిద్దిపేట,వనపర్తి,యాదాద్రి, వికారాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన
👉రేపు పాఠశాలలకు సెలవు*
*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్*శ్రీకాకుళం :జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత దృష్ట్యా రేపు (సోమవారం) స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలకు సెలవు ఇవ్వాలని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. సెలవు అంశాన్ని స్కూల్ కమిటీలు ద్వారా, ఆయా వాట్సాప్ ల ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల పై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల భద్రతకు ఏమాత్రం భంగం కలగని రీతిలో, ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పక పాటించాలని అన్నారు. రెసిడెన్షియల్ వసతి గల పాఠశాలలు ఆహార సరుకులైన బంగాళాదుంపలు, కూరగాయలు, పప్పులు, గుడ్లు మొదలైనవి సరఫరాదారుల ద్వారా సేకరించుకొని ఉంచుకోవాలని కోరారు. వసతి గృహాల్లో ఆశ్రయం పొందిన విద్యార్థులు ఎవరూ సంస్థ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వరాదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.పోలీసు, రెవెన్యూ శాఖ వారు వసతి కోసం పాఠశాలలను అడిగినప్పుడు వెంటనే ఇవ్వవలెను.. స్టేట్ ఇంచార్జ్ హైదర్ అలీ. .
👉విజయనగరం జిల్లా పోలీసు..*శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుశాఖ సూచించిన నిబంధనలు పాటించాలి.. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్..
*నిమర్జనం నిర్వహించే చెరువులు, నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్..
*శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలన్న జిల్లా ఎస్పీ*
*ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా నిబంధనల మేరకు మాత్రమే మైకులు వినియోగించాలన్న జిల్లా ఎస్పీ..విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది సెప్టెంబరు 7, 8 తేదీల్లో సందర్శించి, వాటి అనుమతులను పరిశీలించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఇంకనూ అనుమతులు పొందని మండపాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఉత్సవ నిర్వాహకులకు పోలీసు అధికారులు సెప్టెంబరు 8న సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – గణేష్ ఉత్సవాల వలన ఆయా ప్రాంతంలో వాహనాల రాక పోకలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాలను సందర్శించేందుకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగు చేసేందుకు పార్కింగు స్థలాలను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణ వలన స్థానికులు, ఇతర మతస్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్ధిష్టమైను సౌండుతో, నిర్ధిష్టమైన సమయాల్లో మాత్రమే మైకులను వినియోగించాలన్నారు. ఉత్సవాల వద్ద డిజేలు, అశ్లీల నృత్యాలు నిర్వహించ రాదన్నారు. నిమర్జనం నిర్వహించే సమయంలో మద్యం సేవించడం, కండ్లకు హాని కలిగించే రంగులు జల్లుకోవడం, బాణసంచా కాల్చడం చేయరాదన్నారు. నిమర్జనం నిర్వహించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టాలన్నారు. మండపాల వద్ద ఏర్పాటు చేసే మైకు సెట్స్ కు తప్పనిసరిగా పెర్మిషను తీసుకోవాలని, పెర్మిషనులో పొందిపర్చిన నిబంధనలు పాటించాలన్నారు. ఇతర మతస్థులకు ఇబ్బందులు కలిగించకుండా వారితో సంయమనంతో వ్యవహరించి, మతసామరస్యాన్ని పాటించాలన్నారు. రాత్రి సమయాల్లో విగ్రహాల వద్ద వెలిగించే దీపాల వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యత వహించాలని, అగ్ని ప్రమాదాలను నియంత్రించేందుకు ఇసుక బకెట్లును, డ్రమ్ములతో నీళ్ళును అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతితో విద్యుత్ సరఫరాకు తాత్కాలిక మీటర్లు చేసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల వద్దకు వచ్చే అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించే మండపాల వద్ద పాయింట్ బుక్కులు ఏర్పాటు చేయాలని, అధికారులు, సిబ్బంది ఆయా మండపాలను సందర్శించే సమయాల్లో తనిఖీలు నిర్వహించి, పాయింట్ బుక్కుల్లో సంతకాలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గణేష్ నిమర్జనం నిర్వహించే చెరువులు, నదులు వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గజఈతగాళ్ళును నియమించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
👉విజయనగరం.*ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి..వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి మృతిచెందిన బాలింత..ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగిన బంధువులు
👉*”బుడమేరు”* ఇది నది కాదు చిన్న ఏరు. దీనికి బెజవాడ దుఃఖదాయిని అని మరో పేరు కూడా. మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదుగా కొల్లేరు లో కలిసే ఏరు. ఏరు పుట్టిన చోటుకి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్లు కంటే తక్కువే ఉంటుంది. మరి ఇంత చిన్న ఏరు, ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు బెజవాడని ఎలా బెంబేలు ఎత్తించింది. ఎలా అంటే పాలకులు మరియు ప్రజలు నిర్లక్ష్యం. ఏరు ప్రయాణిస్తున్న దారిని వీళ్ళు సంవత్సరాల తరబడి పూడికలు తియ్యకుండా, అవకాశం ఉన్న దగ్గర కబ్జాలు చేసి, తాను కలవవలిసిన కొల్లేరును కొల్లగొట్టేసి తన దారిని మూసేస్తే, సమయం చూసి మూడు లక్షల మందికి దారి లేకుండా మూసేసింది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చెరువు…ఏరు….నది…ఏదైనా సరే వాటికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే మనం ఈ భూమి మీద మర్యాదగా బ్రతకగలుగుతాం. లేదంటే, వరదలు రూపంలో మనకి నరకం చూపిస్తాయి. వరదలు వచ్చినప్పుడు వీధి లో ఉండే పేదవాడైనా, విల్లా లో ఉండే ధనవంతుడైనా ఒకటే. ఆహార పొట్లాలు కోసం ఆక్రోశించాలి, మంచి నీళ్ళు కోసం పోటీ పడాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాలి. కరెంట్ ఉండదు, ఫోన్ లు పనిచెయ్యవు, కార్లు ఉన్నా ఉపయోగం ఉండదు, చివరికి బ్రతకలన్నా, చావాలన్నా కూడా భయపడే పరిస్థితి. అందుకే ఇకనైనా మేలుకొండి. లేదంటే ఈ వరదలు ఈ భూమి మీద మనకి స్థానం లేకుండా చేస్తాయి. ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూస్తున్నాం. మనిషి మారాలి. మన కోసం కాకపోయినా మన తరువాత తరాలు కోసమైనా ప్రకృతిని ప్రకృతి లాగే కాపాడుకోవాలి…. ఎందుకంటే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది..
👉విజయవాడ:*
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక ..తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం..అన్ని ప్రాంతాల్లోని నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం..ఇకపై మంగళగిరి, కడపలో కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తామని కేశినేని చిన్ని తెలిపారు.
*👉ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..*
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత.. పాత భవనాల వద్ద ఉండొద్దని అధికారుల సూచన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షసూచన, రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు..
*విశాఖలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు*
(విశాఖ) : విశాఖ నగరంలో తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల సహాయార్థం విశాఖపట్నం కలెక్టరేట్, పోలీసు కంట్రోల్ రూం లతో పాటు పలు తహశీల్దార్ కార్యాలయాలలో 24/7 పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయటం జరిగిందని అధికారులు తెలిపారు.
*విశాఖపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్* 0891-2590102, 0891-2590100,
*పోలీసు కంట్రోల్* రూం0891-2565454, డైల్ – 100, డైల్ – 112,
ఆనందపురం తహశీల్దార్ కార్యాలయం 9700501860,
భీమిలి తహశీల్దార్ కార్యాలయం 9703888838,
పద్మనాభం తహశీల్దార్ కార్యాలయం 7569340226 ,
చినగదిలి తహశీల్దార్ కార్యాలయం 9703124082,
పెందుర్తి తహశీల్దార్ కార్యాలయం 7702577311 ,
సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయం, మహారాణిపేట తహశీల్దార్ కార్యాలయం 9182807140,
గోపాలపట్నం 7842717183 తహశీల్దార్ కార్యాలయం,
ములగాడ తహసిల్దార్ కార్యాలయం 9440552007,
గాజువాక తహసిల్దార్ కార్యాలయం 8886471113 ,
పెదగంట్యాడ తహసిల్దార్ కార్యాలయం 9948821997 తుఫాను కారణం గా
ప్రజలకు ఏదైనా సహకారం కావాలంటే పై నెంబర్ లలో సంప్రదించాలని అధికారులు కోరారు.
*వర్షపాతం వివరాలు :*విశాఖపట్నం లో గడిచిన 24 గంటల్లో సగటున 60.7 మిల్లీమీటర్ల చొప్పున మొత్తం 668.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. అత్యధికం గా భీమిలి 87.0 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పం గా పెందుర్తి 42.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో మహారాణిపేట 74.4 మిల్లీమీటర్ల, సీతమ్మధార 72.6 మిల్లీమీటర్ల, ఆనందపురం 68.8 మిల్లీమీటర్లు, విశాఖపట్నం రూరల్ 66.4 మిల్లీమీటర్లు, పెదగంట్యాడ 55.8 మిల్లీమీటర్లు, పద్మనాభం 53.6 మిల్లీమీటర్లు, గోపాలపట్నం 52.4 మిల్లీమీటర్లు, ములగాడ 48.6 మిల్లీమీటర్లు, గాజువాక 45.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.