ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

👉👉8వ రోజూ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన*…జక్కంపూడి కాలనీలో ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడిన సిఎం*

విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 8వ రోజు కూడా పర్యటించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి బయలు దేరిన సిఎం ముందుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వెళ్లారు. పడవలు ఢీ కొనడం వల్ల దెబ్బతిన్న బ్యారేజ్ కు జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు, నిపుణులతో మాట్లాడి కౌంటర్ వెయిట్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్టు మీదుగా జక్కంపూడి వెళ్లారు. ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను చంద్రబాబు పరిశీలించారు. కుమ్మరిపాలెం సెంటర్ లో ఫైర్ ఇంజన్ల ద్వారా రోడ్లు క్లీన్ చేయడాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జక్కంపూడి కాలనీకి వెళ్లారు. జక్కంపూడి కాలనీ లోపలికి కారులో వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి కాలనీలో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ మోకాలు లోతు నీళ్లు ఉన్నాయి. ప్రొక్లెయినర్ మీదనే ఇళ్ల వద్దకు వెళ్లిన సిఎం బాధిత ప్రజలతో మాట్లాడారు. వారి బాధలు విని ధైర్యం చెప్పారు. ఆహారం అందుతున్న విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. తాము సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బీమా క్లెయిమ్స్ త్వరగా పూర్తి అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిట్టినగర్ సెంటర్, పైపుల రోడ్డు, బిఆర్టిఎస్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. అనంతరం అధికారులతో రివ్యూ చేసి…తన దృష్టికి వచ్చిన సమస్యలపై అధికారులతో చర్చించారు.

👉ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం-చంద్రబాబు..బుడమేరు ఆక్రమణలు తొలగిస్తాం… కొంతమంది ఆక్రమణల కారణంగా..లక్షల మందిఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోం… హాట్సాఫ్ సిఎం 👍

👉శ్రీకాకుళం :జిల్లాలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలని అధికారుల‌ను రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు సూచించారు.వైద్య‌,రెవెన్యూ, పోలీసుశాఖ‌ల‌తో పాటు ఇత‌ర శాఖ‌లు అందుబాటులో ఉండాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా మ‌త్య్స‌కారులు వెట‌కు వేళ్ల‌రాద‌ని తెలిపారు.

ఎక్క‌డ కూడా ప్రాణ ఆస్ధి న‌ష్టం జ‌ర‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మున్న చొట ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని కోరారు. వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాల మేర‌కు రేపు రాత్రికి ఒడిశాలోని పూరి. ప‌శ్చిమ‌ బెంగాల్ లో దిఘా మ‌ధ్య తీరం దాటుతుటుంద‌ని ఈ నేప‌థ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ అందుబాటు లో ఉంచామ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర‌మైన వారు సంప్ర‌దించాల‌ని కోరారు. జిల్లా క‌లెక్ట‌ర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో ఎప్ప‌టి క‌ప్పుడు చ‌ర‌వాణిలో మాట్లాడి జిల్లా ప‌రిస్ధితులు అడిగి తెలుసుకుంటున్నారు.

👉పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు…రేపు నిర్ణయం వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పిటిషన్లు.పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.రేపటి హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.. *ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ లోకి వెళ్లే ఎమ్మెల్యేల ను ..తిరిగి ఎన్నికలలో పోటీ  చేయాలని లేదా వారి ఎమ్మెల్యే పదవి ని రద్దు చేసే విధంగా చట్టాలు వస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని పలువురు మేధావులు ఆకాంక్షిస్తున్నారు.

👉సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం*

👉ప్రకాశం బ్యారేజీకి 3 కౌంటర్‌ వెయిట్ల ఏర్పాటు
పాత సిమెంటు దిమ్మెల స్థానంలో స్టీల్‌ కౌంటర్లు
స్వయంగా వెళ్లి పరిశీలించిన సీఎం
వివరాలు తెలిపిన కన్నయ్యనాయుడి బృందం..బ్యారేజీలో ప్రస్తుతం ఉన్న కౌంటర్‌ వెయిట్ల ఒక్కో దాని బరువు 17 టన్నులు.దెబ్బతిన్న వెయిట్లను డ్రిల్లింగ్‌ మిషన్‌తో మూడు ముక్కలు చేసి, క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. పాత వాటి స్థానంలో అదే బరువు ఉన్న కౌంటర్‌ వెయిట్లను అమర్చారు.ఒక్కో కొత్త వెయిట్‌ బరువు 4.8 టన్నులు.వీటికి రెండు పెద్ద రంధ్రాలు ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్‌ వెల్డింగ్‌ ద్వారా వాటికి తొమ్మిది రంధ్రాలు చేస్తున్నారు.ఒక్కో రంధ్రంలో 27 సంచుల ఐరన్‌ స్ర్కాబ్‌(బిళ్లలు, మేకులు, విరిగిన ముక్కలు) వేస్తారు. ఒక్కో సంచిలో 30 కిలోల ఐరన్‌ స్ర్కాబ్‌ ఉంటుంది.ఈ స్ర్కాబ్‌ను ఒక్కో రంధ్రంలో 27 సంచుల లెక్కన పోస్తారు. ఇలా 8.7 టన్నుల స్ర్కాబ్‌ను వేస్తారు.అనంతరం దానిపై 3.50 టన్నుల కాంక్రీట్‌ పోస్తారు.3 దశల్లో బరువును 17 టన్నులకు చేర్చుతారు.

👉 చైనాలో మరో ప్రాణాంతక వైరస్… మెదడుపై ప్రభావం…ఐదేళ్ల కిందటే మరో వైరస్ ను కూడా గుర్తించిన పరిశోధకులు..దీనిపేరు వెట్ ల్యాండ్ వైరస్..

👉*వంశధార నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* గొట్టాబ్యారేజీ వద్ద సా.5 గం.కు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 7,196 క్యూసెక్కులుగా నమోదు.- 40 వేల క్యూసెక్కుల దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.

👉భారత్ పారిస్ 2024 పారాలింపిక్ గేమ్స్ లో 7 బంగారు పతకాలు సాధించింది..భారత్ 18వ స్థానంలో ఉంది. పారాలింపిక్ గేమ్స్ లో భారత్ మొత్తం 29 పతకాలు సాధించింది

👉 ‘హైడ్రా’ కూల్చివేతలపై సామాన్యుడి ప్రశ్నలు: అన్నీ క్లియర్గా ఉన్నాయని అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన ఇల్లును హైడ్రా ఎలా కూలుస్తుందని ఓ ఇంటి యజమాని ప్రశ్నించారు. ‘ఇల్లు FTL పరిధిలో ఉందా? లేదా? అనేది అధికారులకు తెలియదా?అడ్మినిస్ట్రేషన్ తప్పును సామాన్యులపై రుద్దడం ఎంతవరకు కరెక్ట్? బ్యాంక్ వాళ్లు లీగల్ ఒపీనియన్ లేనిదే లోన్ ఇవ్వరు? మరి ఎలా ఇచ్చారు? ఎంతమంది మమ్మల్ని మోసం చేశారు? ఇప్పుడు మాకు న్యాయం చేసేవాళ్లు ఎవరు?’ అని ప్రశ్నించారు.

👉ఇబ్రహీంపట్నం లో విష జ్వరాలు పంజా.తీవ్ర జ్వరం తో మృత్యు వాత పడిన 12 ఏళ్ల బాలుడు….టైఫాయిడ్ జ్వరంతో బాలుడి మరణించినట్లు చెబుతున్న బాలుడు బందువులు.వరదలు వచ్చి వెళ్ళాక వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు.కడుపు లో ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర కడుపు నొప్పితో మృతి చెందిన బాలుడు.గత నాలుగు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న బాలుడు జాన్ వెస్లి..అద్దె ఇల్లు కావడం తో రోడ్డు మీద బాలుడు పార్థివ దేహం.

కంటి నీరు పెట్టిస్తున్న బాలుడు కుటుంబ సభ్యుల రోదన.
👉 ప్రకాశం జిల్లా….కొనకనమిట్ల మండలం, కాట్రగుంట గ్రామ పంచాయతీ, ఓబుళరెడ్డి పల్లె గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి.. ఇంట్లో ఉన్న సామాగ్రి కాలిపోయాయి.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.. సుమారు 2 లక్షలు మేర ఆస్థి నష్టం జరిగినట్లు సమాచారం??..పూర్తి వివరాలు తెలియాల్సిఉంది…

👉నాగర్ కర్నూల్, తాడూరు మండలం సిరిసివాడ దుందుభి వాగులో కొట్టుకుపోయిన కారు…మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులు..కారులో ఉన్న వ్యక్తులను కాపాడిన పోలీసులు..

👉మహిళను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి, లైంగిక సంబంధం కొనసాగించి, మోసం చేసిన వ్యక్తీ అరెస్ట్:*వినుకొండ పట్టణమునకు చెందిన ఒక మహిళను సుమారు గత 5 సం.ల కాలం నుండి నీవంటే నాకు ఇష్టం, నీన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించి, తీరా పెళ్ళి ప్రస్తావన వచ్చే సరికి, మాట దాట వేసి ఆమెను మోసం చేసిన వినుకొండ పట్టణం, హనుమాన్ నగర్ 2 వ లైన్ కు చెందిన షేక్ అత్తర్ నాగూర్ వలి, తండ్రి: ఖాదర్ మస్తాన్, అను వానిని వినుకొండ పోలీస్ వారు ఈ రోజు ది.08.09.2024 వ తేది అరెస్ట్ చేసి, కోర్ట్ నందు హాజరు పరచగా, వినుకొండ JFCM కోర్ట్ వారు అతనికి 13 రోజులు రిమాండ్ విధించడమైనది.

👉కాటేసిన పాము కోసం వెతికి చనిపోయాడు ..కాటేసిన పామును చంపాకే చికిత్స చేయించుకోవాలనుకున్న వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు ANUలో బర్మాకు చెందిన కొండన్న (38) ఎంఏ బుద్ధిజం చదువుతున్నారు. శనివారం పుట్టగొడుగులు కోస్తుండగా రక్తపింజరి..

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..