👉 ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆయనతో పాటు యూఏఈ ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు, వ్యాపార ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.
👉ఆపరేషన్ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..
ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకోసం పటిష్ట చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడలోని కలెక్టరేట్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ గ్రాబర్స్, పొలిటికల్ సపోర్టుతో ఆక్రమణలకు పాల్పడ్డ వారికి బుద్ధి చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుందన్నారు. కొంత మంది ఆక్రమణదారుల వల్ల లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వరదలు విజయవాడ పట్టణానికి మళ్లీ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు నిర్వరామంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
👉గవర్నరుతో సిఎం భేటీ..
గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్‌తో సిఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బుడమేరుతో సంభవించిన వరదలు, సహాయక చర్యలతోపాటు రాష్ట్రానికి జరిగిన నష్టం సుమారు రూ.6,880 కోట్లు ఉండొచ్చని కేంద్రానికి నివేదిక పంపినట్లు గవర్నరుకు సిఎం వివరించారు. వీరిద్దరి భేటీ 45 నిమిషాలకు పైగా జరిగింది. వరద బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు పనిచేసి పెద్దయెత్తున సహాయక పునరావాస చర్యలు చేపట్టినట్లు సిఎం తెలిపారు.సిఎం చంద్రబాబు శనివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలను ఆర్మీ ఇంజినీరింగ్ విభాగం ప్రశంసించిందన్నారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ అక్కడే ఉండి ప్రత్యేకంగా దృష్టి సారించి, బుడమేరు గండ్లును పూడ్చే పనిని పూర్తి చేయగలిగారన్నారు. సోమవారం అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని, ప్రాజెక్టు స్టోరేజీ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.
👉హైదరాబాద్ సిపి గా సీవీ ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు*..
హైదరాబాద్ సీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావ డం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగు పరుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక భాగ మని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుం దని.. నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పని చేస్తుంద న్నారు.వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్‌లో కీలకమ న్నారు. వినాయక నిమజ్జ నం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తాను ఇంకా ఫైల్ చూడలేదని సీవీ ఆనంద్ తెలిపారు.ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఒక్క సారి సమీక్ష నిర్వయిస్తామ న్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని సీవీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం చూపుతామన్నారు.
హత్యలు, అత్యాచారాలు , లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా నియామకం కావడం ఇదేమీ తొలిసారి కాదు. సరిగ్గా ఏడా ది క్రితం వరకూ ఆనంద్.. హైదరాబాద్ సీపీగానే ఉండేవారు.
2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకూ హైదరాబాద్ సీపీగా పని చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పదోన్నతి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు.అనంతరం 2021లో తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో డీజీపీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమ యంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు.కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం తిరిగి హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితుల య్యారు…
👉 నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*..?తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ తెలంగాణ అధ్యక్షురాలి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెట్టేందుకే సుహాసినికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. నందమూరి సుహాసిని ఏపీ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా గతంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట లేదంటే మరో నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు. అయితే తాజాగా సుహాసినికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది .
👉 మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాస్‌పోర్ట్‌పై ఏపీ హైకోర్టు లో ముగిసిన విచారణ..శుక్రవారం ఏపీ హైకోర్టులో జగన్ లంచ్‌మోషన్ ఐదేళ్లకు పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయాలని పిటిషన్ ముగిసిన విచారణ, తీర్పు
ఈ నెల 11కు వాయిదా..
👉ఎమ్మెల్యే కామినేని కి త్రుటిలో తప్పిన ప్రమాదం..
కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం దగ్గర కొల్లేరులో దిగిపోయిన కామినేని ప్రయాణిస్తున్న వాహనం..
అధికారులు కూటమి నాయకుల అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం ..బొలెరోలోనే ఉన్న కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు మీడియా ప్రతినిధులు..
👉గిద్దలూరు పట్టణం, కొంగలవీడు రోడ్డులోని పూసలబజారులో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన బాల గణపతిని దర్శించుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి …*
👉 గిద్దలూరు పట్టణం, గణేష్ నగర్ లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన గణనాధున్ని దర్శించుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి…*
👉*ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత*
*వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*…*78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పిడతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిడతల రమేష్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణలో భారత రాజ్యాంగం ప్రాముఖ్యత అనే అంశం పై నిర్వహించిన వ్యాసరచన పోటిల్లో గెలుపొందిన విద్యార్థులకు గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బహుమతులను అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ఉన్నత చదువుల పోటీ ప్రపంచంలో విద్యార్థులకు దేశభక్తి, సమాజం పట్ల బాధ్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలను విద్యార్థులకు తెలియచేసే కార్యక్రమాలు చేపట్టటం చాలా అభినందనీయమన్నారు.
👉గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలి : మండల అధికారులతో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*…*గిద్దలూరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని, జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో నాణ్యత పాటించకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మండల అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆరు మండలాల ఎంపీడీఓ అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే వాటిని పరిష్కారం చేయాలన్నారు. అభివృద్ధి విషయంలో నాణ్యతా లోపం లేకుండా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని, త్రాగునీటి సమస్యలు, రహదారుల సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేయాలని, గ్రామాల్లోని రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని వర్షాకాల సమయంలో వారికీ తగిన సూచనలు ఇవ్వాలన్నారు.. గ్రామాల్లో అసంపూర్తిగా ప్రభుత్వ భవనాలను పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు.. ఎన్డీయే ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమం గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసమేనని, ప్రతీ అధికారి గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరుమండలాలకు చెందిన ఎంపీడీఓ అధికారులు పాల్గోన్నారు.*
👉ఇకపై ఇల్లు నాదే’.. దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి బంపర్ ఆఫర్.. మామూలు ట్విస్ట్ కాదుగా..మరీ*
సినిమాలు.. టీవీ సీరియల్స్‌కి ఎండ్ కార్డ్ పడుతుందేమో కానీ..మన టెక్కలి కొనసాగుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రామ్ సిరీస్ కు మాత్రం ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేటట్లు లేదు..పూటకో అప్‌డేట్, రోజుకో ట్విస్ట్‌తో సినిమా సిరీస్‌లను మించిపోతోంది.అయితే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్ ఒక ఎత్తయితే… లేటెస్ట్‌గా చోటుచేసుకున్న ట్విస్ట్ సంచలనంగా మారింది.
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. అంతేకాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈనెల 6వ తేదీన మాధురి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యినట్లు డాక్యుమెంట్లలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇల్లు మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ కాగానే దువ్వాడ వాణి అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు. అదే ప్లేస్‌లో కూర్చున్న మాధురి టీవీ9తో ముచ్చటించింది. దువ్వాడ శ్రీను ఇష్టపూర్వకంగానే తన పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారంటూ కన్ఫర్‌మేషన్ కోసం రాజాకు లైవ్‌లోనే ఫోన్ కలిపి మాట్లాడించారు. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి హక్కులు తనకు వచ్చాయన్నారు దివ్వెల మాధురి. ఇకపై ఈ ఇల్లు నాదే..దువ్వాడ శ్రీనివాస్‌ది కాదు.. అంటూ మాధురి పేర్కొన్నారు.
టెక్కలిలోనే మళ్లీ రాజకీయం చేస్తానన్న దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి బంపర్ ఆఫరిచ్చారు. తన ఇంటి అద్దెకు ఇస్తానని, తిరిగి ఇక్కడికే వచ్చి రాజకీయాలు చేయాలని రిక్వెస్ట్ చేశారు మాధురి.. ఈ ఇల్లు ఇప్పుడు లీగల్‌గా తనదేనన్నారు దివ్వెల మాధురి. మళ్లీ వాణి వచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారామె. తన ఇంటికి రావడానికి వాణి ఎవరని ప్రశ్నించారు మాధురి.
కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా… ఇంట్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో దువ్వాడ వాణి నెక్ట్స్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా… గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్.. ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
👉ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు..అన్నమయ్య జిల్లా, మదనపల్లె :విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ములకలచెరువు ఎస్ఐ గాయత్రీ, తంబళ్లపల్లె ఎస్ఐ లోకేష్‌రెడ్డి, ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్‌లపై క్రమ శిక్షణా చర్యలు..రాజంపేట డీఎస్పీ కార్యాలయానికి లోకేష్‌రెడ్డి.రాయచోటి డీఎస్పీ కార్యాలయానికి గాయత్రీ
మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి దిలీప్‌కుమార్‌లను అటాచ్ చేస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ..
👉 కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సీబీఐ..
హత్యాచార అనంతర పరిణామాలపై ప్రభుత్వ నివేదిక..
ఫోరెన్సిక్ నమూనాలు ఎయిమ్స్‌కు పంపుతామన్న సీబీఐ..వారంలో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం
వైద్యుల భద్రత కోసం తీసుకున్న చర్యలపై..స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసిన బెంగాల్ ప్రభుత్వం..తదుపరి విచారణ వారంపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
👉వినాయక నిమజ్జనంలో అపశృతి..కడప జిల్లా :-
వియన్ పల్లి మండలం లోని మొగమూరు వాగులో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు.
ఇద్దరు వ్యక్తులు గల్లంతు..గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టన పోలీసులు..గల్లంతైనవారు వేంపల్లి ఉషా కిరణ్ వీధికి చెందిన బేల్దారి రాజా(28) ఎస్సీ కాలనీకి చెందిన డ్రైవర్ వంశీ (30)గా గుర్తింపు.. మొగమూరు వాగుపై గల్లంతైన వారి బంధువుల అర్ధనాదాలు.
👉ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం.*ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు.*గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రిని అరెస్టు చేసిన పోలీసులు*
*కొట్టుకొచ్చిన మూడు పడవలూ కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తింపు..*సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను అరెస్టు చేసిన పోలీసులు*
👉 జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది : ఎమ్మెల్యే జూలకంటి..
జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసిందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. 40 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నిస్వార్ధ ప్రజాసేవకై అంకితమై కోట్లాది కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కుట్రలతో జైలు పాలు చేసి నేటికీ ఏడాది పూర్తి అయిందని ఆయన అన్నారు. ఆనాడు జగన్ వికృత చేష్టలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆ సంఘటనతో తెలుగు ప్రజలు నియంత పాలను చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలుపు తమ గెలుపుగా భావించి అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీకి భారీ విజయాన్ని అందించారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకు సైతం పనికిరాడిన విధంగా తీర్పు ఇచ్చి 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అఖండ మెజారిటీలతో ఇచ్చిన గెలుపును తమపై ఉంచిన బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలకు నిస్వార్థపూరితంగా సేవ చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నాడని అన్నారు. గతంలో రాష్ట్రంలో నెలకొల్పిన పరిశ్రమలు నియంత పోకడలను భరించలేక రాష్ట్రం నుంచి వెను తిరిగాయని తిరిగి వాటిని రాష్ట్రంలో పునర్నిర్మించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ముందున్న లక్ష్యము అన్నారు.
👉వాళ్లు నా పట్ల నీచంగా ప్రవర్తించారు.. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టకండి : నటి కాదంబరీ జత్వానీ..
కొందరు ఐపీఎస్ అధికారులు నాపట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో అక్రమంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆనాటి పోలీసు అధికారులు విద్యాసాగర్ కు ఎందుకు కొమ్ముకాశారని ప్రశ్నించారు. వరదల వల్ల పోలీసులు చాలా బిజీగా మారిపోయారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉందని జత్వానీ అన్నారు. నాపై సోషల్ మీడియాలో నీచంగా ప్రచారం చేస్తున్నారు. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వారికి శిక్ష పడేలా చూడండని విజ్ఞప్తి చేశారు. నాకు అండగా నిలిచిన మహిళా సంఘాలందరికీ జత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.
👉 మినీ లారీ ఢీకొని వ్యక్తి మృతి..
కంభం సమీపంలోని రావిపాడు రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ లారీ ఢీకొనడంతో గొట్టం అబ్రహం అనే వ్యక్తి మృతి చెందాడు. కందులాపురం సెంటర్లోని హెచ్డిఎఫ్సి (h d f c )బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అబ్రహం ఒంటి గంట ప్రాంతంలో డ్యూటీ కి వస్తూ రోడ్డు దాటుతుండగా గిద్దలూరు వైపు నుండి మిర్చి లోడుతో వస్తున్న మినీ లారీ (ఎ వి 39 టి వి 4335)ఢీకొంది. ఈ లారీ దద్దవాడ నుండి మిర్చి లోడుతో గుంటూరు వెళుతున్నట్లు సమాచారం. మృతుడు అబ్రహం బేస్తవారిపేట మండలం గొట్ట మిల్లుకు చెందినవాడు.. సంతానం లేదు భార్య ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉పొదిలి ఆల్ఫా హై స్కూల్ లో అంబరాన్ని అంటిన గణేష్ నిమర్జన సంబరాలు…. స్థానిక ఆల్ఫా హైస్కూలులో జరిగిన వినాయకుని నిమర్జన కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మెన్ జి.మాలకొండారెడ్డి మరియు ధర్మపత్ని సంత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీన్ రితేష్ నాయర్ నిమార్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాటలో బద్దిగం. రేణుక 15,500/- దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ భరిగే ఏడుకొండలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేలంపల్లి నజీర్, ఇంచార్జి శశికళ,పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకు రూ.85,000 ల చెక్కును అందించిన బోనేని..*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు, కొమరోలు మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు రూ. 85000-00 లను నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి సోమవారం ఉదయం అందజేశారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతల సహకారంతో సేకరించిన నగదును చెక్కు రూపంలో అందచేయటం జరిగిందని సదరు చెక్కును సీఎం సహాయనిధికి అందజేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు బోనేని వెంకటేశ్వర్లును, మరియు దాతలను అభినందించారు.* కార్యక్రమంలో బూనబోయిన చంద్రశేఖర్, పందనబోయిన భూపాల్, ఓబుల్ రెడ్డి, అంకయ్య, పుల్లయ్య, శేఖర్, తిరుపతయ్య, అరవింద్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.*
*విజయవాడ వరద బాధితులకు చేయూత*..లక్ష ముప్పై వేల ఆరు వందల (1,30,600-00) రూపాయల చెక్కును ఎమ్మెల్యేకు అందచేసిన జీవనజ్యోతి కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు.*…*విజయవాడ వరద బాధితులకు గిద్దలూరు పట్టణంలో దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు, పలువురు ప్రముఖులు తమ సహాయాన్ని అందచేస్తుండగా, విజయవాడ వరద బాధితులకు అండగా మేము సైతం అంటూ పట్టణానికి చెందిన జీవనజ్యోతి విద్యాసంస్థల కరస్పాండెంట్ కంకర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది మరియు డిగ్రీ, ఇంటర్మీడియట్, ఒకేషనల్ కళాశాలల విద్యార్థులు ముందుకు వచ్చింది వరద బాధితులకు రూ. 1,30,600-00 లను సేకరించి, ఆ నగదును చెక్కు రూపంలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు కళాశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ రెడ్డి, నిరంజన్, మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గోన్నారు.*..*అన్న క్యాంటీన్ కు రూ. 6 వేలు విరాళం*…*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని బెస్తవారిపేట మండలం, పందిళ్లపల్లె గ్రామానికి చెందిన కర్నాటి వెంకట నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గిద్దలూరు పట్టణంలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ నిర్వహణకు తన వంతు సహకారంగా తనకు వచ్చే ఒక నెల సామాజిక పెన్షన్ మొత్తం రూ. 6000-00 లు ఆరు వేల రూపాయలను అందచేశారు. ఈ సందర్బంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీనివాస రెడ్డి, లక్ష్మి రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గోన్నారు.