👉 కుప్పకూలిన బ్రిడ్జి..చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లో ‘యాగి’ టైఫూన్ విధ్వంసం సృష్టిస్తోంది. 203Kmph వేగంతో గాలులు, భారీ వరదల ధాటికి ఉత్తర వియత్నాంలో బిజీగా ఉండే ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక కార్లు, ట్రక్కులు నీటిలో పడిపోయాయి. ఇందుకు సంబంధించి ఓ కారు కెమెరాలో రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనలో 13 మంది గల్లంతుకాగా, ఓవరాల్గా ఇప్పటి వరకు దేశంలో 60 మందికి పైగా చనిపోయారు.
👉రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం…పొగిడారా ?
సోషల్ మీడియా ద్వారా కూడా రాహుల్ ని పప్పు అంటూ వేళాకోళం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ మీద చాలా రకాలుగా సొంత పార్టీ వారు బయట వారూ మాట్లాడుతూంటారు. రాహుల్ గాంధీని పప్పు అని ప్రత్యర్ధులు ఎక్కువగా ర్యాంగింగ్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బీజేపీ అయితే రాహుల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి పదే పదే ఇదే మాటను వాడింది. జనాల్లోకి ఇదే పంపించింది. సోషల్ మీడియా ద్వారా కూడా రాహుల్ ని పప్పు అంటూ వేళాకోళం చేస్తూ వచ్చింది. అయితే రాహుల్ పప్పు కాదు అని ఇటీవల ఆయన ప్రసంగాలు కానీ ఆయన వ్యవహార శైలి కానీ ప్రతిపక్ష నాయకుడిగా లోక్ సభలో అధికార బీజేపీ కూటమిని ఆయన నిలదీస్తున్న వైఖరిని చూసిన వారు కానీ కచ్చితంగా అర్ధం చేసుకున్నారు.ఆ విధంగా తన మీద వేసిన ఈ బురదను రాహులే తొలగించుకున్నారు అని భావించాలి. ఆయన చేసిన భారీ పాదయాత్ర కూడా అందుకు ఉపకరించింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే రాహుల్ ఈ నెల 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టెక్సాస్ లోని డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు పెద్ద ఎత్తున అందరి నుంచి స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై విభాగం కన్వీనర్ అయిన శ్యాం పిట్రోడా రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకున్నారు.అనంతరం డాలస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శామ్ పిట్రోడా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పప్పు కాదు అని అన్నారు. బీజేపీ ఈ విషయంలో రాహుల్ గాంధీ మీద తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అంతే కాదు కోట్లు కుమ్మరించి మరీ బీజేపీ రాహుల్ గాంధీని కించపరచే కార్యక్రమానికి తెర తీసిందని నిందించారు.నిజానికి రాహుల్ గాంధీ ఉన్నత విద్యావంతుడు అని ఆయన కితాబు ఇచ్చారు. ఆయన ఎంతో చదువుకున్నారని అంతే కాదు లోతైన ఆలోచనాపరుడని శ్యాం పిట్రోడా చెప్పారు. రాహుల్ ఆలోచనల లోతును ఒక్కోసారి అర్థం చేసుకోలేమని కూడా ఆయన అన్నారు. రాహుల్ ని ఎగతాళీ చేసే వారికి ఆయన అసలు అర్ధం కారని అన్నారు.రాహుల్ గాంధీలో పరిపక్వత సాధించిన నాయకత్వం ఉందని అన్నారు. రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో రాటు దేలారు అని కూడా అన్నారు. మొత్తం మీద శ్యాం పిట్రోడా రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. రాహుల్ పప్పు కాదని అంటూనే ఆయనను అర్ధం చేసుకోవడం ఒక్కోసారి కష్టం అని కూడా అన్నారు. ఇది నిజంగా పొగడ్తగానే చూసినా అందులో కూడా అర్ధాలు చూసేవారు ఉంటారని అంటున్నారు.ఏది ఏమైనా భావి భారత దేశ నాయకుడిగా రాహుల్ ఇపుడు అగ్ర భాగంలో ఉన్నారని కాంగ్రెస్ నేతలతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
👉హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్*..నోటీస్ ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోవాలనేది నా కోరిక అన్నారుట.. ఈ వ్యాఖ్యలు ఎంతకు దారి చూస్తాయో వేచి చూడాలి..
👉 ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్…*పాడేరు, జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున జిల్లావ్యాప్తంగా ఘాట్రోడ్లలో వాహనాల రాకపోకలు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.అందులో భాగంగా నర్సీపట్నం సీలేరు ఘాట్ రోడ్, వడ్డాది పాడేరు ఘాట్ రోడ్, అరకు అనంతగిరి ఘాట్ రోడ్, రంపచోడవరం మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్ లలో వాహనాలు రాకపోకలు నిషేధించడం అయిందని, వాహనాలు ఘాట్ రోడ్లలో రాకపోకలు సాగించకుండాసంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
**గూడూరు లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి*..గంగా కావేరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తూ ఓ వ్యక్తి గూడూరు వద్ద కిందకు దిగి మళ్ళీ ట్రెయిన్ ఎక్కే క్రమంలో ప్రమాద వశాత్తూ రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు,ఈ ప్రమాదం లో ఆ వ్యక్తి శరీరం రెండు ముక్కలు గా అవడం తో ప్రయాణికులు బీతిల్లి పోయారు,మృతుని వివరాలు తెలియాల్సి ఉంది….
👉 కర్నూల్ టు నంద్యాల డెమో ట్రైన్ లో కర్నూల్ రైల్వే స్టేషన్ లో ఎక్కి కోట్ల రైల్వే స్టేషన్ వచ్చేలోపు వెల్దుర్తికి చెందిన పల్లీలు అమ్ముకునే వ్యక్తిని చెత్త పేపర్లు ఏరుకునే భార్యాభర్తలు ఇద్దరు అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బును దోచుకెళ్ళి వెళ్లారు అని బాధితుడు వివరించాడు
👉చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్*..వీఆర్వో జయలక్ష్మీకి షోకాజ్ నోటీసిచ్చిన కలెక్టర్ సృజన*వీఆర్వోను విధుల నుంచి తప్పించారు*..విజయవాడ వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన.వీఆర్వో జయలక్ష్మీకి షోకాజ్ నోటీసిచ్చిన కలెక్టర్ సృజన….వీఆర్వోను విధుల నుంచి తప్పించారు. బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు సూచనలు చేయడం జరిగింది.బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశిస్తున్నా మారడం లేదు కొందరి ఉద్యోగుల తీరు. ఇక తీరు మారని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం… వెంటనే చర్యలు తీసుకుంటోంది.
👉హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి శుభాకాంక్షలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం మరియు సిటీ పోలీస్ కో -ఆపరేటివ్ సొసైటీ..నూతనంగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా పదవీ స్వీకారం చేసిన C.V. ఆనంద్ ను హైదరాబాద్ నగర పోలీస్ అధికారుల సంఘం సభ్యులుమరియు సిటీ పోలీస్ కో -ఆపరేటివ్ సొసైటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు సొసైటీ సెక్ట్రటరీ నల్లా శంకర్ రెడ్డి, సభ్యులు GMS విక్టర్, అసిఫ్ ఖాన్ ,నవీన్ కుమార్, రత్నా కుమారి,వినీత్ మొదలగు వారు కలిసిన వారిలో ఉన్నారు.
👉 తెలంగాణ హక్కుల బావుటా.. ఐలమ్మ..!!సెప్టెంబర్ 10న చాకలి ఐలమ్మ వర్ధంతి..!!*అది దేశమంతా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సమయం. స్వాతంత్య్ర పోరాట వీరులకు జనం నీరాజనాలు పడుతున్నారు.కానీ, ఇటు దక్కన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ, అది చేపట్టిన కార్యక్రమాల మీద తీవ్రమైన నిర్భంధం అమలైంది. నిజాంను వ్యతిరేకించే ఏ వ్యక్తి, సంస్థనైనా క్రూరంగా అణిచివేయటమే లక్ష్యంగా రజాకార్లు పనిచేశారు. గ్రామాల్లోని దొరల చేతుల్లో చిన్నకులాల ప్రజలు, చేతి వృత్తిదారులు అరిగోస పడుతున్న కాలమది. తెలంగాణ పల్లెల్లోని దేశ్‌ముఖ్‌లు, దొరలంతా నిజాం అనుచరులుగా ఉంటూ అక్కడి భూమితో బాటు ప్రజల మీదా పెత్తనం చేసేవారు. దీంతో వారి దయమీదనే గ్రామంలోని శ్రామిక వర్గాల ప్రజల బతకాల్సిన దుస్థితి. ఆ సమయంలో ఆ దొరల దుర్మార్గాలను ధైర్యంగా నిలదీసి, వారందరికీ దన్నుగా నిలిచిన నిజాంకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి పోరుబాట పట్టించిన వీరనారి.. ఐలమ్మ.ఆకలికి అతి చేరువలో ఉండే చాకలి కులంలో 1895లో మల్లమ్మ, సాయిలు దంపతులకు ఐలమ్మ జన్మించింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం ఈమె పుట్టిన ఊరు. అతిపిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సింహతో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుటుంబం కావడంతో పూటగడవడం కష్టంగా ఉండేది. వృత్తి పని చేసినా సరైన భుక్తి లేకపోయేది. దీంతో బట్టలు ఉతకటంతో బాటు కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఆ సమయంలోనే 1944లో భువనగిరిలో రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. నల్ల నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి నేతలంతా కలిసి 1945లో పాలకుర్తి కేంద్రంగా ఆంధ్ర మహాసభ శాఖను ఏర్పరిచారు. స్థానిక నేతల మీద నిర్బంధం ఉండటంతో వీరంతా ఐలమ్మ ఇంటినే కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగించేవారు. తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలకు తన ఇంట ఆశ్రయమిచ్చి, భోజన వసతి కల్పించటమే ఐలమ్మ బాధ్యతగా ఉండేది. తర్వాతి రోజుల్లో మహాసభకు గట్టి మద్దతుదారుగా మారింది.ఆ సమయంలో పాలకుర్తి ప్రాంతానికి రజాకార్ల తరపున ఉపసేనానిగా ఉన్న విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో 60 గ్రామాలలో పాలన సాగేది. ఈ గ్రామాల్లోని వీరి ప్రతినిధులు.. ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకోవడం, ఎదురు తిరిగితే హత్య చేయటం, బాలింతల పాలను పిల్లలకు ఇవ్వకుండా పిండి పారబోయించడం, మహిళల బట్టలూడదీయించటం, వంటి హేయమైన పనులు చేసేవారు. రైతుల పంట పొలాలు, పశువులను లాక్కోవటం, వెట్టిచాకిరీ చేయించుకోవడం, గృహ దహనాలు, లూటీలూ సామాన్య విషయాలుగా ఉండేవి. తన భద్రత, తిరుగుబాటు చేసేవారిని అణిచివేసేందుకు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి, విసునూరులో.. రజాకార్లతో మాట్లాడి పోలీస్ స్టేషన్‌నూ పెట్టించాడు. దీంతో గ్రామాల్లోని దొరల బాధితులంతా.. ఆంధ్రమహాసభలో చేరటమో, మద్దతుగా ఉండటమో చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆ దేశ్‌ముఖ్ మహాసభను అంతం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 1945 ఫిబ్రవరిలో పాలకుర్తి జాతర వచ్చింది. ఈ జాతరకొచ్చే జనానికి ఆంధ్రమహాసభ ఎజెండాను తెలపాలనే ఉద్దేశంతో పాలకుర్తి కార్యకర్తలంతా ఆరుట్ల రామచంద్రారెడ్డిని అతిథిగా ఆహ్వనించారు. దీనికోసం వారు నిజాం ప్రభుత్వం నుంచి అనుమతీ పొందారు. కానీ, విసునూరు దేశ్‌ముఖ్ ఈ సభ విజయవంతమైతే, జనం తనమీద తిరగబడతారని భావించి, ఆరుట్ల రామచంద్రారెడ్డిని చంపేందుకు 60 మంది గూండాలను పాలకుర్తికి పంపాడు. వారంతా సభా ప్రాంగణంలో రచ్చ చేయటం, రక్షణ కల్పించాల్సిన పోలీసులు దేశ్‌ముఖ్ ఆదేశాల మేరకు మౌనం వహించటంతో ఆ సభ రద్దైంది. దీంతో అక్కడికి చేరిన నేతలు, కార్యకర్తలంతా తలోదిక్కు పోయారు. ఈ సమయంలో దేశ్‌ముఖ్ ప్రతినిధి ఒకరు.. మహాసభ వాలంటీర్ల రక్షణలో ఉన్న ఆరుట్ల రామచంద్రా రెడ్డి తలదాచుకున్న ఇంటిని గుర్తించి, రాత్రివేళ గుండాలతో వెళ్లి ఆ ఇంటిపై దాడిచేశారు. అయితే, వీరి రాకను ముందే గుర్తించిన వాలంటీర్లు ఆ గూండాలపై తిరగబడి,వచ్చిన దేశ్‌ముఖ్ ప్రతినిధి తల పగలగొట్టారు. దీనిపై దేశ్‌ముఖ్.. ఐలమ్మ భర్త నర్సింహ, ఆమె ముగ్గురు కొడుకులు, ఆరుట్ల రామచంద్రారెడ్డితో సహా 12మందిని నిందితులుగా చెబుతూ కేసు పెట్టగా, 10 మందిని అరెస్టు చేసి విసునూరు పోలీసు స్టేషన్‌కు తరలించగా, సుబ్బారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి పాలకుర్తి ప్రాంతంలోని కొండాపురంలోని గిరిజన ఇండ్లల్లో తలదాచుకున్నారు.ఆంధ్రమహాసభ నేతలు, కార్యకర్తలకు స్థానికంగా ఆశ్రయం కల్పిస్తున్న ఐలమ్మను పాలకుర్తిలో ఉండకుండా చేసేందుకు దేశ్‌ముఖ్ మరో ప్లాన్ వేశాడు. పాలకుర్తి గ్రామ పట్వారీని ఆమె ఇంటికి పంపి కుటుంబసమేతంగా నాగళ్లతో వచ్చి తమ పొలాల్లో పనిచేయాలని ఆదేశించాడు. దీనికి ఆమె నిరాకరించగా, రెచ్చిపోయిన పట్వారీ, పాలకుర్తిలోని ఆంధ్రమహాసభ నేతలు, కార్యకర్తల ఇళ్లన్నీ కూల్చివేయటమే గాక వారి పొలాలను స్వాధీనం చేసుకుంటానని బహిరంగంగా హెచ్చరించాడు. దీంతో రెచ్చిపోయిన మహాసభ నేతలు, కార్యకర్తలు గ్రామంలోని పట్వారీ ఇంటిని గునపాలతో కూల్చిపారేశారు. పట్వారీ వీరి దెబ్బకు ఊరు విడిచి పారిపోగా, కార్యకర్తలు ఆ ఇంటిస్థలాన్ని దున్ని మొక్కజొన్న విత్తనాలు నాటటమే గాక, ఆ పంటను ఊరంతా కలిసి ఉమ్మడిగా మంటల్లో వేసి కాల్చుకుతిన్నారు. దీంతో ఐలమ్మ కుటుంబంపై దేశ్‌ముఖ్ పగ మరింత పెరిగింది. ఆ రోజుల్లోనే ఐలమ్మ కులవృత్తి చేసుకుంటూనే, పాలకుర్తిలోని పొలాన్ని కౌలుకు తీసుకొని పంట వేసింది. ఆ పొలం పొరుగూళ్లో ఉండే కొండల్ రావుది.సరిగ్గా పంట కోతకు వచ్చిన సమయంలో విసునూరు దేశ్‌ముఖ్ ఆ పొలం అసలు యజమానిని బెదరించి ఒక ఒప్పందం రాయించుకున్నాడు. ఆ పొలాన్ని తాను దేశ్‌ముఖ్‌కు కౌలుకివ్వగా, దానిని ఐలమ్మ ఆక్రమించుకుని పండించుకుంటోందన్నట్లు అందులో ప్రస్తావించారు. వెంటనే.. పట్వారీని బందోబస్తుతో పాలకుర్తి పంపి, ఐలమ్మ సాగుచేసే పొలం దేశ్‌ముఖ్ కింద ఉందని, కనుక ఈ పంటమీద హక్కు ఆయనదేనని చాటింపు వేయించాడు. దీన్ని ఐలమ్మ ఆంధ్రమహాసభ కేంద్ర కమిటీ పెద్దలకు చెప్పగా, వారు పంటను కాపాడేందుకు భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్ల ప్రతాప్ రెడ్డి , ఆరుట్ల రామచంద్రా రెడ్డిలను సూర్యాపేట నుంచి పాలకుర్తి పంపారు. వీరు మరో 15 మందితో ఐలమ్మ పొలానికి పోయి, అక్కడ మాటువేసి, పంటకోసేందుకు వచ్చిన దేశ్‌ముఖ్ గూండాల మీద కొడవళ్లు, కర్రలతో దాడిచేసి వారిని నిలువరించారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు కోసి కట్టలు కట్టిన పంటను ఐలమ్మ ఇంటికి చేర్చారు. దొర గుండాలు ఐలమ్మ ఇంటిపై దాడిచేయగా, ఆమె రోకలి బండను చేతబుచ్చుకుని వారిపై తిరగబడటంతో వారంతా పలాయనం చిత్తగించారు.దీంతో మరోసారి పరాభవానికి గురైన దేశ్‌ముఖ్ ఐలమ్మ కుటుంబీకులను, సూర్యాపేట నుంచి వచ్చిన ఆంధ్ర మహాసభ కార్యకర్తలను అరెస్టు చేయించి, చిత్రహింసలకు గురిచేసినా, ఐలమ్మ ఆంధ్రమహాసభ వెంటే నిలిచింది తప్ప దొరల ముందు తలొంచలేదు. ఈ ఘటనపై నమోదైన కేసును కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో వాదించి, ఐలమ్మకు అండగా నిలిచారు. నాడు ఐలమ్మ సాధించిన ఈ విజయం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నిజాం వ్యతిరేకుల్లో గొప్ప స్ఫూర్తిని నింపి హైదరాబాద్ సంస్థానం విముక్తికి బాటలు పరిచింది. నాటి పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు తన పుస్తకంగా వివరంగా ప్రస్తావించగా, దిగ్గజ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తన జీవిత చరిత్ర ‘విప్లవ పథంలో నా పయనం’లోనూ ప్రస్తావించారు. నిజాంకు వ్యతిరేకంగా ఇంత పెద్ద పోరాటం చేసిన ఐలమ్మకు తర్వాత వచ్చిన ప్రభుత్వాల నుంచి ఎలాంటి గుర్తింపూ దక్కలేదు. చివరికి.. స్వాతంత్య్ర సమరయోధుల ఫించన్‌కూ ఆమె నోచుకోలేదు. ఒక సాధారణ రైతుగా, అత్యంత సామాన్య జీవితం గడిపిన ఐలమ్మ 1985 సెప్టెంబరు 10న.. తన 90వ ఏట కన్నుమూశారు.
👉 గత ఏడాది బుడమేరుకు గండి పడితే, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరు కట్ట వెంట కబ్జాలు చేసి ఈ వైసీపీ నేతలు అమ్మేసుకున్నారు. మరో పక్క ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. గత ప్రభుత్వ పాపాలతో పాటు, అధిక వర్షపాతంతో, మనకి ఈ సమస్యలు వచ్చాయి
👉 విషాదం.. మాజీ మంత్రి సతీమణి కన్నుమూత..
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో స్వగ్రామం తిమ్మాజిపేట మండలం ఆవంచకు ఆమె పార్థివదేహాన్ని తీసుకురానున్నట్టు సమాచారం. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి జడ్చర్ల నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.
👉 హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్.. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది.
👉 పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే వారి పై క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని ఆయన వ్యాఖ్యానించారు.
👉ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్*బోట్లు ఢీకొన్న కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..నిందితులు ఉషాద్రి, రామ్మోహన్ లకు 14 రోజుల రిమాండ్..విజయవాడలోని జిల్లా జైలుకు నిందితుల తరలింపు..ప్రకాశం బ్యారేజీని భారీ బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు… ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు బ్యారేజ్ ను ఢీకొన్న బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో… ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో… ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది..
*ఉప్పల్‌లో నకిలీ వైద్యుడు అరెస్ట్*..అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్‌లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా ‘మణికంఠ పాలీ క్లినిక్’ని భిక్షపతి ఐదేళ్లుగా నదుపుతున్నాడు.నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు.. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.