మోడీని ఎందుకు అడగరో..విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

👉మోడీని ఎందుకు అడగరో… విరాళాలు పోగు చేస్తున్న బాబు! 2014 నుంచి 2019 టెర్మ్ లో చూస్తే కేంద్రంలో బీజీపీతో నాలుగేళ్ల పాటు పొత్తులో బాబు ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కేంద్రాన్ని ఇబ్బంది పెట్టరు. ఆయన తన తెలివి తేటలను వ్యూహాలను జోడిస్తూ నిధులను పోగు చేస్తారు. 2014 నుంచి 2019 టెర్మ్ లో చూస్తే కేంద్రంలో బీజీపీతో నాలుగేళ్ల పాటు పొత్తులో బాబు ఉన్నారు. ఆనాడే అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టారు. మోడీ శంకుస్థాపన చేసి వెళ్లారు. అయితే అమరావతి కోసం నిధుల సేకరణ అని ఇటుక నుంచి అన్నీ జనంలో పెట్టింది నాటి ప్రభుత్వం. అంతే కాదు అప్పుల కోసం ప్రపంచమంతా తిరిగింది. ఇక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ సింగపూర్ తో ఒప్పందాలు చేసుకుంది. Also Read – బాబు బాగా బిజీ : నామినేటెడ్ పదవులు ఇప్పట్లో రావు ! అయితే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది.. కానీ కేంద్రాన్ని పెద్దగా నాడు డిమాండ్ చేయలేదు అని విపక్షాలు విమర్శలు చేశాయి. కేంద్రం అయితే అమరావతికి రెండు వేల కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది అని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. మరో వైపు చూస్తే ప్రపంచ రాజధాని లక్ష కోట్ల నిధులు అవసరం అవుతాయని ఎస్టిమేట్లు తయారు చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇతోధికంగా రాజధాని నిధులను సేకరించలేక పోయింది అన్న విమర్శలు ఉన్నాయి. కట్ చేస్తే 2024లో మరోసారి బీజేపీతో పొత్తు కుదిరింది. అక్కడ మోడీ ఇక్కడ బాబు అధికారంలోకి వచ్చారు. Also Read – పుట్టేది ఒకరు.. గిట్టేది ఎందరో?.. అతిపెద్ద దేశంలో జన సంక్షోభం చిత్రమేంటి అంటే ఈసారి బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు పూర్తిగా అవసరం పడింది. అయినా కూడా అమరావతి రాజధానిని పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం లేదు అన్న విమర్శలు వచ్చాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి తాను పూచీగా ఉండి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోంది. మరి ఇది అప్పుగా ఉంటుందా ఉంటే ఎవరు తీర్చాలి అన్నది ఇంకా తేలలేదు. మరో వైపు చూస్తే భారీ వరదలతో బెజవాడ మునకేసింది. కేంద్రం నుంచి తక్షణ సహాయం కింది రెండు మూడు వేల కోట్లు అయినా వచ్చినట్లు అయితే ఏపీలో సజావుగా పని జరిగేది. కానీ అలా ఏమీ జరగడం లేదు. దాంతో టీడీపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను పడుతోంది. చంద్రబాబు మళ్లీ విరాళాల కోసం జనానికి పిలుపు ఇచ్చారు. Also Read – రాజ్యసభకు గల్లా జయదేవ్…ఖరారు చేసిన బాబు!? బాబు పిలుపునకు స్పందించి అంతా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఇది మంచిదే కానీ ఏపీని ఆదుకోవాల్సిన కేంద్రం ఎందుకు తక్షణ సాయం చేయడం లేదు అన్న ప్రశ్న ఉండనే ఉంది. అంతే కాదు ఆఖరుకు కిడ్డీ బ్యాంకులో దాచుకున్న చిన్న పిల్లలు కూడా వరద బాధితులకు విరాళం ఇస్తున్నారు.దీని మీద కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల గట్టిగానే విమర్శించారు. పసి పిల్లల నుంచి డబ్బులు తీసుకోవడమేంటి బాబు గారూ అని ఆమె నిలదీశారు. కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఏపీకి పది వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని తీసుకుని రాలేరా అని ఆమె బాగానే ప్రశ్నించారు. ఆమె అడిగింది చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. Also Read – అరుదైన రికార్డ్ నెలకొల్పిన చిన్న దేశం.. మరింత దిగజారిన భారతదేశం.. కేంద్రం ఏపీ ఎంపీల మద్దతు ఉంది. ఏపీకి అతి పెద్ద కష్టం వచ్చింది. కానీ ఈ రోజుకీ రూపాయి విదల్చలేదు. మరి వరద బాధితులను ఆదుకునేది ఎలా. ఈ విషయంలో కేంద్రం తక్షణ సాయం అయినా చేసినట్లు అయితే ఊరట కలిగేది కానీ అలా జరగలేదే. మరి చంద్రబాబు కేంద్ర బృందాన్ని ఏపీకి వెంటనే పంపించినందుకే ధన్యవాదాలు చెప్పారు. కేంద్రం సాయం విషయంలో ఆయన డిమాండ్ చేస్తే బాగుంటుంది కదా అన్న చర్చ వస్తోంది. మరి బాబు విరాళాలు ఇవ్వాలని జనాల్లో కోరుతున్నారు. నిజమే ఏపీలో ప్రజలు సాయం చేస్తారు. ఇది ఒక ఎత్తు. కానీ ఎంత విరాళాలు ఇచ్చినా వేల కోట్లు పోగు కావు కదా. మరి కేంద్రాన్ని ఎందుకు బాబు డిమాండ్ చేయరు అన్నదే అందరిలో కలుగుతున్న సందేహం. డిమాండ్ చేసినా మోడి అనుకున్నది ఇవ్వరనా లేక కేంద్రం మీద ఒత్తిడి ఎందుకు అన్న ఆలోచనతోనా. ఏమో బాబు గారికే ఇదంతా తెలియాలి. కానీ ఆయన విరాళాల సేకరణ మాత్రం ఒకింత విమర్శల పాలు అవుతోంది.

👉విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం*ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏచూరి ఎయిమ్స్‌లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకుంటున్నారు.  పరిస్థితి విషమంగా ఉండటం తో మల్టీ డిసిప్లీనరీ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది

👉 విజయవాడ: రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీ నుంచి లారీలను పశ్చిమ బెంగాల్ కు పంపవద్దని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు..11, 12, 13 తేదీల్లో మూడు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌ లో లారీల బంద్‌కు పిలుపు.. ఈ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్

👉మొన్నటివరకు ఏసీబీ డీజీగా లంచగొండుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన డేర్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ సీవీ ఆనంద్.. మళ్లీ తిరిగి హైదరాబాద్ సీపీగా తిరిగొచ్చారు.ఈ క్రమంలో సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి రోజే మళ్లీ హైదరాబాద్ సీపీగా తిరిగి రావడం సంతోషంగా ఉందని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు. ఆ విఘ్ననాయకుడి అనుగ్రహంతోనే తాను మళ్లీ హైదరాబాద్ సీపీ‎గా వచ్చానని అనుకుంటున్నట్టు సీవీ ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.మళ్లీ హైదరాబాద్ సీపీగా వస్తానని అనుకోలేదన్నారు.మంగళవారం (సెప్టెంబర్ 10న) రోజున ఖైరతాబాద్ గణేషున్ని సీపీ సీవీ ఆనంద్ దర్శించుకున్నారు.సీపీ సీవీ ఆనంద్‌కు అర్చకులు, ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం.. బడా గణేషునికి సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీవీ ఆనంద్.. తాను డీసీపీగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసినట్టు గుర్తు చేసుకున్నారు.గత సంవత్సరంలాగానే.. ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపే పూర్తయ్యేలా చూస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూసేందుకు లక్షలాది మంది వస్తారన్న సీపీ సీవీ ఆనంద్.. ఈ మేరకు ట్రాఫిక్‎ను సమన్వయం చేసేందుకు బందోబస్తు పెంచుతామని చెప్పుకొచ్చారు. నిమజ్జనం కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తామన్న సీవీ ఆనంద్.. గణేషుని శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిసేలా కట్టుదిట్టమైన భద్రతా ఉంటుందని స్పష్టం చేశారు.

👉కలెక్టరేట్ లో కత్తి కలకలం … నిద్ర మత్తులో నిఘా వ్యవస్థ..*సత్యసాయి జిల్లా:*▪️పుట్టపర్తి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో కత్తి కలకలం.*▪️ఏకంగా కత్తితో కలెక్టరేట్ లోకి వెళ్తున్న పట్టించుకొని పోలీసులు.**▪️సత్యసాయి జిల్లాలో కత్తితో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్న భూ కబ్జాలు, సమస్యలు,కనిపించని పోలీస్ ,నిఘా వ్యవస్థ.*▪️ బుక్కపట్నం మండలం చింతలయ్య గారి పలికి చెందిన రామనారాయణ సమస్య వినిపించేందుకు కలెక్టరేట్ కు వచ్చిన బాధితుడు.▪️పోలిసులు వృద్దుడు వద్ద కత్తినీ స్వాధీనం చేసుకున్నారు.▪️భూ సమస్యతో ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని రక్షించుకోవడానికి కత్తి వెంట తెచ్చుకున్నాను అని తెలిపారు.

👉తుపాకీతో గంగాధర్ వీరంగం ..శ్రీ సత్యసాయి జిల్లా: రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడిన గంగాధర్ కు దేహశుద్ధి చేసిన స్థానికులు..రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో ఘటన..కుంటి మద్ది గ్రామంలో మహిళను లైంగికంగా వేధిస్తున్న గంగాధర్..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కుటుంబ సభ్యులు..కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ తుపాకీ తో బెదిరింపులకు పాల్పడిన గంగాధర్  గంగాధర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుంటిమద్ది గ్రామస్తులు …

👉ఇంజనీరింగ్ అధికారులు 6 గంటలు శ్రమించినా ఇంచు కదలని బోట్లు*

కృష్ణా నదిలో చిక్కుకున్న బోట్లను బయటకు తీసే ప్రక్రియ ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి బోట్లను నదిలోంచి బయటకు తీసేందుకు రెండు క్రేన్ లతో శ్రమించారు.ఇంజనీరింగ్ అధికారులు. 6 గంటల పాటు శ్రమించినా ఇంచు కూడా కదల్లేదు బోట్లు. మరోసారి రేపు ఉదయం బోట్లను బయ టకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు. రేపు ఉదయం విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా డైవింగ్ బృందంతో బోట్లను బయ టకు తీయనున్నారు అధికారులు.50 టన్నుల భారీ క్రేన్ సాయంతో బోట్ల తొలగింపునకు ప్రయ త్నాలు..ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియను అధికారులు ఇవాళ ప్రారంభించారు. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను 50 టన్నుల బరువు మోసే భారీ క్రేన్ సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు. అధికారులు. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొని నీటిలో చిక్కుకున్నాయి. వాటిని తొలగించి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు….

👉 ఆత్మహత్య కోసం వెళ్లి రైలు పట్టాలపై యువతి నిద్ర..

ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువతి రైలు పట్టాలపైకి చేరుకుంది. ఎంతకీ ట్రైన్ రాకపోవడంతో ఆదమరిచి నిద్రపోయింది. ఆ రూట్లో వస్తున్న ట్రైన్ లోకో పెలెట్ ఈమెను దూరం నుంచి గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. ఆ యువతికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో రైలు ఆగింది. బిహార్లోని చాకియా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలెట్ వచ్చి ఆమెను నిద్ర లేపాడు. చనిపోవడానికి వచ్చి నిద్రపోయానని చెప్పడంతో అతను షాకయ్యాడు.

👉మంగళగిరి *ఏడు కోట్ల 70 లక్షల రూపాయలను పవన్ కళ్యాణ్ గారికి అందించిన వై.వి.బిరాజేంద్రప్రసాద్*. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ కు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 7 కోట్ల 70 లక్షల రూపాయలు విరాళాన్ని అందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్థానిక సంస్థల తరఫున అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఇటీవల అత్యవసరంగా నిర్వహించిన జూమ్ మీటింగ్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు మరియు జడ్పిటిసిల ఒక నెల గౌరవ వేతనం ఏడు కోట్ల 70 లక్షలను రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి నేరుగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేయవలసిందిగా అంగీకార తీర్మాన పత్రాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలోవై వి బి రాజేంద్రప్రసాద్ EX MLC ,రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకత్వంలో1)బిర్రు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ,పగడాల రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CJ కొండయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు లెనిన్ బాబు గల్లా తిమోతి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం కల్లూరి శ్రీనివాస్ గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు. రావెళ్ళ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

👉దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్..!*

కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు APK ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓవ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఏపీకి ఫైల్స్ను అస్సలు ఓపెన్ చేయకండి.

👉 రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్‌లో లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది. ఈ కారిడార్‌లోని సరద్న- బంగద్‌ మార్గంలో కొందరు దుండగులు రైలు పట్టాలపై రెండు సిమెంటు బ్లాక్‌లు పెట్టారు. ఆదివారం రాత్రి గూడ్స్‌ రైలు ఆ సిమెంటు బ్లాకులను ఢీకొట్టినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఇక సోమవారం భివానీ-ప్రయాగరాజ్‌ కళింది ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణించే మార్గంలో కూడా రైల్వే ట్రాక్‌పై ఎల్పీజీ సిలిండర్‌, ఓ సీసాలో పెట్రోల్‌, అగ్గిపెట్టెలు పెట్టినట్లు చెప్పారు. ఇక కళింది ఎక్స్‌ప్రెస్‌ రైలును పట్టాలు తప్పించేందుకు చేసిన యత్నంలో ఉగ్రవాదుల కుట్ర కోణం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనకు ఐఎ్‌సఐఎస్‌ ఖొరాసన్‌ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్ల ఘటన సూత్రధారిగా పేర్కొంటున్న పాక్‌ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారత్‌లో రైలు ప్రమాదాలకు ప్రణాళిక రూపొందించాలంటూ ఆడియో క్లిప్‌లో పిలుపునిచ్చిన వారం రోజులకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. అలాగే ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపైనా ఉగ్ర కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 14 మంది ఐఎ్‌సఐఎస్‌ ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..