👉విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం*
ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్ర కమిటీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఏచూరి ఎయిమ్స్‌లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తీసుకుంటున్నారు.
పరిస్థితి విషమంగా ఉండటం తో మల్టీ డిసిప్లీనరీ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది
👉 విజయవాడ: రేపటి నుంచి 3 రోజుల పాటు ఏపీ నుంచి లారీలను పశ్చిమ బెంగాల్ కు పంపవద్దని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు..
11, 12, 13 తేదీల్లో మూడు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో లారీల బంద్‌కు పిలుపు..
ఈ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్
👉మొన్నటివరకు ఏసీబీ డీజీగా లంచగొండుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన డేర్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ సీవీ ఆనంద్.. మళ్లీ తిరిగి హైదరాబాద్ సీపీగా తిరిగొచ్చారు.
ఈ క్రమంలో సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వినాయక చవితి రోజే మళ్లీ హైదరాబాద్ సీపీగా తిరిగి రావడం సంతోషంగా ఉందని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
ఆ విఘ్ననాయకుడి అనుగ్రహంతోనే తాను మళ్లీ హైదరాబాద్ సీపీగా వచ్చానని అనుకుంటున్నట్టు సీవీ ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మళ్లీ హైదరాబాద్ సీపీగా వస్తానని అనుకోలేదన్నారు.
మంగళవారం (సెప్టెంబర్ 10న) రోజున ఖైరతాబాద్ గణేషున్ని సీపీ సీవీ ఆనంద్ దర్శించుకున్నారు.
సీపీ సీవీ ఆనంద్‌కు అర్చకులు, ఉత్సవ సమితి సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం.. బడా గణేషునికి సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీవీ ఆనంద్.. తాను డీసీపీగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను పూర్తి చేసినట్టు గుర్తు చేసుకున్నారు.గత సంవత్సరంలాగానే.. ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపే పూర్తయ్యేలా చూస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూసేందుకు లక్షలాది మంది వస్తారన్న సీపీ సీవీ ఆనంద్.. ఈ మేరకు ట్రాఫిక్‌ను సమన్వయం చేసేందుకు బందోబస్తు పెంచుతామని చెప్పుకొచ్చారు. నిమజ్జనం కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తామన్న సీవీ ఆనంద్.. గణేషుని శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిసేలా కట్టుదిట్టమైన భద్రతా ఉంటుందని స్పష్టం చేశారు.
👉ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం*
*ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు*
*అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం ప్రదానం*
*’సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ అందజేత*
ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది.ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమం లో కేంద్రహోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ సైబర్ కో ఆర్టినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ను అందజేశారు.
👉*నిమజ్జనం కోసం ఘోరంగా కొట్టుకున్న యువకులు* అన్నమయ్య జిల్లా మదనపల్లె ..
వినాయకుని నిమజ్జనం విషయమై యువకులు బహిరంగా ఘర్షణకు దిగిన ఘటన మదనపల్లెలో జరిగింది. స్థానిక సొసైటీ కాలనీలోని భాస్కర్ పాల డిపో సమీపంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో సోమవారం పూజలు ముగించారు. సాయంత్రం నిమజ్జనం చేయాలని ఓ వర్గం.. మంగళవారం చేద్దామని మరో వర్గం వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
👉 తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు.. ఏడుగురు అరెస్టు
తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమడిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు.
సరదాల పేరుతో సాంప్రదాయలను పూర్తిగా మంటగలుపుతున్నారు.పోలీస్ వ్యవస్థ సమయానికి అన్నిటిలోను సరైన నిర్ణయాలు తీసుకుంటున్నరు.
👉 రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన కురిచేడు మండలం వెంగయపాలెం రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది.
మృతిచెందిన యువకుడు నంద్యాల జిల్లా గోగులదిన్నెకు చెందిన పెద్దిబోయిన ఉదయకిరణ్ (18)గా గుర్తించిన స్థానికులు..
👉ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కలెక్టర్ పర్యటన..ప్రకాశం జిల్లా దోర్నాల మండలం, రామచంద్రకోట గ్రామంలో హార్టికల్చల్ ప్లాంటేషన్లో భాగంగా జామ పంటను సాగుచేస్తున్న అంబటి తిరుపతి రెడ్డి కి సంబంధించిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా.పర్యాటనలో భాగంగా చిన్న దోర్నాల గ్రామంలో ముంపుకు గురైన తీగలేరు వాగును పరిశీలించినారు.. ఆమె వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రినాగ్ .
👉కలెక్టరేట్ లో కత్తి కలకలం … నిద్ర మత్తులో నిఘా వ్యవస్థ..సత్యసాయి జిల్లా:*▪️పుట్టపర్తి కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో కత్తి కలకలం.
*▪️ఏకంగా కత్తితో కలెక్టరేట్ లోకి వెళ్తున్న పట్టించుకొని పోలీసులు.*సత్యసాయి జిల్లాలో కత్తితో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్న భూ కబ్జాలు, సమస్యలు,కనిపించని పోలీస్ ,నిఘా వ్యవస్థ.* బుక్కపట్నం మండలం చింతలయ్య గారి పలికి చెందిన రామనారాయణ సమస్య వినిపించేందుకు కలెక్టరేట్ కు వచ్చిన బాధితుడు.పోలిసులు వృద్దుడు వద్ద కత్తినీ స్వాధీనం చేసుకున్నారు.భూ సమస్యతో ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని రక్షించుకోవడానికి కత్తి వెంట తెచ్చుకున్నాను అని తెలిపారు.
👉తుపాకీతో గంగాధర్ వీరంగం ..శ్రీ సత్యసాయి జిల్లా:
రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడిన గంగాధర్ కు దేహశుద్ధి చేసిన స్థానికులు..రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో ఘటన..కుంటి మద్ది గ్రామంలో మహిళను లైంగికంగా వేధిస్తున్న గంగాధర్..
పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కుటుంబ సభ్యులు..
కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ తుపాకీ తో బెదిరింపులకు పాల్పడిన గంగాధర్ గంగాధర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కుంటిమద్ది గ్రామస్తులు …
👉ఇంజనీరింగ్ అధికారులు 6 గంటలు శ్రమించినా ఇంచు కదలని బోట్లు*..కృష్ణా నదిలో చిక్కుకున్న బోట్లను బయటకు తీసే ప్రక్రియ ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి బోట్లను నదిలోంచి బయటకు తీసేందుకు రెండు క్రేన్ లతో శ్రమించారు.
ఇంజనీరింగ్ అధికారులు. 6 గంటల పాటు శ్రమించినా ఇంచు కూడా కదల్లేదు బోట్లు. మరోసారి రేపు ఉదయం బోట్లను బయ టకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు. రేపు ఉదయం విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా డైవింగ్ బృందంతో బోట్లను బయ టకు తీయనున్నారు అధికారులు.50 టన్నుల భారీ క్రేన్ సాయంతో బోట్ల తొలగింపునకు ప్రయ త్నాలు..ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియను అధికారులు ఇవాళ ప్రారంభించారు.
బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను 50 టన్నుల బరువు మోసే భారీ క్రేన్ సాయంతో తొలగించే ప్రయత్నం చేశారు. అధికారులు.
ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజీ గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లను బోట్లు ఢీకొని నీటిలో చిక్కుకున్నాయి. వాటిని తొలగించి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు….
👉 ఆత్మహత్య కోసం వెళ్లి రైలు పట్టాలపై యువతి నిద్ర
ఆత్మహత్య చేసుకోవడానికి ఓ యువతి రైలు పట్టాలపైకి చేరుకుంది. ఎంతకీ ట్రైన్ రాకపోవడంతో ఆదమరిచి నిద్రపోయింది. ఆ రూట్లో వస్తున్న ట్రైన్ లోకో పెలెట్ ఈమెను దూరం నుంచి గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. ఆ యువతికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో రైలు ఆగింది. బిహార్లోని చాకియా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలెట్ వచ్చి ఆమెను నిద్ర లేపాడు. చనిపోవడానికి వచ్చి నిద్రపోయానని చెప్పడంతో అతను షాకయ్యాడు.
👉మంగళగిరి *ఏడు కోట్ల 70 లక్షల రూపాయలను పవన్ కళ్యాణ్ కు అందించిన వై.వి.బిరాజేంద్రప్రసాద్*.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ కు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 7 కోట్ల 70 లక్షల రూపాయలు విరాళాన్ని అందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు
ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్థానిక సంస్థల తరఫున అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఇటీవల అత్యవసరంగా నిర్వహించిన జూమ్ మీటింగ్లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఒక నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని తీర్మానించడం జరిగింది.
అందులో భాగంగా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు మరియు జడ్పిటిసిల ఒక నెల గౌరవ వేతనం ఏడు కోట్ల 70 లక్షలను రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి నేరుగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేయవలసిందిగా అంగీకార తీర్మాన పత్రాన్ని అందజేశారు .
👉దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్..!*
కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు APK ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓవ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఏపీకి ఫైల్స్ను అస్సలు ఓపెన్ చేయకండి.
👉 రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్‌లో లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది. ఈ కారిడార్‌లోని సరద్న- బంగద్ మార్గంలో కొందరు దుండగులు రైలు పట్టాలపై రెండు సిమెంటు బ్లాక్‌లు పెట్టారు. ఆదివారం రాత్రి గూడ్స్ రైలు ఆ సిమెంటు బ్లాకులను ఢీకొట్టినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఇక సోమవారం భివానీ-ప్రయాగరాజ్ కళింది ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించే మార్గంలో కూడా రైల్వే ట్రాక్‌పై ఎల్పీజీ సిలిండర్, ఓ సీసాలో పెట్రోల్, అగ్గిపెట్టెలు పెట్టినట్లు చెప్పారు. ఇక కళింది ఎక్స్‌ప్రెస్ రైలును పట్టాలు తప్పించేందుకు చేసిన యత్నంలో ఉగ్రవాదుల కుట్ర కోణం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనకు ఐఎ్‌సఐఎస్ ఖొరాసన్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్ల ఘటన సూత్రధారిగా పేర్కొంటున్న పాక్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారత్‌లో రైలు ప్రమాదాలకు ప్రణాళిక రూపొందించాలంటూ ఆడియో క్లిప్‌లో పిలుపునిచ్చిన వారం రోజులకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. అలాగే ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపైనా ఉగ్ర కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 14 మంది ఐఎ్‌సఐఎస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
👉నరసరావుపేట పాలపాడు రోడ్ లో కాల్వలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు…*పల్నాడు జిల్లా..*నరసరావుపేట పాలపాడు రోడ్ లో కాల్వలో ఈతకు వెళ్లి ఇద్దరు
మృతి చెందిన ఇద్దరు పసుమర్ధి సంతోష్ (22) రామిరెడ్డి పేట
సురుపుల వెంకట సుధీర్ (9)గా నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు…
మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి,కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.