👉ఏపీకి కియా రూ. 3 కోట్ల విరాళం..
ఏపీకి కియా మోటార్స్ ఇండియా విభాగం భారీవిరాళంతో ముందుకొచ్చింది.వరదల నుంచి రిలీఫ్
పొందేందుకు తమ వంతుగా రూ.3 కోట్ల చెక్ను కియా
మోటార్స్ సీఏఓ కాబ్ డాంగ్ లీ సీఎం చంద్రబాబుకు
అందించారు. కష్ట సమయంలో ఇచ్చిన విరాళం ఎంతో
ఉపయోగపడుతోందని సీఎం వారికి ధన్యవాదాలు
తెలిపారు.
👉👉👉హైడ్రా కూల్చివేతలు ఆగవు… ఆక్రమణదారులకు సీఎం రేవంత్ హెచ్చరిక..
ప్రాజెక్టుల వద్ద కొంతమంది విలాసవంతమైన ఫామ్ హౌజ్ లను నిర్మించారని,అక్కడి నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నోడి ఇంటి డ్రైనేజీతో నిండుతున్న ఆ చెరువులోని నీరు హైదరాబాద్ వాసులు తాగాల్నా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ సబ్ ఇన్స్పెక్టర్ల మూడో బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చెరువులను ఆక్రమణల నుంచి రక్షించేందుకు ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారు మర్యాదగా తప్పుకోవాలని, లేదంటే వాటిని కూల్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా.. న్యాయస్థానాల్లో కొట్లాడుతామని రేవంత్ రెడ్డి స్పష్టం అన్నారు. హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతుందని , ఆ కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని జిల్లా నేతలు కోరినట్లు వివరించారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తామన్నారు. మూసీ చుట్టూ ప్రక్కల పేదల ఆక్రమణలు ఉన్నాయన్న రేవంత్… వారి పట్ల ప్రభుత్వం మానవీయంగా ఆలోచిస్తుందని తెలిపారు.
👉 హైదరాబాద్లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన SOT పోలీసులు – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు.
నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
👉 ఉప ముఖ్యమంత్రి చొరవతో ఏడు నెలలుగా ఆగిపోయిన కార్మికుల జీతం విడుదల
• శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్య దృష్టికి రాగానే తక్షణ పరిష్కారం.
• రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల.
🔸 ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు తాగునీరు అందించే ఈ పథకం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే 536 మంది కార్మికులకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి, రూ.30 కోట్ల మేర పెండింగ్ వేతనాలు ఆగిపోయాయనే సమస్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది.
🔸 జీతాల కోసం రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారనే విషయం తెలుసుకుని, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారుల నుండి వివరాలు తెలుసుకుని, ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు రూ.30 కోట్లు బడ్జెట్ తక్షణమే విడుదల చెయ్యాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి జీవో విడుదల చేసి, రూ.30 కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్ధిక శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పని చేసేలా ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
👉పెద్ద మనస్సు చాటుకున్న తెలంగాణ పోలీసులు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీవిరాళం.
తెలంగాణ పోలీసులు మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలిచే పోలీసులు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులను అదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు వరద బాధితులకు ఒక్క రోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. వన్డే శాలరీ
*రూ.11 కోట్ల ,06,83,571 చెక్ను* డీజీపీ జితేందర్, ఇతర పోలీసులు అధికారులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన పోలీసులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
కాగా, ఇటీవల ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే, వర్షాలు, వరదలతో ప్రజలు కకావికలం అయ్యారు. వరద వల్ల పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. వేల మంది సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోయారు. వర్షాలు, వరదలకు అన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కష్టాలను చూసి చెలిపోయించిన తెలంగాణ పోలీసులు సైతం తమ ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు …
👉తాడేపల్లి: ఉండవల్లి సెంటర్ లో రౌడి షీటర్ హల్చల్
*వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారుడి పై దాడి..*ఆపేందుకు ప్రయత్నించిన స్టానికుల పై దాడి*
*మీ అంతు చూస్తామని అంటూ బెదిరింపులకు దిగిన రౌడి షీటర్*ఘర్షణలో చేతివాటం చూపించిన రౌడి షీటర్ వర్గం*
*ఫోన్ దొంగలించిన రౌడి షీటర్ వర్గం*రోజుకు రోజుకు మితి మిరిపోతున్న రౌడీ షీటర్ దుర్గరావు ఆగడాలు*పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు*దుర్గరావు పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు…
👉 ప్రకాశం జిల్లాదోర్నాల మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు.
తొలుత దోర్నాల మండలం, రామచంద్రకోట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించి జామ పంటను సాగుచేస్తున్న అంబటి తిరుపతి రెడ్డికి సంబంధించిన పొలంను పరిశీలించి రైతుతో మాట్లాడడం జరిగింది. జామ పంట వలన ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది తదితర వివరాలను కలెక్టర్, రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ జామ పంట సాగుకు సంబందించిన ప్లాంటేషన్ కు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుకు మూడు సంవత్సరాలకు గాను 4.57 లక్షల రూపాయలు వంద శాతం సబ్సిడీ తో మంజూరు చేయడం జరిగిందని, మొదటి సంవత్సరం 2.34 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని ఎపిడి శ్రీమతి నిర్మల, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వివరించారు. మార్కాపురం డివిజన్ పరిధిలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేలా జాతీయ ఉపాధి హామీ పథకం పటిష్టం గా అమలు చేయాలని జిల్లా కలెక్టర్, ఎపిడీ ను ఆదేశించారు.
అనంతరం ఇటీవల భారీ వర్షాల కారణంగా చిన్న దోర్నాల గ్రామం వద్ద దెబ్బతిన్న తీగలేరు వాగు సప్ట్టా ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చిన్న దోర్నాల గ్రామం వద్ద ఎండిపోయిన బోరు బావికి వాటర్ రీఛార్జ్ నిర్మాణానికి చేపట్టిన పనులకు జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు. పడిన వర్షం నీటిని బోరు బావులకు రీ ఛార్జ్ అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు.
తదుపరి జిల్లా కలెక్టర్ పెద్దదోర్నాల జూనియర్ కళాశాలను సందర్శించి మొక్కలు నాటి,కళాశాల ఆవరణలో నిర్మించిన ఇంకుడు గుంతను పరిశీలించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.బాగా చదువుకొని మంచి భవిష్యత్ పొందాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, విద్యార్థులకు సూచించారు.ఈ ఆవరణంలో ఇంటర్మీడియట్, డిగ్రీ క్లాసులు జరుగుచున్నవని, అదనపు గదులు అవసరమని కళాశాల ప్రిన్సిపాల్, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ కు సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు, ఓపి, ఐపి బ్లాకులు, ఎమర్జెన్సీ వార్డులతో పాటు.. పలు విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏపీఎంఎస్ఐడిసి కల్పించే సదుపాయాలు, అలాగే వైద్య సిబ్బంది సంఖ్య తదితర వివరాలను సంబందిత ఆసుపత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న రోగులతో వైద్య సదుపాయాలపై, వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్య సేవలు అందించడంలో అనేక పిర్యాధులు వస్తున్నాయని, వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించిన సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.ఆమెవెంటమార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రినాగ్, యర్రగొండపాలెం నియోజక వర్గ ఇన్చార్జి గూడూరి ఎరీక్షన్ బాబు,తహసీల్దార్ శాంతి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
👉 మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డులో గల ఓ అపార్ట్మెంట్లో పనులు చేస్తూ విద్యుత్ తీగ తగిలి కొనకనమిట్ల మండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకట్రావు (21 )మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో పన్నులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
👉అక్రమ బియ్యం 600 బస్తాల బియ్యంను సెజ్ చేసిన అధికారులు..ప్రకాశం జిల్లా విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్ ఏ ఎస్ పి .కుల శేఖర్ అక్రమంగా రేషన్ బియ్యంను సేకరించి తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్, పొదిలి వారు సంయుక్తంగా కలసి సంతనూతలపడు , మండలం లోని నాగరాజా ట్రేడర్స్ అను పేరుగల రైస్ మిల్లు ను తనిఖి చేయగా 600 బస్తాలు పి డి ఎస్ బియ్యం ను సదరు రైస్ మిల్లు యజమాని అయిన మోదుకూరి రాజేష్ గుప్తా అక్రమంగా నిల్వ వుంచి 3 వాహనాల ద్వార నల్ల బజారు కు తరలించుటకు సిద్దంగా వుండగా , అధికారులు సదరు 600 బస్తాల బియ్యంను సెజ్ చేసి తగు చర్యల నిమిత్తం రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న ఆరుగురిపై సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.అలాగే సెక్షన్ 6 ఎ కేసును జాయింట్ కలెక్టర్ సి ఎస్ ప్రకాశం జిల్లా వారి కోర్ట్ నందు నమోదు చేయటం జరిగింది.ఈ తనఖి లలో,విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డి సి టి ఓరామారావు, ఎస్త్సె నాగేశ్వర రావు, తహసిల్దార్ పాల్ మరియు వారి సిబ్బంది మరియు సివిల్ సప్లైస్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గుణవంశి పాల్గొన్నారు.
👉 మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సుమారు 40 లక్షలు విలువచేసే నిత్యావసరాల సరుకులు పంపేందుకు సౌజన్య పంక్షన్ హాల్ లో ప్యాకింగ్ సిద్ధం చేస్తున్న శ్రేణులు….
👉ఆర్ఎస్ఏఎస్టీఎఫ్*
రాయచోటి పరిధిలో 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం : ఇద్దరు అరెస్టు
రాయచోటి-మదనపల్లె రహదారి లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ఒక కారులో 13 ఎర్రచందనం దుంగలతో పాటు, కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ ఎస్ ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ బుధవారం కడప సబ్ కంట్రోల్ నుంచి బయలు దేరి రాయచోటి – మదనపల్లె రోడ్లులో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలిస్తూ వెళ్లారు. అక్కడే కేశాపురం చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక మోటారు సైకిల్ లో ఇద్దరు వ్యక్తులు వేగంగా వెళ్లగా, అనుసరిస్తున్న కారు కూడా అదే వేగంగా రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు తప్పించుకుని పోయే ప్రయత్నం లో ఒక రాయిని ఢీకొని నిలిచి పోయింది. కారులోని ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కారులోని 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసిన ఎస్ ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.
👉అడవిలోకి చొరబడుతున్న ఒకరు అరెస్టు : పిడిలేని గొడ్డళ్లు స్వాధీనం
అదే విధంగా రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ ఐ కృపానంద కు చెందిన ఆర్ ఎస్ ఐ రాఘవేంద్ర టీమ్ రాజంపేట పరిధిలోని కేశాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఒక మోటారు సైకిల్ పై వచ్చిన వ్యక్తి మరి కొంతమంది తో మాట్లాడుతుండగా అనుమానం వచ్చిన టాస్క్ ఫోర్స్ వారిని సమీపించడంతో వారు పారి పోయారు. అయితే మోటారు సైకిల్ పై ఉన్న వ్యక్తిని పట్టుకుని విచారించగా అతని వద్ద రెండు పిడిలేని గొడ్డళ్లు లభించాయి. మోటారు సైకిల్, గొడ్డళ్లు స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను తమిళనాడు సేలం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్లు లో అటవీశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.