కెన్యాలో ఆదానీ గో బ్యాక్ ..సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి..కన్నుమూత.. జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఖండన.. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..పీఈటీ జ్యోత్స్న డౌన్.. డౌన్..500 మంది విద్యార్థుల ధర్నా..టీచర్ మొబైల్‌లో 5 వేలకు పైగా విద్యార్థినుల నగ్న వీడియోలు

👉 అరుణతార నేలకొరిగింది.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూత…న్యూ ఢిల్లీ :ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సీతారాం ఏచూరి.
ఆగస్టు 19న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి.ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్‌ కందాకు ఏచూరి మేనల్లుడు.ఇంద్రాణి మజుందార్‌తో సీతారాం ఏచూరికి వివాహం. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి. జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండవ వివాహం చేసుకున్న ఏచూరి. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో చనిపోయిన కొడుకు ఆశిష్.
👉 కెన్యాలో ఆదానీ గో బ్యాక్ !
భారతదేశంలో పోర్టులు, విమానాశ్రయాలు చేజిక్కించుకున్న ఆదానీ సంస్థ విదేశాలలోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
👉కెన్యాలో ఆదానీ గో బ్యాక్ !
‘ఆదానీ గో బ్యాక్ .. వుయ్ రిజెక్ట్ ఆదానీ’ అంటూ కెన్యా ఏవిఏషన్ అధారిటీ (కెఎఎ) కార్మికులు కెన్యా రాజధాని నైరోబీలోని జోమో కెన్వట్ట అంతర్జాతీయ విమానాశ్రయంలో సమ్మెకు దిగడంతో అక్కడ విమానాశ్రయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారతదేశంలో పోర్టులు, విమానాశ్రయాలు చేజిక్కించుకున్న ఆదానీ సంస్థ విదేశాలలోనూ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ నేపథ్యంలోనే కెన్యాలోని జోమో కెన్యట్ట అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 185 కోట్ల డాలర్లకు ఈ ఎయిర్‌పోర్టును 30 ఏండ్ల పాటు అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు కెన్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా అదానీ సంస్థ రెండో రన్‌వేను నిర్మించడంతో పాటు ప్రయాణికుల టెర్మినల్‌ను ఆధునీకరించాలి. అయితే, పబ్లిక్‌ టెండర్‌ను ఆహ్వానించకుండా అదానీ సంస్థ చేసిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఒప్పందం ఖరారు కావడం గమనార్హం.
దీంతో ఎట్టి పరిస్థితులలో ఆదానీకి ఈ విమానాశ్రయం ఇవ్వడానికి అంగీకరించమని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచుతున్నారని, అన్ని వివరాలు బయటకు ప్రభుత్వం ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. విమానాశ్రయం ప్రభుత్వ ఆస్తి అని, ఆదానికి అప్పగిస్తే లాభాల కోసం ప్రయాణికులపై భారం మోపుతారని, స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారన్నది వారి వాదన. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ, ప్రచారం జరుగుతున్నది. ఈ ఒప్పందంపై అభ్యంతరాల నేపథ్యంలో కెన్యా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆదాని మైనింగ్ కార్యకలాపాల మీద ఆందోళనలు జరగగా, శ్రీలంకలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏకంగా అల్లర్లు చెలరేగాయి. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదాని నుండి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోగా దీని మీదా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా కెన్యాలోనూ ఆందోళనలు జరుగుతుండడం గమనార్హం.
👉వేటు తప్పదా???..హైకోర్టు ఆదేశాలతో వలస ఎమ్మెల్యేల టెన్షన్*..హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిణామాలతో చట్టం తన పని తాను చేసుకుపోతే… అధికారం అడ్డుపడకపోతే… కోట్లు కుమ్మరించి సాధించుకున్న ఎమ్మెల్యే సీటు గల్లంతేనా..? హైకోర్టు ఆదేశాలతో తేనెతుట్టే కదిలినట్టేనా..?
నాలుగు వారాల గడువులో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు.. పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేల్లోనూ కలవరం పుట్టిస్తోంది. ఇప్పటికే ముగ్గురిపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు డైరెక్షన్ ఇవ్వగా, మిగిలిన ఏడుగురి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.
చట్టం ప్రకారం వేటు పడితే.. వలస ఎమ్మెల్యేల భవిష్యత్ ఎలా ఉండబో తోందన్నదే ఆసక్తి రేపు తోంది.6 నెలల్లోనే ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు..?హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్క సారిగా పెరిగిపోయింది.
పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలు…. వలస ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో కాలయా పన జరిగినట్లు.. ఇప్పుడు కూడా పదవీకాలం పూర్త య్యేవరకు గడిపేయొచ్చని భావించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. వేటు కత్తి వేలాడుతుండటం… చట్ట ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటే… మూడు అసెంబ్లీ స్థానాలకు ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితు లే కనిపిస్తున్నాయి. ఐతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారగా, హైకోర్టు తీర్పుతో పర్యావ సానాలపై మిగిలిన ఏడు గురు వలస ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అధికార పార్టీకి ఝలక్ ఇచ్చినట్లైందంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి మొత్తం 26 మందిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేయగా, ప్రస్తుతానికి 10 మంది మాత్రమే హస్తం గూటికి చేరారు. ఐతే వీరిలో ముగ్గురిపై తక్షణం చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు, ఆ తర్వాత హైకోర్టుకు నివేదించింది బీఆర్ఎస్.
అనర్హత వేటు వేయడంలో తాత్సారం చేస్తున్న స్పీకర్‌ తక్షణం నిర్ణయం తీసుకో వాలని ఆదేశించాల్సిందిగా కోరుతూ హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్.
ఆ పార్టీ అనుకున్నట్లే అనర్హత వేటుపై తీసుకోబోయే చర్యలకు సంబంధించి షెడ్యూల్ రూపొందించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ పెద్దలు కంగుతిన్నారు.
పార్టీ మారిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కాపా డుకోవాలనే వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు కారు దిగిన మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఏ రకమైన భరోసా ఇవ్వాల న్నదానిపై అధికార పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట.
👉ఆక్రమించిన చెరువులను అప్పజెప్పండి..
*లేదంటే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాంః సీఎం రేవంత్‌రెడ్డి*
దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి.. అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయి. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే కట్టుబడి ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమించిన వాళ్లలో ఎంత గొప్ప వాళ్లు ఉన్నా వాళ్లు చెరువులను వదలక తప్పదని హెచ్చరించారు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటి పారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ పోలీసు అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన అందులోని ఇండోర్‌ స్టేడియంలో కాసేపు షటిల్‌ ఆడారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఆక్రమణలు ఉన్నాయి. వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
*జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ‘హైడ్రా’
👉టీచర్ మొబైల్‌లో 5 వేలకు పైగా విద్యార్థినుల నగ్న వీడియోలు …!!!
కర్ణాటక రాష్ట్రంలోనే కోలార్ జిల్లా మూలూరు తాలూకా మొరార్జీదేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా పని చేస్తున్న మునియప్ప మొబైల్ లో విద్యార్ధినుల వీడియోలు చిత్రీకరిస్తున్నారు అని కొద్ది నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.
కేసు నమోదు చేసిన పోలీసులు మినియప్ప దగ్గర ఉన్న 5 ఫోన్లను సీజ్ చేశారు..
ఫోన్లో డేటా ఫోరెన్సిక్ విభాగం రికవర్ చేయడంతో 5 వేల నగ్న వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.. అందులో విద్యార్థినుల వీడియోలు కూడా ఉన్నాయి అని తేల్చారు..
👉నెల్లూరు జిల్లా…మనుబోలు మండలం*
*జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు*
మనుబోలు సమీపంలో జాతీయ రహదారిపై మార్నింగ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు కు రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు పూర్తి వివరాలు తెలియాల్సింది ..

👉పీఈటీ జ్యోత్స్న డౌన్.. డౌన్…
500 మంది విద్యార్థుల ధర్నా..
గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థినులను వేధిస్తున్న పీఈటీ జ్యోత్స్న. నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ.
బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి.. లోపలికి వెళ్లి తమను మొబైల్‌ ఫోన్లో వీడియోాలు తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థుల ఆరోపణ.. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘటన.
👉 హేమ డ్రగ్స్ తీసుకున్నారు..!
చార్జిషీట్ లో స్పష్టంగా పేర్కొన్న బెంగళూర్ పోలీసులు…
నేను డ్రగ్స్ తీసుకోలేదని ల్యాబ్ రిపోర్టులో స్పష్టమైంది..!
ఇటీవల సెల్ఫీ వీడియో విడుదల చేసిన హేమ!
👉 బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన బెంగుళూరు పోలీసులు..
1086 పేజీలతో ఛార్జిషీట్‌ దాఖలు.. 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు..
సినీ నటి హేమా రేవ్‌ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్న పోలీసులు..
పార్టీలో హేమా.. MDMA డ్రగ్స్‌ సేవించినట్టు ఆధారాలు..
మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్‌కు జోడించిన పోలీసులు..
హేమాతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు
👉 సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఆదిమూలం ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఎట్టకేలకు వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు.తొలుత మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి మద్దతూలేదని, తనకు భయమేస్తోందని చెప్పిన ఆ మహిళ ఈ తరువాత వైద్య పరీక్షలకు నిరాకరించారు.
దీంతో ఆమెకు బెదరింపులు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని బదనాం చేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని మండిపడుతూ, ఆ మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేశారు.
ఇక తాజాగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యి పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బంధువులు, గన్ మెన్లు ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డిఎస్పి కనజక్షన్ నేతృత్వంలో విచారించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు తపపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం (సెప్టెంబర్ 9)క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి దర్యాప్తూ చేయకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆదిమూలం పిటిషన్ లో పేర్కొన్నారు.
అదలా ఉండగా ఇంత కాలం వైద్యపరీక్షలకు నిరాకరించిన బాధితురాలు ఆదిమూలం క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. ఇక ఆ వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఇలా ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం తరఫుర న్యాయవాది శేషకుమారి వాదించనుండగా, ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా వరలక్ష్మి వాదించనున్నారు.
👉 ప.గో జిల్లా..తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వ్యాఖ్యలు. 👉 విజయవాడ వరదలు మానవ తప్పిదం అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఖండన.
👉 వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు.
👉 ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్న జగన్.
👉 ప్రకాశం బ్యారేజీ ను కూల్చేందుకు వైసిపి నాయకులు భారీ కుట్రకు తెర లేపారు.
👉 మాజీ ఎంపీ నందిగం సురేష్ కనుసన్నల్లో ఐదు బోట్లతో బ్యారేజీపై దాడికి యత్నం.
👉 పడవల యజమానులు గతంలో వైసీపీలో కొనసాగుతూ ఇసుక వ్యాపారం చేసిన వారే.
👉 సాక్షి పత్రికను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు.
👉 కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదు.
👉 అలాగే రాజకీయాల చేస్తే శాశ్వతంగా రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర ఉన్నాయి.
👉 ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ ఇప్పటికీ మార్పు తెచ్చుకోని జగన్మోహన్ రెడ్డీ.
👉 అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు వరద బాధితులకు సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు.
👉 వరద బాధితులకు సాయం చేసేందుకు తణుకు నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావడం అభినందనీయం.
👉నిర్మల్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య?*
తోడబుట్టిన అన్నను తమ్ముడు అతి దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రం లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు (35)ను కుంటుంబ కలహాల కారణాంగా తన తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు.
సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
*టీఎన్జీఓ కాలనీలో రేవ్‌పార్టీ..*
గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రేవ్‌పార్టీ సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టీఎన్‌జీవో కాలనీ అలయ్‌బలయ్‌ చౌరస్తా పక్కన ఉన్న ఓ ఇంట్లో యువతీ యువకులు పెద్ద శబ్దాలతో మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్నారు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసుల కాలనీలోని ప్లాట్‌ నెంబర్‌ 93లోని ఇంటిపై దాడి చేశారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న కె. ఆదిత్య, పిన్నింటి రామకృష్ణ, పెద్దరెడ్డి గారి చరణ్‌, గొర్తి సాయి ప్రవీణ్‌, వీరపనేని వరుణ్‌, శివశంకర్‌రెడ్డి, వీర శివారెడ్డి, మద్దినేని హరికృష్ణ, కాటేపల్లి రమేష్‌, మండపూడి కోటేశ్వరరావు, అనపర్తి విజయ్‌కుమార్‌, కోట్ల అజయ్‌, డి. సంధ్య, కూకటి ఆశ, కూకటి రీతు, షేక్‌ సమ సుల్తానా, ఎం. కీర్తి, యశోధలను అదుపులోకి తీసుకున్నారు.
👉కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి*కాకినాడ జిల్లా..పెద్దాపురం మండలం,
*ఎకరాకు 10 వేలు కాదు..25 వేల పరిహారం తక్షణం ఇవ్వాలి*..ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్ కున్న చిత్తశుద్ది బాబు,జగన్ లకు లేదు..*వైఎస్ షర్మిల రెడ్డి*
APCC చీఫ్
ఏలేరు రైతులను నిండా ముంచింది..వేల ఎకరాలు నీట మునిగాయి..దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే..ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్టలేదు..మరమత్తులు లేక రైతులు దారుణంగా నష్టపోయారు..ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారు ..పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయింది..ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి
-వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారు
-135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టాడు..వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదు..
ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే అంటున్నాడు.. జగన్ బాబు తప్పిదం అంటున్నారు- బాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు ?
గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణ పై ఇద్దరికీ పట్టింపు లేదు..జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారు..తట్టెడు మట్టి కూడా తీయలేదు..- డ్యాం లు కొట్టుకు పోతున్నా జగన్ కి పట్టింపు లేదు
-నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలు నష్టం
-చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్త అన్నాడు
..10 వేలు ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలి..కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటన చేయాలి..- జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశాడు- జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చేయొద్దు- ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చే స్తున్నాం..రాష్ట్రంలో జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వండి..ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్న చూపు
..కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు..ఎవరైనా రైతుల మీద పర్యటనకు రావాలి..కష్టాలు చూడాలి
..రైతుల పక్షాన నిలబడాలనీ కోరారు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..