*ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్*
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
మా కేసు సీజేఐ విచారిస్తున్నారు..
న్యాయం జరుగుతుందా.. అన్న అనుమానం ఉంది..
శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు..సీజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది..
సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి: ఇందిరా..
సీజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాల విమర్శలు
సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం తప్పా?..
గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సీజేఐ వెళ్లలేదా?.. బీజేపీ ధ్వజం..
న్యూఢిల్లీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బుధవారం ప్రధాని మోదీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్లి గణపతి పూజలో పాల్గొనడంతో పాటు హారతి కూడా ఇచ్చారు. మోదీకి సీజేఐ దంపతులు స్వాగతం పలికారు. ఈ ఫొటోలు, వీడియోను మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు తప్పుపట్టారు. ప్రధాని మోదీతో కలిసి సీజేఐ తన నివాసంలో గణపతికి హారతి ఇచ్చారని, అయితే రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ‘మా కేసు సీజేఐ ముందు విచారణ జరుగుతోంది. మాకు న్యాయం జరుగుతుందా? అన్నది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి. ఆ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు’ అని రౌత్ పేర్కొన్నారు. మరో నేత ప్రియాంక చతుర్వేది కూడా విమర్శలు గుప్పించారు. మోదీ, సీజేఐల కలయికను త్వరలో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు ముడిపెడుతూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ప్రధాని వీడియో క్లిప్ చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. అయితే సీజేఐపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ.. అత్యున్నత స్థానాల్లో వ్యక్తులు తమ వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోకూడదన్నారు.
సీజేఐ వ్యక్తిత్వంపై తనకు అపార గౌరవం ఉందని చెప్పారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. సీజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయిందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. వినాయక పూజ అనేది వ్యక్తిగతమని.. ప్రధాని, సీజేఐ వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు ఆ ఫొటోలను బహిరంగపర్చడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా అన్నారు. ఇక ప్రతిపక్షాలపై బీజేపీ, దాని మిత్రపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రతిపక్షాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తాయి. సర్వోన్నత న్యాయస్థానం పట్ల వారు చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నాయి. బీజేపీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. గతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అప్పటి సీజేఐ హాజరవలేదా? అని ప్రశ్నించారు. ప్రధాని వెళ్లి సీజేఐని కలిస్తే అభ్యంతరం లేదని, గణపతిపూజలో పాల్గొనడమే వారికి బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీ సీజేఐని కలిస్తే మీకు అభ్యంతరం. కానీ, రాహుల్ గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీరుకు మద్దతు పలికే అమెరికా చట్ట సభ సభ్యుడు ఇల్హాన్ ఒమర్‌ను కలిస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఇదెక్కడి విడ్డూరం’’ అని పాత్రా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు
👉రాజీనామాకు సిద్ధం!..*కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యలు*
*మెడికోల ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని విమర్శ*
స్థానిక ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు గురువారం కూడా తమ వైఖరిని సడలించుకోలేదు. చర్చలకు రావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదు. వరుసగా మూడో రోజు కూడా ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య చర్చలు జరగలేదు. దీనిపై మమత స్పందిస్తూ ‘‘సామాన్యులకు న్యాయం చేయడం కోసం పదవిని వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాన’’ని ప్రకటించారు. అయితే ఈ ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. ‘‘చాలా మంది డాక్టర్లు చర్చకు సుముఖంగా ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. కానీ కొద్దిమంది మాత్రం ప్రతిష్ఠంభన ఏర్పడాలని కోరుకుంటున్నారు’’ అని విమర్శించారు. రాజకీయ దురుద్దేశాలతో ఆందోళన జరుగుతోందని, దీనికి వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. ‘‘సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు పదవి నుంచి వైదొలగడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ వారు న్యాయం కోరుకోవడం లేదు. వారికి కేవలం కుర్చీ మాత్రమే కావాలి’’ అని వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు తాను సచివాలయంలో రెండు గంటల పాటు ఎదురు చూశానని, వారు సెక్రటేరియట్‌కు వచ్చినా సమావేశంలో కూర్చోలేదని మమత చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. విధుల్లో చేరాలని మరోసారి ఆమె విజ్ఞప్తి చేశారు.
👉 హైదరాబాద్: డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు..
రాజకీయ కుట్రలు సహించేది లేదు..
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉంది.. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించిన సీఎం.. హైదరాబాద్ ఇంచార్జ్ షేక్ అజీమ్ భాష ..
👉కేజీవాల్ కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..👍
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన
కేసులో సీఎం అరవింద్ కేజీవాలు సుప్రీం కోర్టు
బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో
ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రివాల్
బెయిల్కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి
వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే
ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.
👉అయిజ లో అర్థరాత్రి అరెస్టుల పర్వం*😱😱😱
*మాజీ మంత్రి హరీష్ రావు ను అక్రమంగా అరెస్టు చేశారనే సమాచారంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని అయిజ పోలీస్ స్టేషన్ పరిధిలో (తెలంగాణ రాష్ట్ర ఉద్యమ BRS పార్టీ నాయకులు పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ని) BRSV జిల్లా అధ్యక్షుడు మాల మల్లికార్జున గారిని, ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు*
👉 సిపిఎం నేత సీతారాం ఏచూరికి నివాళి..
మార్కాపురం.
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ పార్టీ నాయకులు డి కె ఎం రఫీ అధ్యక్షతన గురువారం సాయంత్రం సిపిఎం కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఏపియుడబ్లూజే జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ, యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఒద్దుల వీరా రెడ్డి లు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం సిపిఎం లో చేరిన ఏచూరి తుది శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం నిరంతరం రాజీలేని పోరాటాలను చేసిన నేత అని కొనియాడారు.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని అన్నారు. అంతర్జాతీయంగా మేధావిగా పేరు గాంచిన గొప్ప నేత అని కొనియాడారు.
ఎచురి ఆశయాల కోసం నిరంతరం రాజీలేని పోరాటాలను కొనసాగించాలని పట్టణ పార్టీ కార్యదర్శి డి.సోమయ్య కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుమ్మా బాల నాగయ్య, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జవ్వాజి రాజు, ఏడుకొండలు, జీ.కొండయ్య, ఎస్కే సలాం ఖాన్ , విజయకుమార్ ,కన్నామనేని వీరనారాయణ,బాలనాగయ్య,పొదిలి మల్లికార్జున,తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఇంచార్జ్ అసలం బేగ్..
👉బాలినేని పార్టీ మార్పు పై మరోసారి చర్చ.*
మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, *ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు* అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది… జిల్లా ఇన్చార్జి షేక్ ఫయాజ్
👉సైబర్ నేరగాళ్లు కాదు..సైబర్ బందిపోట్లు!
ఏఐ ఆధారిత సైబర్ నేరాలతో మరింత ముప్పు..
బ్యాంకు ఖాతాల్ని కాదు.. డబ్బు సీజ్ చేయాలి
వ్యక్తిగత భద్రతలాగానే ఆన్‌లైన్ భద్రత కూడా
ప్రజల వివరాలన్నీ ఆన్‌లైన్ అంగట్లో అమ్మకానికి
‘సోషల్’ వేధింపుల బారినపడుతున్న యువత
కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి
సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ నష్టపోయినవారు
గంటలోగా ఫిర్యాదు చేస్తే ఎక్కువ ప్రయోజనం
సీఆర్‌సీఐడీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ వెల్లడి
నానాటికీ గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజల్లో వాటిపై అవగాహన, అప్రమత్తత ముఖ్యమని.. సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తెలిపారు. ఏఐ, డీప్ ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో సైబర్ నేరగాళ్లు మున్ముందు మరింత పెద్ద ఎత్తున మోసాలకు తెగబడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులను మోసం చేసి వారి పదవీ విరమణ ప్రయోజనాలను దోచుకుంటున్నవారిని కేవలం ‘సైబర్ నేరగాళ్లు’ అంటే సరిపోదని.. వారిని ‘సైబర్ బందిపోట్లు’గా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు
👉విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించిన తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్, కా నిస్టేబుల్ సస్పెన్షన్ కడప జిల్లా*
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు..
కడప సెప్టెంబర్ 12: జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యవహారంపై జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు తీవ్రంగా పరిగణించారు. ప్రాధమిక విచారణ అనంతరం హెడ్ కానిస్టేబుల్ జి. వెంకటేశ్వర్లు (హెచ్.సి 1379), కానిస్టేబుల్ సి.జి గంగాధర్ బాబు (పి.సి 563) లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.
👉 కంభం ఎస్సై బి నరసింహారావును గురువారం టిడిపి జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తోట శ్రీనివాసులు, అంగం నాగేశ్వరరావు, నలబుల వెంకటేశ్వర్లు,కాకర్ల నరేంద్ర, కర్ణ శివ తదితరులు పాల్గొన్నారు
కంభం రిపోర్టర్ వెంకటేశ్వర్లు నలుబుల
👉గత నెల రోజుల నుండి కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామ రెడ్డి త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకు ఒకసారి ఆ కాలనీవాసులు ట్యాంకర్ తెప్పించుకొని త్రాగునీరు వినియోగించుకుంటున్నారు. శ్రీరామ రెడ్డి త్రాగినీరు కార్మికులు సమ్మె చేపట్టడం ద్వారా పట్టణవాసులు త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే గాని అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ విషయంపై త్వరగా స్పందించి పట్టణ వాసులకు త్రాగునీరు అందించే ఏర్పాటు చేయవలసిందిగా
‘‘బతకడానికి వచ్చినావు.. నీవేందీ?’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు..
బతకడానికి వచ్చినోళ్ల ఓట్లతోనే బీఆర్‌ఎ్‌సకు సీట్లు
కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ జవాబు చెప్పాలి..వాళ్లే అలా మాట్లాడించి ఉంటే.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. లేదంటే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: రేవంత్
న్యూఢిల్లీ, ‘‘బతకడానికి వచ్చినావు.. నీవేందీ?’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘వాళ్లు చెబితే కౌశిక్‌రెడ్డి మాట్లాడాడో? వాళ్లే మాట్లాడించారో? కేసీఆరే చెప్పాలి. వాళ్లే చెప్పి కౌశిక్ రెడ్డితో అలా మాట్లాడిస్తే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. సొంతంగా మాట్లాడి ఉంటే అతణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. అయినా బతకడానికి వచ్చినవాళ్లు ఓట్లేస్తేనే బీఆర్‌ఎ్‌సకు సిటీ(హైదరాబాద్)లో అన్నీ సీట్లు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు.
గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో రేవంత్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్‌ఎ్‌సలో చిల్లరగాళ్లు, బ్రోకర్లు చేరినందుకే కేసీఆర్ దగ్గరికి వెళ్లేందుకు తనకు మనసు రావడం లేదని అరికెపూడి గాంధీ అంటున్నారని తెలిపారు. ‘‘ధర్నాలు చేయొద్దు. ఎక్కడి నుంచి వచ్చారు?’’ అని గతంలో కేసీఆర్ ఆంధ్రవారిని ఉద్దేశించి అన్న మాటలనే ఇప్పుడుకౌశిక్ రెడ్డి అంటున్నారని ధ్వజమెత్తారు. గాంధీకి పీఏసీ పదవి ఇవ్వడంలో తప్పేమీ లేదని.. గతంలో కూడా ఇతరులను పీఏసీలో నియమించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎ్‌సకు తాము ఓనర్లమయినందున ఆ స్థానంలో తామే ఉండాలని హరీశ్ భావిస్తున్నారని ఆరోపించారు. 2018-23 మధ్య కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే.. అక్బరుద్దీన్ ఒవైసీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమించారని రేవంత్ ప్రశ్నించారు. 2014లో టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలున్నా బీఏసీకి ఎర్రబెల్లిని రానిచ్చారని, తనను అనుమతించలేదని.. ఎర్రబెల్లి పార్టీ మారినప్పుడు టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా తనను నియమించాలంటూ చంద్రబాబు లేఖ ఇచ్చినా నాటి సభాపతి పట్టించుకోలేదని గుర్తుచేశారు.కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను అధ్యయనం చేయలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరింపులు చేసినందుకే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని.. అలా పడగొట్టే అవకాశం లేకపోతే తమకొచ్చే ప్రమాదం ఏమీ ఉండదని అన్నారు. ఏ పార్టీ వాళ్లు ఆ పార్టీలోనే ఉండాలని అంటే తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని, కేసీఆర్ లక్కీనెంబర్ అయిన 66మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రె్‌సకు ఉందని చమత్కరించారు.బీఏసీలో అన్ని పార్టీలకూ తాము అవకాశం ఇచ్చామని, కాంగ్రె్‌సకు తరఫున నలుగురు ఉంటే బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురిని, సీపీఐ, బీజేపీ,ఎంఐఎం నుంచి ఒక్కొక్కరిని చేర్చుకున్నామని చెప్పారు.కౌన్సిల్‌లో తమకు మెజారిటీ లేనందువల్ల బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురిని తీసుకున్నామని, ఆ పార్టీకి తామేమీ లోటు చేయలేదన్నారు.
Ts ఇన్చార్జ్ హైదర్ అలీ..
👉కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గం…*14 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి..*ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..*
ఈ నెల 14 న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు.పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు,కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, కేసుల పరిష్కారానికి రాజీ మార్గం రాజ మార్గమని కక్షిదారులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
👉ఏపీ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున*
*షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం: కాసరగడ్డ నాగార్జున*
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున నియమితులయ్యారు.ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధికార ప్రకటన విడుదల చేశారు. కాసరగడ్డ నాగార్జున సహా 9 మందిని అధికార ప్రతినిధులుగా నియమిస్తూ జాబితాను విడుదల చేశారు.
*అంకితభావంతో పనిచేస్తా: కాసరగడ్డ నాగార్జున*
తనపై అత్యంత నమ్మకంతో కీలకమైన పీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాసరగడ్డ నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను తాను చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నిరంతరం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని వివరించారు. తనకు పదవి రావడంలో సహకరించిన ప్రతిఒక్కరికి నాగార్జున పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్*రాజీనామాకు సిద్ధం!..*కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్ సీఎం మమత..”కేజ్రీవాల్‌కు బెయిల్”.. ..ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం.. 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..ఏపీ పీసీసీ అధికార ప్రతినిధిగా కాసరగడ్డ నాగార్జున.. కళ్యాణదుర్గంలో నెల రోజులుగా తాగునీటికి ఇబ్బందులు..సిపిఎం నేత ఏచూరికి నివాళి-మార్కాపురం..కంభం ఎస్ఐకి ఘన సన్మానం.
Recent Posts