👉తండ్రి తరఫున చెక్కు అందించిన బాలకృష్ణ కూతురు..
ఇటీవల తెలుగు రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున విరాళాలు ప్రకటించడం..కొందరు వాటిని స్వయంగా ముఖ్యమంత్రుల్ని కలిసి అందించచడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ తరుపున 50 లక్షల రూపాయల చెక్ ను ఆయన చిన్న కుమార్తె తేజస్వీని నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఏం రేవంత్ ని కలిసి అందించారు.
అనంతరం కాసేపు ఇరువురి మధ్య చిన్న పాటి మాట మంతి జరిగినట్లు తెలుస్తోంది. నిన్నటి రోజునే బాలకృష్ణ అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్ అందజేశారు. రెండు రాష్ట్రాలకు కలిపి ఆయన కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే బాలయ్య బిజీ షెడ్యూల్ కారణంగా నేడు కుమార్తెని పంపించినట్లు తెలుస్తోంది. తేజస్విని ఇంతవరకూ ఇలా రాజకీయ నాయకుల్ని కలిసింది లేదు.
కుటుంబ వ్యవహారా లు..బిజినెస్ లు చూసుకునేవారు. ఇటీవలే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చారు. సోదరు డు మోక్షజ్ఞ చిత్రాన్ని ఆమె స్వయంగా నిర్మిస్తున్నారు. ఇకపై కంటున్యూగా సినిమాలు చేసే అవకాశం ఉంది. తదుపరి సినిమా ఈవెంట్లో లకూడా తేజస్వీని ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది. బాలకృష్ణ పెద్ద కుమార్తె, లోకేష్ సతీమణి బ్రాహ్మాణి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
అప్పటి వరకూ ఆమె బిజినెస్ వ్యవహారాలు చూసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా చిన్నగా రాజకీయ వ్యవహారాల్లోనూ భాగమవుతున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
👉 17న వరద బాధితులకు సాయం: సీఎం ..
వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్‌పై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
[9/13, 1:35 PM] Viswas Tv Sunil Andhra: విజయవాడ నగరంలో ఇంటింటికి తిరిగి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.
విశ్వాస్ న్యూస్ ప్రతినిధి
విజయవాడ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వారి తనయుడు కందుల విగ్నేష్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ నగరంలో ఇంటింటికి తిరిగి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ , స్థానిక విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు తదితరులు పాల్గొని ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్థానికులు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
[9/13, 2:07 PM] Viswas Tv Sunil Andhra: వాహన తనిఖీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై
ప్రకాశం జిల్లా
రాచర్ల మండలంలో శుక్రవారం
వాహన తనిఖీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై
ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి వాహన పత్రాలను లైసెన్స్ పొల్యూషన్ పత్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు… అదేవిధంగా పలు వాహనాలకు జరిమానాలు విధించారు… అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేశారు..వేగం కన్నా ప్రాణం మిన్న అని అన్నారు..
👉 గుంటూరు జిల్లా..తాడేపల్లి టీడీపీలో బయట పడ్డ విభేదాలు..మండలం లోని పెనుమాక లో టీడీపీ మండల మహిళా విభాగం కార్యదర్శిపై యువకులు దాడి..ఒకవర్గం మహిళ నేత బంధువుల తో కలసి తనపై తన భర్త పై దాడిచే యించిందని,గాయల పాలైనామని మహిళా నేత అనూష తన బాధను వ్యక్తం చేశారు..దాడిచేయించటమె కాకుండా మండల నేతల బలం తో తనభర్తపై కేసు పెట్టి స్టేషన్ కు పంపారని,పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చినా స్పందన రాలేదని,పార్టీ నేతలు కక్షకట్టి తన భర్త ను అరెస్ట్ చేయించారని,ఇంతకాలం టీడీపీలో తిరిగినందుకు తగిన శాస్తి జరిగిందని అనూష పోలీస్ స్టేషనవద్ద కన్నీటి పర్యంతమైనారు ..
👉 వరదబాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ని కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల నిర్వాహకులు
తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛందంగా ప్రజలు, దాతలు, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.1,63,77,261 (1.63 కోట్లు) అందజేత.
గుంటూరుకు చెందిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ ఎండీ, సెక్రటరీ కరస్పాండెంట్ భీమనాథం భరత్ రెడ్డి, శివ శిరీష రూ.10 లక్షలు అందజేత
గుంటూరుకు చెందిన ఆరుషి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ అధినేత యెండ్లూరి సత్యనారాయణ రూ.లక్ష అందజేత
గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ రూ.50వేలు అందజేత..విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్(ఏపీపీయూఎస్ఎంఏ) ప్రతినిధులు రూ.10 లక్షలు అందజేత..గుంటూరుకు చెందిన పీఎస్ఆర్ ఇన్ ఫ్రా అధినేత బి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు అందజేత
విజయవాడకు చెందిన మొక్కపాటి సత్యనారాయణ రూ.2,42,764 అందజేత
కర్నూలుకు చెందిన పి.రాజశేఖర్ రూ.లక్ష అందజేత
మంగళగిరికి చెందిన దివి పిచ్చేశ్వరరావు రూ.50వేలు అందజేత..వరద బాధితులకు అండగా నిలిచిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు
👉పాపం.. పవన్ కళ్యాణ్కు ఏమీ తెలియదు: జగన్*
కాకినాడ పర్యటనలో సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ సెటైర్లు వేశారు.’వరద బాధితులను ఆదుకోకుండా ప్రభుత్వమంతా ఫొటోలకే పరిమితమైంది.చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్.. కానీ ఇక్కడ కాదు.పాపం ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి ఏమీ తెలియదు.కానీ చంద్రబాబు పవన్ను మించిపోయాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్’ అని విమర్శించారు.
👉 రష్యా ఆర్మీ నుంచి బయటపడ్డ భారతీయ యువకులు. యువకుల్లో నారాయణపేట జిల్లాకి చెందిన సోఫియాన్. 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న సోఫియాన్. క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చిన భారతీయులు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సోఫియాన్. ఉద్యోగం పేరుతో ముంబై ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకులు. 9 మంది యువకుల్లో హైదరాబాద్‌కు చెందిన అఫ్రిదీ మృతి.
👉సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్న చంద్రబాబు*
• *రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం*
• *రేపు ఉదయం హైదరాబాద్ రానున్న చంద్రబాబు..
👉వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున దాతలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా హీరో సాయి ధరమ్ తేజ్ విరాళం రూ.10 లక్షల చెక్ ను మంత్రి నారా లోకేష్ అందజేశారు..
👉 వినాయక చవితి సందర్బంగా ఒంగోలు లోని గాంధీ రోడ్డులో రాముల వారి గుడి వద్ద గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమం పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు, తాతా ప్రసాద్ శ్రీరామ మూర్తి మిరియాల కృష్ణమూర్తి తులసిరామ్ అయినాబత్తిన ఘనశ్యామ్ బెల్లం సత్యనారాయణ, కుప్పా రంగసాయి, కండె శ్రీనివాసులు, ఆళ్ల శ్రీనివాస రెడ్డి తదితర నాయకులు, యువకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .
👉 వినాయక చవితి సందర్బంగా ఒంగోలు లోని D-Mart ప్రక్కనున్న BK అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, కండె శ్రీనివాసులు, చిటితోటి సుబ్బారావు, పసుపులేటి శ్రీనివాసులు తదితర నాయకులు.
👉 ఒంగోలులో మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయం లో కౌన్సిల్ సమావేశం హాలులో జరిగిన నగర పాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశంలో పాల్గొన్న నగర మేయర్ గంగాఢ సుజాత, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు,సంతనూతలపాడు శాసనసభ్యులు బి. న్. విజయ్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర రావు మరియు కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
👉వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు..
జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్.
తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొన్న మూర్తి. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.
వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు.
👉 ఏపీ మాజీ మైన్స్ డైరెక్టర్‌పై ఏసీబీ కేసు నమోదు..
నిబంధనలకు విరుద్ధంగా మైన్స్‌ను కట్టబెట్టారని ఆరోపణ..
రూ.2,566 కోట్ల మైనింగ్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తింపు.
👉మా భూమిని కబ్జా చేశారు… పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..!..విశాఖపట్నం: తమ స్థలంలో పనులు చేసుకుంటుండగా గూండాలొచ్చి తమపై దాడి చేశారని ఓ ఎన్నారై జంట గురువారం కన్నీరుమున్నీరైంది. ఇది భారత దేశమా..పాకిస్తానా అంటూ ఆక్రందన వ్యక్తం చేసింది. తమకు జరిగిన అన్యాయంపై నగర పోలీస్ కమిషనర్‌తో పాటు హోంమంత్రి అనిత, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌లకు వారు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగకపోతే దేశాన్ని వదిలి కుటుంబమంతా ఇతర దేశాలకు పోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో బాధితులు మీడియాతో మాట్లాడారు. వివరాలిలా ఉన్నాయి.
స్థలం వివాదంలో కోర్టు తీర్పు ఇచ్చినా..
వేపగుంట -సింహాచలం రోడ్డులో సింహపురి కాలనీ వద్ద ప్లాట్ నంబర్ 27/28లలో ఉడా అనుమతి పొందిన 1/2004 పేరిట 446 గజాల స్థలం ఉంది. ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తగా విషయం కోర్టుకు చేరింది. చివరకు ఆ స్థలం వెంకట పద్మజ, నాయుడు దంపతులకే చెందుతుందని విశాఖ కోర్టు పర్మినెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడు తండ్రి కొన్నాళ్లగా ఆ స్థలంలో పనులు చేయించుకుంటుండగా డీవీ మహేష్, అనుచరులు అడ్డుపడుతూ వస్తున్నారన్నది ఆరోపణ. దీంతో అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన నాయుడు, వెంకట పద్మజ దంపతులు హుటాహుటిన విశాఖ వచ్చేశారు. గురువారం ఉదయం కూడా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. తమపై కొంతమంది దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్‌ను సంప్రదించారు. ఆయన వెంటనే పెందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కబ్జాదారులు అక్కడ నుంచి పరారయ్యారు. గోశాల వద్ద మైత్రీనగర్ లే అవుట్ వద్ద చోటు చేసుకున్న ఈ సంఘటన విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించింది. తాము అనుమానం వ్యక్తం చేసే వ్యక్తులపై చర్యలు చేపట్టాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు..
కబ్జాదారులపై కఠిన చర్యలు: సీపీ..
కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్టు కూడా ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు మరలా జరిగితే క్షమించేదే లేదని హెచ్చరించారు.
👉 దాడిని ఖండించిన జనసేన పార్టీ వినుకొండ నియోజకవర్గo సమన్వయ కర్త నాగ శ్రీను రాయల్
పల్నాడు జిల్లా..వినుకొండ మండలం భారతపురం గ్రామానికి చెందిన రాజవరపు నరసింహరావు ని మరియు బాల ఆంజనేయులు ని భారతాపురం లో వాళ్ళ ఇంటికి వెళ్తుండగా దారిలో కర్రలతో రాళ్లతో రాజవరపు వెంకటరావు, రాజవరపు శ్రీనివాసరావు, మరియు ఎర్ర శీను మరియు కొంతమంది పక్కా ప్రణాళికతో దాడి చేశారు.ఈ దాడిన ఖండించిన వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ మరియు గాయపడిన బాధితులని ప్రభుత్వ గవర్నమెంటు హాస్పిటల్ నందు పరామర్శించి దాడి చేసిన వ్యక్తులను చట్టప్రకారం శిక్షించాలి డిమాండ్ చేశారు. మరియు బాధితులకి ప్రాణహాని కలకుండా పోలీసులు బాధ్యత వహించాలని తెలియజేశారు.
👉గుంటూరు నగరవ్యాప్తంగా ఉన్న అనధికార కట్టడాలు, హోర్డింగ్‌ల తొలగింపునకు గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అధికారుల రికార్డుల ప్రకారం, GMC అధీకృత నిర్మాణాలు, అనుమతి లేకుండా మరియు అన్ని నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు ఏర్పాటు చేశాయి.
వాటిపై ప్రతేక దృష్టిపెట్టారు…ఈ నేపథ్యంలో గాంధీ పార్క్ ఎదుట నిర్మాణాలను నేడు కుల్చివేయటం ప్రారంభించారు…
అదేవిధంగా నగరంలోని పలుభవన నిర్మాణాలపై దృష్టి పెట్టారు..నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తామని అనేకసార్లు హెచ్చరించారు…
అయినా నేటికి నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటంతో వాటిపై నగర కమీషనర్ దృష్టి సాధించారు…
ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయని పక్షంలో వాటిని కూల్చేందుకు కూడా వెనకాడనని అన్నారు…
మార్జిన్ లో ఉన్న షాపులను అదేవిధంగా హోల్టింగ్స్లను వెంటనే తొలగించాలని సూచించారు…
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులపై దృష్టి పెట్టామని అదేవిధంగా వాటిలో ఏమైనా నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగిస్తామని అన్నారు.
👉 వినుకొండలో మరొకసారి చైన్ స్నాచర్స్ మెరుపు దాడి నాలుగు తులాల బంగారపు గొలుసును దొంగలించిన గుర్తుతెలియని వ్యక్తి..పల్నాడు జిల్లా..
వినుకొండ పట్టణంలో విష్ణుకుండినగర్ ఫస్ట్ లైన్ లో, మరోసారి చెలరేగిన చైన్ స్నాచర్స్ .వివరాల్లోకెళ్తే వినుకొండ పట్టణం విష్ణుగుండి నగరం ఫస్ట్ లైన్ లో నివాసం ఉంటున్న దావులూరి వాణి నిన్న రాత్రి 8 గంటలు సమయం లో స్కూల్ నుంచి పిల్లలు ని తీసుకొని వచ్చి ఎదురు ఇంటి మహిళ తో మాట్లాడుతుండగా మెరుపు వేగంతో , బైక్ మీద గుర్తుతెలియని వ్యక్తి దావులూరి వాణి మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు లాక్కొని పారిపోవడం జరిగింది. స్థానికులు అందరూ వెంట పడగా దొంగ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చెసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉రాజమండ్రిలో చిరుత కలకలం*
రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకోడానికి ఆపరేషన్
కొనసాగుతుంది. దివాస్ చెరువు అటవీప్రాంతాలలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి కదలిక చిత్రాలు గుర్తించారు. చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుత పులి పాదముద్రలు కనుగొన్నారు. చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను కొన్నిప్రదేశాలలో అమర్చారు.