ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..జనసేనలోకి బాలినేని..వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం..నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు ..పొదిలిలో నిఘా నేత్రాలు.

👉హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్లు..
ట్రాన్స్‌జెండర్ల సేవల అంశాన్ని పరిశీలించాలన్న సీఎం రేవంత్ రెడ్డి..హోంగార్డ్ తరహాలో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం.

👉నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారు:**తెలంగాణా హై కోర్టు*
హైడ్రాను రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్పూర్లో ఈనెల 3న షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
👉 జనసేనలోకి భారీగా చేరికలు..దెందులూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం జనసేనలో పార్టీలోచేరారు.ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే, చిర్రి బాలరాజు. నరసాపురం ఎమ్మెల్యే, బొమ్మిడి నాయకర్. ఉంగుటూరు ఎమ్మెల్యే, పత్స మట్ల.ధర్మరాజు. ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు. ఇతర నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు.
👉 కరెంట్ షాక్ తో రైతు మృతి. సిబ్బంది సస్పెండ్..
ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో రైతు కంకిపాటి నాగరాజు ఈనెల 12న కరెంట్ షాక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. లక్కవరం ఏఈ, జోషఫ్. జేఎల్ఎం, తామా వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశామని షిఫ్ట్ ఆపరేటర్ మణికుమార్ ని విధుల నుండి తొలగించగా లైన్ ఇన్స్పెక్టర్ గణేష్ సింగ్ కు షోకాస్ నోటీస్ ఇచ్చామని డి ఈ, రాధాకృష్ణ తెలిపారు.
👉ఏపీలో ఇవాళి నుంచి పీహెచ్సీ ఆస్పత్రుల్లో OPలు బంద్*
పీజీ వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాల్టి నుంచి పీహెచ్సీ వైద్యులు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బహిష్కరించ నున్నారు.
అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తామని పీహెచ్సీ వైద్యుల సంఘం తెలిపింది.
నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
రేపు ఛలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని, మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని తెలిపింది.
👉గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ?*
ఏపీ లో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నిన్న ఈ నాలుగు జిల్లాల నేతలతో టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమావేశమయ్యారు.
అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని వారిని కోరారు..
పోటీ చేసేందుకు నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
👉నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, పీఎస్ఆర్, విశాల్‌గున్నీపై చర్యలకు సిద్ధం*..ఏసీపీ హనుమంతరావు, సీఐ ఎం.సత్య నారాయణ రావుపై ప్రభుత్వం వేటు.జత్వానీ ఇంటరాగేషన్‌లో కీలక పాత్ర పోషించిన హనుమంతరావు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో జత్వానీని ఆగమేఘాలపై అరెస్ట్ చేసిన సత్యానారాయణ.గత రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీ ఫిర్యాదు..ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం.సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వానీ కేసు అనంతరం హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు. జత్వానీ ఇంటరాగేషన్‌లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఆమె పోలీసు కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంటరాగేట్ చేశారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జత్వానీని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ కేసులో అన్నీ తామై నడిపించిన ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ తదితరులపై చర్యలకు రంగం సిద్దమైంది.
ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీ ఫిర్యాదు
తల్లిదండ్రులు, న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, పాల్‌తో కలిసి గతరాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నటి జత్వానీ విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు తమను అరెస్ట్ చేశారని, ఏ తప్పూ చేయకున్నా తమ కుంటుంబం 42 రోజులపాటు జైలులో మగ్గిందని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన పోలీసు అధికారులతోపాటు విద్యాసాగర్‌పైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
👉ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..గనులశాఖలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు
ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా కేసులో ఆరోపణలు
ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి.గురువారం కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి..ఏపీ, తెలంగాణతోపాటు చెన్నైలోనూ ఆయన కోసం గాలింపు..ఏపీలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. గురువారం ఆయనపై కేసు నమోదు కాగా, అప్పటి నుంచి మూడు బృందాలు ఆయన కోసం వెతుకుతున్నాయి. ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులోనూ ఆయన కోసం గాలిస్తున్నారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు చెన్నై, తిరుపతి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, కొర్లకుంట తదితర గ్రామాల్లోని ఆయన నివాసాలతోపాటు రైల్వే కోడూరులోని ఆయన అత్తగారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక కాంట్రాక్టు, నిర్వహణలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. కేసు నమోదైన వెంటనే వెంకటరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గనుల శాఖలో ఆయన సన్నిహితులను ఏసీబీ విచారించింది
👉జనసేనలోకి బాలినేని???.ఇతర నేతలు వెళ్లకుండా వైసీపీ హైకమాండ్ జాగ్రత్తలు..
వైఎస్ఆర్‌సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు.తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపోమాపో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు. తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం చేశారు.వైసీపీ తరపున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. ఆయన బాలినేనికి సన్నిహితుడు. ఆయన సిఫారసు ద్వారానే సిట్టింగ్ గా ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్ ను తప్పించి .. తాటిపర్తికి టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని పార్టీ మారిపోతే ఆయన కూడా వెళ్తారన్న ఉద్దేశంతో.. పార్టీ ఆఫీసు నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ కు పిలుపు వచ్చింది . జగన్ ఆయనతో మాట్లాడి.. పార్టీకి విధేయంగా ఉండాలని..బాలినేనితో కలిసి నడవవొద్దని చెబుతారని అంటున్నారు.బాలినేనికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. ఆయన పార్టీని చక్క బెడతారని పలువురు ప్రకాశం జిల్లా నేతలు ఇటీవలి కాలంలో జగన్ తో పాటు పార్టీ నేతల్ని కలిసి చెబుతున్నారు. అయితే అసలు బాలినేనికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలియడంతో … ఆయనకు మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు బాలినేనిని టీడీపీలోకి రానివ్వరు. బీజేపీలో చేరలేరు. పవన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గతంలో కూడా బాలినేనిపై ఈ ప్రచారం జరిగింది. అప్పట్లో ఖండించారు కానీ.. ఇప్పుడు ఖండించడం లేదు. తనను ఆ పార్టీలోకి వెళ్లాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.
👉వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు శనివారం మధ్యాహ్నం లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్, తలశిల రఘురాం హాజరు కానున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని మరోసారి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు వీరందరికి మరోసారి నోటీసులు పంపారు.
దీంతో వీరందరూ శనివారం హాజరుకానున్నారు.
మరో ప్రక్క మాజీ ఎంపీ నందిగామ సురేశ్ ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్న సంగతి తెలిసిందే.
👉కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు పెట్టిన యువతి బంధువులు, కర్నూలు జిల్లాలో దారుణం*
కర్నూల్ జిల్లా..పెద్దకడుబురు మండలం..
ఓ యువకుడు వేరే వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడం అతని తల్లిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. యువతి బంధువులు దళిత మహిళ అయిన ఆమెను స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో దళితుడైన ఈరన్న అనే యువకుడు.. మరో వర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు కులం అడ్డంకిగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఊరి నుంచి వెళ్లిపోయారు. ఇలా జరిగిన వెంటనే యువకుని కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయారు. 6 నెలల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో యువతి బంధువులు తీవ్ర ఆగ్రహంతో యువకుడి తల్లి గోవిందమ్మను గురువారం రాత్రి కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో స్థానికులు ఆమెను విడిపించేందుకు యత్నించగా వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..
*రక్షించిన పోలీసులు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు. ఆరు నెలల క్రితం దళితుడైన ఈరన్న.. మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడమే అని పేర్కొన్నారు. అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని మరో సామాజికవర్గం ఆదేశించడంతో గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. రూ.700 కోట్ల రూపాయలతో బోర్డ్ తిప్పేసిన కంపెనీ… లబోదిబోమంటున్నారు బాధితులు!!!..
ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు.. అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు.. పేరు ఏదైనా.. మోసం మాత్రం కామన్‌ అయిపోతోంది
అవును.. ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తీరా కొద్దినెలల తర్వాత బిచాణా ఎత్తేయడం.. అలాగే.. అధిక వడ్డీలు పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజల్ని నిండా ముంచేస్తున్నాయి.
ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడంలేదు.
మొన్నామధ్య హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసింది. ఉద్యోగాల పేరుతో 10 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించడంతో మోసపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన తెరపైకి వచ్చింది.
హైదరాబాద్‌ మాదాపూర్‌లోని DKZ టెక్నాలజీస్ కంపెనీ అధిక వడ్డీల పేరుతో 700కోట్లు వసూలు చేసింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని పెద్దయెత్తున ప్రచారం చేయడంతో విశేష స్పందన వచ్చింది. మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి వడ్డీ రూపంలో అధికంగా చెల్లించారు నిర్వాహకులు. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండడంతో వేల మందితో పెట్టుబడులు పెట్టించారు కొందరు సభ్యులు. అయితే.. రెండు నెలల నుంచి డబ్బులు చెల్లించక పోవడంతో కంపెనీ నిర్వాహకులను నిలదీశారు డబ్బులు కట్టించినవారు, కట్టినవారు. దాంతో.. ఏకంగా.. మాదాపూర్‌లోని ఆఫీస్‌కి తాళం వేసి పరారయ్యారు DKZ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ ఇక్బాల్, రాహిల్ అనే వ్యక్తులు DKZ సంస్థను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామని నిందితులు ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇక.. DKZ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు.. సుమారు 18వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇలాంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు హైదరాబాద్‌ పోలీసులు
👉గణేష్ నిమజ్జనానికి భారీ పోలీస్ బలగాలతో బందోబస్తు..
హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనం సందర్భం గా 25వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావే శంలో సిపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ…సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని మధ్యా హ్నం 1.30 గంటల్లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహ కులతో చర్చించామని.. దానికి వాళ్లు అంగీకరించా రని తెలిపారు.
ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తిలకించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు హుస్సేన్‌సాగర్‌ పరిస రాలకు వస్తారని… దీన్ని దృష్టిలో ఉంచుకుని బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సీపీ వివరించారు.
👉తిరుపతి: మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం కేసు
మహిళా రైతు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ
సబ్‌కలెక్టర్‌, MRO ఆఫీసులో కొనసాగుతున్న సోదాలు
కోళ్లబైలు, వలసపల్లి రికార్డులు పరిశీలన..
ఫ్రీ హోల్డ్‌ భూముల కోసం రైతుల దరఖాస్తు
రైతుల స్టేట్మెంట్‌ రికార్డు చేసిన అధికారులు..
👉 పొదిలిలో నిఘా నేత్రాలు పట్నంలోని అన్ని సెంటర్లలో నిఘా నేత్రాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో సీఐ టీవెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వి వేమన తెలిపారు. గతంలో 16 నిఘ నేత్రాలు ఉండేయని, వాటిలో కొన్నింటికి మరమ్మత్తులు చేయించడంతోపాటు, నాలుగు కొత్తవి కూడా ఏర్పడడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వీటివల్ల దొంగతనాలు,అనుకోని సంఘటన జరిగిన పసికట్టేవీలు కలుగుతుంది అన్నారు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..