👉 క్రీమ్+బన్ = క్రీమ్-బన్… నిర్మలమ్మపై కామెంట్స్ వర్షంలో బిగ్ టర్న్!..
హోటల్స్ యజమానుల సమావేశం సందర్భంగా అన్నపూర్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిత్యం పలు కీలక ప్రశ్నలు ప్రజల నుంచి, వ్యాపారుల నుంచి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న కోయంబత్తూరులోని వ్యాపారులతో జరిగిన భేటీలోని ఓ వ్యవహారం మరింత వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. అవును… ఈ నెల 11న కోయంబత్తూరులోని వ్యాపారులతో నిర్మలా సీతారామన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్నపూర్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… బన్ పై జీఎస్టీ లేదని, క్రీమ్ పై 5% జీఎస్టీ ఉందని, కానీ క్రీమ్ బన్ పై మాత్రం జీఎస్టీ 18% ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇదే క్రమంలో… ఇలా బన్ పై జీఎస్టీ లేదు కానీ క్రీమ్ బన్ పై మాత్రం 18% జీఎస్టీ ఉండటంతో… తమకు క్రీమ్, బన్ సెపరేట్ గా ఇస్తే తామే బన్ పై క్రీమ్ రాసుకుని తింటామని కస్ట్ మర్లు చెబుతున్నారని అన్నారు. జీఎస్టీ గందరగోళంలో కంప్యూటర్లు కూడా సరిగా పనిచేయడం లేదని సెటైర్ వేశారు. అయితే దీనిపై స్పందించిన నిర్మళా సీతారామన్… శ్రీనివాసన్ చెప్పింది పరిశీలిస్తామని అన్నారు. ఈ సమయంలో… క్రీమ్+బన్ = క్రీమ్-బన్ అనే విషయం నెట్టింట వైరల్ గా మారింది! ఈ క్రమంలో శ్రీనివాసన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైరల్ చేసింది డీఎంకే పార్టీ సోషల్ మీడియా! ఈ క్రమంలోనే నిర్మాలా సీతారామన్ నాయకత్వంలో జీఎస్టీ అతి పెద్ద సంక్లిష్ట సమస్యగా పరిణమించిందన్నట్లుగా పోస్టులు పెట్టింది. ఈ సమయంలో… నిర్మలా సీతారామన్ ను కలిసిన శ్రీనివాస్ ఈ మేరకు క్షమాపణలు చెప్పారని,తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారంటూ ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ దీనికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పినట్లుగా రాసుకొచ్చింది! దీంతో… సీతారామన్ వ్యవహార శైలి ఇది అంటూ తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన శ్రీనివాసన్ తో క్షమాపణలు చెప్పించుకోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం అంటూ కామెంట్లు మొదలైపోయాయి. *ఇందులో భాగంగా… బహిరంగ వేదికలపై పదే పదే ఇలా చేయడం నిర్మలా సీతారామన్ కు అలవాటుగా మారిందని ఖర్గే విమర్శించగా… ఓ చిన్న వ్యాపారి జీఎస్టీ విధానం గురించి మాట్లాడితే అహంకారంతో అగౌరవపరుస్తారు.. అదే కోటీశ్వరుడైన మిత్రుడు కోరితే చట్టాలనే మార్చేస్తారు.. జాతీయ సంపదను ఆ మిత్రుడికి కట్టబెడతారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ తరుపున క్షమాపణలు చెప్పారు! ఓ గౌరవప్రదమైన వ్యాపారవేత్తకు, ఆర్థిక మంత్రికి జరిగిన ప్రైవేట్ సంభాషణలను వెలుగులోకి రావడంపై శ్రీనివాసన్ కు క్షమాపణలు చెప్పారు!! ఈ వ్యవహారంపై తాను శ్రీనివాసన్ తో మాట్లాడినట్లు తెలిపారు! ఏది ఏమైనా… ఈ వ్యవహారం మాత్రం పెను దుమారం రేపుతోంది!!
👉గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో దారుణం..
పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని మృతి..
ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన కాలేజీ యాజమాన్యం..తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..
మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలింపు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన స్థానిక పట్టాభిపురం పోలీసులు..
👉బీజేపీకి అగ్ని పరీక్షగా మారిన రెండు రాష్ట్రాల ఎన్నికలు*
బీజేపీకి జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసలే అరకొర మెజారిటీ, మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ..ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచి తమకు అడ్డేలేదని చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూడా అదే పనిగా కష్టపడుతోంది. జమ్మూ కశ్మీర్, హర్యానాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. ఇందులో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 46సీట్లు గెలుపొందాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి రెండు చోట్లా ఆశలు మిణుకుమిణుకు అంటున్నాయి. హర్యానాలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి అక్కడ రైతు వ్యతిరేక చట్టాలు, రెజ్లర్ల ఆందోళనలు ఆ పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో హర్యానా హస్తం ఖాతాలో చేరడం పక్కా అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక , జమ్మూలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ తో జత కట్టగా….బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ కు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తోడు కావడంతో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అక్కడ అంతా ఆర్టికల్ 370రద్దును వ్యతిరేకించిన వారే కావడంతో బీజేపీ..అక్కడ అధికారం చేపట్టే స్థాయిలో సీట్లు దక్కించుకోవడం కష్టమే. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితం బీజేపీకి ప్రతికూలంగా వస్తే… ఆ తర్వాత జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి.
👉ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు*
ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో ఈ గడువును మరోమారు పెంచుతున్నట్లు
UIDAI ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 14తో గడువు ముగియనుండగా, 2024 డిసెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది.
దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసు కోవాలను కొనేవారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
👉విజయవాడ బ్యారేజి దగ్గర 5రోజు ప్రారంభమైన పడవ తొలగింపు పనులు..
ఏకకాలంలో పనిచేస్తున్న రెండు ప్రత్యేక బృందాలు.
వైజాగ్ స్కూబా డైవింగ్ టీ, కాకినాడ అబ్బులు టీం వర్క్.
90% మేర కట్ చేసిన పడవను బయటికి లాగుతున్న అబ్బులు టీం.
పడవను లాగేందుకు కటింగ్ ప్రక్రియ చేస్తున్న స్కూబా టీం.
పడవలు మొత్తాన్ని బయటికి లాగాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న టీమ్స్..
👉👉సిబ్బంది వేదింపులు భరించలేక కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిబ్బంది వేధింపులు తట్టుకోలేక కేజీబీవీ పాఠశాల రెండో అంతస్తుపై నుంచి దూకి ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం…
👉 నిమ్స్ లో ఈ నెల 22 నుండి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్న యూకే వైద్యుల బృందం..
గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలకు అవకాశం..
వివరాలకు నిమ్స్ లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలి – నిమ్స్ సంచాలకులు బీరప్ప..
👉 జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా గిద్దలూరు కోర్టు ఆవరణంలో రెండు బెంచులు ఏర్పాటు చేశారు. బెంచ్ 1 నందు సివిల్ కేసులు పరిష్కరించబడినవి. బెంచ్ 2 నందు క్రిమినల్ కేసులు పరిష్కరించబడినవి.బెంచ్ వన్ కు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ ఓంకార్,న్యాయవాద సభ్యులుగా జి .ఆనంద్ కుమార్ మరియు చల్లగాలి పోలయ్య వ్యవహరించారు.
పర్మినెంట్ ఇంజక్షన్ మూడు కేసులు, పార్టిషన్ కేసు ఒకటి, నగదు కేసులు 16 కు 39,70,592, మరియు EP కేసులు 5 రాజీ పడగా పరిహారముగా 10, 38 ,890 వేల రూపాయలు,బ్యాంక్ కేసులు 3 కు 1,27,000,బి.యస్.న్.ల్. కేసులు 10 కు 7,105 రూపాయలు కక్షి దారులకు అందినవి. బెంచ్ 2 కు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రొసైడింగ్ ఆఫీసర్ బి.మేరీ సారా దానమ్మ, న్యాయవాద సభ్యులుగా ఎం. పిచ్చయ్య యాదవ్ మరియు డి. సంధ్యారాణి వ్యవహరించారు. భరణం కేసులు 9 కు 33,00,000 రూపాయలు, చెక్ బౌన్స్ కేసులు 2 కు 3 ,83,000 వేల రూపాయలు, గృహహింస కేసులు 4 మరియు రాజీ పడదగిన క్రిమినల్ కేసులు 108 , అడ్మిషన్ కేసులు 15, STC కేసులు 242 పరిష్కరింపబడినవి.గిద్దలూరు కోర్టు నందు 418 కేసులు ఈరోజు పరిష్కరించబడినవి.మొత్తము 88లక్షల 26 వేల 587 రూపాయలు కక్షిదారులకు ముట్టినవి. అనంతరం హాస్టల్ సందర్శనలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు నందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ ఓంకార్ గిద్దలూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖలోని ప్రభుత్వ బాలుర వసతి గృహము ఒకటి,రెండు మరియు గిరిజన బాలుర సంక్షేమ స్కూలు మరియు వసతి గృహమును ఆకస్మికముగా తనిఖీ చేశారు. బాలురకు అందుతున్న వసతులను పరిశీలించి కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సర కాలముగా వారికి మెనూ బిల్లులు అందకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్ నందు ఫిజిక్స్ మరియు సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు అధ్యాపకులు లేరని తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తపరిచారు .పదవ తరగతి చదివే పిల్లలకు బోధన సిబ్బంది సరియైన సంఖ్యలో లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించి సరియైన అధ్యాపకులను ఏర్పాటు చేసుకోవలసినదిగా ఆదేశించారు.వసతి గృహం 2 కు సరైన కాంపౌండ్ గోడ లేకపోవడం విచారకరమన్నారు. న్యాయ సేవాధికార చట్టము, నిర్బంధ ఉచిత విద్య ,ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవలసినదిగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ C I. కె.సురేష్, న్యాయ వాదులు ఎం. పిచ్చయ్య యాదవ్, కె .రవి ప్రకాష్ బాబు, చల్లగాలి పోలయ్య, ఎంఏ రైడర్ బాబు, జనార్ధన్ ,జి. ఆనంద్ కుమార్,పారా లీగల్ వాలంటీర్ అద్దంకి మధుసూధనరావు, హాస్టల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీం+బన్ = క్రీమ్-బన్…నిర్మలమ్మపై కామెంట్స్ వర్షంలో బిగ్ టర్న్!..గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..సిబ్బంది వేదింపులు భరించలేక కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు..గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్.
Recent Posts