👉వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట..!!! రావడం అంటే రాజకీయంగా కొంత చర్చకు తావిస్తోంది. వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట రావడం అంటే రాజకీయంగా కొంత చర్చకు తావిస్తోంది. జగన్ తన టార్గెట్ ని చంద్రబాబు మీదనే మళ్ళించారని అంటున్నారు.
టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని నమ్ముతున్నట్లుగా వైసీపీ అధినాయకత్వం తీరు ఉంది. అందుకే జనసేనను పెద్దగా విమర్శించకుండా వ్యూహాత్మకమైన వైఖరితో ముందుకు సాగాలని అనుకుంటోందని అంటున్నారు. టీడీపీకి బలమైన సామాజిక వర్గం నుంచి కానీ పవన్ నుంచి కానీ మద్దతు లేకపోతే ఈ విజయం అసలు లభించదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. కేసు బుక్ మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం పవన్ విషయంలో ఏమీ అనవద్దని పార్టీకి కూడా సూచనలు కూడా వెళ్ళాయని అంటున్నారు. పిఠాపురం వెళ్ళిన జగన్ పవన్ మీద గట్టిగానే విమర్సలు చేస్తారని అంతా భావించారు. ఎందుకంటే పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం. పైగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మామూలుగా అయితే వైసీపీ పవన్ ని కూడా గట్టిగా టార్గెట్ చేసేదే. ఎందుకంటే గత ఎన్నికల ముందు అదే తీరు కనిపించేది. పైగా చంద్రబాబు కంటే కూడా పవన్ నే పట్టుకుని అనేక విమర్శలు చేసేది. ఇపుడు సాక్షాత్తు అధినేత జగన్ పిఠాపురం వెళ్ళినా పవన్ ని పల్లెత్తు మాట అనకపోగా పాపం పవన్ అని సానుభూతి చూపించడంలో పరమార్ధం ఏమై ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. అయితే రాజకీయంగా బాబుని ఒంటరిని చేసే మాస్టర్ ప్లాన్ లో ఇది భాగమని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీని పక్కన పెట్టి ఒక్క టీడీపీనే వైసీపీ విమర్శించేది. చివరికి టీడీపీ బీజేపీల మధ్య కటీఫ్ అయింది దాని ఫలితంగా వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. ఇపుడు కూడా అదే రకం స్ట్రాటజీని ప్లే చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. అయితే జనసేన మాత్రం టీడీపీతోనే ఉంటుంది అని అంటున్నారు. పవన్ కి రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యమని కూడా అంటున్నారు. కానీ ఇది ఫక్తు రాజకీయం. ఎవరెన్ని చెప్పినా పరిస్థితులు ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండవు. అందువల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. పైగా కూటమిలో బీజేపీ కూడా ఉంది. టీడీపీ బీజేపీల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చినా కూడా దాని ప్రభావం కచ్చితంగా జనసేన మీద కూడా పడుతుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ అయితే ఒక క్లారిటీతో ఉంది అని అంటున్నారు. పవన్ మీద విమర్శలు చేయకూడదు అన్నదే ఆ స్పష్టత. ఇప్పటికే మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ వైసీపీ ఏమీ అనకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనను అలాగే ఉంచి టీడీపీని చంద్రబాబునే టార్గెట్ చేసుకోవాలని ఏపీ పాలనలో జరిగే లోపాలు ఆ తప్పులు తడకలూ అన్నీ కూడా బాబు ఖాతాలోనే వేయాలని వైసీపీ నిర్ణయించుకుంది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఎత్తులకు టీడీపీ పై ఎత్తులు ఎలా ఉంటాయో.
👉 కోమాలో ఉన్న కానిస్టేబుల్ కోసం 10 లక్షలు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఇటివల బాధితుడి భార్య కళ్యాణ్ గారిని ఎయిర్‌పోర్ట్‌లో కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు.
@జనసేనపార్టీ & చిరంజీవి యవత గద్వాల జిల్లా
నేడు నూతన పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం*
తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టను న్నారు. ముందుగా ఆయన గన్ పార్కుకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.
అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 :30 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించను న్నారు .ఆ తరువాత ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ నిర్వహించ నున్నారు.
ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు,కాంగ్రెస్ నాయకురాలు దీపాదాస్ మున్షి,మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రసంగించను న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు.
నూతన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ, మండల, జిల్లా,నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలిరానున్నట్లు తెలుస్తుంది…
👉పెరిగిన వంట నూనె ధరలు*
వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.
పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కి చేరాయి.
👉మహారాష్ట్ర రాష్ట్ర..నాగ్ పూర్ లో DJ సౌండ్ బాంబ్…* DJ చాలా దగ్గరగా ప్లే చేయడం వల్ల ఏర్పడిన వైబ్రేషన్స్ కారణంగా కూలిన ఒక గోడ…పoక్షన్ కు హాజరైన చాలా మందికి గాయాలు…డీజే ని బ్యాన్ చేయాల్సిందిగా స్థానికులు చెబుతున్నారు. ఉత్సవాలలో డీజే ల మితిమీరిన శబ్దాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న.. అధికారులు మాత్రం సరైన విధంగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.. అనారోగ్యానికి గురైన వారిపై,వృద్ధులు పిల్లల ఆరోగ్యాలపై ఎన్ని దుష్ప్రభావాలు చూపుతాయో ప్రభుత్వం గమనించి డీజే లను బ్యాన్ చేయడం లేదా వాటి నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు .
👉 ఏపీలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా!..
మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు అలాగే ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ తో నగారా మోగింది.👉పాత ఓటరు లిస్టు ఉండదు.అందరూ మరలా క్రొత్తగా ఓటర్లు గా నమోదు కావలసిందే.👉Graduate MLC ఎన్నికలకు Form 18 లో Teacher MLC ఎన్నికలకు Form 19 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును.👉ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును. 👉 Graduate MLC ఓటు నమోదుకు Form 18 తో
1 Graduate Degree Provisional/Orignal Attested Zerax copy ..2 Photo 3 Aadhar (Optional) Copy ..4.Voter id/Residence proof Copy ను జత చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి.
👉Teacher MLC ఎన్నికల నియోజక వర్గాలలో నివాసము ఉండి ఏదేని ( ఇతర జిల్లాలో ఉన్నదైనా సరే)
Recognised Secondary School ఆ పైన Institution లో పని చేయుచూ Nov 1 నాటికి గత 6 యేళ్ళలో 3 ఏళ్ళ సర్వీసు నిండిన టీచర్లు ఓటరు గా Form 19 లో నమోదుకు అర్హులు. Form 19 తో 1Photo 2 Service certificate 3 Aadhar(Optional) 4.Voter id /Residence proof లను Attach చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇచ్చి రశీదు పొందవచ్చును. Online లో కూడా Submit చేయవచ్చును.
👉Graduate /Teacher MLC ఓటరు గా నమోదు అగుటకు Assembly Election ఓటరు గా ఉండవలసిన పని లేదు.👉ఈ రెండు రకాల MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు అర్హత మాత్రమే. 👉Online లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి వెరిఫికేషన్ కు వచ్చినప్పడు Certicate. Copies ఇవ్వాలి. అదే Offline దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు.నివాసము ఉంటున్నారా లేదా అని మాత్రమే వెరిఫై చేస్తారు.
👉 మార్చి 2025 లో జరిగే ఈ MLC నియోజక వర్గాల పరిధి లో టీచర్లు/ గ్రాడ్యయేట్లు అందరూ బాధ్యత గా Form 18/19 ద్వారా ఓటరు గా నమోదు చేసుకోవాలి.
👉అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిదిని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..!!!
ఆన్‌లైన్ గేమ్‌లు, ఇతర వ్యవసనాలకు అలవాటు పడిన అల్లుడు అత్తింటి ఆస్తిపై కన్నేశాడు. ఆ ఆస్తికి వారసుడైన బావమరిదిని అంతమొందిస్తే అంతా తనకే దక్కుతుందని పగటి కలలు కన్నాడు. తుదకు నమ్మకంగా బావమరిదిని హత్య చేసి, సూసైడ్ అంటూ దొంగనాటకాలు ఆడాడు. పోలీసుల ఎంట్రీతో అసలు కథ బయటికొచ్చింది.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన గోగుల శ్రీకాంత్ (34) హైదరాబాద్‌లోని కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. 2017లో కావలికి చెందిన వ్యాపారి మద్దసాని ప్రకాశం తన కుమార్తె అమూల్యను శ్రీకాంత్‌కిచ్చి వివాహం జరిపించాడు. ప్రకాశం కుమారుడు యశ్వంత్ (25) బావ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. యశ్వంత్ హాస్టల్ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఓ గదిలో తన స్నేహితుడు మహేష్‌తో ఉంటూ హాస్టల్ నిర్వహణలో బావకు సహకరిస్తూ ఉండేవాడు. అయితే శ్రీకాంత్ వ్యసనాలకు అలవాటు పడి రూ.4కోట్లకుపైగా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు శ్రీకాంత్ భార్య తల్లిదండ్రుల ఆస్తిపై కన్నేశాడు. బావ మరిది యశ్వంత్‌ను అంతమొందిస్తే అత్తామామల ఆస్తి తనకే దక్కుతుందని, దీనితో అప్పులు తీర్చి జల్సాగా బతకొచ్చని కుట్ర పన్నాడు. దీంతో నమ్మకంగా బావమరిదిన చంపేందుకు పన్నాగం పన్నాడు.
అందుకు కర్ణాటక కర్వార్ జిల్లా అంజయ్యనగర్‌లో వంట పనిచేసే పులియశ్రమానే ఆనంద్ (35), హాస్టల్ సూపర్‌వైజర్ అంబటి వెంకటేశ్‌లను సంప్రదించి హత్యాకుట్రను చెప్పాడు. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.2లక్షలిచ్చాడు. ఆగస్టు 29న యశ్వంత్ ఉండే హాస్టల్ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి, యశ్వంత్ స్నేహితుడు మహేష్‌ను 31న బయటికి పంపించేశాడు. సెప్టెంబర్ 1న అర్ధరాత్రి 12.45కు ఆనంద్, వెంకటేశ్ గదిలోకి ప్రవేశించి.. యశ్వంత్ కాళ్లు, చేతులు కట్టేసి చున్నీతో గొంతుకు ఉచ్చు బిగించి చంపేశారు. యశ్వంత్ 90 కిలోల బరువు ఉండడంతో ఉరికి వేలాడదీయడం కష్టం అయ్యింది. దీంతో ఉరి నుంచి దించుతున్నట్లు ఫొటోలు తీశారు. వ్యసనాలతో బావమరిది ఆత్మహత్య చేసుకున్నట్లు అత్తామామలకు కొత్త అల్లి చెప్పాడు శ్రీకాంత్. అదేరోజు కారులో మృతదేహాన్ని తీసుకొని కావలికి బయల్దేరాడు. అత్తాగారింట్లో తొందరపెట్టి దహన సంస్కారాలు చేయించాడు. అయితే ఖననం సమయంలో మృతదేహంపై గాయాలు చూసిన ప్రకాశం, హాస్టల్ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా అనుమానాలు బలపడ్డాయి. వెంటనే ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా శ్రీకాంత్ నేరం అంగీకరించాడు. హత్యకు సహకరించిన నిందితులను కూడా అరెస్టు చేసి రూ.90 వేల నగదు, 4 ఫోన్లు, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు.
👉 విజయవాడ ప్రకాశం బ్యారేజ్ బొట్ల పరిస్థితి! అధికారులు కు మళ్లీ నిరాశే.. ప్లాన్-C కూడా ఫెయిల్.. రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్*
వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట..!కోమాలో ఉన్న కానిస్టేబుల్ కోసం 10 లక్షల వైద్య సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్.. ఆస్తికోసం సినిమా ఫక్కీలో బావ మరిదిని హత్య! చేసిన బావ..ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన..ప్రకాశం బ్యారేజ్ బొట్ల పరిస్థితి! అధికారులకు మళ్లీ నిరాశే.. .
Recent Posts