ఎం ఎస్ ఎం ఈ, పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ..ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పార్థసారథి.. సీఎంకు దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఎమ్మెల్యే దామచర్ల, ఎమ్మెల్యే ముత్తుముల..విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్.. కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ దాడి.. ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల..జిల్లా ఎస్పీని కలిసిన కంభం సీఐ.

👉ఎం ఎస్ ఎం ఈ, పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..తెలంగాణలో పారిశ్రామి కాభివృద్ధి అంశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది సూక్ష్మ, చిన్న- మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ, పాలసీని బుధవారం ఉదయం మాదాపూర్ లోని శిల్పకళ వేదికగా ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు..
బుధవారం ఉదయం 11గంటలకు ఎంఎస్ఎంఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రారంభించగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేసేలా పరిశ్రమల అవసరాలు, అభిరుచులకు అనుగు ణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తా మని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.అమెరికాలో ఉన్న వ్యాపారావకాశాలన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయని చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబో తున్నామని ప్రకటించారు..
👉 ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పకళా వేదికలో MSME- 2024 నూతన పాలసీని సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి,మంత్రి శ్రీధర్‌ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీపడేలా పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారన్నారు. విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకే.. ఈ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్
👉ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పార్థసారథి..ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ
పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గాను వాలంటీర్ వ్యవస్తను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాల్సిన ఈ వ్యవస్థ గాడితప్పిందనే విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ వ్యవస్థను ఎమ్ చేయాలి.. వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే అంశాలపై నేడు కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు, లేదా..మార్పుపై వచ్చే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంపై మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లకు గుడ్ న్యూస్ అందించారు. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖలలో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. 2023లో వారి పదవీకాలం ముగిసినప్పటికీ రెన్యువల్ చేయలేదని అన్నారు.
👉భారత్‌లో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు
దుబాయ్‌ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్‌..
9 రోజుల క్రితం ఢిల్లీలో తొలి ఎంపాక్స్‌ కేసు
కేరళలో రెండో మంకీపాక్స్‌ కేసు నమోదు.
👉మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి మంత్రులు, మరియు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో పాల్గోన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి , నియోజకవర్గంలోని పలు అంశాలను బాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పంచాయతీ రాజ్ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని పలు సమస్యలను వారికీ విన్నపించి గ్రామాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా, సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి తన తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు.
👉ఏలూరు, సెప్టెంబర్, 18 : ఎర్రగుంటపల్లి ప్రభుత్వ బి.సి., బాలుర వసతి గృహంలో గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి. శశికుమార్ తన బంధువు భార్యతో కలిసి ఏలూరు అమీనాపేటలోని శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమ బాలికల వసతి గృహంలోని బాలికలను శారీరకంగా, మానసికంగా , లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణలపై బి.శశికుమార్, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ప్రభుత్వ బి.సి., బాలుర వసతి గృహం, ఎర్రగుంటపల్లి వారిని విధుల నుండి సస్పెండ్ చేస్త్తూ జిల్లా కలెక్టర్ ఉత్తరువులు జారీ చేసారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి తెలిపారు. బి.శశికుమార్, గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ప్రభుత్వ బి.సి., బాలుర వసతి గృహం, ఎర్రగుంటపల్లి వారు శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమ బాలికల వసతి గృహంలోని బాలికలను శశికుమార్ బంధువులు ఫణిశ్రీ, లావణ్య లతో కలిసి శారీరకంగా, మానసికంగా , లైంగికంగా వేధించారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపణలతో విద్యార్థినిలు ఏలూరులోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారని, సదరు ఫిర్యాదుననుసరించి జిల్లా బాలల సంరక్షణాధికారితో ప్రాథమిక దర్యాప్తు నిర్వహించడం జరిగిందని, ప్రాధమిక విచారణ నివేదిక ఆధారంగా, తదుపరి విచారణపై జోక్యాన్ని నివారించేందుకుగాను శశికుమార్ ను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ విధుల నుండి తొలిగించి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తరువాత నిందితులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేసారని నాగరాణి తెలిపారు.
*👉చిత్తూరు జిల్లా నిండ్ర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ 10-09-2024 వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన PC 4583 పి.వినోద్ కుమార్ సతీమణి ఎం.కళావతికి ఈరోజు IDRF ఫండ్ నుండి రూ.1,00,000 చెక్కును జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు, చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్.ఐ. హోం గార్డ్ సుధాకర్ సమక్షంలో అందజేశారు.*
*ఈ సందర్భంగా ఎస్పీ మృతుడి కుటుంబానికి భరోసా ఇస్తూ, పోలీస్ డిపార్టుమెంట్ తరఫున వారికి అన్ని విధాల సహాయం అందిస్తామని తెలిపారు. అదనంగా, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అందించే అన్ని న్యాయమైన సౌకర్యాలు, ఫలితాలు కూడా సమర్థవంతంగా పొందేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
👉విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ ను దేహశుద్ధి చేసిన బంధువులు..
మహబూబాబాద్ పట్టణంలో ని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్ లో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రుల దాడి..
స్థానిక స్కూల్ అవరణంలో వార్డెన్ కి దేహశుద్ది చేసిన బంధువులు..వార్డెన్ ను వెంటనే తొలగించాలని విద్యార్థిని బంధవులు,తల్లిదండ్రులు అందోళన..
వార్డెన్ పై చర్యలు తీసుకొవాలని తల్లిదండ్రుల, బంధువులు. అందోళన..ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్ లో వార్డెన్ నీ బంధించిన స్కూల్ యాజమాన్యం..కృష్ణాజిల్లా..పెనుమలూరునియోజకవర్గం..
గంగూరు..అనుమతుల మూడు… నడిపేది ఆరు..!
మోన్న లేడీస్ హాస్టల్ లో జరిగిన సంఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కంకిపాడు పోలీసులు..
గోసాలైట్స్ పై విస్తుపోయే నిజాలు వెలుగులోకి…
ఆంజనేయ టవర్స్ లో ఉన్న హాస్టల్ కి అనుమతులు లేవని చెప్తున్నా ఇంటర్మీడియట్ అధికారులు..
అసలు ఆ కాలేజీకి మూడు బ్రాంచ్ల వరకే అనుమతులు ఉన్నాయని చెప్తున్న అధికారులు..
కానీ అనధికారకంగా మరో నాలుగు క్యాంపస్ లు నడుపుతున్నట్టు సమాచారం. …?
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా హడావిడి చేసే అధికారులు.. అసలు వాస్తవాలు వెలుగులోకి తెచ్చేనా….?లక్షల రూపాయల ఫీజులు కట్టి విద్యార్థులను చదివించే తల్లిదండ్రులు కొంచెం ముందు చూపుతో వ్యవహరించి అన్ని గుర్తింపులో ఉన్న కాలేజీలో చదివిస్తే తమ పిల్లలకు భద్రత ఉంటుందని చెబుతున్న అధికారులు..
గోసాలైట్స్ క్యాంపస్ పై ఆర్ ఐ ఓ కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త..తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్న ఇంటర్మీడియట్ అధికారి..
👉కలెక్టరేట్ లో ఏసీబీ దాడి……!!!
రూ 1.14లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిల్లా హార్టికల్చర్ అధికారి కొత్తగూడెం కలెక్టరేట్లో ఏసీబీ దాడి. రూ లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి సూర్యనారాయణ.డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ దాడి.కొనసాగుతున్న దర్యాప్తు. సూర్యనారాయణ అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై.రమేష్..
👉 మార్కాపురం జిల్లా ఆసుపత్రి ని సందర్శించిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి.. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జిల్లా ఆసుపత్రి ని సందర్శించి హాస్పిటల్లో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.స్వయంగా తన కాలికి ఎక్సరే తీయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి విభాగంలో పేషెంట్లకు అందుతున్న సేవల గురించి పేషంట్లను అడిగి తెలుసుకున్నారు.పిమ్మట హాస్పిటల్ స్టాఫ్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ కమిటీ సభ్యులైన సూర పరమేశ్వర్ రెడ్డి, కాకర్ల శ్రీనివాసులు , చెక్కా మధుసూదన్ రావు,పిల్లేబోయిన పద్మావతి ని హాస్పటల్ స్టాప్ కు పరిచయం చేశారు.ఈ సందర్భంగా స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని త్వరలో హాస్పిటల్కు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని , వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతారని అప్పటికన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోవాలని హాస్పిటల్ స్టాఫ్ సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి హాస్పిటల్ స్టాఫ్,అధికారులు పాల్గొన్నారు.
👉సాధారణ బదిలీలలో భాగంగా కంభం సిఐగా కె.మల్లిఖార్జున బదిలీ అయ్యారు.ఈ సందర్బంగా సర్కిల్ లో రిపోర్ట్ చేసుకున్న తదుపరి బుధవారం జిల్లా పోలీస్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలు/పిల్లల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు, సైబర్ నేరాలపై అవగాహన, నిర్వహించాల్సిన విధులు మరియు బాధ్యతల పట్ల సిఐకు దిశా నిర్దేశం చేశారు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..