సీఎం రేవంత్ కు అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా రాహుల్..త్వరలో ప్రతినెలా మహిళల ఖాతాలో రూ.1,500..తిరుమల తిరుపతి ప్రతిష్టను గత ప్రభుతం దెబ్బతీసింది-ముఖ్యమంత్రి చంద్రబాబు..కేరళను వణికిస్తున్న మంకీపాక్స్‌.. నిఫా వైరస్‌‌లు..ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లు గుర్తింపు..నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి-ఎస్ఎఫ్ఐ.. అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జి.వి..టిడిపి నేత కారుకి నిప్పు..టీటీడీలో అవినీతిపై ఫిర్యాదు.. స్మశాన భూమిని కబ్జా చేసిన వైకాపా నాయకులు.

👉రేవంత్ రెడ్డికి సోనియా, రాహుల్ అప్పాయింట్మెంట్ సైతం ఇవ్వలేదా
కొంత కాలంగా రేవంత్ రెడ్డిని కలవడానికి మొహం చాటేస్తున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతిని కలిశారు.
రుణమాఫీ కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కోసం పిలవడానికి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి సోనియా,రాహుల్ అప్పాయింట్మెంట్ సైతం ఇవ్వలేదు….
👉గుడ్ న్యూస్.. త్వరలో ప్రతినెలా మహిళల ఖాతాలో రూ.1,500..
ఏపీలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ అందించనుంది. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. దీని ద్వారా 18-59 ఏళ్ల మహిళల ఖాతాలో ప్రతి నెలా రూ.1,500 చొప్పున జమ చేయనుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వడంపైనా విధివిధానాలు ఖరారు చేయాలన్నారు.
👉అన్న క్యాంటీన్ల స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలి..*ఇప్పటి వరకూ 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం… మొత్తం 203కు పెంచుతాం..
*పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నాం*
*బుడమేరు వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్నాం.
👉తిరుమల తిరుపతి ప్రతిష్టను గత ప్రభుతం దెబ్బతీసింది…టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం*
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
*అమరావతి:* పేదవాని ఆకలి తీర్చేందుకు ఎంతో పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్న క్యాంటీన్ల ద్వారా అన్న దానం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వీటిని సూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు కూడా అన్ని విధాలా ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.గురువారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సియం ప్రారంభించి ప్రజలకు స్వయంగా అన్నం వడ్డించారు. అనంతరం అక్కడ ఉన్న కొంత మంది మహిళలు, ఆటో డ్రైవర్ తదితరులతో సియం కొద్దిసేపు మాట్లాడారు.అన్న కాంటీన్ ద్వారా అందిస్తున్న అన్నం ఇతర వంటకాలు ఏవిధంగా ఉన్నాయని అడగ్గా భోజనం చాలా బాగుందని 5రూ.లకే మంచి ఆహారాన్ని అందించడం పట్ల వారు సింయకు ధన్యవాదాలు తెలియజేశారు.గత 5ఏళ్ళ కాలంలో అన్న క్యాంటీన్లు లేక భోజనం కోసం అనేక ఇబ్బందులు పడ్డామని వారు సియంకు వివరించారు.
అనంతరం సియం చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని గతంలో ఉన్న 203 క్యాంటీన్లను పూర్తిగా పునరుద్దరిస్తామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి ఉండేలా పట్టణాల్లో అయితే మరిన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తున్నట్టుతెలిపారు.పూటకు కేవలం 5రూ.లకే రుచికరమైన,పౌష్ఠికాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ప్రాంతంలో మూడు పూటలు కలిపి 15రూ.లకే అందిస్తున్నామని దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదని అన్నారు.పేదవాడి ఆకలి దప్పులు తీర్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని అన్నారు.
గత ప్రభుత్వం పవిత్రమైన తిరుమల తిరుపతిని అపవిత్రం చేసింది-ప్రక్షాళన ప్రారంభించాం.
తిరుమలలో గత ప్రభుత్వం భక్తులకు నాసిరకం భోజనం పెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయడమే గాక భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రసాదం తయారీలో నాసిరకమైన ముడి సరుకులను వాడారని ఇందుకు సంబంధించి ఆధారాలు దొరికిన తర్వాత బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తిరుపతి వేంకటేశ్వరస్వామి హిందువులకు కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి తిరుమలను గత ప్రభుత్వం పూర్తిగా అపవిత్రం చేసిందని తిరుమల ప్రక్షాళనను ప్రారంభించామని అన్నారు.
వరద బాధితులకు మానతాదృక్పదంతో మెరుగైన ఫ్యాకేజిని అందించి ఆదుకుంటున్నాం..విజయవాడ బుడమేరు వరద బాధితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మరీ ముఖ్యంగా తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని రీతిలో మానవతా దృక్పధంతో మెరుగైన ఫ్యాకేజిని అందించి అన్ని విధాలా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.జగన్ ప్రభుత్వం బుడమేరును పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే వరద పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని 10 రోజుల పాటు అధికార యంత్రాంగమంతా బాధితులకు అండగా ఉండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ఆదుకుందని చెప్పారు.ఇళ్ళచుట్టూ నీరు చేరిన గ్ర్రౌండ్ ప్లోర్ కుంటుంబాలకు 25 వేల రూ.లు, మొదటి ప్లోర్ వారికి 15వేలు,ఆపైగల వారికి 10వేల రూ.లు వంతున పరిహారం ఇవ్వడంతో పాటు వరద బాధితులందరికీ 25 కిలోల బియ్యంతో కూడిన 6 రకాల పలు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందించి ఆదుకున్నట్టు సియం తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి గతంలో ఎన్నడూ లేని విధంగా ధాతలు పెద్దఎత్తున సియం సహాయ నిధికి విరాళాలు అందించడం పట్ల రాష్ట్ర ప్రజలందరి తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సియం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఇప్పటి వరకూ సియం సహాయ నిధికి 350 కోట్ల రూ.ల వరకూ విరాళాలు అందాయని అన్నారు.
బుడమేరు ఆధునీకరణకు గతంలో రూ.150 కోట్లు మంజూరు చేస్తే గతం ప్రభుత్వం రద్దుచేసింది.
గతంలో తాను సియంగా ఉండగా బుడమేరు ఆధునీకరణకు 5 పనులకు గాను 150 కోట్ల రూ.లను మంజూరు చేస్తే గత జగన్ ప్రభుత్వం ఆపనులను రద్దు చేయడంతో పాటు పలు ఆక్రమణలకు పాల్పడంతో నేడు బుడమేరుకు వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సియం చంద్రబాబు పేర్కొన్నారు.బుడమేరు ద్వారా మరలా వరదలు రాకుండా బుడమేరు ఆధునీకరణకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని సియం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ, ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మి,సిడిఎంఏ హరినారాయణ,జెసి భార్గవ్ తేజ్,ఎంఎల్సి పి.అనురాధ, తాడికొండ ఎంఎల్ఏ టి.శ్రావణ్ కుమార్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
👉ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. టీడీపీలో పోటీ*
రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో TDP అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు స్థానానికి ఆలపాటి రాజేంద్ర, దేవినేని ఉమ, తాళ్ల వెంకటేశ్ పేర్లు పరిశీలన లో ఉన్నాయి. అయితే ఆలపాటికే సీటు ఖాయమైనట్లు సమాచారం. ఇక ఉభయగోదావరి జిల్లాల స్థానానికి కేఎస్ జవహర్, బొడ్డు వెంకటరమణ,పేరాబత్తుల రాజశేఖర్, మంతెన రామరాజు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
👉కేరళను వణికిస్తున్న మంకీపాక్స్‌.. నిఫా వైరస్‌‌లు.. ఒకే వ్యక్తిలో రెండు వైరస్‌లు గుర్తింపు.. సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్‌*
కేరళను వైరస్‌లు వణికిస్తున్నాయి. ఇప్పటికే మంకీ పాక్స్‌ కేరళను షేక్‌ చేస్తుండగా నిఫా వైరస్‌ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు.. ఒకే వ్యక్తిలో అటు నిఫా.. ఇటు మంకీపాక్స్‌ లక్షణాలు బయట పడుతుండడం కేరళను మరింత కుదిపేస్తోంది. మంకీ పాక్స్‌.. నిఫా వైరస్‌ వ్యాప్తితో కేరళతోపాటు సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్‌ అయ్యాయి. తమిళనాడు- కేరళ బోర్డర్‌లో హైఅలెర్ట్‌ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ వైరస్‌ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్‌ లక్షణాల
తో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో.. దేశంలో రెండో మంకీపాక్స్‌ కేసు రికార్డ్‌ అయింది. అలెర్ట్‌ అయిన కేరళ అధికారులు.. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు. 16మందిని గుర్తించి ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. ఈనెల 9న తొలి మంకీపాక్స్‌ కేసు నమోదు అయింది.
👉తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడికి ప్రమోషన్!*
*డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం*
*రేపు లేదా వారం రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్న మంత్రి అన్బరసన్*
*ఈ నెల 28న కాంచిపురంలో నిర్వహించే డీఎంకే డైమండ్ జూబ్లీ మీటింగ్ లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి పేరును ప్రకటించే అవకాశం*
*ప్రస్తుతం క్రీడా మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్*
👉గుంటూరు జిల్లా ఈస్ట్ డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ అబ్దుల్ అజీజ్..
ఇటీవలే జరిగిన సాధారణ బదిలీల్లో గుంతకల్ రైల్వే డిఎస్పీ గా విధులు నిర్వహించిన అబ్దుల్ అజీజ్..
బదిలీపై గుంటూరు జిల్లా ఈస్ట్ డిఎస్పీగా వచ్చిన అబ్దుల్ అజీజ్..
నూతన ఈస్ట్ డిఎస్పీను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన.. పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది.
👉టీటీడీలో అవినీతిపై సీఎంకు ఫిర్యాదు..*
తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగి.. శ్రీవారి ఖజానాకు సుమారు రూ. 5 వందల కోట్లకుపైగా గండి పడిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిర్దారించారు. గత రెండున్నర నెలలుగా టీటీడీలోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలోని 18 విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
గత ఐదేళ్లలో టీటీడీలో భారీగా అవకతవకలు జరిగినట్లు పలువురు భక్తులతోపాటు బీజేపీ, జనసేన నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం స్టేట్ విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి అధికారులు టీటీడీలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధులను కేటాయించడంతో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ముడిసరుకులు కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి సారించి ఆ విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహంచి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
👉50 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా చేస్తున్న “నందిని” సంస్థను పక్కన పెట్టి.. ఢిల్లీకి చెందిన “ఆల్ఫా ట్రేడర్స్” మరి కొంత మంది హోల్ సేల్ ట్రేడర్స్ నుంచి “బటర్ ఆయిల్ నెయ్యి” ని జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ బటర్ ఆయిల్ నెయ్యి తయారీలో ఆవుపాల వెన్నకు బదులు కొన్ని రకాలైన “పశువుల కొవ్వును” వాడతారు. అయినా పట్టించుకోని జగన్ సర్కార్ ట్రేడర్ల నుంచి వచ్చే కమిషన్ కోసం శ్రీవారి సన్నిధిలో మహా అపచారానికి పాల్పడింది.దీనిపై పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
👉పోలీసులకు పట్టుబడ్డ జానీ మాస్టర్.. ఎలా, ఎక్కడ దొరికాడంటే..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుుకుంది. జానీ మాస్టర్‌ని పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టులో ఆయనని పోలీసులు హాజరుపరచనున్నారు. అనంతరం పీటీ వారెంట్ కింద హైదరాబాద్‌కు తరలించనున్నారు.
కాగా జానీ మాస్టర్ బెంగళూరు నుంచి గోవా వెళ్లినట్టు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేశారు. అక్కడ ఓ లాడ్జ్‌లో ఉన్నట్టు నిర్ధారించుకొని ఎస్‌వోటీ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. బాధిత యువతి కేసు పెట్టిన నాటి నుంచి 5 రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. పరారవడంతో చాకచక్యంగా వివరాలు సేకరించి అతడి ఆచూకీని కనిపెట్టారు. అతడి ఆచూకీ కోసం మొత్తం 4 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నెల్లూరుతోపాటు ముంబై, ఢిల్లీలో ఆయన కోసం గాలించాయి. ఎట్టకేలకు ఆయన ముంబైలో ఉన్నట్టు గుర్తించారు.
మరోవైపు.. లైంగిక దాడి కేసు పెట్టిన యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్‌ లైంగిక దాడికి ప్రయత్నించినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో కేసును పోక్సో కేసుగా మార్చే అవకాశం ఉందంటూ కథనాలు వినపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
👉మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..
జానీ మాస్టర్‌పై లైంగిక దాడి వ్యవహారం మహిళా కమిషన్ దృష్టికి కూడా చేరింది. ఈ మేరకు జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదైంది. బాధిత యువతిని పలు మహిళా సంఘాల నాయకులు బుధవారం కలిశారు. అనంతరం లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను మహిళా కమిషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.
👉స్మశాన వాటిక భూమిని కబ్జా చేసిన వైసిపి నాయకులు*
*👉చంద్రగిరి మండలం మల్లయ్య పల్లి స్మశాన వాటికను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వైసిపి నాయకులు*
*👉గత ప్రభుత్వం అధికారం అండతో స్మశాన వాటికనే ఆక్రమించారని స్థానికుల ఆవేదన.*👉ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై వ్యక్తిగత దూషణలు,దాడులు*
*👉గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని వైనం*👉కబ్జా కు గురైన భూమిని తిరిగి స్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్తుల ఆవేదన*
👉విద్యార్ధి ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.*
*ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి*
కడప నగరంలోని హరి టవర్స్ దగ్గర ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్న చైతన్య అనే విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నానికి చేయగా విద్యార్థిని కడప రిమ్స్ కి తరలించారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి వారి బృందం విద్యార్థిని రిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించడం జరిగింది. అలాగే సమాచారం అడగగా నారాయణ విద్యాసంస్థలు విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అలాగే వైస్ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అందరూ కూడా తిడుతూ కొట్టారని ఆ అవమానాన్ని భరించలేక వాజ్మాయిల్ తాగడం జరిగిందని తెలపడం జరిగింది. విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు ఫీజులు దోపిడీతో విద్యార్థుల జీవితాలతో, ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. సంఘటన జరిగి కొన్ని గంటలవుతున్న కనీసం విద్యార్థి ఆరోగ్యం గురించి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చొరవ చూపలేదు. గతంలో కూడా అదే విద్యా సంస్థల్లో అనేకమంది విద్యార్థులకు యాజమాన్యం కొట్ట గా చేతులు విరగడం వంటివి అనేక ప్రమాదాలు జరిగాయి దీనిపైన విద్యాశాఖ అధికారులు పట్టించుకోనందువలన అధికారుల పరివేక్షణ లోపంలోనే విద్యార్థులకు అనేక సంఘటనలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కూడా విద్యార్థి కి మెరుగైన వైద్యం అందించాలని అదే విదంగా ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన ఆందోళన చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమం లో వినయ్, పండు తదితరులు పాల్గొన్నారు..
👉 మిలాద్ ర్యాలీలో అపశృతి..
చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా నిర్వ‌హించిన ర్యాలీలో అప‌శృతి చోటుచేసుకుంది. అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో టపాసుల నిప్పు రవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ పై పడ్డడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలం వద్దనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి స్వ‌ల్ప గాయాలైన‌ట్లు స‌మాచారం.
👉రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు: ఎస్పీ*
ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.
👉అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జివీ..
*వినుకొండ పట్టణంలోని తల్లి పిల్ల వైద్యశాల వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు.* ఇస్కాన్ అక్షయపాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. *పేదలకు కడుపు నింపే ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి మ్యారేజ్ డే సందర్భంగా రూ.1,10,116 విరాళం ఆయన ప్రకటించారు.* ఎన్టీఆర్ పై అభిమానంతో పట్టణానికి చెందిన సురేంద్ర 11000, మరో వ్యక్తి 5000 విరాళాన్ని ప్రకటించి చెక్కులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి చేతుల మీదగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు,అధికారులు,ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
👉పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం ముగాచింతలపాలెం లో వైసీపీ అరాచకం.. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారు కి నిప్పు పెట్టిన పత్యర్థులు.. అర్ధరాత్రి ఇంటి ముందలు ఉన్న కారును తగలబెట్టిన ప్రత్యర్ధులు..అప్రమత్తమై మంటలు ఆర్పిన గ్రామస్తులు…

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..