ప్రకాశం జిల్లాలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం..రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫోర్స్ చేసింది..బిజేపి పై జగన్ సంచలన‌ వ్యాఖ్యలు..వైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు: షర్మిల..లడ్డూ వివాదంపై స్పందించిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల..నెయ్యి కల్తీ పై రమణదీక్షితులు ఫైర్..

👉రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫోర్స్ చేసింది.. అంబేద్కర్ మునిమనువడు రాజారత్నం.. అయితే.. ఓ సందర్భంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు. బీజేపీపై అంబేద్కర్ మునిమనువడు రాజారత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో పర్యటించారు.చాలా డిబేట్లలో పాల్గొన్నారు.అక్కడి ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు.అయితే.. ఓ సందర్భంలో ఆయన రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు.అభివృద్ధిలోనూ వారి భాగస్వామ్యం తక్కువే అని అన్నారు. అన్నివర్గాల వారికి అవకాశాలు రావాలని, అలాంటి పరిస్థితుల కోసం తాము అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది. ప్రజలకు రిజర్వేషన్లు దూరం చేయాలన్నదే ఆయన సంకల్పం అన్నట్లు మాట్లాడారని ఫైర్ అయింది. చాలా వరకు దేశవ్యాప్తంగా రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి.
బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఇదే క్రమంలో అంబేద్కర్ మునిమనవడు రాజారత్నం విడుదల చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయంశమైంది. రాహుల్ రాజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలపాలని బీజేపీ తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని సూచించారని ఆయన చెప్పారు. కానీ.. తాను ఎలాంటి నిరసనలు తెలపలేనని నిరాకరించినట్లు రాజారత్నం వెల్లడించారు. సమాజం కోసమే తాను సేవ చేస్తున్నానని.. వారు మాత్రమే నాకు ఆదేశాలు ఇస్తారని, వారి ఆదేశాలనే పాటిస్తానని చెప్పినట్లు వివరించారు. తనను ఆదేశించే హక్కు బీజేపీకి లేదని చెప్పినట్లు తెలిపారు. తాను ఎవరికీ మద్దతుదారిడిని కాదు అని.. తనకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే.. రాజారత్నం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
👉భారతీయ జనతా పార్టీ పై జగన్ సంచలన‌ వ్యాఖ్యలు…చంద్ర‌బాబు పై క‌క్ష లేదు: జ‌గ‌న్‌.

రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న క‌క్ష పూరితంగా సాగుతోంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.అన్నీ అబ‌ద్ధాలు చెబుతూ.. ప్ర‌జ‌ల‌ను వంచిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.
ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని.. శిశుపాలుడి పాపాలు పండిన‌ట్టుగా చంద్ర‌బాబు పాపాలు కూడా పండుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ఒక్క విష‌యాన్నీ ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకుంటున్నార‌ని అన్నారు.
*బీజేపి వాళ్ళకు సగం తెలుసు, సగం తెలీదు…*
*కేంద్ర సీనియర్ మంత్రుల ప్రతినిధులు తితిదే బోర్డులో ఉన్నప్పుడు* అక్కడి ప్రొసీజర్, ప్రాసెస్ తెలీదా…?? కనుక్కోమనండి వాళ్ళకు తెలీయకపోతే….*నిజంగానే భాజపా వాళ్ళు హిందువుల ప్రతినిధులైతే…* నిజంగానే వాళ్ళు మనుషులైతే‌..చంద్రబాబు ను కడిగి పారేయాలి
👉వైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు: షర్మిల..తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ..అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. “గవర్నర్ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైకాపా విశ్వసనీయతను కోల్పోయింది. వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే..జగన్ చెడ్డపేరు తెచ్చుకున్నారు.హామీలు అమలు చేయకుండా గతంలో మోసంచేశారు. రుషికొండపై ఆయన కబ్జాలు చేశారు.వైఎస్ఆర్కు జగన్కు పొంతనే లేదు. వైకాపా అంతం అయినట్లే..ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ
మిగలరు. సజ్జల, విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు
అమలు చేయాలి” అని షర్మిల తెలిపారు.
👉విడదల రజినిపై విచారణకు ఆదేశం* .
అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ తమను బెదిరించి, భయపెట్టి రూ. కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు. ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఫిర్యాదు దారు చలపతిరావు మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి 2010 నుంచి ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు. 2020 సెప్టెంబర్ 9న అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ పిఏ దొడ్డా రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి ఎమ్మెల్యే కలవమని చెప్పారు. దీంతో వారు రజనీని ఆమె కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కలవలేదని అంటూనే.. వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలని ఆమె చెప్పారు. తన పిఏను కలిసి అతను చెప్పిన విధంగా చేయాలని చెప్పి పంపేశారు. దీంతో వారు పీఏను కలిసారు. ఆయన రూ. 5 కోట్లు చెల్లించమని చెప్పారు. అంత చెల్లించలేమని చెప్పిన క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారు. వ్యాపారం ఎలా చేస్తారో.. మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు.
👉 వైసీపీకి సామినేని ఉదయభాను రాజీనామా..
వైసీపీలో నాకు అన్యాయం జరిగింది..వైసీపీలో నాకు సరైన గుర్తింపు లేదు-సామినేని..
ఆత్మాభిమానాన్ని కాపాడు కోవడానికే రాజీనామా- సామినేని..ఎల్లుండి జనసేనలో చేరనున్న సామినేని ఉదయభాను..
👉 లడ్డూ వివాదంపై స్పందించిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల..
తిరుమల లడ్డూ భక్తుల మనోభావాలకు చెందినది..
విషయాన్ని చంద్రబాబు తేలిగ్గా ఎలా తీసుకున్నారు..
వివాదాన్ని కేవలం రాజకీయం చేయాలనుకున్నారా..
విషయం ముందే తెలిస్తే ఎందుకు విచారించలేదు..
100 రోజుల తర్వాత విషయం చెప్పడానికి కారణమేంటి..
100 రోజుల పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి..
ఈ విషయాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారా-షర్మిల..
సీబీఐ విచారణ కోరుతూ అమిత్‌ షాకు లేఖ రాస్తా..
తప్పు నిజంగా జరిగిందా, లేదా అనేది తేలాలి..
తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలి-షర్మిల
👉 NTR జిల్లా జగ్గయ్యపేట
*పెనుగంచిప్రోలు పట్టణంలో తప్పిన పేను ప్రమాదం
*హోటల్ లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
*ఉదయం హోటల్ లో టిఫిన్ చేస్తున్నవారి పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ *ప్రమాదం తప్పించుకున్న హోటల్ నిర్వాహకులు
*అతి వేగం ఏ ప్రమాదానికి కారణం అని తెలుపుతున్న స్థానికులు *పెనుగంచిప్రోలు పట్టణంలోని డౌన్ సెంటర్ లో చోటు చేసుకున్న ప్రమాదం*ట్రాక్టర్ ప్రమాదంలో వంటగ్యాస్ సిలిండర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
*ట్రాక్టర్ ప్రమాదం లో పూర్తిగా దెబ్బతిన్న హోటల్..
👉మానవత్వం చాటిన జిల్లా ఎస్పీ దామోదర్..
నాగులుప్పలపాడు CM చంద్రబాబు సభకు బందోబస్తు నిమిత్తం జిల్లా ఎస్పీ దామోదర్ వెళ్తున్నారు. ఇంతలో ఒంగోలు ఉడ్ కంప్లెక్ వద్ద నెల్లూరు జిల్లా జలదంకు చెందిన బ్రహ్మయ్య మూర్ఛ వచ్చి పడిపోయాడు. సంఘటనను గమనించిన ఎస్పీ వాహనం ఆపి తన చేతిలో తాళాలు పెట్టి సృహ వచ్చిన తర్వాత మంచి నీళ్లు తాగించి తన విధులకు వెళ్ళారు. ఎస్పీ మంచి మనస్సు చాటుకున్నారని పలువురు అభినందించారు.
👉తిరుమల*
*రమణదీక్షితులు, శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు.. *నెయ్యి కల్తీ పై రమణదీక్షితులు ఫైర్..
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా గత పాలకులపై దీక్షితులు ఆరోపణలు..
ఈ రెండు మూడు రోజుల్లో వస్తున్న వార్తలు చాలా బాధగా ఉంది..శ్రీవారి భక్తులకు మనోవేదన కలిగించింది..
నైవేద్యాలు, లడ్డూల్లో పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించింది..ప్రసాదాల నాణ్యత లోపించిందని గతంలో
చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాను..
నేను ఒకరిగానే ఒంటరి పోరాటం చేశాను..
తోటి అర్చకులు కూడా నాకు సహకారం అందించలేదు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టారు..నందిని డైరీ నుండి నాణ్యమైన నెయ్యిని సరఫరా ప్రస్తుతం జరుగుతుంది..నెయ్యి కల్తీ మీద సమగ్రమైన విచారణ చేపట్టాలి..కల్తీ తో పాటు ,స్వామివారి కైంకర్యాలు గూర్చి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తే గతంలో నాపై కేసులు పెట్టారు
👉వైకాపాలో సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఉండరు: షర్మిల..తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ..అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. “గవర్నర్ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైకాపా విశ్వసనీయతను కోల్పోయింది. వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే..జగన్ చెడ్డపేరు తెచ్చుకున్నారు.హామీలు అమలు చేయకుండా గతంలో మోసంచేశారు. రుషికొండపై ఆయన కబ్జాలు చేశారు.వైఎస్ఆర్కు జగన్కు పొంతనే లేదు. వైకాపా అంతం అయినట్లే..ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ
మిగలరు. సజ్జల, విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు
అమలు చేయాలి” అని షర్మిల తెలిపారు.
👉సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో *“మన మంచి ప్రభుత్వం “* కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా. డోల బాల శ్రీ వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్,కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, దర్శి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మి ,ఎర్రగొండపాలెం ఇంచార్జి గూడూరి ఏరిక్షన్ బాబు,టి. డి. పి నాయకులు దామచర్ల సత్య, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు, బాపట్ల పార్లమెంటు సభ్యులు టి. కృష్ణ ప్రసాద్, బి. జే.పి నాయకులు దారా సాంబయ్య గరటయ్య ,పారిశ్రామిక వేత్త కంది రవిశంకర్ అయినాబత్తిన ఘనశ్యామ్ కుప్పా రంగసాయి బెల్లం సత్యనారాయణ, ఆత్మకూరి బ్రహ్మయ్య మరియు పలువురు టి. డి. పి నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు .


👉 ఒంగోలు లోని అంజయ్య రోడ్ లో బిస్మిల్లా హైదరాబాద్ బిర్యానీ సెంటర్ ను ప్రారంభించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినాబత్తిన ఘనశ్యామ్ బెల్లం సత్యనారాయణ కుప్పా రంగసాయి ఆత్మకూరి బ్రహ్మయ్య తదితర నాయకులు కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉 వైసీపీలో చివరికి మిగిలేది ఎందరు? జగన్ పార్టీ భవితవ్యం ఏంటి?
ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని… ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు.
ఉండేవారు ఎందరు.. వెళ్లేవారు ఎందరు..
చివరికి మిగిలేది ఎందరు.. నేతల వలసలతో వైసీపీ క్యాడర్‌ టెన్షన్ పడుతుంటే… అధిష్టానం మాత్రం చాలా కూల్‌గా కనిపించడానికి కారణమేంటి..? వరుసగా నేతలు పార్టీని వీడుతున్నా… ఏం నష్టం లేదన్న భావనతో ఉందా? వెళ్లే వారు తిరిగి వస్తారనే నమ్మకమేమైనా ఉందా? పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోడానికి కారణమేంటి? ఇవే పరిస్థితులు కొనసాగితే వైసీపీ భవితవ్యం ఏంటి? వలసలను ఆపేవారేలేరా?
పదవులను వదులుకుని కొత్త పార్టీల్లోకి వెళుతున్న వైసీపీ నేతలు..ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు… జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు.. ఇలా ఒకరేంటి వరుసగా వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీలో పునరుత్తేజం నింపాల్సిన నేతలు… పూర్తిగా డీలా పడిపోతున్నారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే వైసీపీ నాయకత్వంపై నమ్మకం లేక తట్టాబుట్టా సర్దేస్తున్నారా? అనే సందేహమే ఎక్కువగా వ్యాపిస్తోంది. పదవులు లేని వారు…. మాజీలైన నేతలు అధికార దాహంతో పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారని సరిపెట్టుకుందామన్నా…. రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులు కూడా తమ పదవులను వదులుకుని కొత్త పార్టీల్లోకి వెళ్లేందుకు పోటీ పడటమే విచిత్రంగా అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.
పదవులు పోయినా ఓకే.. వైసీపీలో కొనసాగలేమంటున్న నేతలు? ఇలా పార్టీని వీడుతున్న వారిలో చాలామంది ఇంతవరకు కొత్తగా ఏ పార్టీలో చేరనేలేదు. ఒకరిద్దరికి టీడీపీ, జనసేనలో తీసుకునేందుకు ఆయా పార్టీలు కూడా ఓకే చేశాయంటున్నారు. కానీ, ఏ పార్టీతోనూ మాట్లాడకుండానే పెద్ద ఎత్తున నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు వైసీపీని వీడిన వారిలో రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి తమ పదవులకు సైతం రాజీనామా చేశారు.ఐతే వీరిలో మోపిదేవికి టీడీపీ నుంచి ఆహ్వానం ఉండగా, మిగిలిన వారు జంక్షన్‌లో జామ్‌ అయినట్లు కనిపిస్తున్నారు. పదవులు పోయినా పర్వాలేదు కానీ, వైసీపీలో కొనసాగలేకే వీరంతా పార్టీకి రాం రాం చెప్పేశారంటున్నారు. ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, మద్దాల గిరి, పెండెం దొరబాబు ఇప్పటికే రాజీనామా ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు కూడా వినిపిస్తోంది.
వైసీపీతో జర్నీకి ఇష్టపడని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు..
బాలినేని, సామినేని ఇప్పటికే జనసేనతో టచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, మిగిలిన నేతల రాజకీయ భవిష్యత్‌పై ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ, వారు మాత్రం వైసీపీతో జర్నీకి ఇష్టపడటం లేదు. దీంతో కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా పర్వాలేదు… వైసీపీలో మాత్రం కొనసాగలేమంటూ రాజీనామాలు చేసేశారు. ఐతే ఐదేళ్లు పార్టీలో అన్ని హోదాలు అనుభవించిన ఈ నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారంటే… పార్టీ హైకమాండ్ తమను పట్టించుకోలేదనే ఏకైక కారణం చెబుతున్నారు. మంత్రులుగా పనిచేసిన బాలినేని, ఆళ్ల నాని, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన సామినేని ఉదయభాను సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం..
ఐనా, వీరు పార్టీ మారతామంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు డజను మంది నేతలు పార్టీని వీడగా, ఒక్క బాలినేనితో మాత్రమే అధిష్టానం సంప్రదింపులు జరిపింది. అది కూడా బాలినేని కన్నా జూనియర్ అయిన మాజీ మంత్రి విడదల రజినితో రాయబారం నెరపడం కూడా బెడిసి కొట్టిందంటున్నారు. వెళ్లే వారు వెళ్లనీ అన్నట్లు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తుండటంతో ఈ వలసలు మరింతగా పెరుగుతున్నాయంటున్నారు.
రాజకీయ భవిష్యత్‌పై భయంతో పక్కచూపులు చూస్తున్న కాపు నేతలు..
ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని… ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేననే భయంతో కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువగా పక్క చూపులు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు పార్టీని వీడుతుంటే తామేం తక్కువా? అన్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు.
అంతుచిక్కని జగన్ వైఖరి..
ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. పుంగనూరుతోపాటు చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ జెండాను దించేశారు. గుంటూరు, ఏలూరు జిల్లా పరిషత్ లను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇంకొన్ని జెడ్పీల్లో కూడా టీడీపీ జెండా ఎగిరేలా ప్లాన్ జరుగుతోందని చెబుతున్నారు. ఇలా పార్టీకి ప్రతి దశలోనూ డ్యామేజ్ జరుగుతున్నా, వైసీపీ అధిష్టానంలో చలనం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు వెళ్లినా తానొక్కడిని చాలన్నట్లు అధినేత జగన్ వ్యవహరిస్తుండటమే అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. మొత్తానికి వైసీపీ అంతర్గత సంక్షోభం…. వలసలకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో చివరికి మిగిలేది ఎందరు అన్న సందేహం వ్యక్తమవుతోంది.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..