👉ఎదురుదాడి చేస్తే భయపడను.. తాటతీస్తా” సీఎం చంద్రబాబు వార్నింగ్..సెలవులు వచ్చినా ఉద్యోగులకు జీతాలు..
”నేను మొదటిసారి సీఎం అయిన తర్వాత 75 రూపాయలకు పెన్షన్ పెంచా. ఇప్పుడిచ్చే పెన్షన్‌ను రూ.4 వేలకు నేనే పెంచా. ఉద్యోగులకు సెలవులు వచ్చినా జీతాలు ఇచ్చాం. ప్రతీ నెలకు ఒకసారి అధికారులు మీ ఇళ్లకు వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళిక చేశాను. నేను వెళ్లి పరిశీలించి ఇళ్ల వద్ద వారి సమస్యలు తెలుసుకున్నా. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డ పఠాన్ కాజావళి కుటుంబానికి ఆదుకుంటాం. గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామని మమ్మల్ని గెలిపించారు. అక్టోబర్ నెలంతా గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు. పేదల పట్ల ఉదారంగా ఉంటా.. అధికారులు తప్పులు చేస్తే వదిలిపెట్టను. జగన్ శిష్యులు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేనితనం ఉంది. ఎదురుదాడి చేస్తే భయపడ తారనుకుంటున్నారు. ఎదురుదాడి చేస్తే భయపడను.. తాటతీస్తా” అని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
👉తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు..
నిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా ఆదేశాలు – పుత్తూరు పెట్రోల్ బంకు ఎన్ఓసీకి రూ.లక్ష డిమాండ్ చేసిన ఆర్డీవో నిశాంత్ రెడ్డి – విచారణలో లంచం డిమాండ్ చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
👉తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు..తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ . ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని.. స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ విషయం తేలిందన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఏఆర్ డెయిరీలో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడులోని ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.మరోవైపు ఏఆర్ డెయిరీ విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది.
పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
టీటీడీ ఆరోపణలపై ఏఆర్ డెయిరీ క్లారిటీ
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలపై ఏఆర్ డెయిరీ స్పందించింది. నాణ్యత నిర్ధారణ పరీక్షల తర్వాతే టీటీడీకి నెయ్యిని సరఫరా చేశామని తెలిపింది. తాము సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ, నాణ్యతా లోపం లేదని స్పష్టం చేసింది. జూన్, జులై నెలల్లోనే నెయ్యి సరఫరా చేశామన్న ఏఆర్ డెయిరీ.. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేయడం లేదని తెలిపింది. పాతికేళ్లుగా తాము డెయిరీ సేవలు అందిస్తున్నామన్న యాజమాన్యం.. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని స్పష్టం చేసింది. టెస్టులు చేయించిన తరువాతే నాణ్యమైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు తెలిపింది.
👉మద్దిశెట్టి రాజీనామా…???
ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మొన్న శిద్దా సీఎంను కలవడం, నిన్న బాలినేని పవన్ కళ్యాణ్ ను కలవడం జిల్లాలో సంచలనంగా మారింది. ఇదే తరుణంలో దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ ను కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్నాళ్లు వైసిపికి రాజీనామా చేయకుండా వైసీపీ లోనే కొనసాగుతూ, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమికి మద్దిశెట్టి జై కొట్టారు. ఎన్నికల తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయిన మద్దిశెట్టి మరో నాలుగైదు రోజుల్లోనే వైసిపికి తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది
👉కాకినాడ, కోనసీమ జిల్లాల ఇంటలిజెన్స్ DSP గా సుంకర మురళి మోహన్ భాద్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు… ఉమ్మడిజిల్లాలు లో పని చేసిన అనుభవం ఉంది.
👉నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం! ..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్న ట్లుగా సమాచారం.
కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్ప వచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు. కేజ్రీవాల్. లిక్కర్ స్కాము కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే…
ఆప్ నేత అతిషీని సీఎం పీఠంపై కూర్చోబెడుతుం డటం గొప్పవిషయంగా చెప్పవచ్చు. మన దేవంలో చాలా పార్టీలు, కుటుంబ పార్టీలే ఉన్నాయి. తమ తర్వాత తమ కుటుంబీ కులే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో చాలా మంది నేతల ఉన్నారు. కానీ కేజ్రీవాల్ దీనికి భిన్నమని నిరూపించారు. తాను వైదొలిగిన తర్వాత తన భార్య కాకుండా..పార్టీ లో మంచి పేరున్న నేతను సీఎంగా ప్రకటించడం దీనికి నిదర్శనం. నేడు మధ్యా హ్నం 4.30గంటలకు రాజ్ నివాస్ లో అతిషీ…ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు…ఆమెతోపాటు మరో ఐదుగురు ఆప్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో..అతిషీని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది నియమించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈమధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అతిషీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
అయితే ఈ కార్యక్రమం సాదాసీదాగా సాగిపో నుంది. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి అవ్వడం కంటే ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు బాగలేకపోవ డం ప్రధాన అంశంగా చెప్పవచ్చు. కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఆప్ నేతలకు నచ్చలేదు. మన సమయం బాలేదు ఆర్భాటాలు చేయకూడదు అనుకుంటూ సర్ధుకుపోతున్నారు…
👉 ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యన్.వెంకటేశ్వర్లును శనివారం NSP గెస్ట్ హౌస్ నందు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా ,జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్,మర్యాద పూర్వకంగా కలిశారు.
👉 పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం.ఆనారోగ్యంతో బాధపడే వారికీ ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయనిధి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చిన్న కంభం గ్రామానికి చెందిన కిల్లా సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు LOC చెక్కును అందచేశారు.
కంభం మండలం,చిన్న కంభం గ్రామానికి చెందిన సూర్యనారాయణ గత కొన్ని రోజులుగా లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్, పంజాగుట్టాలోని నిమ్స్ లో అడ్మిట్ చేయించారు. మెరుగైన చికిత్స చేయించుకొనే స్థోమత లేని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం LOC (LETTER OF CREDIT) ద్వారా రూ. 2,00000-00 లు అక్షరాల రెండు లక్షల రూపాయలు మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తం అని, గత తెలుగుదేశం హయాంలో గిద్దలూరు నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల రూపాయలు వివిధ ఆనారోగ్య కారణాలతో బాధపడే వారికీ ఆర్ధిక సహాయం అందించటం జరిగిందని గుర్తు చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధికఇబ్బందులుఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.*
👉 ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు…. దీనికి సంభందించిన వివరాలను పట్టణ పోలీసు స్టేషన్ లో డిఎస్పీ యు. నాగరాజు వెల్లడించారు…. ఈ సందర్భంగా శిక్షణ ఎస్సై తో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు డిఎస్పీ రివార్డులు అందజేశారు.
ఎదురుదాడి చేస్తే భయపడను.. తాటతీస్తా” సీఎం చంద్రబాబు వార్నింగ్….తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు..నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం..తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు….మద్దిశెట్టి రాజీనామా?..బైక్ దొంగల అరెస్ట్.. సిఎం సహయనిధి చెక్కు అందజేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల
Recent Posts