తిరుపతి లడ్డు అంశంపై గవర్నర్ కు వినతి పత్రం.. దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన నిర్మాణాలు కూల్చివేత..యువ ఐపీఎస్ లీలలెన్నో.. విల్లా రాణి.. పేకాట రాజు!..దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి..ప్రసాదాన్ని కల్తీ చేసి మనోభావాలు దెబ్బతీశారు:ఎమ్మెల్యే ముతుమల

👉తిరుపతి లడ్డూ అంశంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల..
కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేపించే విధంగా చర్యలు తీసుకోవాలని గోవర్నర్ ను కోరిన షర్మిల రెడ్డి.
👉 డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ..డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్‌ కూడా జనసేన గూటికి చేరనున్నారు.
👉బీహార్‌లో: ఏపీకి చెందిన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..*
బీహార్‌ – పాట్నాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్న అనంతపురం జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి అనే అమ్మాయి ఉరి వేసుకొని ఆత్మహత్య..
పల్లవిరెడ్డి మృతితో క్యాంపస్‌లో అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎన్‌ఐటీ సిబ్బంది తీరుపై మండిపడుతూ విద్యార్థులు ఆందోళన.
👉 ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులు..
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
👉దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి..మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135,
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్..
రిలీజ్ రోజున అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్..28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి.
👉సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌.. దేవర మూవీ విడుదల కోసం కొత్త జీవోను ఆమోదించినందుకు మరియు తెలుగు సినిమాకి నిరంతరం మద్దతు తెలుపుతున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి కూడా నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేసిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌.
👉 వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన నిర్మాణాలు కూల్చివేత..
GVMC అధికారులు మరోసారి భీమిలిలో కూల్చివేతలు చేపట్టారు.CRZ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు.
సముద్ర తీరంలో హోటల్ నిర్మాణం కోసం ప్రహరీ గోడ నిర్మించిన ఎంపీ విజయ సాయిరెడ్డి కుమార్తె.
హైకోర్టులో కేసు వేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.
👉యువ ఐపీఎస్ లీలలెన్నో.. విల్లా రాణి.. పేకాట రాజు! రాష్ట్ర భద్రతను కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ కూడా ఓ పిల్లర్. రాష్ట్ర భద్రతను కాపాడే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థ కూడా ఓ పిల్లర్. అంతటి ప్రాధాన్యం గల శాఖలో పనిచేస్తున్న పలువురు పోలీసులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అది జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్ నగరం వరకూ పనిచేస్తున్న పోలీసులపై ఆ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ యువ ఐపీఎస్‌లే ఈ దారుణానికి ఒడిగట్టడం మరింత చర్చకు దారితీసింది. ఇంకొదరైతే ప్రొబేషనరీ సమయంలోనే వసూళ్లకు తెరతీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు డ్యూటీలోకి వచ్చీరాగానే ఈ దారుణానికి ఒడిగడుతున్నారు.ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారణ కూడా చేశారు. మరో ఇద్దరు కీలక ఆఫీసర్లు అమెరికాలో ఉండిపోయారు. అయితే.. ఈ కేసు ఇలా కొనసాగుతుండగానే.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల చరిత్రం పోలీసు అయితే ఏం చేసినా చెల్లుతుందని కొందరి అభిప్రాయం. అందుకు పొలిటికల్ పరంగానూ సహకారం లభిస్తే అది మరింత ప్లస్ అవుతుంది. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ కొంత మంది పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే అపవాదు ఉంది…👉ముఖ్యంగా హైదరాబాద్‌కు కీలక విభాగానికి బదిలీపై వచ్చిన ఓ ఐపీఎస్ అధికారి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.ఆమె ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ విల్లాల ధరలు కనుక్కొని ఆరా తీస్తుండడం చేస్తుంటారు. హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ ఆమెపై పలు ఆరోపణలు రావడంతో మరో చోటుకు బదిలీ చేశారు. అయితే.. అక్కడ కూడా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో చర్చకు దారితీసింది. అలాగే.. మల్టీజోన్ 2 పరిధిలో ఓ జిల్లా ఎస్పీగా నియమితులైన యువ ఐపీఎస్ సైతం ఇదే తరహా అవినీతికి తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నింటినీ ఖర్చు చేసినట్లుగా చూపి అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి కిందిస్థాయి సిబ్బంది తీసుకెళ్లడంతో చివరకు అక్కడి నుంచి బదిలీ చేశారు. వీరితోపాటే ఇంకా చాలా మందిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వం వేటు వేసింది. చాలా వరకు ప్రాధాన్యం లేని పోస్టులకు వారిని బదిలీ చేసింది. యువ ఐపీఎస్‌లుగా ఉండి అవినీతికి పాల్పడడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. హైదరాబాద్ శివారులోని డీసీపీగా నియామకం అయిన ఓ మహిళా డీసీపీ..అక్కడ కొంతకాలమే పనిచేశారు. కానీ.. ఆమె పనిచేసిన కాలంలో భూవివాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడ్డారనే అపవాదు ఆమెపై ఉంది. ఓ నాలుగెకరాల భూమిని మరొకరికి కట్టబెట్టే ప్రయత్నంలో ఆమె అభాసుపాలయ్యారు. అలాగే.. రాష్ట్రంలో జూదం ఆటపై నిషేధం కొనసాగుతుంటే ఎస్పీ అయి ఉండి దానికి మద్దతు తెలిపారు. అంతేకాదు.. జూదరులను ఒక దగ్గరకు చేర్చి ప్రతీ ఆటకు రేటు కట్టి వసూళ్లకు పాల్పడినట్లు టాక్ ఉంది. నిఘా ఈ విభాగానికి విషయం తెలియడంతో ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందలించారు. ఆ తరువాత ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు.
ఇలా.. రాష్ట్రంలో ఒక్కో ఐపీఎస్ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిష్పక్షపాతంగా ప్రజలు సేవలు అందించాల్సింది పోయి.. పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం నడుస్తోంది.
👉దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ విభాగ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.శివకుమార్.
కంభం CLR జూనియర్ కళాశాలకు విచ్చేసిన ప్రభుత్వ విభాగ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కే. శివకుమార్ ని సిఎల్ఆర్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ శిరిగిరి బ్రహ్మం మరియు అధ్యాపకులు శాలువాతో సత్కరించారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా “చదువు మళ్ళీ కొనసాగిద్దాం- బంగారు భవితను నిర్ణయించుకుందాం” అనే వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ కే శివకుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండి చదవగలిగి వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు మరియు పదవ తరగతి ఫెయిల్ అయిన వారు పదవ తరగతినీ,15 సంవత్సరాలు నుండి పదవ తరగతి పూర్తయిన వారంతా ఇంటర్ కోర్సును ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా చదివే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. కార్యక్రమంలో ఏపీఓఎస్ఎస్ క్లర్క్ నాగరాజు,CLR డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ భూపనీ నారాయణ, గుండాల ముక్తేశ్వరరావు, అధ్యాపకులు ఏనుగుల రవికుమార్, షేక్ షరీఫ్, పాలిశెట్టి నవీన్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి, ఉప్పు నారాయణ, కే.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
👉తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి మనోభావాలు దెబ్బతీశారు:ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి కాకుండా జంతువుల నుంచి తీసిన కొవ్వుతో లడ్డులను తయారు చేసి ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారన్నారు.
👉పరిపాలకుడు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని కానీ ఈ రకమైన పోకడలకు పోవటం మంచిది కాదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మన ఆగమన శాస్త్రం ప్రకారం ఏ రకంగా నిర్వర్తించాలో ఆ పద్ధతి ప్రకారం ఆవు నెయ్యిని ఉపయోగించి అన్ని రకాలగా నాణ్యమైన లడ్డును అందించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.గత ప్రభుత్వం కక్షపూరితమైన పరిపాలన చేసిందన్నారు. పేద ప్రజలకు ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పేదల రక్తం తాగారని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు స్వయంగా వారి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.
👉వివాహ వేడుకలో కుందూరు నాగార్జున రెడ్డి..
*అర్థవీడు వైసీపీ నాయకులు ఖాదర్ ఖాన్ కుమారుని వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన మార్కాపురం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి..వారి వెంట అర్ధవీడు మండల వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు ఉన్నారు…

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..