👉పొరుగున మార్క్సిస్ట్ ప్రభంజనం..!!!
పొరుగుదేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రస్తుతం పూర్తయింది. ప్రారంభ ఫలితాలు.. అధ్యక్షుడి మార్పు తప్పదనే సంకేతాలను పంపించాయి. కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైనట్టే.
శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత నేత రణిల్ విక్రమసింఘె, సాజిత్ ప్రేమదాస, అనుర కుమార దిశనాయకె పోటీ పడ్డారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దేశవ్యాప్తంగా 22 ఎలక్టోరల్ జిల్లాల్లో 13,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగింది. ఇందులో మార్క్సిస్ట్ ప్రభంజనం కనిపించింది. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరామున (నేషనల్ పీపుల్స్ పవర్) తిరుగులేని మెజారిటీని సాధించింది.
👉 తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్..
తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్
తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందన్నారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వివరించింది.
👉 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా..
ముమ్మిడివరం..సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ ఇంతవరకు గుర్తించని అధికారులు*
యానాం సమీపంలోని దర్యాలతిప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జిసి, జిఎస్టిసి, గెయిల్ ఇండియా, తోపాటు సమురు సంస్థలు, గ్యాస్ సంస్థలు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
👉 వైసిపి ఆలయాలను అపవిత్రం చేసింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్*
*గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.*
*’గత ప్రభుత్వంలో రథాలు తగులబెట్టారు. ఆలయాలను అపవిత్రం చేశారు.*
*రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడాము.*
*ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బతినకూడదు.*
*ప్రసాదాలు కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పాము.’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.*
👉మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరు బాలికలపై బాలుడి(17) లైంగిక దాడి 😱 *
*తప్పించుకున్న మరో చిన్నారి*
*నిందితుడు, బాధితులంతా ఒకే కులం వారు కావడంతో విషయం బయటకు పొక్క కూడదని కుల పెద్దలు తీర్మానం*
*ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తాం అని హుకుం*..*భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఘటన*
*వ్యసనాలకు బానిసైన ఓ బాలుడు(17)*..*ఇల్లెందుకు చెందిన ఆరేళ్ల వయసు* *కలిగిన ముగ్గురు బాలికల పై కన్నేశాడు.. ఇళ్లవద్ద ఆడుకుంటుండగా ఆ బాలికలకు మాయమాటలు చెప్పి ఆ ముగ్గురిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఇద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు*..*తప్పించుకున్న మరో బాలిక ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై కుల పెద్దలు అదేరోజు రాత్రి పంచాయితీ నిర్వహించారు*..*నిందితుడు, బాధితులంతా ఒకే కులం వారు కావడంతో విషయం బయటకు పొక్క కూడదని తీర్మానించారు*..*ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తామని బాధిత కుటుంబాలనే హెచ్చరించారు. కానీ, విషయం బయటికి రావడంతో ఐసీడీఎస్ అధికారులు శనివారం విచారణకు రాగా స్థానికులు సహకరించలేదు*
*కులపెద్దల హెచ్చరికలతో మౌనంగా ఉన్న బాధిత కుటుంబాలు ఇల్లెందు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు
👉 కడప ..ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో ప్రతి ముస్లిం నడవాలని 28వ డివిజన్ టిడిపి యువ నాయకుడు బి అబ్దుల్లా పేర్కొన్నారు
కడప నగరంలోని బుచ్చర వీధిలోని ఉర్దూ పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సిరతుల్ నబి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రవక్త జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమానికి అబ్దుల్లా ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ నేటి యువత ముస్లిం సంప్రదాయాలు, ప్రవక్త సూచించిన మార్గాలపై నడిచి పుణ్యకార్యాలు చేయాలని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ దావూద్, ఉపాధ్యాయులు అహ్మద్ బాషా, ఫక్రుద్దీన్, శివకుమార్, యాస్మిన్ సుల్తానా, భాగ్యలక్ష్మి, శ్వేతా రెడ్డి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు
👉 వక్ఫ్ ఆస్తుల రక్షణకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి హైకోర్టులో వేసిన పిల్ రాష్ట్ర ప్రభుత్వం తాము అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ మరియు 11 మంది అధికారుల ఆధ్వర్యంలో పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశామని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, చీమలపాటి రవి గార్ల ధర్మాసనానికి తెలిపారు. పిల్ 248/2021 ప్రకారము ప్రతి జిల్లాలో జిల్లా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి నెలవారి సమావేశాలను నిర్వహించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధికి చేస్తున్న చర్యలను గురించి చర్చించి తగు చర్యలు తీసుకోవాలి. మీ మీ జిల్లాలలో సదరు కమిటీలను ఏర్పాటు చేశారా లేదా, ప్రతి నెల సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆర్టిఐ కింద తెలుసుకొని, జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయకపోయినా నెలవారి సమావేశాలు ఏర్పాటు చేయకపోయినా తమను తగిన సమాచారంతో సంప్రదిస్తే హైకోర్టులో కోర్టు దిక్కార కేసు వేసి వక్ఫ్ ఆస్తులను రక్షించడానికి పోరాడుతామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది బషీర్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి ఖాజావలి తెలిపారు. ఈ ప్రకటనతో పాటు ఉన్న హైకోర్టు ఉత్తర్వులను ఉపయోగించి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడం ప్రతి ముస్లిం విధి .
👉 ప్రపంచంలోనే అత్యధిక సామూహిక అత్యాచారాలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి.😱
👉సిరోహిలో మరో బాలికపై 6 యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.😱..రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.నిందితులపై కఠిన చర్యలపై ఇంతవరకు ఏ బీజేపీ మహిళా నేత నోరు విప్పలేదు..!విచిత్రమైన నిశ్శబ్దం చుట్టూ వ్యాపిస్తోంది 😢😢
ఎంతకాలం దేశం ఇవన్నీ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటుంది??
👉అన్న క్యాంటీన్ కు 15వేలు విరాళం అందించిన పెద్ద కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులు*
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణంలోని పెద్ద కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి గిద్దలూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ నిర్వహణకు తమ వంతు సహకారంగా రూ. 15,000-00 అక్షరాల పదిహేను వేల రూపాయలు ఎమ్మెల్యే గారికి అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారందరిని అభినందించారు.కార్యక్రమంలో షేక్ ఖాజా హుస్సేన్, యాసం రాముడు, షేక్ రసూల్, అనప శ్రీను,సుభాని,లక్ష్మి, సావిత్రమ్మ,సుశీల తదితరులు పాల్గోన్నారు.
👉ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు మేలు చేసిన ప్రభుత్వం ఎన్డీయే..*గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..*గత వైసీపీ భూకబ్జా పాలకులు అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు మంచి చేసిన ప్రభుత్వం ఎన్డీయే అని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బెస్తవారిపేటలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయటం జరిగిందన్నారు.అదే విధంగా పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ లను ప్రారంభించటం జరిగిందని, నాడు వైసీపీ పాలకులు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే, గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి వాటికీ ప్రాణం పోశారన్నారు. అదే విధంగా గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు విడుదల అయిన నిధుల్లో బెస్తవారిపేట మండల అభివృద్ధికి రూ. 2.50 కోట్లు, బెస్తవారిపేట పంచాయతీకి రూ. 93 లక్షలు నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు.ఎన్డీయే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించే మంచి ప్రభుత్వంఅని,అర్హులైన ప్రతీ ఒక్కరికి పక్కా గృహాలు, పెన్షన్లు,ప్రభుత్వ పథకాలను అందించే జవాబుదారీ ప్రభుత్వమన్నారు.*
*ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ టి. పార్వతీ, ఎమ్మార్వో జితేంద్ర కుమార్, స్థానిక సర్పంచ్ బుద్దుల ప్రేమానంద్, ఎంపీటీసీ ఖాజావలి, మండల పార్టీ అధ్యక్షులు సొరెడ్డి మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పూనూరు భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటిక నరసింహా, పట్టణ అధ్యక్షులు దూదేకుల సైదులు, మరియు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గోన్నారు.*
👉 సిఐ కె.మల్లికార్జునను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..
నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కంభం సర్కిల్ సిఐ కె. మల్లికార్జునను కంభం మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసులు,తోట శ్రీనివాసులు,కేతం శ్రీను.కంభం పట్టణ అధ్యక్షుడు మాధవ,తోట శ్రీను(గుడి మెట్ట.శ్రీను) పి.మల్లి, నలబులవెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సత్కరించారు.