జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. మెగాస్టార్ కు అరుదైన గౌరవం ..విహారయాత్రలో విషాదం..అన్న క్యాంటీన్ కు గిద్దలూరు పట్టణ సిమెంట్ & ఐరన్ షాప్స్ అసోసియేషన్ విరాళం..శాస్త్రీయ దృక్పధం, శాస్త్రీయ ఆలోచనలు విద్యార్థి దశలోనే బాలలకు అలవాటు చేయాలి jvv..వరద బాధితులకు రూ.50 వేలు ఆర్ధిక సహాయం-అర్ధవీడు..వికలాంగులకు హెల్పింగ్ హార్ట్స్ సహాయం

👉 జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు .. తాడేపల్లిగూడెంలోని మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. లడ్డూ ప్రసాదంలో అపచారం చోటుచేసుకున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెబుతుండడంతో అన్నివర్గాల్లోనూ ఆగ్రహం కనిపిస్తోంది. దోషులను వదలకుండా.. మరోమారు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ దుర్ఘటనపై ప్రపంచవ్యాప్తంగా హిందూలోకం గొంతెత్తుతోంది. తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేశారని.. తిరుమల గొప్పతనాన్ని దెబ్బతీశారని నిలదీస్తున్నారు. రాజకీయ పరంగానూ అన్ని పొలిటికల్ లీడర్ల నుంచి వాయిస్ వినిపిస్తోంది. తాజాగా.. బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తాడేపల్లిగూడెంలోని మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. దాంతో పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.కాగా.. ఇప్పటికే లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. సరైన విధంగా విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అటు.. అగ్రనేత అమిత్ షా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. తాజాగా.. జగన్ నివాసాన్ని ముట్టడించారు.
👉మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి అరుదైన గౌరవం!*
మెగాస్టార్ చిరంజీవి స్వ‌యం కృషితో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలి చారు. తాజాగా మెగాస్టార్‌కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది.
ఈ విష‌యాన్ని తెలియ‌ జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఈరోజు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు.
డాన్స్‌కి కేరాట్ అడ్ర‌స్‌గా నిలిచారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 143 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంలో మెగా అభిమా నుల ఆనందానికి అవ‌ధు లు లేకుండా పోయాయి.
👉 చిలకలూరిపేట :శాస్త్రీయ దృక్పధం, శాస్త్రీయ ఆలోచనలు విద్యార్థి దశలోనే బాలలకు అలవాటు చేయాలనే సంకల్పంతో జనవిజ్ఞాన వేదిక ప్రతియేటా చెకుముకి సంబరాలు నిర్వహిస్తుందని జవహర్ నవోదయ పూర్వపు ప్రిన్సిపాల్ సిహెచ్ ప్రభాకరరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సాధినేని చౌదరయ్య పాఠశాలలో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక డివిజన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మరో అతిధి, జెవివి గౌరవ అద్యక్షులు పి.వి. సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన,అక్టోబర్ 1 న నిర్వహించే పాఠశాల స్థాయి, మండల స్థాయి చెకుముకి సంబరాలను విజయవంతం చేయాలని పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. అనంతరం జెవివి భవిషత్ కార్యక్రమాలు చర్చించారు. అలాగే ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి దార్ల బుజ్జిబాబు, ఉపాధ్యక్షులు కె.రామ మోహనరావు, సమతా అధ్యక్షురాలు టి.కుమారి, జిల్లా గౌరవ అద్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్, రిటైర్డ్ ఎక్సైజ్ సి.ఐ. గోరంట్ల నారాయణ, న్యాయవాది మాదాసు భాను ప్రసాద్, ధూళిపాళ్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
👉 ఢిల్లీ లో ఆదివారం కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవిందుమోహన్ ను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు,లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాద పూర్వకంగా కలిసి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల శేషవస్రం, స్వామి, అమ్మవార్ల ఫోటో, అభిషేకం లడ్డు అందించారు. శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల ప్రసాదం అందించిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని కేంద్ర హోం శాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ అభినందించారు. కేంద్ర హోం శాఖలో ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన పెండింగ్ దస్రాలు క్లియర్ చేసేందుకు సహకరించగలరని కేంద్ర హోం సెక్రటరీ ని ఎంపీ బైరెడ్డి శబరి కోరారు.
👉గుంటూరు .. ఠాగూర్ సినిమా రిపీట్..
అర్థరాత్రి గుంటూరు వారి తోట లోని ఆదిత్య హాస్పటల్ “మరోసారి ఠాగూర్ సినిమాను” చూపించింది.
తోంటి నొప్పితో హాస్పటల్లో చేరితే ప్రాణం తీశారన్న కుటుంబ సభ్యులు.ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం తీశారని హాస్పటల్ ముందు బంధువుల రోథన‌.
మృతుడు తాడేపల్లి మండలం గుండి మెడ గ్రామానికి చెందిన గుండీమెడ శ్రీనివాసరావు 50 సంవత్సరాలు.
పేషంట్ బంధువుల నుండి సంతకాలు తీసుకోకుండా ఆపరేషన్ చేశారన్న కుటుంబ సభ్యులు.
ఐసియు లో పెట్టి చనిపోయిన విషయం చెప్పకుండా మందులు కూడా రాశారని మృతుని బంధువులు ఆరోపణ.
డాక్టర్ ను నిలదీస్తే స్ట్రోక్ వచ్చి చనిపోయారని సమాధానం.మృతుని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హాస్పటల్ ఎదుట ఆందోళన.
విషయం తెలుసుకున్న సహా ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది.పోలీసుల రాకతో ఏషింటు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.వెంటనే ఎమ్మార్పీఎస్ నాయకులను కలిసిన పేషంట్ బంధువులు.
డాక్టర్ మేన హాస్పిటల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుకుంటున్నారు
👉హెల్పింగ్ హార్ట్స్ ఆద్వర్యం లో మార్కాపురం లోని స్ఫూర్తి మానసిక వికలాంగుల ఆశ్రమం కు ఫ్యాన్స్, నిత్యావసర వస్తువులు డొనేట్ చేయడం జరిగింది. ఆశ్రమం లోని మానసిక వికలాంగులైన పిల్లలకు అన్న సంతర్పణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎ.రాయుడు,రాజు,రమేష్, మొదలైన వారు పాల్గొన్నారు.
👉విహారయాత్రలో విషాదం*
అల్లూరి జిల్లా మారేడు మిల్లిలో జలతరంగిని జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది,
ఏలూరు మెడికల్ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు విహారయాత్ర కోసం వచ్చి జలతరంగిణి జలపాతం వద్ద ఐదుగురు వైద్య విద్యార్థులు గల్లంతు అయ్యారు.
సాయంత్రం ఒక్కసారిగా వాగు ఉధృతం గా రావడంతో విద్యార్థుల గల్లంతు అయ్యారు. గల్లం తైన వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఒక అమ్మాయిని స్థానికులు రక్షించారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.మిగతా ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు స్థానికుల సహాయంతో వైద్య విద్యార్థుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. కాగా సంఘటన స్థలంలో వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది…
👉విజయవాడ వరద బాధితులకు రూ. 50 వేలు ఆర్ధిక సహాయం అందించిన అర్ధవీడు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు.*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని అర్ధవీడు మండల ఫర్టీలైజర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం తమ వంతు సహకారంగా రూ.50,000-00లు అక్షరాల యాభై వేలు చెక్కు ద్వారా ఎమ్మెల్యే కి అందచేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందించారు.*కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు ఎం. మల్లికార్జునరావు, బంకు రంగయ్య, లాకా రమణ, షేక్ అబ్దుల్, వెంకటేశ్వర్లు, సుభాని, మాకా వెంకటసుబ్బయ్య, ఏ.వెంకటేశ్వర రెడ్డి,కారే శ్రీనివాసులు, నరేంద్ర రెడ్డి, రవి,రాధాకృష్ణ,చాంద్ బాషా,రఘు కోటి తదితరులు పాల్గొన్నారు.
👉అన్న క్యాంటీన్ కు విరాళం అందించిన గిద్దలూరు పట్టణ సిమెంట్ & ఐరన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు*
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని గిద్దలూరు సిమెంట్ & ఐరన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి గిద్దలూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ. 15,000-00 అక్షరాల పదిహేను వేల రూపాయలు చెక్కు ద్వారా ఎమ్మెల్యే గారికి అందచేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు అభినందించారు.*
కార్యక్రమంలో సిమెంట్ & ఐరన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు నారాపురం సుబ్బయ్య, వాడకట్టు రామాంజనేయులు, నంది శ్రీను, సూరె మహేష్, అరవింద్, ఆనంద్, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.*

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త