కరోనా కంటే..జమిలీ ఎన్నికలు చాలా డేంజర్‌ ?..బాలినేని, దామచర్ల మధ్య మాటల యుద్ధం..విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తీరుపై విమర్శలు..ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు..సీబీఐ అధికారి పేరుతో ఫోన్ కాల్.. సీఎం రేవంత్ కు 50 లక్షలు విరాళం అందజేసిన మహేష్ బాబు..స్టడీ మెటీరియల్ అందజేత..కంభం సిఐ ని కలిసిన టిడిపి నాయకులు.

👉కరోనా కంటే..జమిలీ ఎన్నికలు చాలా డేంజర్‌ ?.. కమల్ హాసన్ ..
దేశ వ్యాప్తంగా జెమిలి ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో…ప్రముఖ నటుడు, మక్కల్ నిధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు… కరోనా మహమ్మారి కంటే డేంజర్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా జంబ్లీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కేంద్ర కేబినెట్ ఈ బిల్లుపై ఆమోదం తెలిపి… రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి ఈ బిల్లును సమర్థించి పార్లమెంటుకు పంపి ఛాన్స్ ఉంటుంది. అంటే 2027 లోపు.. ఏ క్షణమైన దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ జమ్మిలి ఎన్నికలు జరిగితే…. చాలావరకు నష్టాలు జరుగుతాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ ఎక్కడ కనిపించదు. రాష్ట్రాల సమస్యలు కూడా తెరపైకి రావు. కేవలం జాతీయ సమస్యలు మాత్రమే తెరపైకి వస్తాయి.దీంతో ఈ జమిలి ఎన్నికలను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోతుందని..ఇలా ఇప్పుడే జమిలి ఎన్నికలకు కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వాదనలు వస్తున్న నేపథ్యంలో కమలహాసన్ కూడా మాట్లాడారు. జమిలి ఎన్నికలు…ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే నియంతృత్వ పాలన అవుతుందని కూడా… చెప్పుకొచ్చారు కమల్ హాసన్.2014లో ఇదే తరహా ఎన్నికలు జరిగి ఉంటే దేశం ప్రమాదంలోనే పడేదన్నారు. ప్రతి ఒక్కరూ ఏకతాటి పైకి వచ్చి ఈ.. జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాలని కోరారు. కరోనా కంటే ప్రమాదకరమైన ఈ జమిలి ఎన్నికలను అందరూ బహిష్కరించాలని తెలిపారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం వీటి నిర్వహణ అస్సలు సాధ్యం కాదని కూడా ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగంలో ఐదు సవరణలు చేస్తే కానీ.. ఇది జరగదన్నారు.
👉పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు..
కొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పింఛన్ల తనిఖీకి అధికారులు ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. రవాణా శాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటా తెప్పించుకుంటారు. రాష్ట్ర అధికారులు గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అనర్హులకు నోటీసులు పంపించి, లిఖితపూర్వక సమాధానాన్ని తీసుకుంటారు. గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
👉ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
కర్నూల్‌లో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు..
100 ఎకరాల్లో అమరావతిలో లా కాలేజ్‌..
జూనియర్‌ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం
నిందితులకు శిక్షపడేలా విచారణ ఉండాలి-చంద్రబాబు

👉 కడప జిల్లా ..మైదుకూరు పట్టణంలోని మిట్ట జూలర్స్ షాప్ లో దొంగలు పడ్డారు. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని. దుకాణం యజమాని మెట్ట సుబ్బరాయుడు స్పష్టం చేశాడు.
గత మూడు రోజుల నుండి మూసి ఉన్న దుకాణాన్ని నేడు తెల్లవారుజామున తెరవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
దొంగలు దొంగతనం ఆనవాళ్లు కనపడకుండా సిసి కెమెరాలను హార్ట్ డిస్కులను సైతం ఎత్తుకెళ్లారని ఆయన తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
👉విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తీరుపై విమర్శలు.. పేద గర్భిణీలు రావటమే కానీ తిరిగి వెళ్ళలేరా.. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పేదలకు మెరుగైన వైద్యం ఇవ్వాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు నవ మాసాలు మోసి ఎన్నో పిల్లలు కలుగుతారని కలలుగన్న కన్నతల్లిలు కలలను కన్నీళ్లుగా మారుస్తున్నటువంటి విజయవాడ హనుమాన్ పేటలో కల ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల లో డెలివరీ కోసం రావడమే కానీ. తిరిగి బిడ్డతో వెళ్లడం అనేది కొందరికి మాత్రమే సాధ్యం అని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం కోసం వచ్చినటువంటి గర్భిణీ మహిళల పట్ల అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బాధితులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపర్నెంట్ గాని అధికారులు కానీ బాధితులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన వాళ్లకు పట్టింపుకు రాని బాధితులు ఆవేదన ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎలా అయినా సంబంధిత డాక్టర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సామాన్య పేద ప్రజలు రోదిస్తున్నారు.
👉హాట్ హాట్ గా ఒంగోలు రాజకీయం .. బాలినేని, దామచర్ల మధ్య మాటల యుద్ధం*
*బాలినేని, ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్న..దామచర్ల*
*తాను అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ చంద్రబాబుకు లేఖ రాసాను… బాలినేని*
ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి-సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మధ్య గత కొన్నేళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనని అంతా భావించారు.
కానీ నేతలు మాత్రం తగ్గేదేలేదంటున్నారు. సయోధ్యకు చాన్సే లేదని సందేశమిస్తున్నారు.బాలినేని జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. బాలినేని అభిమానులు పవన్ కల్యాన్‌, చిరంజీవి, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై దామచర్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు.
బాలినేని జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించడంపై దామచర్ల సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు తనపై పెట్టిన అక్రమ కేసులను మర్చిపోలేదన్నారు. బాలినేని, ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్నారు. ఆ కేసుల నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తామన్నారు దామచర్ల.
దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఫైర్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ చంద్రబాబుకు లేఖ రాశానన్నారు. తనను కేసుల నుంచి పవన్ కల్యాణ్‌ కూడా కాపాడలేరంటూ దామచర్ల మాట్లాడటం తగదన్నారు.బాలినేని కూటమిలో చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్యూచర్ పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో చూడాలి మరి.. *జిల్లా ప్రతినిధి షేక్ ఫయాజ్..
👉ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్*
*ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలి* హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు.ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్డు ఆధారంగానే ఆ ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విధంగా సన్నద్దంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
👉 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టులో విచారణ
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని..
హైకోర్టులో పిటిషన్‌ వేసిన కేఏ పాల్‌
నేడు అఫిడవిట్‌ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
👉ప్రముఖ సినీ నటుడు జి.మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. AMB తరపున మరో రూ.10 లక్షల విరాళం అందజేశారు.
*తెలంగాణ ప్రతినిధి హైదర్ అలీ..
👉నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్మార్ట్ షాపింగ్ మాల్ ను ముఖ్యఅతిథిగా హాజరై, షాపింగ్ మాల్ ను ప్రారంభించిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి.. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ,రవీందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
👉2,50,000 వేల రూపాయల LOC నీ అందజేసిన – ఆవుల రాజిరెడ్డి ..
నర్సాపూర్ : ARR క్యాంప్ కార్యాలయంలో నర్సాపూర్ మండలం గుండెం గడ్డ గ్రామానికి చెందిన సప్పటి శంకర్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలో పై చికిత్స కోసం రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్. ఓ.సీ నీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి.. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,రవీందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
👉మీ అమ్మాయిని అరెస్ట్ చేశాం.. సీబీఐ అధికారి పేరుతో ఫోన్ కాల్.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?
*ఖమ్మం/న్యూస్ ఫ్రెండ్: నేను సీబీఐ అధికారిని, మీ అమ్మాయిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాం” అంటూ ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా కాల్ చేశాడు*. ఫోన్ కాల్ అందుకున్న వ్యక్తి పక్కనే కుమార్తె ఉండడంతో అప్రమత్తం అయ్యాడు. అతను సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా కాపాడుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం గ్రామానికి చెందిన గోవిందరావు ఫోన్‌కు వాట్సప్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తిన అతనికి ఓ వ్యక్తి సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, మీ కుమార్తె బ్యాగ్‌లో డ్రగ్స్ దొరకింది. ఆమెను అరెస్ట్ చేశామని తెలిపాడు. అయితే అదే సమయంలో కుమార్తె గోవిందరావు పక్కనే ఉండడంతో వచ్చిన ఫోన్ కాల్ ఎవరిదో ఇట్టే పసిగట్టాడు. సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తున్నారనే అనుమానం తో ఫోన్ కట్ చేసి, తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పడంతో ఫోన్ హ్యాక్ అయిందనే అనుమానం వ్యక్తం చేశారు.దీంతో అప్రమత్తమైన గోవిందరావు తన బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును మరో ఖాతాకు మళ్లించాడు. తరుచూ వార్తల్లో వినడం సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూడడం వల్లే తాను అప్రమత్తమయ్యానని గోవిందరావు తెలిపాడు. వెంటనే సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే కేటుగాళ్లు కాల్ కట్ చేశారు. సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పిస్తే ఇలాంటివి జరగవని ఆయన చెపుతున్నాడు.
👉సత్యసాయి జిల్లా..*ధర్మవరంలో ఉద్రికత్త..రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శిచేందుకు వెళ్లిన *మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి*
ఇదే సమయంలో వైసీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.
కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్న కూటమి కార్యకర్తలు.
*వాహనంపైకి వెళ్లడానికి ప్రయత్నించిన ఓ కార్యకర్త*
*వేగంగా దూసుకెళ్లిన కేతిరెడ్డి కారు… వాహనంపై నుంచి కింద పడిన కార్యకర్త..
👉తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీ పై ఆలయం ముందు ప్రమాణం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..నేను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డులో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం – భూమన కరుణాకర్ రెడ్డి…
👉 ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న దాదా.. కంభం గ్రామపంచాయతీ రెండవ సచివాలయం పరిధిలో స్థానిక జుమ్మా మసీద్. మరియు చిన్న మసీదు ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి అతార్ షేక్ హుస్సేన్ ( దాదా) ప్రభుత్వం 100 రోజులలో చేసినటువంటి పనుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో 54వ బూత్ కన్వీనర్ పి నాగూర్ అలీ ఖాన్ మైనార్టీ నాయకులు ముజాహిద్.షేక్ మసూద్. సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం రాణి తదితరులు పాల్గొన్నారు
👉 కంభం సర్కిల్ ఆఫీస్ లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అతార్ షేక్ హుస్సేన్ (దాదా). పి నాగూర్ అలీ ఖాన్ సయ్యద్ ఖాసిం భాష పాల్గొన్నారు..డివిజన్ ఇంచార్జ్ అసలం బేగ్..
👉ఏపీ టెట్ 2024 కోచింగ్ ఫర్ మైనార్టీస్ ఇన్ ఉర్దూ మీడియం ఎస్జీటీ పేపర్ వన్ కొరకు కంభం మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల ఎన్ఎస్ నందు ఆగస్టు 1 తారీఖు నుంచి సెప్టెంబర్ 25 తారీకు వరకు జరిగినది.ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఉర్దూ మీడియంలో చదువుతూ ఉర్దూ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరవుతున్న దాదాపు 50 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉచిత శిక్షణ అందించారు. ఉర్దూ ఉపాధ్యాయులు హబీబుర్ రెహమాన్ ఖాన్, సయ్యద్.షఫీ, రఫీ, ఆరిఫ్ ఖాన్ వీరంతా వారి విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థులకు శిక్షణ అందించారు. ఆంగ్ల సబ్జెక్టు బోధనలో ఉపాధ్యాయుడు సలీం భాషా సైతం తన సేవలను అందించి సహకరించారు. కోఆర్డినేటర్ గా అర్ధవీడు మండల విద్యాశాఖ అధికారి టి.అబ్దుల్ సత్తార్ వ్యవహరించగా,సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున విద్యార్థులకు ఉచిత మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు సయ్యద్.అనీష్ అహ్మద్,అత్తార్ దాదా,అస్లామ్,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..