👉ఆన్‌లైన్ ట్రేడింగ్..హైటెక్ చీటింగ్😱.. రెచిపోతున్న సైబర్ నేరగాళ్లు!!!.. అయితే.. సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు తాజాగా కొన్ని సూచనలు చేశారు. మోసపోతే 24 గంటల్లోనే పోలీసులను ఆశ్రయించాలని,అలా అయితే ఎంతో కొంత రికవరీ చేయొచ్చని చెబుతున్నారు. నగరాల్లో ఇప్పుడు దొంగతనాలు,దోపిడీల కంటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సైబర్ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలో తమ మోసాలకు తెరతీస్తున్నారు. బయట ఎవరికీ సాధ్యంకాని విధంగా అత్యాధునికంగా టెక్నాలజీని వాడుతూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు.
ఓ వైపు ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వాటి బారిన పడి మోసపోతూనే ఉన్నారు. కోట్లాది రూపాయలు అప్పనంగా అప్పగిస్తున్నారు. సైబర్ క్రైమ్స్‌లోనూ కొందరు నేరగాళ్లు వింతగా, కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏకంగా తాము సైబర్ క్రైమ్ పోలీసులమని, లేదంటే ఈడీ విభాగం నుంచి అంటూ కాల్ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. లేదంటే ఈ-మెయిల్స్ చేస్తున్నారు.వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపుతూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటువంటి మోసాలు మరిన్ని పెరిగాయి. సగటును రోజుకు పది వరకు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిత్యం సైబర్ క్రైమ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకొని ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.ఇటీవల సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ చెప్పి వసూళ్లకు పాల్పడుతుండడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఎవరికైనా తాము సీబీఐ నుంచి, ఈడీ లేదా ఎన్ఐఏ నుంచి ఫోన్ చేస్తున్నామంటే అవతలి వ్యక్తి భయపడుతారు. దాంతో ఫోన్‌లో సైబర్ మోసగాళ్లు అడిగిన వివరాలన్నింటినీ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా అప్పటికే వాళ్ల వివరాలన్నింటిని సేకరించి పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులు డ్రా చేసుకోగలుగుతున్నారు. ఆధార్, పాన్ నంబర్ కూడా చెబుతూ.. ఇంటి అడ్రస్‌ను కూడా చెప్పడంతో సరెండర్ అవుతున్నారు. నిందితులు ఢిల్లీ, ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. లేదంటే.. మీ పేరిట పర్సల్ వచ్చిందని, అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్,మత్తు పదార్థాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారు. ఇలానే.. హైదరాబాద్ శివారు ఏరియాకు చెందిన ఓ బాధితుడికి ఈడీ విభాగం నుంచి అని చెప్పి ఫోన్ చేశారు. దాంతో నమ్మిన ఆ బాధితుడు అడిగిన వివరాలన్నింటినీ ఇచ్చి రూ.40 లక్షలు మోసపోయాడు. 3 నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. మరికొంత మంది వృద్ధులైతే ఈ పోలీసుల చుట్టూ తిరగలేక.. ఆ కేసులను ఎదుర్కోలేక పోయిన డబ్బులను తలచుకుంటూనే ఏడుస్తున్నారు. ఇక మరికొందరైతే న్యూడ్ కాల్స్ చేస్తూ మరో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు.అయితే.. సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు తాజాగా కొన్ని సూచనలు చేశారు. మోసపోతే 24 గంటల్లోనే పోలీసులను ఆశ్రయించాలని,అలా అయితే ఎంతో కొంత రికవరీ చేయొచ్చని చెబుతున్నారు.24 గంటల్లో అయితే నేరానికి పాల్పడిన వారిని ట్రేస్ అవుట్ చేసే అవకాశాలూ ఉన్నాయని సూచిస్తున్నారు.
👉10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు*
తెలంగాణ ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. *పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది.* ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. *తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.*
👉 హుస్సేన్ సాగర్‌లోని ప్రసాద్ ఐ మాక్స్, జలవిహర్, ప్యారడైస్ హోటల్ అన్ని FTL పరిధిలో ఉన్నాయి..
వీటిని కూల్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?..
సామాన్యులు రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి వారి కడుపులో మట్టి కొడుతున్నావు..
*-బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్..
👉మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్*
*కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి కి సీఎం ఆదేశం* *నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం*ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం* *మైనారిటీలకు లబ్ది జరిగేలా వక్ఫ్ భూముల అభివృద్ది* *మైనారిటీ సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు*
అమరావతి:- ముస్లిం మైనారిటీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీల నేపథ్యంలో….ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని..వీటి కోసం పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలని సీఎం ఆదేశించారు. మైనారిటీ సంక్షేమం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సోమవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్ల కు సంబంధించి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మంజూరై కొంత మేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునః సమీక్ష చేయాలని సూచించారు. కడపలో హజ్ హౌస్ కోసం నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేసి 80 శాతం మేర నిర్మాణం పూర్తి అయిందని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలని సీఎం సూచించారు. మైనారిటీ విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే గుంటూరు క్రిస్టియన్ భవన్ కు నాడు తెలుగుదేశం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేయగా 50 శాతం పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించగా…మిగిలి ఉన్న పనులను పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మైనారిటీలకు ఇచ్చే ఆర్థిక సహకార పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలని సూచించారు.వక్ఫ్ బోర్డ్ భూముల అభివృద్ధి పరిచేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం అంగీకారం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూములను అభివృద్ది చేయాలని…అందులో ఆ వర్గానికి చెందిన వారే భాగస్వాములుగా ఉండేలా చూడాలన్నారు. వక్ఫ్ బోర్డు కు ఆదాయం తీసుకురావడంతో పాటు….భూముల అభివృద్ది ఫలాలు ఆ వర్గానికే అందేలా చూడాలని సూచించారు. అదే విధంగా నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. మత కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖలు అనవసర జోక్యం చేసుకోవద్దని….వారి గౌరవాలకు భంగం కలగకుండా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం సూచించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు, రూ.5 వేలు ఇస్తామన్న హామీని త్వరలో అమల్లోకి తేవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖాజీలు గా నియమించాలని సీఎం తెలిపారు. మసీదుల నిర్వహణకు రూ. 5 వేలు ఆర్థిక సాయం., హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ. 1 లక్ష సాయం ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. మైనారిటీలకు స్మశాన వాటికల స్థలం కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ ఎండి ఫరూక్, అధికారులు పాల్గొన్నారు.
👉చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం..*పిఎం సూర్యఘర్ ద్వారా మగ్గాలు ఉన్న వారికి ఉచిత విద్యుత్*
*చేనేత, హస్తకళలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు* అమరావతి :-* చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత, హస్త కళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దాదాపు రెండు సంవత్సరాల పాటు చేనేత, జౌళి, హస్తకళలపై కనీసం సమీక్ష నిర్వహించలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ శాఖలో పరిస్థితులు, స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమగ్ర సమీక్ష చేశారు. 35 చేనేత, 36 హస్తకళల క్లస్టర్ ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఉత్పత్తులను ఆధునీకరించడం, టెక్నాలజీ వాడకం, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా చేనేత, హస్తకళాకారుల ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని…తద్వారా ఆ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సిఎం అన్నారు. త్వరలో కొత్త టెక్స్‌టైల్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిపుణులు, కన్సల్టెన్సీ ద్వారా చేనేత, హస్తకళలలో ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి ఇ-కామర్స్ , రిటైల్ చైన్‌లతో జతకట్టాలని అన్నారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. పిఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాలున్నవారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని సిఎం అన్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్రకటించినట్లు నేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
👉గురుకుల పాఠశాల అధ్యాపకుల నిర్లక్ష్యం వలన విద్యార్థిని బలి.. అంటున్న తల్లితండ్రులు.. నందిగామ**
చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ని గురుకుల పాఠశాల లో ఎనిమిదోవ తరగతి చదువుతున్న కస్తాలా అపర్ణ D/O కిషోర్ చందర్లపాడు గ్రామ నివాసి అయిన కస్తాల అపర్ణ ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8/9/2024 నుండి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విద్యార్థిని. అధ్యాపకులకు తెలియజేయగా గురుకుల పాఠశాలలోని అధ్యాపకులు సొంత ప్రయత్నంగా టాబ్లెట్స్ తెప్పిచ్చి ఇచ్చి వైద్యం అందించినట్టు అక్కడ ఉన్న స్థానికులు తెలియజేశారు,
గత 12 రోజుల నుండి విద్యార్థిని ఆరోగ్యం బాగోకపోయినా అధ్యాపకులు పట్టించుకోకపోగా రోజువారి తరగతులకు హాజరవుతున్నవిదర్థిని ని అధ్యాపకులు గమనించకుండా వారి పనిలో వారు ఉంటూ విద్యార్థిని ని నిర్లక్ష్యానికి గురిచేసి ఆరోగ్యం క్షీణించిన తరువాత ది 23/9/2024 సోమవారం ఉదయం నందిగామలోని దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ వైద్యశాల )కు అధ్యాపకులు తీసుకువచ్చి ఆరోగ్యం బాగోలేదు నీరసంగా ఉందని చెప్పి వైద్యశాలలో చేర్పించినారు, కనీసం ఇన్ని రోజులైనా అధ్యాపకులు తల్లిదండ్రులకి విద్యార్థిని ఆరోగ్యం బాగోలేదని తెలియ చేయలేదని తల్లిదండ్రులు స్థానికులు తెలియజేశారు, వైద్యశాలలోని డాక్టర్లని వివరణ అడగగా గురుకుల పాఠశాల నుండి విద్యార్థిని తీసుకొచ్చి ఆరోగ్యం క్షీణించింది వైద్యం అందించాలని తెలియజేయగా డాక్టర్లు విద్యార్థినికి తగు వైద్యం అందిస్తున్న సమయంలో సడన్గా ఆరోగ్యం క్షీణించి ఒక్కసారిగా విద్యార్థిని ఆరోగ్యం క్షీణించటం తీవ్రతరం అవటంతో డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు సిఫారసు చేయగా తీవ్రత ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల విద్యార్థిని అకాల మరణం చెందింది, దీనిపైన తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురై గురుకుల పాఠశాల అధ్యాపకుల పైన చాలా ఆగ్రహాన్ని చూపిస్తున్నారు, ఇంత నిర్లక్ష్యం వహించిన అధ్యాపకులను తక్షణమే విధులను తొలగించాలని విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు స్థానికులు నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో ఆందోళన చేస్తున్నారు,
👉ఇది మంచి ప్రభుత్వం* కార్యక్రమంలో భాగంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ పర్యటన సందర్బంగా 53వ డివిజన్ అధ్యక్షులు *రావూరి సత్యనారాయణ* ప్రధాన కార్యదర్శి *టీవి మధు సుధనరావు* ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ సెల్ అధికార ప్రదినిధి 53,54,క్లస్టర్ ఇంచార్జి *సయ్యద్ కరీముల్లా*, 53వ డివిజన్ యూనిట్ ఇంచార్జి నియోజకవర్గం మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి *సయ్యద్ ఇమ్రాన్* టీడీపీ డివిజన్ నాయకులు *పట్నలా హరి* బూత్ కన్వీనర్ *విజయ లక్ష్మి* కార్యక్రమంలో పాల్గున్నారు
👉 త్వరలో తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్
అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం
రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు..
సంక్షేమ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు-సీఎం రేవంత్
వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డ్ విధానంతో..
ముందుకెళ్లాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్‌కు..
జిల్లాల వారీగా ఒక వ్యవస్థ ఉండాలి-సీఎం రేవంత్..
👉 గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
రైల్వే, జిల్లా కోర్టులో ఉద్యోగాలు అంటూ డబ్బు వసూలు
10 మంది నుంచి రూ.కోటి వసూలు చేసిన..
చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
👉కబ్జా చేసిన పేదల ఇంటి స్థలాలు తిరిగి బాధితులకు ఇప్పించిన మడకశిర ఎమ్మెల్యే..
వైకాపా ప్రభుత్వంలో మా ఇంటి స్థలాలు కబ్జాకు గురయ్యాయని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు..
పట్టణ పరిధిలోని చీపులేటిలో గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్ స్థలాన్ని పలువురు కబ్జా చేశారు..
ఈ విషయం పై 20రోజుల్లొ ఎమ్మెల్యే ఎం. ఎస్. రాజుగారు రెవిన్యూ అధికారులను పిలిపించి బాధితులకు స్థలాలు వారికే చెందే విధంగా పట్టాలు తయారు చేయించారు..
నష్టపోయిన బాధితులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు సోమవారం పట్టాలు పంపిణీ చేశారు..
పట్టాలు తీసుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
*రెవిన్యూ కార్యాలయానికి రక్షణ ఎక్కడ!..*హుజూర్ నగర్..విలువైన రికార్డులు. సామాగ్రి. తదితర వస్తువులు..
*జరగరాని సంఘటన జరిగితే బాద్యులు ఎవరు!..
*రాత్రి పూట రక్షకుడు లేడు గేటుకు తాళం ఉండదు..
*ఉదయం ప్రేమ జంటలకు ఆతిధ్యం..*పని చేయని నిఘా నేత్రాలు..ఆకాశం వైపు చూస్తున్న సీసీ కెమెరాలు..
*చోద్యం చూస్తున్న రెవిన్యూ అధికారులు..
👉 గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్,
గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్
ఈ నెల 28న చాక్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమాలు చేపడతామని గురుకుల విద్యా జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తెలంగాణలోని SC, ST, BC, మైనార్టీ, జనరల్ గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని డిమాండ్ చేసింది. నైట్ స్టడీ అవర్స్ అనంతరం రాత్రి 9 గంటలకు ఇళ్లకు వెళ్లేందుకు మహిళా టీచర్లు ఇబ్బంది పడుతున్నారంది. అలాగే మెస్ ఛార్జీలు పెంచాలని, 010 కింద జీతాలు, కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరింది.
👉లడ్డూ వివాదంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు😯
తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని.. త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా జంతు సంబంధ ఉత్పత్తులతో తయారైన ప్రసాదం భక్తి తత్పరతతో స్వీకరించినమన్న ఆలోచన భక్తులమెవ్వరం సహించలేమని తెలిపారు. ఈ వార్త అసత్యం అయి తీరాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు
👉 సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్..
‘దేవర’ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. “దేవర విడుదల కోసం కొత్త జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు” అని తారక్ ట్వీట్ చేశారు.
👉 ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్..
ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్
బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, బీమా రంగాల్లో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 10 వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా దేశంలో తొలిసారిగా ఓ కోర్సును తీసుకొస్తోంది. దీనిని రేపు (బుధవారం) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 18 ఇంజినీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో అమలు చేసి కోర్సు పూర్తైన వారికి సర్టిఫికెట్, ఇంటర్న షిప్ తో పాటు ఉద్యోగమూ పొందేలా చూస్తారు.
ఆన్లైన్ ట్రేడింగ్..హైటెక్ చీటింగ్😱.. 👉10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..వీటిని కూల్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?-బిజెపి ఎంపీ ఈటెల సవాల్….చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం..ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం..గురుకుల పాఠశాల అధ్యాపకుల నిర్లక్ష్యం వలన విద్యార్థిని బలి?..👉కబ్జా చేసిన పేదల ఇంటి స్థలాలు తిరిగి బాధితులకు ఇప్పించిన మడకశిర ఎమ్మెల్యే..లడ్డూ వివాదంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు
Recent Posts