..నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష… నాటి పాలకులు గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిగా విస్మయించారు-మంత్రి గొట్టిపాటి..వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..మర్రిపూడి లో టిడిపి సంబరాలు..మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు.. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు..

👉నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్‌ మేళా నిర్వహణకు క్యాలెండర్‌: లోకేశ్*
నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్‌ మేళా నిర్వహణకు క్యాలెండర్‌ రూపొందించనున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. నైపుణ్యాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో ఆయన ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరికులమ్‌లో మార్పులు చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు.
👉రేపు అకౌంట్లోకి డబ్బులు జమ*
వరదలతో నష్టపోయిన బాధితుల అకౌంట్లోకి ఏపీ ప్రభుత్వం బుధవారం ఆర్థిక సాయం జమ చేయనుంది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ఈ సాయం అందనుంది. వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు ఇవ్వనున్నారు. దుకాణాలు ధ్వంసమైన వారికి రూ.25 వేలు, పంటలకు హెక్టారుకు రూ.25 వేల చొప్పున అందజేస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ఇళ్లకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
👉హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు..
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు
హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే 10 టీమ్ లు తనిఖీలు చేస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా..రామాయణంలో భరతుడిలా పాలిస్తా!..ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆతిశీ వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ మళ్లీ సీఎం అయ్యేదాకా
ఆయన కుర్చీ అలాగే ఉంటుంది సీఎం ఆఫీసులో రెండో కుర్చీ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆమె.. పక్కనే పాత సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కుర్చీని ఖాళీగా ఉంచారు. ఆయన వాడిన కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చొని ఆతిశీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో సన్నివేశాన్ని ప్రస్తావించారు. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో భరతుడు రాజ్యాన్ని ఏలాల్సి వచ్చిందన్నారు. అప్పుడాయన రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి బాధ్యతలు నెరవేర్చారని గుర్తుచేశారు. ఇప్పుడు తనదీ అదే పరిస్థితి అని ఆతిశీ చెప్పారు. భరతుడి స్ఫూర్తితోనే తాను నాలుగు నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తానని తెలిపారు.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని, అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు
👉మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు*
* కుమ్మరిగూడెం 22 ఎకరాల మడుగులో అక్రమణలు తొలగింపు..* నేలమట్టమైన వందలాది గృహాలు
* గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా మడుగు భూమిని నివేశన స్థలాలుగా కేటాయింపు.. ఎన్నికల్లో లబ్ధి కోసం విద్యుత్ కనక్షన్లు ఇచ్చి గృహ నిర్మాణాలు చేపట్టిన గత పాలకులు.. కూటమి ప్రభుత్వం రావటంతో ఆపరేషన్ అక్రమణలు చేపట్టిన అధికారులు..* నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 180 గృహాలు కూల్చివేత *ఆందోళనలో అక్రమణదారులు*మచిలీపట్నం :*
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో హైడ్రా తరహా అక్రమణల తొలగింపుకు నగర పాలక సంస్థ అధికారులు తెర లేపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా మడుగు పోరంబోకు భూమిలో నిర్మాణాలు చేసిన 180 గృహాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేస్తున్నారు.
స్థానిక కుమ్మరిగూడెంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న 22 ఎకరాల మడుగు భూమిలో అప్పటి MLA పేర్ని నాని పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేశారు.
ఎన్నికల్లో లబ్ది పొందేందుకు విద్యుత్ కనక్షన్లు కూడా ఇప్పించి వారితో గృహ నిర్మాణాలు చేపట్టించారు.
ఈ చర్యలను అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న కొల్లు రవీంద్ర తీవ్రంగా ప్రతిఘటించారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మడుగు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పెడ చెవిన పెట్టారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అక్రమణలపై దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగానే మడుగు పోరంబోకు భూమిని అక్రమించి అక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు.
నోటీసులకు స్పందించకపోవటంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రోక్లైన్లతో అక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు.
అయితే ఈ అక్రమణల తొలగింపుపై అక్రమణదారులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి MLA పేర్ని నాని చెబితేనే తాము ఇక్కడ గృహాలు నిర్మించుకున్నామని.. నేడు అక్రమణలంటూ తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కొంత మంది స్వార్ధ రాజకీయాల కోసం తాము కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నిస్తున్నారు.
👉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టీటీడీ విజిలెన్స్ విచారణకు సంబంధించి అధికారులు పంపిన లేఖలకు వివరణ ఇచ్చేందుకు చట్టం అనుమతిస్తున్న ఫైల్స్‌ను వారంలో సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ ఫైల్స్ అందిన తర్వాత మూడు వారాల్లో విజిలెన్స్‌ అధికారులకు వివరణ ఇవ్వాలని సుబ్బారెడ్డిని ఆదేశించింది. అలాగే రాష్ట్ర విజిలెన్స్‌ అధికారుల విచారణాధికారాన్ని తేల్చాలంటే ప్రభుత్వ కౌంటర్‌ అవసరమని అభిప్రాయపడిన కోర్టు.. విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.
తాను టీటీడీ ఛైర్మన్‌గా తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ లేఖలు పంపడాన్ని వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై.. ప్రభుత్వం తనపై చేస్తోన్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణ జరగ్గా.. లాయర్లు వాదనలు వినిపించారు.
టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా తీసుకున్న పలు నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ మొత్తం ఏడు నోటీసులు పంపించిన విషయాన్ని కోర్టుకు వివరించారు సుబ్బారెడ్డి తరఫు లాయర్. పిటిషనర్‌ ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్‌గా లేరని.. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరినా ఎస్పీ స్పందించలేదన్నారు. పిటిషనర్‌పై చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరిపి సంబంధింత శాఖకు నివేదిక సమర్పిస్తుందని.. చర్యలు చేపట్టే అధికారం విజిలెన్స్‌కు లేదని ప్రభుత్వం తరఫున ఏజీ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. విజిలెన్స్ అధికారులకు తెలిసిన సమాచారం చెబితే సరిపోతుందని కదా అని పిటిషనర్‌‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీ పాలమండలి ఛైర్మన్‌గా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉంటారని.. విజిలెన్స్‌ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత పిటిషనర్‌పై ఉంటుందని అభిప్రాయపడింది.
👉 సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు..
పసిబిడ్డలపై, బడులకు వెళ్లే చిన్నారులపై లైంగిక అకృత్యాలు అధికమవుతున్న పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. బాలలతో చిత్రించిన అశ్లీల దృశ్యాలను(చైల్డ్‌ పోర్నోగ్రఫీ) చూడడం, డౌన్‌లోడ్‌ చేయటమే కాదు… వాటిని కలిగి ఉన్నా నేరమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి.పార్దీవాలతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పోక్సో, ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించవచ్చునని తెలిపింది.
👉 త‌మిళ‌నాడులోని 11 ప్ర‌దేశాల్లో ఎన్ఐఏ సోదాలు..,
త‌మిళ‌నాడులోని 11 ప్ర‌దేశాల్లో ఎన్ఐఏ సోదాలు
త‌మిళ‌నాడులోని 11 ప్ర‌దేశాల్లో ఈరోజు ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఉగ్ర‌వాదం కుట్ర కేసులో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఈ విచార‌ణ‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉన్న‌ది. చెన్నై, పుదుకొట్టై, క‌న్యాకుమారిల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. హిజ్ ఉత్ త‌హిర్ కేసు విచార‌ణ‌లో భాగంగా ఈ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు రిక్రూట్మెంట్ చేస్తున్న నేప‌థ్యంలో ఎన్ఐఏ ఈ సోదాలు చేప‌ట్టింది.
👉నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష..*స్కిల్ సెన్సెస్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన, నైపుణ్యశిక్షణపై చర్చించిన మంత్రి*..ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ కార్యాలయాలపై నోట్ కు ఆదేశం..*నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకై క్యాలెండర్.* *అమరావతిః* నైపుణ్యాభివృద్ధి శాఖపై విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంతి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై చర్చించిన మంత్రి నారా లోకేష్ పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతాల్లో నైపుణ్యగణన చేపట్టాలని ఆదేశించారు. పరిశ్రమలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకు వచ్చిందన్న అంశంపై సమావేశంలో చర్చించారు. ఐటీఐ కాలేజీల్లో ఉద్యోగాల కల్పన, శిక్షణపైనా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకై క్యాలెండర్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఉన్న ఎంప్లాయింట్ మెంట్ ఎక్స్ చేంజ్ కార్యాలయాలపై సమగ్ర నోట్ సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డ్యాష్ బోర్డు రూపకల్పన, స్కిల్ యూనివర్సిటీ అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరభ్ గౌర్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండ్, సీఈవో జి.గణేష్ కుమార్, కేపీఎంజీ(పీఎంయూ, ఏపీఎస్ఎస్ డీసీ) స్టేట్ హెడ్ కుమార పురుషోత్తం, కేపీఎంజీ(పీఎంయూ, ఏపీఎస్ఎస్ డీసీ) ఈ.మోహన్ తదితరులు పాల్గొన్నారు.
👉 వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..
NTR: విజయవాడ గుణదలలోని వ్యభిచార గృహంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పప్పులు మిల్లు సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఇద్దరు మహిళలను ఒక యువకుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
👉 నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మార్కాపురం శాసనసభ్యులు .. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి స్టేట్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్ లో ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో మార్కాపురం నియోజకవర్గంలోని అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల విభాగంలో పోటీలు జరిగాయి.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ క్రీడలు భవిష్యత్తుకు పునాది అని క్రీడల్లో బాగా రాణించిన బాల బాలికలు చదువుల్లో కూడా ముందు ఉంటారని అన్నారు.ఈ సందర్భంగా బాల బాలికలకు శుభాశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యాధికారులు, టీచర్స్, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
👉ఇది మంచి ప్రభుత్వం* ప్రచారంలో నగర కమీషనర్.
*నాలుగవ సచివాలయ లొ… టిడిపి శ్రేణులు, కమీషనర్ ఆధ్వర్యంలో..పొదిలి పట్టణంలోని ఐదుసచివాలయంలో కుటమి ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ పుసలపాటి శ్రీనివాసరావు స్దానిక టిడిపి పాల్గొన్నారు._
కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రొజులు అయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన మంచి పనులగురించి ప్రజలకు వివరించారు.ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన తక్షణమే స్పందిస్తామని అధికారులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని కమీషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్స్పెక్టర్ మారుతీరావు, టిడిపి నాయకులు ముల్లా ఖుద్దుస్,ఓబుల్ రెడ్డి, రసూల్, కాటూరి శ్రీను దివ్యల మురళిజిలాని భాష వెలుగోల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
👉నాటి పాలకులు గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిగా విస్మయించారు*కూటమి ప్రభుత్వం వచ్చాక గుండ్లకమ్మకు రూ. 8 కోట్లు కేటాయించాం*
*సాగు నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ**త్వరలోనే కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి*
*విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్*
వెల్లంపల్లి:* గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. పులిచింతల, అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టులే ఇందుకు ఉదాహరణలు అని మంత్రి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా వెల్లంపల్లి పొగాకు బోర్డుకు చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్… పొగాకు కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. పూర్తి స్థాయిలో రైతుల పంట కొనుగోలుకు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు రిపేరు పనులను స్థానిక రైతు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత సాగు నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా జిల్లాలోని గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా నాటి వైసీపీ పాలకులు చోద్యం చూస్తూండిపోయారని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ. 8 కోట్ల నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ మొత్తంతో ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. వైసీపీ నాయకులు గడిచిన మూడేళ్ల నుంచి గుండ్లకమ్మలో చుక్క నీరు కూడా నిలబెట్ట లేకపోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 1.75 టీఎంసీలు నీళ్లు నిలబెట్టగలిగాం అని వెల్లడించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద ఉన్న కాల్వల పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులపై గొట్టిపాటి రవి కుమార్, సంబంధిత శాఖ మంత్రి రామానాయుడుతో ఫోన్ లో మాట్లాడారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి రామానాయుడు త్వరలోనే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పొగాకు బ్లేడ్లను పరిశీలించారు. లో గ్రేడ్ పోగాకును కూడా వెనక్కి పంపకుండా మొత్తం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాధ్యమైనంత వరకు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి సూచించారు.
👉 మర్రిపూడి లో టిడిపి సంబరాలు. ఆంధ్రప్రదేశ్ మారీటైం బోర్డు చైర్మన్ గా కొండపి నియోజకవర్గం చెందిన యువ నాయకులు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం దామచర్ల సత్య గారికి పదవిని కట్టబెట్టిన *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు* గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మండల కేంద్రమైన మర్రిపూడి బస్టాండ్ సెంటర్లో టిడిపి నాయకులు సంబరాలు నిర్వహించారు. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాల ఎదురుగా మండల నాయకత్వం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాణ సంచనాలు కాలుస్తూ ఆనందోత్సవంలో టిడిపి క్యాడర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ చేరెడ్డి నరసారెడ్డి, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి యర్రమోతు శ్రీనివాసులు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధిరేగుల వీరనారాయణ, మాజీ జడ్పిటిసి తుళ్లూరి నరసింహారావు, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు గొంటు హనుమారెడ్డి, మాజీ మండల కన్వీనర్ యర్రం రెడ్డి వెంకటరెడ్డి, మాకినేని శ్రీను, పువ్వాడ వెంకటేశ్వర్లు, మండలంలోని పలు గ్రామాల టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
👉వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యం..
గ్రామాల అభివృద్దే ఎన్డీయే లక్ష్యం..గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
*రాష్ట్రంలో గ్రామాలను అభివృద్ధి చేయటమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.”ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా 5వ రోజు కంభం మండలం, “తురిమెళ్ళ” గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గోన్నారు. మొదటగా గ్రామంలోని ఆర్ బి కె సెంటర్ లో ఏర్పాటు చేసిన “పొలం పిలుస్తుంది”కార్యక్రమంలో పాల్గోని ఆర్ బి కె ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు వైసిపి పాలనలో గ్రామ పంచాయతీల అభివృద్ధిని గాలికి వదిలేసి సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేశారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖలాలు కూడా లేవన్నారు. తన పాలనా కాలమంతా ప్రజలను వేధించడం పీడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. అలాంటి రాక్షస పాలనను అంతమొందించి, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 100 రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలను పొందిందన్నారు.ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, సామాజిక పెన్షన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచి, ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తూన్నామని, ఉద్యోగస్తులకు ప్రతినెల 1వ తేదీనే తమ అకౌంట్లలో జీతాలు పడుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతారని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, రాష్ట్రంలో పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రజా వేదికలో ప్రజలు అర్జీల ద్వారా తెలియజేసిన సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. సభ అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదా సుభద్ర, జడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ,మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీను, కేతం శ్రీనుతో పాటు అన్నీ విభాగాల అధికారులు మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గోన్నారు.*
👉 చంద్రబాబు చెప్పాడు – గోరంట్ల చేశాడు
ఇద్దరు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న గోరంట్ల..
అధైర్య పడొద్దు మీ ఇద్దరి బిడ్డల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుంది, శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మీ ఇద్దరి బిడ్డల చదువుల బాధ్యతను తీసుకుంటాడంటూ ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిండు సభలో నిరుపేద తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చాడు. మాట ఇచ్చినదే తడవుగా నిరుపేద తల్లిదండ్రులు ఖాజావలి, బీబీ సార ల ఇద్దరు పిల్లలలో ఒకరైన పఠాన్ రజియా ను శ్రీ హర్షిణి జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ చేర్పించడం జరిగింది. ఇంటర్మీడియట్ రెండేళ్లు హాస్టల్ తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. మరొక బాబు ను మార్టూరులోని శ్రీ హర్షిణి స్కూల్లో పదో తరగతికి చేర్పించబోతున్నామని బాబుకు కూడా పూర్తి ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
👉 రాచర్ల మండలంలోని గంగంపల్లి మరియు అనుమలవీడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ముందుగా ప్రత్తి, వరి మరియు కంది పంటలను సందర్శించడం జరిగింది తరువాత గ్రామసభ నిర్వహించడం జరిగింది, ఈ గ్రామ సభలో మండల వ్యవసాయ అధికారి షేక్. అబ్దుల్ రఫీక్ మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పంటలో మెగ్నీషియం లోపం ఉందని దీని నివారణ గాను లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారి చేసినట్లయితే మెగ్నీషియన్ లోపం నివారించవచ్చునని తెలిపారు, ప్రస్తుతం కంది పంట కళ్ళే దశలో ఉందని నల్లి మరియు మరుక మచ్చల పురుగు రాకుండా ముందుగానే వేప నూనె లీటర్ నీటికి 5 ml కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు, అనంతరం ఖరీఫ్ సీజన్లో సాగు చేసినటువంటి పంటలకు పంట నమోదు, రైతుల యొక్క అతంటికేషన్ గురించి చర్చించడం జరిగింది అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు గురించి రైతులకు వివరించడం జరిగింది, అనంతరం వెటర్నరీ డాక్టర్ డి.హరిబాబు గారు మాట్లాడుతూ దూడలలో నులిపురుగుల నివారణ గురించి మరియు వ్యాక్సిన్స్ గురించి రైతులకు వివరించడం జరిగింది, పాడిలో అధిక లాభాలు పొందుట గురించి రైతులకు వివరించడం జరిగింది, మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ N. మోహన్ కృష్ణ మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డ్రిప్పు 90 శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నట్టు తెలిపారు, Sprinklers 55 % రాయితీ పైన రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు కావాల్సినటువంటి రైతులు రైతు సేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు,గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది.
👉 నంద్యాల హైవేపై వాహనదారుల అవస్థలు*
గాజులపల్లె -నంద్యాల జాతీయ రహదారిపై లారీలు, బస్సుల రాకపోకలు స్తంభించాయి. మంగళవారం తెల్లవారుజామున నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో ఇటుకల దిమ్మెలను ఉల్లిగడ్డ లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని కిలోమీటర్ల వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రమాదంలో దెబ్బతిన్న లారీని తొలగించక పోవడంతో, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
👉 ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, యడవల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న రాచర్ల పోలీసులు.
రూ,,42,900/-లు స్వాదీనం, కేసు నమోదు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..