పని ఒత్తిడితో యువతి మృతి.. వివాదాస్పదమైన నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు.. 👉శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం..రాములోరి రథానికి రక్షణ కరువు.. 👉రూ.50 లక్షల వైద్యం నిమ్స్‌లో ఉచితం..మరో సెలబ్రెటీ పై యువతి ఫిర్యాదు..రూ.997తో అదిరే ఆఫర్..మాగుంట పార్వతమ్మ కన్నుమూత..!.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ, జిల్లా కలెక్టర్..

👉 పని ఒత్తిడితో యువతి మృతి.. వివాదాస్పదమైన నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు..!!!🤭🤭🤭
నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని ఓ కళాశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా ఉద్యోగి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. సీఏ చదివిన ఓ యువతి పని ఒత్తిడి తాళలేక మరణించారన్న వార్త తనను కలచి వేసిందని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు పని ఒత్తిడిని జయించడం గురించి కూడా విద్యా సంస్థలు బోధించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
👉 ఏపీలో అత్యవసర సేవలకు 112కు డయల్ చేయండి..
తెలుగు రాష్ట్రాల్లో అత్యవసర సేవల కోసం 100కు డయల్ చేస్తాం. ఇకపై ఏపీలో 100కు బదులు 112కు డయల్ చేయాలి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు అత్యవసర సేవలకు డయల్ 100 సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు నంబర్లు కేటాయించారు. తెలంగాణకు డయల్ 100, ఏపీకి డయల్ 112 కేటాయించారు.
👉శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం..
శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా మంగళవారం హరిణి అమరసూర్య ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ)కి చెందిన ప్రముఖ నాయకురాలు అమరసూర్య ఈ పదవిని చేపట్టిన 16వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. హరిణి అమరసూర్య ఎన్‌పీపీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. 2000లో సిరిమావో బండారునాయకే తర్వాత ఆ పదవిని చేపట్టిన మహిళగా హరిణి చరిత్ర సృష్టించింది.
👉 రాములోరి రథానికి రక్షణ కరువు???
*అనంతపురం జిల్లా,ఉరవకొండ:*
*సోమవారం అర్ధరాత్రి దాటిన సమయంలో రథానికి నిప్పు …*మద్యం మత్తులో రాములోరి రథానికి నిప్పు పెట్టిన దుండగులు .. సీఎం చంద్రబాబు సీరియస్ … రంగంలోకి ప్రత్యేక బృందాలు..అనంతపురంలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశం.
▪️ఘటనా స్థలానికి వెళ్లాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశం..▪️ఘటనకు గల కారణాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలన్న చంద్రబాబు..▪️నిందితులని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలన్న సీఎం..▪️ఘటన జరిగి సుమారుగా 12 గంటలు గడుస్తున్న తరుణంలో గ్రామస్తులు, భక్తులు ఆందోళన.
👉ఫోన్‌ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం విచారణ చేస్తుంది: డీజీపీ..ఫోన్‌ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీఎం విచారణ చేస్తుందని డీజీపీ జితేందర్ వెల్లడించారు.HYD సీపీ, వెస్ట్‌జోన్‌ డీసీపీ విచారణ చేస్తున్నారని తెలిపారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుకు రెడ్‌కార్నర్ నోటీసు ఇవ్వటానికి ఇంత సమయం పట్టిందన్నారు. రెడ్‌ కార్నర్‌ నోటీసుల కోసం ఇంటర్‌పోల్‌కి లేఖ రాశామని.. సీబీఐకి రాగానే రెడ్‌ కార్నర్ నోటీసు జారీ చేస్తామన్నారు. తెలంగాణ చుట్టుపక్క రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఉందన్నారు. మావోయిస్టుల కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
👉రూ.50 లక్షల వైద్యం.. నిమ్స్‌లో ఉచితం*
అరుదైన జబ్బులతో బాధపడే పిల్లలకు ప్రత్యేక విభాగం
హైదరాబాద్‌ సిటీ: పిల్లలు గౌచర్‌.. పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ జబ్బుల బారిన పడితే వారికి జీవితాంతం ఖరీదైన మందులు ఇవ్వాల్సిందే. ఆ తరహా బాధితుల్లో ఎదుగుదల సరిగా ఉండదు. మానసిక పరిపక్వత అంతంత మాత్రమే. వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడవచ్చు. చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలో జెనెటిక్‌, అరుదైన జబ్బులకు చికిత్స అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పాలసీని ఫర్‌ రేర్‌ డిసీజ్‌ (ఎన్‌సీఆర్‌డీ) పాలసీ తీసుకు వచ్చింది. ఈ పాలసీని ఇప్పుడు నిమ్స్‌లో అమలు చేస్తున్నారు. జెనెటిక్‌, అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డు, వైద్యులు, పడకలను ఏర్పాటు చేశారు.
జెనెటిక్‌ విభాగంలో..
సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయాగ్నోస్టిక్‌ సహకారంతో నిమ్స్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జెనెటిక్‌ విభాగంలో ఈ డే-కేర్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి తెలిపారు. గౌచర్‌, పాంపే వంటి అరుదైన, జెనెటిక్‌ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు..
ఎన్‌సీఆర్‌డీ పాలసీ ప్రకారం అరుదైన, జెనెటిక్‌ వ్యాధులతో బాధపడే ఒక్కో వ్యక్తి చికిత్సకు రూ.50 లక్షలను సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ మినిస్ట్రీ నుంచి నిధులు కేటాయిస్తారు. దీంతో బాధితులకు ఉచితంగానే ఇక్కడ చికిత్స అందుతుంది. ప్రస్తుతం గౌచర్‌ వ్యాధితో బాధపడుతున్న 26 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఇది జెనెటిక్‌ సమస్య వల్ల వచ్చే వ్యాధని, సాధారణ మందులతో పాటు ఐవీ ఇన్ఫ్యూజన్‌ ఇవ్వాల్సి ఉంటుందని నిమ్స్‌ జెనెటిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ షుగున్‌ అగర్వాల్‌ వివరించారు. ఈ సమస్య ఉన్నవారిలో ప్లీహం పెద్దగా కావడం, కాలేయం పనిచేయక పోవడం, నాడీ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఈ జబ్బు సాధారణంగా 2 నుంచి 12 ఏళ్ల వయస్సు పిల్లలకు వస్తుందని అగర్వాల్‌ తెలిపారు.
పిల్లల వైద్యులు గుర్తించాలి
అరుదైన, జెనెటిక్‌ వ్యాధులతో బాధపడే పిల్లలకు జీవితాంతం మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పిల్లల వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఈ జబ్బును గుర్తిస్తారని, జెనెటిక్‌, అరుదైన వ్యాధి లక్షణాలు ఉంటే తమ వద్దకు పంపిస్తారని అగర్వాల్‌ చెప్పారు. నిలోఫర్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి వస్తున్నారని తెలిపారు. పిల్లల బరువు, వయస్సును బట్టి చికిత్సలు అందించాల్సి ఉంటుందన్నారు. చాలా ఖరీదైన మందులు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.
పాంపే డిసీజ్‌..ఈ జబ్బుతో బాధపడే వారికి గుండె, కాలేయంలో వాపు వస్తుంది. దీని వల్ల పిల్లలకు గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంది. మెరుగైన చికిత్స అందించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. పుట్టిన ఏడాది నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు ఈ జబ్బు వస్తుందని, ప్రస్తుతం ఈ వ్యాధితో నలుగురికి చికిత్సలు అందిస్తున్నామని అగర్వాల్‌ వెల్లడించారు..
👉మరోక సెలబ్రెటీ పై … మరో యువతీ ఫిర్యాదు😯😯
*హైదరాబాద్:👉యూట్యూబర్‌ హర్షసాయిపై ఫిర్యాదు.
▪️పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు.▪️నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బిగ్‌బాస్ ఫేమ్.▪️పేదవారికి సాయం చేస్తూ యూట్యూబ్‌లో వ్యూయర్స్‌ను ఆకట్టుకున్న హర్ష.▪️హర్షసాయితో పాటు తండ్రి రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన యువతి.▪️పెళ్లి పేరుతో రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆరోపణ.
▪️యువతి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు.
👉 రూ.997తో అదిరే ఆఫర్
జియో, ఎయిర్ టెల్ లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు ప్రభుత్వరంగ సంస్థ BSNL గట్టి పోటీనిస్తూ మరో ఆఫర్ ను తీసుకువచ్చింది. రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటా చొప్పున 160 రోజులకు 320 GB డేటా ఇస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
👉నూతన అధికారులు విధి నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి: సీపీ సుధీర్ బాబు *
*ఫ్రెండ్లీ పోలీసింగ్ భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి*
తెలంగాణ పోలీసు శాఖలో నూతనంగా ఎంపికై శిక్షణలో ఉన్న 56 మంది ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ అధికారులకు కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ అధికారులకు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ యొక్క ప్రాధాన్యత, గొప్పదనాన్ని వివరించి, పలు విలువైన సూచనలు ఇచ్చారు. పోలీసు శిక్షణ జీవితంలో గొప్ప అవకాశం అని, శిక్షణ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిక్షణాధికారులు, అధ్యాపకులు నేర్పే అంశాలను శ్రద్ధాసక్తులతో నేర్చుకోవాలని సూచించారు. నూతన నేర న్యాయ చట్టాల పైన పూర్తి స్థాయి పరిజ్ఞానం, అవగాహన పెంచుకోవాలని, తద్వారా విధి నిర్వహణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం ద్వారా సమాజంలో వివిధ వర్గాల ప్రజలకు సత్వర న్యాయం అందించే గొప్ప అవకాశం లభిస్తుందని, అది గొప్ప సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని, పౌరసేవలకు అంకితం కావాలని, పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. ప్రజలతో మమేకమై పని చేయాలని, బాధితులు ధైర్యంగా స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా పని వాతావరణం ఉండాలని సూచించారు. సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలని, పోలీస్ స్టేషన్కు వస్తే న్యాయం జరుగుతుందనే ఫ్రెండ్లీ పోలీసింగ్ భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని, కింది స్థాయి సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగాలని, కలసికట్టుగా పని చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిర, ఎసిపి నరేందర్ గౌడ్, ఎసిపి రమేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉బాపట్ల జిల్లా:*చీరాల రూరల్ సిఐగా శేషగిరిరావు నియామకం.*
*రూరల్ సిఐగా భాద్యతలు స్వీకరించిన శేషగిరిరావు.*
*గతంలో మంగళగిరి,తాడేపల్లి సిఐగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సిఐ శేషగిరిరావు.*
👉 టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళా లో ఉద్యోగం పొందిన వారిని అభినందించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు, టీడీపీ యువ నాయకులు దామచర్ల సత్య
👉 టంగుటూరు మండలం మర్లపాడు లో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొని నందమూరి తారకరామారావు మరియు దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , యువ నాయకులు దామచర్ల సత్య , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ,నగర మేయర్ గంగాఢ సుజాత,నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, దర్శి ఇంచార్జి డా.గొట్టిపాటి లక్ష్మి, మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు, నూకసాని బాలాజీ , హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవి కుమార్ ,సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , డా.కడియాల లలిత్ సాగర్ , పాపా రావు , సిరిపురం వెంకట్రావు మరియు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , యువ నాయకులు దామచర్ల సత్య , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా. డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , యర్రగొండపాలెం ఇంచార్జి గూడూరి ఏరిక్షన్ బాబు , నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు , దర్శి ఇంచార్జి డా.గొట్టిపాటి లక్ష్మి , కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు ,పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు , మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు,నూకసాని బాలాజీ , బీజేపీ నాయకులు శివా రెడ్డి , యోగయ్య యాదవ్ , హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవి కుమార్ ,డా. కడియాల లలిత్ సాగర్ పాపారావు,డా. కందుల గౌతమ్ రెడ్డి తదితర నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉 ఒంగోలు లోని ఆస్టోనా ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర అధ్యక్షులు దాయనేని ధర్మరావు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు , నగర మేయర్ గంగాఢ సుజాత మరియు తదితర ఉద్యోగస్తులు, డీలర్లు మరియు పలువురు బైక్ మెకానిక్కులు,నాయకులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు
👉 పప్పులో ప్రత్యక్షమైన జెర్రి..😱😱😱
హైదరాబాద్ – అబిడ్స్‌లోని తాజ్ మహల్ హోటల్లో.. ఓ కస్టమర్ పప్పు కర్రీ ఆర్డర్ చేయగా అందులో జెర్రి కనిపించింది.దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్.
👉 నూజివీడు ట్రిపుల్ ఐటీ సాంబారులో పిండి ముద్దలు😱
నూజివీడు ట్రిపుల్ ఐటీలోని మెస్ సాంబార్లో పిండి ముద్దలు రావడంతో విద్యార్థులు మంగళవారం రాత్రి ఆందోళన చెందారు. భోజనం చేద్దామనుకున్న విద్యార్థులకు సాంబారులో పిండి ముద్దలు కనిపించడంతో అర్ధాకలితో వెళ్లిపోయామన్నారు. యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ కాంట్రాక్టర్లను రద్దుచేసి, కొత్తవారిని రప్పించాలన్నారు.
**మైదుకూరు..చిన్నయ్య గారి పల్లి నుంచి ఎల్లంపల్లి వెళ్ళు దారిలో సుమారు 100 మీటర్లు నీరు నిలిచి ఉన్నది ఎప్పుడు వర్షాలు వచ్చిన డ్రైనేజీ వ్యవస్థ లేనందున ఈ నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బంది కలుగజేస్తుంది. పేరుకే మున్సిపాలిటీలు ఇంత తప్ప మరి ఏమి లేదు అన్ని గ్రామ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.
👉నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ.
*జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పారిపోయిన పనిమనిషి నాయక్*..*నిన్న రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు..*తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు*
👉అర్థరాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు..
హైదరాబాద్ జిల్లాలోని రాచకొండ, సైబరాబాద్ పలు ప్రాంతాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్, పాన్ దుకాణాలు,పనివేళలను ఇక నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు నిర్వహించుకోవచ్చని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే సూపర్ మార్కెట్లు, బంగారు షాపులు, ఇతర కిరాణ దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించు కోవచ్చు. దీనికి సంబంధిం చి మంగళవారం ఉత్తర్వుల ను జారీ చేసింది ప్రభుత్వం. వైన్స్ లిక్కర్ అవుట్ లెట్స్ జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే షాపులు సమయాన్ని కూడా పొడిగించారు. ఈ దుకాణాలను ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించు కోవచ్చని తెలిపింది.
జీహెచ్ఎంసీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దుకాణాల నిర్వహణ వేళలు కూడా పెంచింది. వారంతరంలో శనివారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక వీకెండ్ లో అయితే ఉదయం 10గంటల నుంచి అర్థరాత్రి 1 వరకు ఓపెన్ చేసుకోవచ్చు.అట….
👉** ఎన్డీఏ వందరోజుల పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్ట చేపట్టక పోవడానికి నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద థాలి బచావ్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..
👉మాగుంట పార్వతమ్మ కన్నుమూత..!
మాజీ పార్లమెంటు సభ్యులు , ప్రముఖ వ్యాపార వేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామి రెడ్డి సతీమణి , పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వదిన మాగుంట పార్వతమ్మ (77) సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ ఈ ఉదయం ఆమె కన్ను మూసారు.
పార్లమెంటు సభ్యురాలిగా,శాసన సభ్యురాలిగా పార్వతమ్మ పలు హోదాలలో ప్రజలకి తమ సేవలందించారు. మాగుంట సుబ్బరామరెడ్డి దివంగతులైన తరువాత 1996లో తొలిసారిగా ఆమె రాజకీయ రంగప్రవేశం చేసి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ తరువాత 2004లో కావలి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు.
*అంత్యక్రియలు :పార్వతమ్మ పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకి నెల్లూరు , సరస్వతి నగర్ లోని ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు.
అభిమానుల సందర్శనార్ధం రేపు అంటే సెప్టెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు.
గురువారం సాయంత్రం 3గంటలకి అక్కడి నుండి వారి అంతిమయాత్ర బయలుదేరుతుందని మాగుంట కుటుంబసభ్యులు తెలిపారు.
*ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో ఆమె చిత్రపటానికి అయినాబత్తిన ఘనశ్యామ్ ,తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్పా రంగసాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, కండె శ్రీనివాసులు, కుమార స్వామి, కుమార్ గారు, కార్పొరేటర్ శ్రీ రమేష్, బొద్దులూరి నరసింహులు, తిరుమలశెట్టి శ్రీనివాస రావు, రామారావు, ఆళ్ల శ్రీనివాస రెడ్డి, మేడిది రవి, చిలిపి శ్రీనివాస రెడ్డి,రాము స్వర్ణ శ్రీహరి, జజ్జర బాల కోటయ్య , మల్లవరపు కృష్ణ రెడ్డి, ముజీబ్,షేక్ నసీర్ తదితర నాయకులు,మాగుంట అభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
👉ప్రకాశం జిల్లా, కొండపి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీ..
ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్యులు అందిస్తున్న సేవలు తీరును రోగులను అడిగి తెలుసుకున్న మంత్రి..
ఆస్పత్రిలోని పలు రికార్డులు, మందులు పరిశీలించిన మంత్రి ..పేద ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ఆశ్రయించేది ప్రభుత్వ ఆసుపత్రులనే ..వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి..ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..
విద్యా, వైద్యం, ప్రజారోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..అని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హెచ్చరించారు.
👉కొండపిలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసి డాక్టర్లతో అక్కడ పరిస్థితి గురించి తెలుసుకుంటున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి,కలెక్టర్ అన్సారియా..
👉ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత కృష్ణ భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. కొనకనమిట్ట పొదిలి మరిపూడి మండలం లో భారీ వర్షం పడింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం పడుతూ ఉండటంతో ఒకసారిగాఎక్కడిక్కక్కడ వాగులు పొంగి ప్రవహించాయి.పొదిలి మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పొదిలి మార్కాపురం రహదారిలో బట్టువారిపల్లె గ్రామం వద్ద ఉన్న పెద్దవాగు ఒకసారిగా ఉగ్రరూపం దాల్చింది. అప్పటికే ప్రయాణంలో ఉన్న ఒక ఆర్టీసీ బస్సు అక్కడికి చేరింది. ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వాగు లోతు అంచనా లేని డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో నీటిలో ఆగిపోయింది. ఆర్టీసీ అధికారులకు డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో జెసిబి సహాయంతో బస్సును బయటికి లాగారు.వాగులో వాహనాలు వెళ్లకుండా పోలీస్ కాపలా ఉన్నారు. భారీ వర్షానికి గతంలో కూడా ఈ రోడ్డుపై ప్రవహిస్తున్నవాగు లో వాహనాలు నిలిచిపోయాయి. ఈ నీరు మండలంలోని రామాపురం చెరువుకు చేరుతోంది.*పొదిలి పట్టణంలో భారీ వర్షానికి నీట మునిగిన జగనన్న కాలనీ… కాలనీలు ఇచ్చినా మౌలిక వసతులు లేక ప్రజల అవస్థలు..

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..