👉పవన్ దీక్షాదక్షతలను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ?.. పవన్ కి దీక్షలు చేసే స్వేచ్చ లేదా అంటే లేకేమి ఆయన బ్రహ్మాండంగా చేయవచ్చు అన్న సమాధానమూ వస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయం గురించి తెలియని వారు లేరు..
ఆయన గత పదేళ్ళుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ వస్తున్నారు. ఆయన దూకుడుతో కూడిన రాజకీయం చేస్తారు.అగ్రెస్సివ్ మోడ్ లో మాట్లాడుతారు. ఆయన ప్రసంగాలు ఆవేశపూరితంగా ఉంటాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అత్యధికులు వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పవన్ మార్క్ పాలిటిక్స్ ఆ విధంగానే హైలెట్ అవుతూ వచ్చింది. అయితే పవన్ పదేళ్ళ పాటు సుదీర్ఘమైన పోరాటం చేసిన తరువాత అధికారం అందుకున్నారు. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వానికి బాసటగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు. అధికారంలో ఉంటూ దాదాపుగా నాలుగు నెలల పాలన పూర్తి చేశారు.అయితే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన దూకుడు రాజకీయం ఇపుడు మాత్రమే ప్రశ్నించబడుతోంది.అలా ఎందుకు జరుగుతోంది అన్నదే ఇక్కడ చర్చ.ఉదాహరణకు తీసుకుంటే తిరుపతి లడ్డూ అపవిత్రం అయింది అని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అది ఇపుడు విమర్శల పాలు అవుతోంది. పవన్ కి దీక్షలు చేసే స్వేచ్చ లేదా అంటే లేకేమి ఆయన బ్రహ్మాండంగా చేయవచ్చు అన్న సమాధానమూ వస్తుంది. అయితే పవన్ ఇపుడు ఉన్న పరిస్థితి ఆయన ఉన్న పొజిషన్ చూసిన వారు మాత్రం దానిని తప్పు పడుతున్నారు.ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముందు ఏదైనా సమస్య వస్తే ఆయన దానిని అధికారిక స్థాయిలో పరిష్కరించగలిగే స్థితిలో ఉన్నారు.అధికార మంత్ర దండం ఆయన చేతిలో ఉంది. చట్టం ఆయన దగ్గర ఉంది. మరి ఇన్ని ఉంచుకుని ఆయన సామాన్యుల మాదిరిగా ఇంకా చెప్పాలీ అంటే విపక్ష పాత్రలోకి వెళ్ళి ఎందుకు ఆందోళన బాటలు పడుతున్నారు అన్నదే ప్రశ్న. ప్రాయశ్చిత్త దీక్ష సాధారణంగా ఎవరు చేసుకుంటారు అంటే తప్పు చేసిన వారు. మరి పవన్ ఏ తప్పు చేశారని ఈ దీక్ష అంటే జవాబు లేదు. ఆయన అధికారంలో ఉండగా తప్పు జరిగితే శాఖాపరమైన విచారణ జరిపించి దానికి సరైన పరిష్కారం కనుగొనాలి. అదే రాజధర్మం. అదే ప్రజలు కూడా ఆశించేది.*ఇక ఆయన అధికారంలో లేని టైం లో గత ప్రభుత్వం లో తప్పులు జరిగాయి అంటే ఆ విషయంలోనూ ఒక సమగ్రమైన విచారణ జరిపించాలి. బాధ్యులను వెతికి పట్టుకోవాలి. ఒక వేళ ప్రాయశ్చిత్తం అంటూ చేస్తే ఆ తప్పులు చేసిన వారే చేయాలి. మరి పవన్ ఎందుకు ఈ దీక్షలు చేస్తున్నారన్నదే అర్ధం కావడం లేదని అంటున్నారు.పైగా ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారు అంటే సర్వ మతాలు సమానం అని చాటి చెప్పే పొజిషన్ లో ఉన్నారు అని చెప్పాలి. ఆయన ముందు ఏ మతం సమస్య అయినా ఏ వర్గం సమస్య అయినా వచ్చినా దానికి ఒకే విధంగా రాజ్యాంగంలో సూచించిన మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.👉అలా కాకుండా ఆయన ప్రాయశ్చిత్తం దీక్షలు అంటూ చేయడం అంటే అది ఒక విధంగా పలాయనవాదం కాదా అన్న చర్చ కూడా లేవనెత్తుతున్నారు.అన్నింటికీ మించి పవన్ తాను అధికారంలో ఉన్నాను అన్న విషయం విస్మరిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. అందుకే పవన్ దీక్షాదక్షతల మీద ఇపుడు ప్రశ్నలు సందేహాలు వ్యక్తం చేసేవారు బాగా అధికం అవుతున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అధికారంలో ఉన్న వారు ఆరోపణలు చేయకూడదు, అనుమానాలు అంతకంటే వ్యక్తం చేయకూడదు, వారు ఫుల్ పవర్స్ కలిగి ఉన్నారు కాబట్టి అలా వచ్చిన వాటిని పూర్తి స్థాయిలో వారు పరిష్కరించగలిగి ఉండాలి. కానీ అలా జరగకపోవడం వల్లనే ఇపుడు ఈ రకమైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో చూస్తే లడ్డూ ప్రసాదాల విషయంలో కల్తీ జరిగింది అన్నది ఒక ఆరోపణ. దానిని చేసిన వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు. దాని మీద బిగ్గరగా మాట్లాడుతున్న వారు ఉప ముఖ్యమంత్రి సహా కీలక నేతలు.అయితే అధికారంలో ఉన్న వారు ఆరోపణల నిగ్గు తేల్చాలి కానీ విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం చేయడమేంటి అన్నదే ఇపుడు హాట్ డిబేట్ గా ఉంది. ఏది ఏమైనా పవన్ వ్యక్తిగత స్థాయిలో దీక్షలు చేసుకోవచ్చు కానీ ఆయన డిప్యూటీ సీఎం గా కూడా రాజ్యాంగం ప్రసాదించిన తన హక్కులను బాధ్యతలను పూర్తి స్థాయిలో డిశ్చార్జి చేస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి
👉👉చంద్రబాబు బేరసారాలకు, డబ్బు రాజకీయాలకు ఆర్.కృష్ణయ్య తలొగ్గడం బాధాకరం. ఒకచేత్తో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, మరో చేత్తో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని డబ్బుతో కొనుగోలు చేస్తూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు.మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కారుమూరు నాగేశ్వరరావుల ఆరోపణ..
ఎంతో గౌరవించి బీసీల అభ్యున్నతికి పాటుపడతారన్న ఆకాంక్షతో జగన్ గారు కృష్ణయ్యకు పదవి ఇచ్చారు.
– పార్టీలో ఎంతో మంది ఉన్నా.. కృష్ణయ్య ద్వారా దేశ రాజధానిలో, పార్లమెంటులో బీసీల వాణి వినిపిస్తుందని నమ్మకంతో, విశ్వాసంతో రాజ్యసభ పదవిని కట్టబెట్టారు.
– అలాంటి ఉదాత్త సంకల్పాన్ని నీరుగారుస్తూ.. చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు తలొగ్గి కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం, నష్టం చేకూర్చారు. చంద్రబాబు కొనుగోలు, కృష్ణయ్య రాజీనామా ఈ రెండు అంశాలను ప్రజలు గమనిస్తున్నారు. తన పరిపాలన ద్వారా ప్రజలకు సమర్థ పాలన చంద్రబాబు అందించలేకపోతున్నారు.
– ఆ అంశాలను మరుగున పరచడానికి ఇలాంటి ఎత్తుగడలు తీసుకుంటున్నారు. రాజీనామా చేసిన వారికి కొంత ఇచ్చి, ఆ ఖాళీ అయిన సీట్లను పదిరెట్లకు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు. చంద్రబాబుకు ఇదొక లాభసాటి వ్యాపారంగా మారింది. రాజకీయాల్లో బాబు నయా మార్కెటింగ్ వ్యవహారమిది. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటికి కృష్ణయ్య తలొగ్గి రాజకీయంగా బీసీలకు తీరని ద్రోహం చేశారు.ఇలాంటి వ్యవహారాలతో వైయస్సార్ సీపీని బలహీనపర్చలేరు.
– అంతకుమించి రెట్టింపు స్పందనతో సమయం వచ్చినప్పుడు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
తిరుమల పవిత్రతను,
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోందన్నారు.
👉👉కూటమి నేతల పాపాల ప్రక్షాళనకే పూజలు
:వైయస్సార్‌సీపీ నేతల ప్రకటన..
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రులు పేర్ని నాని (వెంకట్రామయ్య), కొడాలి నాని (వెంకటేశ్వరరావు). ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న పార్టీ నేత వల్లభనేని వంశీ.
టీటీడీ లడ్డూ తయారీపై చంద్రబాబు దారుణ ఆరోపణలు
లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనడం హేయం
కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు
చంద్రబాబుకు అదే పనిగా వంత పాడుతున్న పవన్‌కళ్యాణ్
తిరుమల శ్రీవారి పట్ల కూటమి నేతల దారుణ పాపాలు
వాటి ప్రక్షాళన కోసమే ఈనెల 28న రాష్ట్రమంతా పూజలు
:వైయస్సార్‌సీపీ నేతల వెల్లడి
గతి తప్పి వ్యవహరిస్తున్న అధికార పక్ష ప్రజాప్రతిని«ధులు
దళిత ప్రొఫెసర్‌పై దౌర్జన్యం చేసిన జనసేన ఎమ్మెల్యే నానాజీ
బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీ చింపేసిన రఘురామకృష్ణంరాజు
అయినా వారిపై ఏ చర్యా లేదు!
:ప్రెస్‌మీట్‌లో వైయస్సార్‌సీపీ నేతల ఆక్షేపణ..
శ్రీ వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నేతలు, రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ని దుర్మార్గంగా వాడుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే, వారికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వంత పాడుతున్నారని మండిపడ్డారు.
కూటమి నేతలు స్వామివారి పట్ల చేసిన పాపాల ప్రక్షాళన కోసమే ఈనెల 28న రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో వైయస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేయనున్నారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలంతా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తప్పు చేసిన వారే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారన్న మాజీ మంత్రి.. చంద్రబాబు, పవన్ శరీరాలు వేరైనా, ఒకే ఆత్మలా తిరుగుతున్నారని, అందుకే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాడు బుద్ధి, కుళ్లిన మెదడుతో మలినపు మాటలు మాట్లాడారని ఆగ్రహించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో పాటు, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశామన్న వేదన వారి అంతరాత్మను దహించి వేస్తోందని, అందుకే ఈ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారని తెలిపారు.
👉గతంలో భీమవరంలో బాప్టిజం తీసుకున్నామన్నదీ.. ముస్లిం సోదరుల ఇంటికి వెళ్ళి హలాల్ చేసిన మాంసమేనా? అని అడిగిన విషయాన్ని, రష్యా చర్చిలో ఏసు ప్రభువు ముందు మోకాళ్ళదండ వేసింది, పిల్లలకు క్రైస్తవ పేర్లు పెట్టింది కూడా పవన్ అన్నది ఎవరూ మర్చిపోలేదని పేర్ని నాని వివరించారు.
👉తన రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ఆలయం, రాష్ట్ర ప్రతిష్ట మంట గలిసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడారన్న, మాజీ మంత్రి కొడాలి నాని, అందుకు చంద్రబాబును ఆ దేవదేవుడు ఎప్పటికీ క్షమించడని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల గత పాలనలో నలుగురు బిడ్డర్లుకు నాలుగు దఫాలుగా టెండర్లు ఇవ్వగా.. నెయ్యిలో నాణ్యత లేదని 14 ట్యాంకర్లు వెనక్కి పంపింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా 18 నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపారని గుర్తు చేశారు. టీటీడీలో సరుకుల నాణ్యతకు అంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.
👉ఇప్పుడు నెయ్యి నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చూస్తే.. అవన్నీ ఆయన పదవిలోకి వచ్చిన తర్వాతే సరఫరా అయ్యాయని కొడాలి నాని గుర్తు చేశారు. అయితే అది తమ ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ నిందించారని, రాజకీయం చేసి శ్రీవారి ఆలయంతో పాటు, రాష్ట్ర ప్రతిష్టను కూడా దిగజార్చారని ఆయన ఆక్షేపించారు. జగన్‌గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న దుర్భుద్ధితో చివరకు శ్రీవారి ప్రసాదాన్ని కూడా రాజకీయల్లోకి లాగిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. ఇది చాలా పెద్ద కుట్ర కాబట్టి, అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ, జగన్ ప్రధానమంత్రి, సీజేఐకి లేఖ రాస్తే, చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
👉తప్పు చేస్తే మక్కెలిరగ్గొడతానన్న చంద్రబాబు.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్‌పై దాడి, దౌర్జన్యం చేసినా, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని చింపేసినా ఏ చర్య తీసుకోలేదని కొడాలి నాని ఆక్షేపించారు.
👉’బద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి తలపై ఎందుకు కాల్చారు’: హైకోర్టు,
‘బద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి తలపై ఎందుకు కాల్చారు’: హైకోర్టు
బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు అక్షయ్ షిండే.. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఘటనపై దర్యాప్తు న్యాయంగా, నిష్పక్షపాతంగా జరగాలని బాంబే హైకోర్టు పేర్కొంది. “నిందితుడిని మొదట చేతులు లేదా కాళ్లపై కాకుండా తలపై ఎందుకు కాల్చారు?” అని పోలీసులను ప్రశ్నించింది. “బలహీనమైన వ్యక్తి తుపాకీని లోడ్ చేయలేడు. ఎందుకంటే దానికి బలం అవసరం” అని తెలిపింది. కాగా అక్షయ్ తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడని అంతకుముందు పోలీసులు తెలిపారు.
👉 59 ముక్కలుగా నరికి మహిళ దారుణ హత్య.. పోస్టుమార్టం రిపోర్ట్,
59 ముక్కలుగా నరికి మహిళ దారుణ హత్య.. పోస్టుమార్టం రిపోర్ట్
బెంగళూరులో ఇటీవల జరిగిన మహిళ హత్యోదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ శరీరాన్ని నిందితుడు 59 ముక్కలుగా నరికినట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. తొలుత ఫ్రిజ్‌లో 30 శరీర భాగాలను ఉన్నట్టు తెలిపినా పోస్టుమార్టం తర్వాత అసలు నిజం బయటపడింది. కాగా, మృతురాలు మహాలక్ష్మీ సంవత్సరం క్రితం తన భర్తతో విడిపోయి మల్లేశ్వరం ప్రాంతంలోని ఓ మాల్‌లో పనిచేస్తూ ఒంటరిగా ఉంటోంది. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
👉 కత్తులతో రెచ్చిపోయిన యువకులు.. 8 మందికి గాయాలు..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు. బుధవారం అర్థరాత్రి పిల్లర్ నంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్‌లో కస్టమర్ల మధ్య గొడవ జరిగిది. ఆ గొడవను అడ్డుకోబోయిన షాపు యజమానిపై 15 మంది యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 8 మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
👉 పట్టాలు తప్పిన రైలు.. బోగీలు బోల్తా..
జార్ఖండ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు నుంచి రెండు బోగీలు విడిపోయి బోల్తా పడ్డాయి. బొకారో జిల్లాలో బుధవారం అర్ధరాత్రి తుపాకాడిహ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్టీల్ కాయిడ్స్ లోడ్‌తో వెళ్తుండగా ఇది సంభవించింది. దీంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
👉 రాయలసీమలో రెవెన్యూ హత్య ..
*అనంతపురం జిల్లా,శింగనమల*
*▪️రెవెన్యూ అవినీతికి రైతు బలి*
రీల్స్ ఎమ్మెల్యే అంటు …రాయలసీమలో ▪️రీల్స్ ఎమ్మెల్యే పై రైతులు ఆగ్రహం.
▪️జిల్లాలో రైతులు సమస్యల దృష్టి పెట్టకపోవడంతో రోడ్లు పైకీ చేరి పురుగులు మందులు సేవిస్తూ రీల్స్ ఎమ్మెల్యే అంటు రైతులు కన్నీటి ఆవేదన.
▪️అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సమస్యలు గాలికి వదిలేసిన ఎమ్మెల్యే.
▪️శింగనమల నియోజకవర్గం, పామిడి గ్రామానికి చెందిన రైతు అనంతపురము జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో పురుగులు మందు సేవించి ఆత్మహత్య.
▪️అదే శింగనమల నియోజకవర్గంలో సాగు నీరు, తాగు నీరు కావాలి అంటు రోడ్డు ఎక్కిన రైతులు పురుగులు మందులు సేవించిన ఘటన మరువక ముందే మరో రైతు ఆత్మహత్య.▪️ఆ రైతు చావుకు కారణమైన అధికారి పై చర్యలు శూన్యం ఎందుకో …
▪️ఏపీలో గత వైసిపి ప్రభుత్వంలో రెవెన్యూలో భారీగా స్కాంలు.▪️అనీ జిల్లాల గ్రీవెన్స్ లో పెరిగిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం …
▪️ఏకంగా రెవెన్యూ అవినీతికి రైతు బలి … సాక్ష్యాత్తు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోనే రైతు ఆత్మహత్య యత్నం చేసి చివరకు ప్రాణాలు వదిలిన రైతు.
▪️ఈ వారంలో శింగనమల నియోజకవర్గంలో రైతులు పురుగులు మందులు సేవిస్తూన్న ఘటనలు రెండవ సారి.
▪️విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న శింగనమల అధికార పార్టీ నేతలు.▪️రీల్ ఎమ్మెల్యే ఇకనైనా … రీల్స్ కోసం కాకుండా రియల్ ఎమ్మెల్యే గా పనీ చేయాలి అని రైతులు ఆ ఎమ్మెల్యే ని వేడుకుంటున్నారు.
👉 ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు?: రాజాసింగ్..
ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు?: రాజాసింగ్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పందించారు. ప్రసాదం అపవిత్రం కావడంపై హిందువులంతా బాధపడుతున్నారన్నారు. ‘తితిదే ఎంతో పవిత్రమైంది. నమ్మకం లేనపుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారు. ప్రసాదం అపవిత్రం చేసినవాళ్లు తిరుమలకు ఎందుకు వెళ్తానంటున్నారు.. ఇది సరైందేనా?’ అని పరోక్షంగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
👉ఎన్టీఆర్ జిల్లా:ఏ.కొండూరు అడ్డరోడ్డులో రోడ్డుపై నడిచే వెళ్తున్న తండ్రి కొడుకులు పై
దూసుకెళ్లాన లారీ. మామిళ్ల శీను కొడుకు ప్రసంగి
సంఘటన స్థలంలో మృతి చెందిన తండ్రి కొడుకులు
👉తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..*
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది.
ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 28న జేపీసీ హైదరాబాద్‌కు వస్తుందన్నారు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, ముస్లిం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభ్యుడిగా ఉన్నారు. సవరణ పేరిట ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
👉ఇదే విషయంపై మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. తిరుమల లడ్డూ అంశంపై కూడా స్పందించారు లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు. ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారంటూ ప్రశ్నించారు.
లోక్‌సభ నుంచి 21 మంది..రాజ్యసభ నుంచి 10 మంది మొత్తం 30మంది ఎంపీలతో జేపీసీని ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వం. ముందుగా ఐదు రాష్ట్రాల్లో పర్యటించాక అక్టోబర్ ఫస్ట్ తరువాత మిగతా రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది జేపీసీ. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జేపీసీ తన నివేదకను లోక్‌సభకు ఇవ్వనుంది.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి ఫోన్ ద్వారా పరామర్శించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్ర బాబు నాయుడు ..
మాజీ పార్లమెంట్ సభ్యులు కీ. శే లు మాగుంట పార్వతమ్మ స్వర్గస్తులైన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట సుబ్బరామరెడ్డి మనవడు మాగుంట సుబ్బరామ్ బాబు తో ఫోన్ లో పరామర్శించినారు.
అనంతరం ప్రభుత్వం తరపున మంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్వతమ్మ కి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలియజేసినారు.
👉నెల్లూరు లోని మాగుంట స్వగృహంలో కీ.శే. మాగుంట పార్వతమ్మ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డా. డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, పూర్ణ చంద్ర రావు, బంగారయ్య హర్షిని కాలేజీ విద్యాసంస్థల అధిపతి గోరంట్ల రవి కుమార్ ,మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి , నగర DSP డి. శ్రీనివాస రెడ్డి,టంగుటూరు మండలం మాజీ M.P.P చంద్రశేఖర్ , బెల్లం జయంత్ బాబు , జరుగుమల్లి మాజీ M.P.P మురళి ( పెదబాబు ) పద్మ, బెజవాడ వెంకటేశ్వర్లు , సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి శ్యామ్ ప్రసాద్ రెడ్డి
.👉నెల్లూరు లోని మాగుంట స్వగృహం లో కీ.శే. మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..
👉నెల్లూరు లోని మాగుంట స్వగృహం లో కీ.శే. మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన టీడీపీ మాజీ MLC నన్నపనేని రాజ కుమారి , కేంద్ర మాజీ మంత్రివర్యులు పనబాకా లక్ష్మి ,మాజీ టి. టి. డి బోర్డు చైర్మన్ బాపిరాజు ,మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీ. శే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ,మాజీ శాసనసభ్యులు అనం వివేకానంద రెడ్డి తనయులు అనం చెంచు సుబ్బారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ షేక్ వయాజ్..
👉నెల్లూరు పట్టణంలో స్వర్గస్తులైన మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మరియు జిల్లా నేతలు.. స్టాఫ్ రిపోర్టర్ ఎస్ ఎస్ రహమాన్..
👉 చెవిలో పేలిన ఇయర్ బడ్స్.. యువతికి శాశ్వత వినికిడి లోపం..
టర్కీలో శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో పేలిందని యువతి ప్రియుడు తెలిపారు. దీనిపై శాంసంగ్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడుకు గల కారణాన్ని వెల్లడించలేదన్నారు. దీంతో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….
👉 అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశ్రుతి.. హోంగార్డుకు తీవ్రగాయాలు..
సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు. చెరువులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడంతో బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో హోంగార్డుకు తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది
*పాఠశాలల సందర్శన*
కంభం మండలంలోని రావిపాడు జడ్పీ ఉన్నత పాఠశాల మరియు సత్యనారాయణ ఎయిడెడ్ పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారులు బి.మాల్యాద్రి ,కె.శార్వాణి సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను,మధ్యాహ్న భోజనాలను, పాఠశాల వసతులు,సౌకర్యాలను పరిశీలించారు. ఎంఈఓ-2 శార్వాణి మధ్యాహ్న భోజనాల మెనూ మరియు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూచనలు చేశారు. పాఠశాల పారిశుధ్య అంశాలపై ఆరా తీశారు పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలనీ,తద్వారా విద్యార్థులలో ఉద్యాన మరియు వ్యవసాయ ఆధారిత అవగాహన కలిగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలసుబ్రమణ్యం సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
👉ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం*చెప్పినవన్నీ చేసి చూపిస్తాం*: *గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేర్చి తీరుతామని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఘంటాపథంగా తెలిపారు. “ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 7వ రోజు గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మేళాతాళాలతో ఘణ స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న దుష్ట పాలనను అంతమోందించి అధికారంలోకి వచ్చిన చంద్రన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతీ కార్యక్రమాన్ని చేసి చూపిస్తామని, మనది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొంది ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ముందుకు పాలన సాగిస్తున్నామన్నారు. ప్రజావేదికలో ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, లక్ష్మిదేవి, ఉపసర్పంచ్ కడియం శేషగిరి, స్థానిక నాయకులు బొమ్మినేని వెంకటేశ్వర్లు, గంజి వీరయ్య, శివపురం మురళీ, బీసీ నాయకులు బైలడుగు బాలయ్య, మాజీ సర్పంచులు ముచ్చుకుంట్ల రామ సుబ్బయ్య, బోధనబోయిన గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి LIC నరసింహులు, మరియు మండల ఎంపీడీఓ, మండల ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో ఆంజనేయరెడ్డి మండల అధికారులు,నాయకులు,గ్రామ ప్రజలు పాల్గోన్నారు. ..డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్..