..జగన్ తిరుమల పర్యటన రద్దు..నా మతం మానవత్వం-మాజీ సీఎం జగన్..హైడ్రా బాధితుల ర్యాలీ….కస్టడీలో రఘురామరాజుకు చిత్రహింసలు నిజమేన..జనగామ ఏబీవీ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..శ్రీ చైతన్య కాలేజీలో 200 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ బ్యాడ్ టచ్..

👉కస్టడీలో రఘురామను చితకబాదుతూ వీడియో కాల్‌లో సీఐడీ చీఫ్‌కు చూపడం నిజమే.. దర్యాప్తు కొలిక్కి వచ్చినట్టే!..*కస్టడీలో రఘురామరాజుకు చిత్రహింసలు నిజమేనని దర్యాప్తు అధికారుల నిర్దారణ
వీడియో కాల్‌లో చూసిన అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కొట్టడం అలా కాదంటూ ముసుగు వ్యక్తులతో కలిసి కార్యాలయానికి వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులు..పోలీసులు.. అప్రూవర్‌గా మారే అవకాశం..అప్పటి అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..పరారీలో ఉన్న అప్పటి దర్యాప్తు అధికారి విజయ్‌పాల్‌ కోసం విస్తృత గాలింపు..
గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఇచ్చింది తప్పుడు నివేదికేనని వైద్యుల నిర్దారణ..
ఆయన శరీరంపై రక్తపు గాయాలున్నాయని హైదరాబాద్‌లోని సైనిక ఆసుపత్రి అప్పట్లో నివేదిక ఇచ్చింది.
తాజాగా విచారణలో అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలు ఉండడం నిజమేనని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు వైద్యులు తెలిపారు.
👉దేశంలో పెరగనున్న చక్కెర ధరలు
దేశంలో చక్కెర ధరలు పెరగనున్నాయి. 2024-25 సీజన్‌ ( అక్టోబర్‌-సెప్టెంబర్‌)కు సంబంధించి చక్కెర, ఇథనాల్‌ కనీస విక్రయ ధర (ఎంఎస్‌పీ) పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో చక్కెర ధర పెరగనుంది. ‘చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నాం. అలాగే ఇథనాల్‌ ధరను కూడా పెంచుతాం. ఈ విషయం పెట్రోలియం శాఖ పరిశీలిస్తుంది’ అని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం తెలిపారు.
👉మంత్రి పొంగులేటిఇంట్లో ఈడీ దాడులు
HYDలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం 16 బృందాలు
15 చోట్ల ఏకకాలంలో దాడులు
నిర్వహిస్తున్నాయి. గతంలో ఎన్నికల
సమయంలో కూడా పొంగులేటి నివాసంలో
ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే.
👉ఫుడ్ పాయిజన్.. 15 మందికి అస్వ‌స్థ‌త‌
జనగామ ఏబీవీ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావ‌టంతో 15 మంది ఇంట‌ర్ విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయితే హాస్ట‌ల్ సిబ్బంది ఆర్ఎంపీతో రహస్యంగా విద్యార్థుల‌కు చికిత్స అందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఫుడ్ పాయిజన్ అయిన‌వారిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారిని జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై యాజ‌మాన్యం మౌనం పాటిస్తుంది. మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.
👉ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మరో పోస్టు పెట్టారు. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్.’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
👉 జగన్ తిరుమల పర్యటన రద్దు*

కొనసాగుతున్న శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం..నేడు తిరుమల చేరుకుని, రేపు శ్రీవారిని దర్శించుకోవాలని భావించిన జగన్..చివరి నిమిషంలో పర్యటన రద్దు నిర్ణయం!
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి.
మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా…? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
👉నా కులం ఏందో అందరికీ తెలుసు..నా మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకోండి:జగన్*
*నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న జగన్
-15 సార్లకు పైగా తిరుమలకు వెళ్లానన్న మాజీ సీఎం
*తనను డిక్లరేషన్ అడుగుతున్నారని మండిపాటు
*చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్న*చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న జగన్..
తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల వెళతానని చెబితే… తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని… బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు సాంప్రదాయాలను తాను గౌరవిస్తానని, అనుసరిస్తానని చెప్పారు. తన మతం మానవత్వమని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండని అన్నారు. ముఖ్యమంత్రిగా నాన్నగారు ఐదేళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వస్త్రాలకు సమర్పించారని… సీఎంగా తాను కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించానని చెప్పారు. తన మతం ఏందో వాళ్లకు తెలియదా? నా కులం ఏందో తెలియదా? అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని తాను పాదయాత్రను ప్రారంభించానని… పాదయాత్ర పూర్తయిన తర్వాత తిరుమలకు నడకమార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని జగన్ చెప్పారు. 15 సార్లకు పైగా తాను తిరుమలకు వెళ్లానని… అలాంటి తనను డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తుండటం దుర్మార్గమని చెప్పారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదని… ఆయనను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. నెయ్యి ధరను పెంచి, హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యిని సరఫరా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబే తప్పు చేసి, ఆయనే సిట్ వేస్తారని విమర్శించారు. మాజీ సీఎం అయిన తనకే ఇన్ని ఇబ్బందులు కలిగిస్తే… సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హిందూయిజం అంటే మానవత్వాన్ని చూపించడమని చెప్పారు.
👉ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధనలను పాటించాల్సిందే..
తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు..భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వ్యాఖ్య..ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విన్నపం.. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం పూర్తిగా రాజకీయరంగు పులుముకుంది.
తిరుమల పర్యటనకు వెళుతున్నానని జగన్ ప్రకటించిన తర్వాత…ఈ వ్యవహారం మరింత ముదిరింది. క్రైస్తవుడైన జగన్ తిరుమల డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం చెప్పారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని అన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు,భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని అన్నారు.భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ‘ఓం నమో! శ్రీ వెంకటేశాయ నమః’ అని ట్వీట్ చేశారు.మరోవైపు,జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.
👉స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన సీఎం..
ఇటీవల బుడాపెస్ట్ లో జరిగిన ఒలింపియాడ్ లో భారత్ తరపున మొదటిసారి స్వర్ణ పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు హరిక ధ్రోనవల్లి, అర్జున్ లను శుక్రవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి క్రీడాకారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
👉*సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కు ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు*
హైదరాబాద్:సెప్టెంబర్ 27
హైదరాబాద్ లో హైడ్రా బాధితులు సెక్రటేరియట్ ర్యాలీకి ఈరోజు పిలుపునిచ్చారు. లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటు సెక్రటే రియట్ కి ర్యాలీగా బయలుదేరారు.
పోలీసులు అడ్డుకున్నా కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటు సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు మూసి బాధితులు.అటు హైదరాబాద్‌ లోని మూసీ పరివాహక ప్రాంతా ల్లో ఉద్రిక్తత వాతాహవరం నెలకొంది. హైదరాబాద్‌ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్క్ చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
పునరావాసం కోసం వివరా ల సేకరణకు అధిఅక్రూలు వస్తే అడ్డుకుంటున్నారు. సర్వేకు వచ్చిన అధికా రులను అడ్డుకుంటున్నారు మూసీ నివాసిత ప్రజలు.. ఇళ్లకు మార్క్‌ వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు..
స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతి నగర్‌లో అధికారుల సర్వే నిలిచిపోయింది.
👉*నా భార్య 9 నెలల కడుపుతో ఉంది.. ఇప్పుడు ఉన్నపళంగా వచ్చి మా ఇల్లు కూలగొడ్తే మేము ఎటు పోవాలి..చైతన్యపురిలో అవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధితుడు.పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నం.. కరెంట్ బిల్లు,ఇంటి పన్ను అన్ని కడుతున్నం.
*నాకు పెళ్ళి చేయాల్సిన ముగ్గురు ఆడ బిడ్డలు ఉన్నారు.. నా ఇంటి మీదకు రాకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చైతన్యపురి మూసీ బాధితురాలు
👉 మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో 200 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..!!!
అస్వస్థతకు గురైన విద్యార్థులు..
👉మంత్రాల నెపంతో వ్యక్తి హత్య
TG: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకున్నారు.
👉దేవర సినిమా ఫ్యాన్ షోలో అపశృతి*
కడప జిల్లా:సెప్టెంబర్ 27
కడప జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్స్ షో లో ఈరోజు అపశృతి చోటుచే సుకుంది కడప జిల్లా కేంద్రంలోని రాజా థియేటర్‌లో జరిగిన ఘర్షణ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం కడప రాజా థియేటర్లో ఫ్యాన్స్ షో వేశారు. పెద్ద సంఖ్యలో థియేటర్‌కి చొచ్చుకు పోయారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ అభిమానులను కట్టడి చేసేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది.
దీంతో థియేటర్ యాజ మాన్యంపై ఎన్టీఆర్ అభిమానులు దాడికి దిగారు. ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
గొడవ అనంతరం ఇంటికి వెళ్లిన మస్తాన్… కాసేపటికి మృతిచెందాడు. మస్తాన్‌ది చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు
👉ఏపీలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్*
ఏపీలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నిన్న
రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆయనను విజయవాడ కోర్టులో హాజరు పర్చనున్నారు.గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు,ఒప్పందాలు,
ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలున్నాయి. గత నెలలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది.
👉దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి*
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూస్తూ వ్యక్తి మృతిచెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడుకడప జిల్లాలో సీకేదీన్నె మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు.‘దేవర’ రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు.దీనికి వచ్చిన మస్తాన్ మూవీచూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.వెంటనే దగ్గరలోని
ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
👉పార్లమెంటరీ కమిటీల్లో వైసీపీ ఎంపీలకు చోటు*
వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీల్లో వైసీపీ ఎంపీలు నలుగురు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా టూరిజం సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విజయ సాయిరెడ్డిలకు చోటు దక్కింది.
👉జనగామ జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ ఆర్అండ్ బి ఈఈ హుస్సేన్ తోపాటు, టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్..* *రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా జనగామ కలెక్టరేట్ లోని ఈఈ ఛాంబర్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.*బాధితుడు సత్యపాల్ రెడ్డి వద్ద పెట్రోల్ బంక్ ఎన్ఓసి కోసం డబ్బులు డిమాండ్ చేసిన సదరు అధికారులు*
👉👉ఎన్నిక‌ల వాగ్దానాల‌తో అఫిడ‌విట్‌పై సంత‌కం.. నోట‌రీ వైర‌ల్..హ‌ర్యానాలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డిన విష‌యం తెలిసిందే. జులానా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐఎన్ఎల్‌డీ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్య‌ర్థి సురేంద‌ర్ లాథ‌ర్ ఎన్నిక‌ల అఫిడ‌విట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న‌ది. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఏం చేస్తాన‌న్న దానిపై అత‌ను కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే ఓ నోట‌రీపై ఆ వాగ్దానాల‌ను రాశారు. దానిపై ఆయ‌న సంత‌కం చేశారు
👉 *ప్రకాశం జిల్లా*..రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్, మరొకరికి తీవ్ర గాయాలు*పెద్దారవీడు మండలం తోకపల్లి గొబ్బూరు మధ్య రోడ్డు ప్రమాదం*..*బోలారో ను ఢీకొన్న ద్విచక్ర వాహనం (మోపెడ్) – స్పాట్ లో వ్యక్తి మృతి, మరొకరికి విరిగిన కాలు*..*మోపెడ్ ను ఢీకొని రహదారి పక్కన కురుకుపోయిన బోలారో…*
👉’బ్యాడ్‌ టచ్‌’ చేస్తున్నారు..బడికెళ్లను..టీచర్‌ అకృత్యంపై చిన్నారి ఆవేదన..*తల్లి ఫిర్యాదుతో అరెస్టు*
గుడివాడ: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటుచేసుకుంది.
‘సార్‌ నన్ను రోజూ బ్యాడ్‌ టచ్‌ చేస్తున్నారు.. బడికి వెళ్లను’ అని ఆ చిన్నారి మారాం చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. గురువు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతోంది. బడికి వెళ్లాలంటేనే భయంతో మొండికేస్తోంది.
తల్లిదండ్రులు బతిమాలి, బెదిరించి పంపిస్తున్నారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని రోదిస్తోంది. దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం ఎందుకు బడికి వెళ్లనంటున్నావని తల్లి ప్రశ్నించింది. ఆ చిన్నారి బావురుమని ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది.
గుడివాడ మండలం చౌటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.చంద్రశేఖర్‌ (42) కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థినిని అసభ్యంగా తాకుతున్నాడని.. దీంతో బడికి వెళ్లాలంటే భయపడుతోందని ఆమె తల్లి గుడివాడ తాలుకా పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. తాలూకా ఎస్సై ఎన్‌.చంటిబాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

7k network
Recent Posts

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి

*మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం:CBN …* జగన్ ది అక్రమ సంబంధం’…వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. షర్మిల షాకింగ్ కామెంట్స్! .. 👉తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు బదిలీ* .. 👉ఆరు శవాలు – వైసీపీకి ఎంత బలమో !*.. *రికార్డుల కోసం భక్తుల ప్రాణాలతో చెలగాటం*… 👉జి డీ సి సి బ్యాంక్ లో 5 కోట్ల రూపాయల వరకు స్క్మాం …*గిద్దలూరు: నీటి సమస్యపై అత్యవసర సమావేశం..