అయోధ్య లో రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న బీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..జగన్.. అది నీ సమస్య: చంద్రబాబు..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు..మతాల మధ్య చిచ్చుపెట్టేలా డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు- వైయస్ షర్మిల..ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్..”దుష్ప్రచారం ఇకనైనా ఆపండి-మాజీ ఎమ్మెల్యే అన్నా..”షాద్‌నగర్ లో మహిళ మర్డర్..!!”ఆర్పీ పట్నాయక్ కుమారుడిపై దాడి..కేసు నమోదు..చెన్నై పోర్టులో రూ. 110 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..బస్సు డ్రైవర్ వేధింపులు.. కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని…

👉 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు..బెంగళూరు (మల్లేశ్వరం)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు
చేయాలని బెంగళూరు తిలక్ నగర ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట
పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా సీతారామ
బెదిరించి భాజపాకు నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని
ఆశ్రయించారు. దీనిపై విచారణ పూర్తి చేసింది న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్దే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించి, తదు విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు.
* *రాముని సాక్షిగా….*అయోధ్య లో రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న బీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం…! *5 మందిని అరెస్టు..*అయోధ్య లోని రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న ఓ బాలిక పై 9 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.*
*ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.*బాధితురాలు బీఏ చివరి సంవత్సరం విద్యార్థిని, కాంట్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.*అయోధ్య: ఉత్తర ప్రదేశ్‌ లోని అయోధ్య లోని రామ మందిరం లో స్వీపర్‌గా పనిచేస్తున్న 20 ఏళ్ల యువతిపై 9 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఇప్పటి వరకు 5 మందిని అరెస్టు చేశారు.ఈ మేరకు ఓ పోలీసు అధికారి శుక్రవారం సమాచారం అందించారు. బాధితురాలు బీఏ చివరి సంవత్సరం చదువుతోందన్నారు.
* *అయోధ్యలోని కాంట్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని నమోదు చేసిన FIR ప్రకారం, ఆగస్టు 16 మరియు 25 మధ్య మూడు వేర్వేరు సందర్భాలలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. కాంట్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ (SHO) అమరేంద్ర ప్రతాప్ సింగ్ తొలుత సెప్టెంబర్ 2 న FIR నమోదు చేశామని,ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.మిగతావారు పరారీలో ఉన్నారని తెలిపారు.*
👉ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు*
*ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి: చంద్రబాబు*..అమరావతి :ఏపీలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించిత్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలి. అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు. అందరూ
వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి. వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలి. ఇందులో మరో ఆలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు.
👉మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా అల్లాడుతుంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కనీసం అది గుర్తుందా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు శాంతి హోమాలు, పవన్ ప్రాయశ్చిత దీక్ష, అటు వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని విమర్శించారు.ఒకరిమీద ఒకరు పోటీ పడి నీచమైన మత రాజకీయాలకు తెరలేపారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. మత ఘర్షణలు క్రియేట్ చేయాలనే హిడెన్ అజెండా ఏమైనా పెట్టుకున్నారా అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.
👉 ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్..
శుక్రవారం తిరుమల పర్యటన రద్దు అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం ఏపీలో నడుస్తోంది. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటిది నా రాజకీయ జీవితంలోనే చూడలేదు. ఇలాంటి ఘటన దేశంలోనూ ఎక్కడ కూడా జరగలేదు.’ అని జగన్ అన్నారు
👉 జగన్.. అది నీ సమస్య: చంద్రబాబు..
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నీకు తిరుమల వెళ్లటానికి ఇష్టం లేదు.. వెళ్తే నాకు స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాలి. నీకు అలా స్వామి అంటే నమ్మకం అని సంతకం పెట్టడం ఇష్టం లేదు. అది నీ సమస్య.’ అని అన్నారు.
👉బస్సు డ్రైవర్ వేధింపులు.. కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని..
యూపీలోని ఫతేపూర్ జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ప్రియాంక దేవి అనే విద్యార్థిని కాలేజీ రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. వెంటనే కాలేజీ యాజమాన్యం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.స్కూల్ బస్సు డ్రైవర్ నిరంతరం వేధింపులకు గురిచేయడంతో విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
👉నేడు సిట్ బృందం తిరుపతికి రాక*
తిరుమల మహా ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంపై విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం ఈరోజు తిరుపతిలో మొదటిసారిగా భేటీ కానుంది.
సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
నూతనంగా ఏర్పాటైన సిట్ బృందం శనివారం తిరుపతిలో మొదటిసారిగా భేటీ అయిన తర్వాత విచారణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసిన కల్తీ నెయ్యి కేసును సిట్ బృందం స్వాధీనం చేసుకోనుంది.
కేసును సిట్ స్వాధీనం చేసుకున్న అనంతరం ఆ కేసు విచారణ అధికారిగా ఒక డీఎస్పీ స్థాయి అధికారిని సిట్ చీఫ్ నియమించనున్నారు.
సిట్ విచారణ పూర్తి అయ్యేంతవరకు సిట్ బృందానికి కావలసిన భవనాలు, ఆఫీస్ మెటీరియల్, కంప్యూటర్ వంటి వస్తువులను టీటీడీ కల్పించనుంది.
రెండు మూడు రోజుల్లో సిట్‌ బృందం మౌలిక వసతులను సమకూర్చుకొని విచారణను వేగవంతం చేయనుంది.
మొదటిసారిగా సమావేశం అవుతున్న సిట్ బృందానికి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దిశా నిర్దేశం చేయనున్నారు.
👉 రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి..
రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి
రేషన్ కార్డు లేకున్నా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయని తెలిపారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటు లోకి తీసుకొస్తామని అన్నారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచ్/పర్సన్ ఇన్ చార్జి, గ్రామ కార్యదర్శి, ముగ్గురు సేవా కార్యకర్తలు ఉంటారని తెలిపారు.
👉 బుచ్చమ్మ అత్మహత్య పై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
కూకట్‌పల్లిలోని చెరువు సమీపంలో ఉంటున్న బుచ్చమ్మ కూతుర్లకు కట్నం కింద ఇల్లు ఇచ్చింది. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారేమోనన్న భయంతో తల్లిని ప్రశ్నించగా మనస్తాపానికి గురైన బుచ్చమ్మ అత్మహత్య చేసుకుంది.
దీనికి హైడ్రాకు సంబంధం లేదని వివరణ ఇచ్చిన రంగనాథ్.
*’పూరీ’ మహాప్రసాదం నాణ్యత కోసం యంత్రాంగం: ఒడిశా*…పూరీ జగన్నాథ ఆలయంలో ఇచ్చే మహా ప్రసాదాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఒడిశాప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్రన్ తాజాగా ప్రకటించారు. నెయ్యి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రసాదం తయారీగది లోకి కఠిన పరీక్షల తర్వాతే ఏ పదార్థమైనా వెళ్లేలా నిబంధనల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
👉చిత్తూరు జిల్లా..
కుప్పం అటవీ అధికారుల సాక్షిగా కుప్పంలో చెలరేగిపోతున్న కలప అక్రమ రవాణాదారులు…కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసుకుపోయిన కొందరు అటవీ అధికారుల ప్రమేయంతో యధేచ్ఛగా కలప అక్రమ రవాణా…చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమణస్వీకారం చేసినప్పటి నుండి ఈ అధికారుల ఆగడాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా పట్టపగలే కుప్పం పట్టణంలో అక్రమ కలప రవాణా.. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
👉పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా శిఫార్సు చేసిన ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపిన మాగుంట*
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ని
గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా లోక్ సభ స్పీకర్ నియమించినారు.
తనను ఈ కమిటీ చైర్మన్ గా నియమించుటలో శిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, సహకరించిన మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతఙ్ఞతలు తెలియజేయుచున్నాను.
ఈ నియామకంలో నాకు తోడ్పాటు అందించిన నా సహచర పార్లమెంటు సభ్యులకు, ప్రకాశం జిల్లా మంత్రులకు, శాసన సభ్యులకు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
*👉పాపాయిపల్లిలో క్షుద్ర పూజల కలకలం*
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని బెస్తవారిపేటలో క్షుద్ర పూజల దృశ్యాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.
బెస్తవారిపేట పాపాయి పల్లి గ్రామంలో ఓ మహిళ ఇంటి మెట్ల వద్ద క్షుద్ర పూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు..*రక్ష రేకు మీద మహిళ పేరు రాసి ఆమె కనిపించకుండా పోవాలని నిమ్మకాయలు కుంకుమ కలిపి ఇంటి మెట్ల వద్ద ఉంచిన వైనం.*
ఇప్పుడు స్థానికంగా ఈ ఘటన వైరల్ గా మారింది
👉కర్నూలు జిల్లాకు బదిలీపై వచ్చి చార్జి తీసుకున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్. శాంతకుమారి , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు….*
*ఎమ్మెల్యే ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన కంభం విధ్యుత్ శాఖ ఏడీ..
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని కంభం నూతన ఏడీగా బాధ్యతలు స్వీకరించిన కేసరి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి సన్మానించారు. కంభం మండలంలో ప్రజలకు, రైతులకు ఏ సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కంభం, బెస్తవారిపేట, గిద్దలూరు ఏఈ లు నరసయ్య, ఎస్.ఎస్. రావు, నారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డి, మరియు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు మేడం భాస్కర్ రెడ్డి, కాశిరెడ్డి, గోపిరెడ్డి, చేరెడ్డి చిన్న కాశిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.
👉ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలో నడిచి వెళ్తున్న ఉదయగిరి బాలయ్య అనే వ్యక్తిని ఢీకొన్న స్కూటీ …బాలయ్యకు తీవ్రగాయాలు కావడంతో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ నుంచి ఒంగోలు తరలించగా మృతి చెందినట్లు తెలియ వచ్చింది..
మృతుడు బాలయ్య రిటైర్డ్ ఆర్మీ 60 సంవత్సరాలు
👉పేదల బియ్యం బొక్కేస్తున్న పామర్రు రమేష్…*
*రేషన్ మాఫియా ఆగడాలకు చెక్ పెడుతున్న విజయవాడ పోలీసులు..*
*పటమట పోలీస్ స్టేషన్లో రేషన్ మాఫియా డాన్ పామర్రు రమేష్ అనుచరుడు అరెస్ట్…*
*25వ తేదీ రాత్రి రామవరప్పాడు ప్రాంతంలో పేదలకు పంచవలసిన బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న శివప్రసాద్ ని అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు…*
*శివప్రసాద్ ని ప్రశ్నించిన పోలీసులకు విస్తృ పోయే విషయాలు వెలుగులోకి…*
*ఎండియు వాహనాల వద్ద ఎంతకు కొనుగోలు చేస్తారు,ఎక్కడ నుండి ఎక్కడ కు తరలిస్తున్నారు, దీని వెనకున్న అసలు సూత్రధారుడు ఎవరని విషయాలను పటమట పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది…*
*అసలు సూత్రధారుడు రేషన్ మాఫియా డాన్ గా పేరుగాంచిన పామర్రు రమేష్ అని, శివప్రసాద్ వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది…*
*పేదల బియ్యం బొక్కేస్తున్న రేషన్ మాఫియా డాన్ పామర్రు రమేష్ పై సుమారుగా 20 కి పైగా కేసులు గత నెలలో పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు…*
*రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న పామర్రు రమేష్ పై రౌడీషీట్ తెరిస్తే ఈ అక్రమ రేషన్ కి చెక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..*
👉 ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య..
ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య
జడ్చర్లకు చెందిన వీరేష్ అనే(30) వ్యక్తి చర్లపల్లిలో ఉంటూ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా ఆటో సరిగా నడపకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బుల కోసం గొడవ చేయగా మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని టైం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
👉 ఆర్పీ పట్నాయక్ కుమారుడిపై దాడి..కేసు నమోదు..
ఆర్పీ పట్నాయక్ కుమారుడిపై దాడి. కేసు నమోదు
గుచ్చిబౌలి ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ లో సంగీత దర్శకుడి కుమారుడు వైష్ణవ్ బిబిఏ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అదే స్కూల్ లో నాలుగో సంవత్సరం చదువుతున్న శ్యామ్ వైష్ణవ్ ను ర్యాగింగ్ చేయడంతో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కోపంతో శ్యామ్ కాలేజి బస్సు మణికొండ సమీపంలోకి రాగానే వైష్ణవ్ పై దాడి చేశాడు. అంతేగాక చెవి కూడా కొరకడంతో రక్త గాయాలు అయ్యాయి. గురువారం రాత్రి ఆర్ పి పట్నాయక్ రాయదుర్గం పిఎస్ లో కుమారుడితో వెళ్లి ఫిర్యాదు చేయించాడు.
👉 షాద్‌నగర్ లో మహిళ మర్డర్..!!
షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. 15వ వార్డు కాలనీవాసులు శనివారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్లిన సమయంలో కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు వెంటనే స్థానిక పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
👉 సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..!!!
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. నూనె ధరలు లీటర్‌పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి ధరలూ కేజీ రూ.60కి తగ్గడం లేదు. నిత్యావసరాల ధరలు భారీగా పెరడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
👉 గన్ ఫైర్ చేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
గన్ ఫైర్ చేసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని కలెక్టరేట్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో విధులు నిర్వహిస్తు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గన్ ఫైర్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాలగా గుర్తించారు.p 2018వ బ్యాచ్ కి చెందిన బాలకృష్ణ ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
: 👉చెన్నై పోర్టులో రూ. 110 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత…
మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రన్ డ్రగ్స్ ను చెన్నై పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కార్గో షిప్ ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నంచిన చెన్నైకి చెందిన ఇద్దరు కార్గో షిఫ్ ఏజెంట్లు అబుతాహిర్ మరియు అహ్మద్ భాషా.ఇందులో అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.
👉*దుష్ప్రచారం ఇకనైనా ఆపండి* అన్నారాంబాబు*
*తిరుమల క్షేత్ర వ్యవహారాలపై,లడ్డూ ప్రసాదంపై,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల దర్శనంపై ప్రభుత్వం,అధికార పక్షం చేస్తున్న దుష్ప్రచారం ఇకనైనా ఆపాలని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం YSRCP సమన్వయ కర్త అన్నా రాంబాబు హితవు పలికారు.*
*పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మార్కాపురం పట్టణం శ్రీచెన్న కేశవ స్వామి ఆలయంలో YSRCP శ్రేణులతో కలిసి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారపు పాపం నశించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.*ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు.*
*తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా ఉందని ఆరోపించారు.
*భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కూటమి నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం రాద్దాంతం చేయడం సరికాదన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడాన్ని పాలకులు కుట్రతో అడ్డుకోవడం సరికాదని,ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు.*పవిత్ర పుణ్య క్షేత్రం సందర్శనకు వెళ్తామంటే పోలీసులతో 30 యాక్ట్ ను ప్రవేశపెట్టడం,పోలీసులను మోహరించడమేమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.*

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..