కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి రూ.650 కోట్లు సమకూర్చిన కాంగ్రెస్ నాయకుడు..! పవన్ పై సిపిఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు..ప్రపంచం అంతం కాబోతుందా? న్యూక్లియర్ రియాక్టర్ దాడికి సిద్ధం అవుతున్న పుతిన్..?.వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం..హైడ్రా కమిషనర్‌పై కేసు నమోదు..10 ఏళ్ల చిన్నారిపై వీఆర్ఏ అఘాయిత్యం..వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొల్లగొట్టిన ఘనుడు ఎవరో అందరికీ తెలుసు: షర్మిల..”వైసీపీ నేత శిల్పా కు ‘హైడ్రా’ నోటీసులు..

👉ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ.
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి…
వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ.
👉హైడ్రా కమిషనర్‌పై కేసు నమోదు…
కమిషనర్‌ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు..హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యడంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ అనే వృద్ధురాలు..
దీంతో కేసు సంఖ్య 16063/IN/2024 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్న మానవ హక్కుల కమిషన్.
👉రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం..
*రేణిగుంట: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ గారు తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత సిజెఐకి ఘన స్వాగతం లభించింది.
జస్టిస్ పి.కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అండ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ చిత్తూరు జిల్లా, జస్టిస్ వై. లక్ష్మణరావు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు, జస్టిస్ రాఘవ స్వామి రిజిస్ట్రార్ ప్రోటోకాల్ హైకోర్టు ఆఫ్ ఏపీ, జస్టిస్ రామకృష్ణ రిజిస్ట్రార్ మేనేజ్మెంట్ హై కోర్టు ఆఫ్ ఏపీ, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి ఈ. భీమారావు, చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ గురునాథ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పి కోటేశ్వరరావు ప్రోటోకాల్ మెజిస్ట్రేట్, ధనుంజయ నాయుడు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ తదితరులు గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆదివారం ఉదయం భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
👉సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు…
దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు శ్రీవారి లడ్డూ వివాదంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జంతువుల కొవ్వులు కలిపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంలో దోషులు ఎంత పెద్దవారు ఉన్నా వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవారికి మత రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సహా అన్ని పార్టీల నాయకులు, మీడియా మొత్తం తిరుమల లడ్డూ సమస్య చుట్టూనే తిరుగుతున్నారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆ వివాదానికి స్వస్తి పలకాలని కోరారు. మాజీ సీఎం జగన్‌…వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తే తిరుమల అపవిత్రమవుతుందంటూ కొందరు అధికార పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానించడం సరికాదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లూ సీఎంగా ఉన్న జగన్‌ స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదన్నారు. అలాంటిది ఇప్పుడు సాధారణ భక్తుడిలా తిరుమలకు వెళ్తానంటున్న జగన్‌ ను డిక్లరేషన్‌ అడగడం సరైన విధానం కాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.👉 డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భార్య క్రిస్టియన్‌ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నారు? అని రామకృష్ణ నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి దీక్షలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.పవన్‌ డిప్యూటీ సీఎం అయ్యింది లడ్డూపై దీక్షలు చేయడానికా అని మండిపడ్డారు.అవసరమైతే లడ్డూ వ్యవహారంపై సీఎం, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారని పవన్‌ కల్యాణ్‌ కు ఏం సంబంధమని రామకృష్ణ నిలదీశారు. లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సిట్‌ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. దేవుడిని అడ్డుపెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మతం, కులాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యలను వీడాలని సూచించారు.
👉బండి సంజయ్ లా మారుతున్న పవన్ కళ్యాణ్..ఊగిపోవడమేనా?
రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అంశం పైన చర్చించుకుంటున్నారు. పొద్దున లేస్తే చాలు.. తిరుమల లడ్డు గురించే వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు తిరుమలలో శ్రీవారి లడ్డు కల్తీ అయిందని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది.
ఈ తరుణంలోనే వైసీపీ పార్టీ పైన తెలుగుదేశం తమ్ముళ్లు, కూటమిలో ఉన్న జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు రెచ్చిపోయి మాట్లాడుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వాడని… అందుకే లడ్డును కల్పి చేసి ఉంటాడని కూటమి పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఈ లడ్డు వివాదం లో.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు.
అచ్చం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్… వ్యవహరించినట్లుగానే.. హిందుత్వం గురించి పవన్ కళ్యాణ్ ఏపీలో వాదిస్తున్నారు. లడ్డు విషయంలో 11 రోజుల దీక్ష కూడా చేపట్టారు పవన్. దుర్గగుడి మెట్లు కూడా కడిగి ఫోటోలకు ఫోజులిచ్చారు. హిందూ ధర్మం గురించి ఎవరైనా.. చెడ్డగా మాట్లాడితే చీల్చి చెండాడుతానంటూ… ఓ బిజెపి కార్యకర్త లాగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. *టాలీవుడ్ హీరో కార్తీ అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్.గతంలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కూడా ఇలాగే వ్యవహరించేవారు. అభివృద్ధి, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా… కేవలం హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు బండి సంజయ్. ఏపీ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణి తో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రకటించిన హామీల విషయంలో.. దృష్టి పెట్టకుండా… హిందుత్వ వాదాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
*హైదరాబాద్‌*..*వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం*..*వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ జేపీసీ ఛైర్మన్‌ జగదాంబికా పాల్‌కు వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వ్రాతపూర్వకంగా అందజేసిన జేపీసీ మెంబర్‌ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌*
*వక్ఫ్‌ బిల్లుపై టీడీపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోంది – హఫీజ్‌ ఖాన్‌*..*ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హఫీజ్‌ ఖాన్‌ ఏమన్నారంటే…
శనివారం హైదరాబాద్‌లో వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది,ఈసమావేశంలో ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చాం,ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకం, దీని వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించాం. వక్ఫ్‌ భూములకు సంబంధించి కలెక్టర్‌కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, వక్ఫ్‌ భూములకు సంబంధించి వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఉంది, ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది, ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది, ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది. మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు, దీనిపై లోక్‌సభలో మిథున్‌రెడ్డి , రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఈ వక్ఫ్‌ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో కూడా ఉభయసభల్లో చెప్పారు. ఈ రోజు జేపీసీ మెంబర్‌ విజయసాయిరెడ్డి వ్యతిరేకిస్తూ లిఖితపూర్వకంగా ఇచ్చారు, అయితే టీడీపీ మాత్రం పార్లమెంట్‌లో ద్వంద వైఖరి అవలంభిస్తుంది, ఈ ఇష్యూని గందరగోళంలో పడేస్తుంది, టీడీపీ ఇప్పుడు కూడా రెండు కళ్ళ ధోరణి అనుసరిస్తుంది, టీడీపీ పార్లమెంట్‌లోనే వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదు, కానీ అక్కడ మద్దతిచ్చి ఇక్కడ ఇలా నాటకాలు ఆడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్‌ గేమ్‌ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తుంది, దీనిని ముస్లిం సమాజమంతా గమనించాలి.
👉వైసీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి ‘హైడ్రా’ నోటీసులు..
సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు..
వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో అధికారులు..
వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి..
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఆయ‌న సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల స‌ర్వే చేప‌ట్టిన అధికారులు వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన‌ శిల్పా మోహ‌న్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాజీ సీఎం వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఫ్యామిలీ వ్యాపారంతో పాటు వెంచ‌ర్లు వేసి నిర్మాణాలు చేప‌ట్టేది. శిల్పా మోహ‌న్ రెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్‌లో నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.
👉 వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనుడు ఎవరో అందరికీ తెలుసు: షర్మిల..
గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కదలాలన్న షర్మిల..అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారంటూ ధ్వజంగత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులశాఖ (ఏపీఎండీసీ) మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా, పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని స్పష్టంచేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, తెరవెనుక ఉండి అన్నీ తానై వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనాపాఠి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల వివరించారు.
“ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు… నిబంధనలను బేఖాతరు చేసి వారు అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఎన్జీటీ నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ స్కాంపై ఏసీబీతో విచారణతో పాటు, సమగ్ర దర్యాప్తు జరిపించాలి. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరులపై దోపిడీపై సీబీఐ విచారణ కోరండి” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
👉కాంగ్రెస్ అధిష్టానానికి పంపడానికి రూ.650 కోట్లు సమకూర్చిన కాంగ్రెస్ నాయకుడు..!!!
సంచలనంగా మారిన ఈడీ సోదాలు..
కర్ణాటక తరహాలోనే ఇక్కడి నుంచి నిధుల తరలింపు
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు పంపుతున్నట్టు సమాచారం..!!
హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బులు తరలించినట్టు ఈడీ అధికారుల అనుమానం..!!
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని కొన్ని బ్యాంకులకు నిధులు వచ్చిన సంగతి తెలిసిందే..!!
అదే తరహాలో ఢిల్లీ అధిష్టానానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకుడు రూ.650 కోట్లు సమకూర్చి పెట్టినట్టు సమాచారం..!!
దాంట్లో బాగానే ఈడీ సోదాలు అని తెలుస్తుంది..
👉10 ఏళ్ల చిన్నారిపై వీఆర్ఏ అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు..అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.
👉ప్రపంచం అంతం కాబోతుందా? న్యూక్లియర్ రియాక్టర్ దాడికి సిద్ధం అవుతున్న పుతిన్..!
రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఆయుధాలు అయిపోతున్నాయ్.. చిట్టెలుకలా భావించిన ప్రత్యర్థి ఎంతకూ లొంగడం లేదు. దానికి నుంచి పాశ్చాత్య దేశాల మద్దతు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని మోదీ సాగిస్తున్న శాంతి ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. మోదీని మించి మరే నాయకుడికి పుతిన్ ను ఆపే శక్తి లేదు. తాజాగా ఆయన ఓ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న దేశానికి అణుశక్తి కలిగిన మరో దేశం సహకరిస్తే దానిని తీవ్రంగా పరిగణిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. దీని వెనుక ఆయన ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. ఈ హెచ్చరిక అమెరికాను ఉద్దేశించినదే. లేదా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు సంబంధించినది కూడా. కాగా.. అణ్వాస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతు పలికితే.. అది రెండు దేశాలు కలిపి చేస్తున్నట్లు భావిస్తామని కూడా పుతిన్ పేర్కొన్నారు. అంటే ఉక్రెయిన్ మద్దతుగా ఉన్న దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.
పుతిన్ ఇప్పుడే కాదు.. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన 2022 ఫిబ్రవరి 24 తర్వాత కొద్ది రోజులకే అణ్వాయుధాన్ని వాడతామని హెచ్చరించారు. అయితే ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు చేసిన హెచ్చరికతో తామిచ్చే జవాబు అణ్వాయుధాలతోనా? అనేది చెప్పలేదు. కాగా.. ఉక్రెయిన్ కు నాటో దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు అందిస్తున్నాయి. వాటితోనే ఇప్పటి వరకు అది పోరాడుతూ వస్తోంది.
తాజాగా జెలన్ స్కీ కూడా మరిన్ని ఆయుధాలు ఇస్తే రష్యాను ఓడిస్తానని ప్రకటన చేశారు. నాటో ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి ఆయుధాలు అందించింది. వాటిని ప్రయోగిస్తే.. అది రష్యా నాటో యుద్ధంగానే చూస్తామని పుతిన్ అంటున్నారు. తాము ఇచ్చే ఆయుధాలపై అమెరికా అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు కొన్ని పరిమితులు విధించాయి. వాటిలో దీర్ఘ శ్రేణి ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే రష్యా అణు ముసాయిదాలో ఇటీవల మార్పులు చేశారు. దీని ప్రకారం శత్రువుల విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులు.. డ్రోన్లను ప్రయోగిస్తే అణ్వస్త్రాలను వాడేందుకు రష్యా నిర్ణయం తీసుకోవచ్చు.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..