మోదీని అధికారం నుంచి దించేవరకు నేను చావను: ఖర్గే..మైసూరులో రేవ్‌పార్టీ..రేప్ కేసులో ఇరుక్కున్న మరో యూట్యూబర్.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు..రాజకీయేతర వ్యక్తుల చేతికే టీటీడీ !..హైడ్రా హోంగార్డును బలి తీసుకుందనడం సరికాదు: కమిషనర్ రంగనాథ్.. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో రైతు ఆత్మహత్యాయత్నం….సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణ అరెస్ట్.. మార్కాపురంలో పౌష్టికాహార మహోత్సవాలు..

👉వైసీపీ ప్లాన్ ఏంటి?…మోడీ టార్గెట్ వెన‌క క‌థ ఏంటి..?
సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోతే ఏమవుతుంది … రాజ్యసభలో ఉన్న బలంతో బిజెపిని తమకు అనుకూలంగా మార్చుకుంటాం అని కలలు కన్న వైసిపి పప్పులు ఉడకటం లేదు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు వైసీపీని వీడి వెళుతున్నారు. ఇప్పటికే ఏకంగా ముగ్గురు ఎంపీలు బయటకు వచ్చేసారు. మోపిదేవి వెంకటరమణ – బీదా మస్తాన్రావు – ఆర్ . కృష్ణయ్య వైసీపీతో పాటు పదవులకు కూడా రాజీనామాలు చేసేశారు. పైగా కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ఉండడంతో వైసీపీకి బిజెపితో దోస్తీ చేసే అవకాశం సందు కూడా దొరకటం లేదు. దీంతో వైసిపికి సీన్ అర్థమైపోయింది .. టిడిపి – జనసేనతో పాటు బిజెపిని కూడా శత్రుపార్టీల జాబితాలో చేర్చినట్టే కనిపిస్తోంది..తాజాగా తిరుమల లడ్డు వివాదం పై వైఎస్ జగన్ తో పాటు వైసిపి నేతలపై హైదరాబాద్కు చెందిన బిజెపి మహిళ నేత మాధవి లత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్ర రాజకీయాలు ఎందుకని ? ప్రశ్నించిన నాని *హిందువులపై అమితమైన ప్రేమ ఒల‌క‌ పోస్తున్న తాను … తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లులు తగ్గించారా అని నిలదీశారు. గతంలో అన్య మతస్తుడు అయిన ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బిజెపి నేతలు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. అన్య‌మ‌త‌స్తుడు అని మతస్తుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఎందుకు తీసుకువెళ్లారని మోడీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు పేర్ని నాని..
తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో బీజేపీని వైసిపి నేరుగా టార్గెట్ చేసినట్టు క్లియర్గా అర్థం అవుతుంది. తిరుమల లడ్డు విషయంలో గత కొద్ది రోజులుగా బిజెపి నేతల ప్రాప‌కం కోసం తెగ ప్రయత్నించి విఫలం అయింది వైసిపి. ఇక ఆ పార్టీ నుంచి తమకు ఎలాంటి సహకారం దొర‌క‌దని ఫిక్స్ అయ్యారో ఏమోగానీ ఇప్పుడు ప్రధానిని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం చర్చనీయాంశం అవుతుంది. బిజెపిని ప్రశ్నించడం ద్వారా జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీల మద్దతు అయినా తమకు లభిస్తుందన్న ఆశలతో ఈ విషయంలో మోడీని సైతం వైసీపీ టార్గెట్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
👉 సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన నగదు గుర్తింపు..
రూ. 124 కోట్లు ఓకే వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు గుర్తించిన పోలీసులు.. మహ్మద్ బిన్ అహ్మద్ పేరిట బ్యాంక్ ఖాతా ఉన్నట్లు గుర్తింపు.. హైదరాబాద్ ఎస్బీఐకి చెందిన 6 కరెంట్ ఖాతాల్లోకి నగదు బదిలీ.. 6 కరెంట్ ఖాతాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు..
6 ఖాతాల్లో 2 నెల్లో రూ. 150 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు.. మహ్మద్ బిన్ అహ్మద్ ను అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. రూ. 124 కోట్లు 234 సైబర్ నేరాలకు సంబంధించినవిగా గుర్తింపు.. కమిషన్ కోసం బ్యాంక్ ఖాతాలను సమకూర్చినట్లు గుర్తింపు..
👉అక్టోబర్ 2న రాజకీయ పార్టీని ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్.. జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. 2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్’ పేరుతో ఆయన ప్రారంభించిన యాత్ర రెండేళ్ల పూర్తి చేసుకోనున్న సందర్భంగా పాట్నాలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
👉 మోదీని అధికారం నుంచి దించేవరకు నేను చావను: ఖర్గే..జమ్మూకశ్మీర్ లో ఎన్నికల ప్రసంగం ఇస్తూ అస్వస్థతకు గురైన నేషనల్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.చికిత్స అనంతరం తిరిగి ప్రసంగించిన ఖర్గే..ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని స్పష్టం చేశారు.’నాకిప్పుడు 83 ఏళ్లు. నేను త్వరగా చనిపోను.మోదీని కుర్చీ దించేవరకు బతికే ఉంటా. నాకు మాట్లాడాలని ఉన్నా అలసట వల్ల మాట్లాడలేక పోతున్నా క్షమించండని కోరారు.
👉 రేప్ కేసులో ఇరుక్కున్న మరో యూట్యూబర్
జగిత్యాల జిల్లాకు చెందిన యూ ట్యూబ్ ఫేం సింగర్, సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు..కొన్నేళ్ళ క్రితం పరిచయమై మాయ మాటలు చెప్పి లొంగతీసుకుని రేప్ చేశాడని యువతి ఆరోపణ..
బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్న యువతి..పెళ్లి చేసుకోవాలని తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆవేదన..
కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పట్టణ పోలీసులు
👉తిరుమలలో రెండో రోజు సిట్ విచారణ*
AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. 3 బృందాలుగా ఏర్పడి అధికారులు విచారించనున్నారు. TTD బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేయనున్నారు. ఈవో శ్యామలరావును కలిసి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. ఈ నెయ్యి సరఫరా చేసిన దిండిగల్ (TN)లోని AR డెయిరీ ఫుడ్స్ సంస్థ, తిరుమలలోని లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, సరకులను పరిశీలించనున్నారు.
👉 మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్…
మైసూరు శివారులోని ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ..
50 మందికిపైగా అరెస్ట్..శాంపిళ్లు సేకరణ..
చట్టపరమైన చర్యలు తప్పవన్న సీఎం సిద్ధరామయ్య..
కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారకస్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.రేవ్‌పార్టీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి శాంపిళ్లు సేకరించామని, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
👉హైడ్రా హోంగార్డును బలి తీసుకుందనడం సరికాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్..
ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో ఓ హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. ఆదివారం సాయంత్రం మృతి చెందాడు..
అయితే హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలన్నీంటికి హైడ్రా కు ముడి పెట్టవదన్నారు.
సంగారెడ్డి, మల్కాపూర్ చెరువుతో హైడ్రాకు ఎలాం టి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నా రన్నారు. సంగారెడ్డిలో హోం గార్డు గాయపడి మరణిస్తే హైడ్రా బలి తీసుకుందని చెప్పడం సరికాదన్నారు ఏవీ రంగనాథ్.
👉 టూత్‌పేస్ట్ రేపర్‌లలో మొసళ్ల పిల్లలు..
అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు
ముంబై: టూత్‌పేస్ట్ కవర్‌లో మొసళ్ల పిల్లలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు కుర్లా స్థానికులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్ మీదుగా తరలిస్తున్న మహ్మద్ రెహాన్ మద్నీ (41), హమ్జా మన్సూరి (30)లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కైమన్ జాతికి చెందిన ఐదు మొసళ్ల పిల్లలను అక్రమంగా తరలించేందుకు వారు ప్రయత్నించారు.టూత్‌పేస్ట్ కవర్‌లో స్వల్ప కదలిక కనిపించడంతో కస్టమ్స్ తనిఖీల్లో మొసళ్ల పిల్లలుకనిపించింది. టూత్ పేస్టులో ఐదు నుంచి ఏడు అంగుళాల పిల్ల మొసళ్లు ఉన్నాయి. ప్రత్యక్ష మొసళ్లను దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్ అవసరం. కానీ వారిద్దరికీ లైసెన్స్ లేదు.
👉 రాజకీయేతర వ్యక్తుల చేతికే టీటీడీ !
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ ఎంపికలో చంద్రబాబు మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రతి సారి అది రాజకీయ పదవిగానే భర్తీ చేస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం రాజకీయాలకు అతీతంగా అథ్యాత్మిక ప్రముఖుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారికి.. పరిపాలన అనుభవం ఉన్న వారికి.. దేవదేవునిపై వంక పెట్టలేనంత భ క్తి ఉన్న వారికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
శ్రీవారి ఆలయ చైర్మన్ గా వైసీపీ నియమించినట్లుగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వాళ్లను నియమిస్తే ఇబ్బందులు వస్తాయి. టీటీడీ చైర్మన్ గా చేయాలని శ్రీవారికి సేవ చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. వీరంతా తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న తప్పు జరిగినా మహా పాపం అనుకుంటారు. అలాంటి వారు పాలనా పగ్గాలు చేపడితే పక్కాగా అన్ని కార్యక్రమాలు జరిగిపోవడానికి ప్రాధాన్యం ఇస్తారని.. అవకతవకలకు అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.అధ్యాత్మికతతో పాటు కొంత పాలనా సామర్థ్యం కూడా అవసరమని భావిస్తున్నారు. ఆ దిశగా మెరుగైన చాయిస్ ఎవరైతే వారిని నియమించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత వివాదం కారణంగా హిందూత్వ సంస్థలు, అథ్యాత్మిక వాదులూ కూడా మెచ్చేలా టీటీడీ చైర్మన్ ను నియమించాల్సి ఉంది.
👉భవనం పైనుంచి దూకి తల్లి కూతురు ఆత్మహత్య?*
అనుమానాస్పద స్థితిలో ఆదివారం రాత్రి కూతురుతో కలిసి తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది,
నర్సింగ్ ఎస్సై హరికృష్ణ రెడ్డి,తెలిపిన వివరాల ప్రకారం…భీమవరానికి చెందిన మానస (30) తన భర్త, కూతురితో కలిసి రంగారెడ్డి జిల్లా నార్సింగి లోని మైహోం అవతార్‌లో నివాసం ఉంటున్నారు.
భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి కూతురు కృషి(3)తో కలిసి 18వ అంతస్తుపై నుంచి దూకి మానస ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు..
మృతురాలు కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు . ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
👉 వీఆర్ఏ మృతి.. వివాహేతర సంబంధమే కారణమా?..
వైఎస్సార్ కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహులు మృతి చెందిన విషయం తెలిసిందే. నిద్రిస్తున్న సమయంలో నరసింహులు మంచం కింద గనులు పేల్చడానికి వాడే డిటోనేటర్లతో పేల్చి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నరసింహులు భార్య సుబ్బలక్ష్మమ్మ వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
👉సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణ అరెస్ట్..
ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాహితీ ఇన్ఫ్రా
రియల్ ఎస్టేట్ పేరుతో బడా మోసం..సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్టు చేసిన ఈడీ..
ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ లో కేసు నమోదు
👉 మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌష్టికాహారం మహోత్సవాల సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారులు..అంగనవాడి కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్..
అంగన్వాడి కార్యకర్తలు చేసిన వంటి ఆహార పదార్థాలు రుచిచూసి సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్..
ప్రాజెక్టు అధికారులు, అంగనవాడి కార్యకర్తలను అభినందించిన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్..
👉శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టరేట్లో ఒంటిపైన పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది .పుట్టపర్తి మండలం నిడుమామిడి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు మాబు , బాబు అనే ఇద్దరు వ్యక్తులు తన భూమి 38 సెంట్లు కబ్జా చేయడమే కాకుండా తనపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు_
👉ప్రకాశం జిల్లా :*బేస్తవారిపేట.. పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య..బేస్తవారిపేట మండలంలోని సింగర పల్లె గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన రమణమ్మ 38 సంవత్సరాలు అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.హుటాఫుటిన కుటుంబ సభ్యులు రమణమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు సమాచారం అందుకున్న ఎస్సై రవీంద్ర రెడ్డి వారి సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..