తిరుమల లడ్డుపై సుప్రీం వ్యాఖ్యలు వారికి చెంపపెట్టు: వైఎస్ షర్మిల..అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ..జన్యువాధితో బాధపడుతున్న మహిళకు కోటిన్నర రూపాయల వ్యాక్సిన్ అందజేత.. ..ఏపీలో KGBVల్లో ఉద్యోగాలు..టీటీడీ చైర్మన్‌ పదవికి నేను అనర్హుడిని- టి జి వెంకటేష్ ..కర్నూల్‌లో త్రీ టౌన్‌ పోలీసుల అత్యుత్సాహం..మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్.. ఎల్ కోటలో సెమిస్టర్ బుక్స్ పంపిణీ

👉తిరుమల లడ్డుపై సుప్రీం వ్యాఖ్యలు వారికి చెంపపెట్టు: వైఎస్ షర్మిల..
తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ సుప్రీంకోర్టు చేసిన సూచనల నేపధ్యంలో, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సుప్రీం ధర్మాసనం తిరుమల లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు.
CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం దర్యాప్తు చేయాలని, CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందని ఆమె పేర్కొన్నారు . ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన తో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయ్యిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదని షర్మిల అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుకు సుప్రీం మరో షాక్-లడ్డూ సీబీఐ చేతికి వెళ్లబోతోందా?
“చంద్రబాబుకు సుప్రీం మరో షాక్-లడ్డూ సీబీఐ చేతికి వెళ్లబోతోందా?”
ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు తెలియాలి
CBI కి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై శ్రీవారి భక్తులు ఆందోళనలో ఉన్నారని,ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని ఆమె పేర్కొన్నారు .
కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ? అన్నది బయటకు రావాలన్నారు.
తిరుమల లడ్డూ విషయంలో అనేక సందేహాలకు సమాధానం కావాలి
అంతేకాదు తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? NDDB రిపోర్ట్ ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు ? అనే విషయాలు కూడా బయటకు రావాలన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి
దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే కూటమి సర్కార్ ఈ పని చెయ్యాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
👉అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ 😱.. గుజరాత్ వ్యాపారికి షాకిచ్చిన దొంగలు ఇందుకోసం ఒక ఫేక్ ఆఫీసును ఏర్పాటు చేసి మరీ మోసానికి పాల్పడిన వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. సినిమాల్లో కూడా ఈ తరహా మోసాన్ని చూపించలేదనే చెప్పాలి. ఖతర్నాక్ స్కెచ్ తో రూ.1.30కోట్ల భారీ మొత్తాన్ని కొట్టేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాటిక్ గా ఉన్న ఈ భారీ మోసంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటోతో ఫేక్ కరెన్సీని క్రియేట్ చేయటం.. ఒక బడా బంగారు వ్యాపారిని అడ్డంగా బుక్ చేశారు. ఇందుకోసం ఒక ఫేక్ ఆఫీసును ఏర్పాటు చేసి మరీ మోసానికి పాల్పడిన వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. అహ్మదాబాద్ కు చెందిన బంగారు వ్యాపారి మోహుల్ ఠక్కర్ కు ఇటీవల ఒకరు ఫోన్ చేశారు. తనను తాను ప్రశాంత్ పటేల్ గా పరిచయం చేసుకున్న అతను.. స్థానికంగా ఉన్న ఒక నగల షాపు మేనేజర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. సదరు వ్యాపారి తనకు తెలిసిన వాడే కావటంతో.. మేనేజర్ పేరుతోచెప్పిన వ్యక్తి మాటల్ని నిజమని నమ్మాడు. తనకు 2.1 కిలోల బంగారం కావాలని.. ధర విషయంలోకాస్త అటు ఇటుగా మాట్లాడుకొని చివరకు రూ.1.60 కోట్లకు డీల్ కుదుర్చుకన్నారు. ఏకంగా ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ.. సెప్టెంబరు 24న ఫోన్ చేసిన సదరు వ్యక్తి తాము కోరిన బంగారాన్ని షాపునకు పంపాలని కోరారు. దీంతో.. ఠక్కర్ తన మనుషులకు 2.1 కేజీల బంగారాన్ని ఇచ్చి వారి వద్దకు పంపాడు. ఠక్కర్ మనుషులు హవాలా వ్యాపారి షాపునకు చేరుకున్నారు. అప్పటికే వీరి కోసం ముగ్గురు వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. షాపులోని నోట్ల లెక్కింపు మిషన్ ను తీసుకొచ్చి 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించటం మొదలు పెట్టారు. తమ వద్ద రూ.1.30 కోట్లు మాత్రమే ఉన్నాయని.. మిగిలిన రూ.30 లక్షలు పక్కనున్న షాపు నుంచి తెస్తామంటూ వెళ్లారు. Also Read – కేటీఆర్ కారుపై దాడికి యత్నం తమతో పాటు బంగారు బిస్కెట్లను చెక్ చేయిస్తామని తీసుకెళ్లారు. అయితే.. వారు అటు వెళ్లగానే.. వారిచ్చిన బ్యాగులోని కరెన్సీ కట్టల్లో జాతిపిత మహాత్మ గాంధీ బొమ్మకు బదులుగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉండటంతో కంగుతిన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉండటంతో ఠక్కర్ మనుషులు షాపులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు.
. అయితే..తనకు ఇవేమీ తెలియదని.. నోట్ల లెక్కింపు మిషన్ ను తెమ్మంటే మాత్రమే తెచ్చానని.. ఆ నోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పటంతో.. తమను మోసం చేసిన విషయాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఠక్కర్ కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన గుండె ఆగినంతపనైంది. ఎంతసేపు వెయిట్ చేసినా వారు తిరిగిరాలేదు. మరో వైపు ఆ షాపు సెటప్ సైతం ఇటీవలే అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఇంత దారుణంగా మోసం చేసిన వారిపై ఠక్కర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.. కేసు నమోదు చేసిన పోలీసులు మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమాటిక్ గా ఉన్న ఈ మోసం స్థానిక వ్యాపారుల్లో సంచలనంగా మారింది.
👉నోటుపై మహాత్మా గాంధీకి బదులుగా అనుపమ్ ఖేర్ ఫోటో ఉంది..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో కోట్లాది రూపాయల మోసం జరిగిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రూ.1 కోటి 90 లక్షల విలువైన 2100 గ్రాముల బంగారంతో కొందరు దుండగులు పరారయ్యారు. ఈ దుండగులు నగల వ్యాపారులకు ఇచ్చిన డబ్బు నకిలీదని, దానిపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటోను ముద్రించారు. ఈ నోటును చూసిన నగల వ్యాపారులు షాక్‌కు గురయ్యారు. దీని తరువాత, ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వబడింది, వారు నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.
*👉ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు ఆహ్వానించారు.*
*ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును వేదపండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదంను అందించారు.*
👉ఏపీలో KGBVల్లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?*
ఏపీలో KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకూ దరఖాస్తు
చేయవచ్చు. ఇందులో టీచర్ జాబ్లు 507 కాగా, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. OCT 14 నుంచి 16లోగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి, 17, 18తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 19న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి, 23న అపాయింట్మెంట్
లెటర్లు అందిస్తారు.
**నేడు ఏఆర్ డైరీకి సిట్ బృందం..!.. *మరో సిట్ బృందం తిరుమలలో తనిఖీలు.*నిన్నంతా తిరుమల లోని ల్యాబ్ లో వివరాలు సేకరించిన సిట్ అధికారులు.**ల్యాబ్ లో నిబంధనలకు అనుగుణంగా టెస్టులు జరిగాయా అన్న కోణంలో విచారణ.*పోటు కార్మికులతో మాట్లాడిన సిట్ అధికారులు.*
👉 పోలీసులు డైరెక్షన్ …లాయర్లు యాక్షన్???
▪️కర్నూల్‌లో త్రీ టౌన్‌ పోలీసుల అత్యుత్సాహం.
▪️14 రోజులుగా పోలీస్‌స్టేషన్‌లోనే ఇద్ద‌రు అనుమానితులు.
▪️జై భీమ్ సినిమా తరహాలో పోలీసుల దాష్టీకం.
▪️అనుమానితులను చిత్రహింసలు పెట్టి చేయని తప్పులను ఒప్పించేలా ఇబ్బందులకు గురి చేశారని బాధితుల బంధువుల ఆరోపణ.▪️14 రోజులుగా తమ పిల్లలు కనపడడం లేదంటూ లాయర్లను ఆశ్రయించటంతో వెలుగులోకి ఘటన.
▪️జడ్జి సెర్చ్‌ వారెంట్ విధించడంతో రంగంలోకి అడ్వకేట్ జనరల్.. అనుమానితుల స్టేట్‌మెంట్ రికార్డ్.
▪️కర్నూల్ త్రీ టౌన్ సీఐ మురళీధర్‌రెడ్డిపై గతంలో అనేక ఆరోపణలు.▪️అమాయకుల‌పై బలవంతంగా కేసులు పెడుతున్నారని ఆరోపణ.▪️పోలీసుల తీరుపై మండిప‌డుతున్న లాయ‌ర్లు, ప్రజాసంఘాలు.
👉మూసీ ఆక్రమణలతో అందరూ ఇబ్బందిపడుతున్నారు: మంత్రి..
మూసీ ఆక్రమణలతో అందరూ ఇబ్బందిపడుతున్నారు: మంత్రి
హైదరాబాద్ మూసీలో ఆక్రమణలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. గతపదేళ్ల కాలంలో మూసీ పరివాహక ప్రాంతంలో చాలా అక్రమకట్టడాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఏం చేసినా ప్రజల కోసమేనని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులకు నష్టం కలగకుండా, తాము ముందుకు సాగుతామన్నారు. ఇండ్లు కోల్పోతున్న పేదలకు నివాసం కల్పిస్తున్నామన్నారు.
👉అరుదైన జన్యువాధితో బాధపడుతున్న మహిళ.. రక్తం గడ్డ కట్టడానికి కోటిన్నర రూపాయల ఇంజెక్షన్లు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ప్రోత్సాహంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఉచితం గా సమకూర్చిన వైనం….హాట్స్ ఆఫ్ ఎమ్మెల్యే సాబ్…ప్రభుత్వ రుణం తీర్చుకోలేనిది..బాధిత మహిళ…గుంటూరు.. గోరంట్ల ప్రాంతానికి చెందిన నాగదుర్గ జన్యు వ్యాధితో బాధపడుతుంది.
గ్లాన్జ్‌మాన్ థ్రోంబాస్థెనియా అనే జన్యు వ్యాధి ఉన్న రోగుల్లో రక్త స్రావం ఆగదు. రక్తం గడ్డకట్టించేందుకు లెక్కకు మించి ఇంజక్షెన్లు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే రోగుల్లో ప్లేటు లెట్లు గ్లైకో ప్రోటీన్లను తక్కువ స్థాయిలో కలిగిఉంటాయి. దీంతో ఫ్లేట్ లెట్ల మధ్య ఫైబ్రోజెనిక్ బ్రిడ్జి త్వరగా ఏర్పడదు. దీనివలన రక్త స్రావం జరుగుతూనే ఉంటుంది.జన్యుపరంగా వచ్చే లోపం.. రక్తస్రావం ఆగేందుకు పెద్ద ఎత్తున ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మూడు వందల వరకూ ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుందని ఇందు కోసం కోటిన్నర ఖర్చువుతుందని వైద్యులు తెలిపారు.అంత పెట్టుకొనే స్థోమత లేదని నాగదుర్గ చెప్పడంతో ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు.ఎమ్మెల్యే నసీర్ స్పందిస్తూ ఆమెకు వైద్యం అందించమని అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్ అరెంజ్ చేద్దామన్నారు. దీంతో జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ రంగంలోకి దిగారు. ఆయనే సర్జన్ కావడంతో స్వయంగా రంగంలోకి దిగి అత్యంత్య జాగ్రత్తగా బాధితురాలికి ఆపరేషన్ చేసి సిస్ట్ తొలగించారు. అనంతరం ఎమ్మెల్యే సాయంతో 319 ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేశారు. దీంతో ఆమెకు రక్త స్రావం తగ్గిపోయి పూర్తిగా కోలుకుంది. ఉచితంగా వైద్యం అందించిన వైద్యులకు, ఇంజక్షన్లు సమకూర్చిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు, కూటమీ ప్రభుత్వానికి ఆమె, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
👉 జమ్మూకశ్మీర్ లో నేడు చివరి దశ ఓటింగ్.. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడి..!!* జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడో, చివరి దశ 40 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉధంపూర్, సాంబా, కతువా జిల్లాలు, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా జిల్లాల నుండి 39.18 లక్షల మంది ఓటర్లు 5,060 పోలింగ్ స్టేషన్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా 415 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
ఈ దశ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ పోటీలో ఉన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మాత్రమే అసెంబ్లీ, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా కమ్యూనిటీ ఈ దశలో ఓటు వినియోగించుకోనున్నారు. 2019, 2020లో బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలలో ఓటు వేశారు. ఓటింగ్‌కు ఒకరోజు ముందు సోమవారం ఏడు జిల్లాల్లో 20,000 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించారు.’ఉగ్రవాద రహిత, శాంతియుత’ ఓటింగ్‌ జరిగేలా పోలింగ్‌ ప్రాంతాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్మూ రీజియన్‌ అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీపీ) ఆనంద్‌ జైన్‌ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, వేలాది మంది ఎన్నికల కార్యకర్తలు ఈ ఉదయం తమ తమ జిల్లా ప్రధాన కార్యాలయాల నుండి ఎన్నికల సామగ్రితో ఓటింగ్ బూతులకు చేరుకున్నారు.
మొదటి దశలో ఓటింగ్ శాతం భారీగా నమోదైంది. సెప్టెంబర్ 18న మొదటి దశలో 61.38 శాతం ఓటింగ్ జరగగా, సెప్టెంబర్ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం ఓటింగ్ జరిగింది. 2019 ఆగస్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ, కాశ్మీర్‌లో ఇది మొదటి అసెంబ్లీ ఎన్నికలు. దీని ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటించనున్నారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) పాండురంగ్ కె. పోల్ ప్రకారం, 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 24 సీట్లు జమ్మూ ప్రాంతంలో, 16 సీట్లు కాశ్మీర్ లోయలో ఉన్నాయి.
పోల్ పోలింగ్ జిల్లాల్లో మొత్తం 5,060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 పోలింగ్‌ కేంద్రాలను మహిళలే నిర్వహిస్తారని. వీటిని ‘పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌’గా పిలుస్తారని తెలిపారు. దీంతో పాటు 43 పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ వికలాంగుల చేతుల్లో ఉండగా, 40 పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ యువత చేతుల్లో ఉంటుందని సీఈవో తెలిపారు. పర్యావరణ సమస్యలపై సందేశం అందించేందుకు 45 గ్రీన్‌ పోలింగ్‌ స్టేషన్లు, 33 యూనిక్‌ పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయన్నారు. సరిహద్దు ప్రాంతాల వాసుల కోసం నియంత్రణ రేఖ లేదా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
👉 టీటీడీ చైర్మన్‌ పదవికి నేను అనర్హుడిని*
*ఆర్యవైశ్యుల్లో ఆ అర్హత కలిగిన వారు చాలామంది ఉన్నారు**రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌*
టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవికి తాను అనర్హుడినని, తనకున్న వ్యాపారాల దృష్ట్యా తిరుమలలో పూర్తి సమయాన్ని వెచ్చించలేనని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేశ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవి చేపట్టే అర్హత ఆర్యవైశ్యుల్లో చాలా మందికి ఉందన్నారు. పూర్తి సమయం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధానంలో గడుపుతూ సేవ చేసే వాళ్లలో ఆర్యవైశ్యులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని తెలిపారు. నిత్యం వ్యాపారాలతో తీరికలేకుండా ఉండే తాను టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవికి అనర్హుడినని తెలిపారు.
👉ముంబై నటి జెత్వాని కేసులో నేడు కీలక పిటిషన్ల విచారణ.*
*బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పలువురు ఐపీఎస్ లు,పోలీస్ అధికారులు.*
*నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.*
*నేడు మరోసారి విచారణ చేపట్టనున్న న్యాయస్థానం.*
*ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసిన న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు*
👉తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా?*
TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(NLG), గడ్డం వినోద్ (ADB), గడ్డం వివేకానంద్ (ADB), ప్రేమ్ సాగర్ రావు (ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్రెడ్డి (NZB), దానం నాగేందర్ (HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.
👉 త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క..
త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో రాగిజావ: మంత్రి సీతక్క
తెలంగాణలోని 5 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్నపూర్ణ ట్రస్టు ద్వారా త్వరలో రాగిజావ అందిస్తామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లోని పలు స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి వంటింటికి పరిమితమైన స్త్రీలు ఇప్పుడిప్పుడే బయటకొచ్చి అన్ని రంగాల్లో రాణిస్తుంటే వారిని అవమానపరిచేలా బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్‌ చేయడం సరికాదని మండిపడ్డారు.
👉మూసీ ప్రాంతంలో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.
తొలికాలంలో రివర్ బెడ్‌లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు.
చాదర్ ఘాట్‌లోని మూసా నగర్, రసూల్ పూరా, శంకర్ నగర్లో కూల్చివేతలు జరుగుతున్నాయి.
👉రూ.2 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌*
అల్లూరు సీతారామ‌రాజు జిల్లా కొయ్యూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని భూదరాల పంచాయతీలో ఘ‌ట‌న‌..
ముందస్తు సమాచారంతో తనిఖీలు నిర్వహించి, 279 ప్యాకెట్లలో 850 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు..
రెండు కార్లు, ఒక బైక్‌, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం
ఇద్ద‌రు అరెస్ట్‌, రిమాండ్‌కు త‌ర‌లింపు
ప‌రారీలోని మ‌రో 5 మంది కోసం గాలిస్తున్న పోలీసులు.
👉భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య..
సింగరేణి సంస్థలో ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు కట్టి తాము మోసపోయామని తెలిసి పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య…
జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలావత్ రత్నకుమార్, పార్వతీ దంపతులు సింగరేణి ఉద్యోగం పేరుతో 16 లక్షల రూపాయలు ఓ వ్యక్తికి కట్టి తాము మోసపోయామని తెలిసి మనస్థాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపణ..
పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలింపు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతుల మృతి..
*మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్…*
కారణమిదేమూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కూల్చివేతలు.. మార్కింగ్ సర్వే.. అటు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అధికారులు హైఅలెర్ట్ జారీ చేశారు. మూసీ సుందరీకరణలో భాగంగా అక్కడి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ సర్వే కూడా జరిగిపోయింది. కూల్చివేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్‌ కూడా వేశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించేశారు కూడా. ఓల్డ్ మలక్ పేట్‌లో ఖాళీ చేయించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయనున్నారు. పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ సర్వే కొనసాగుతోంది..
*వరద ఉధృతి..*
మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మూసీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జంట జలాశయాల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. కాసేపటి క్రితమే జలమండలి అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మరికాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1400 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1428 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్ సాగర్ 6 గేట్లను రెండు ఫీట్ల మేర అధికారులు ఎత్తివేశారు..*అధికారుల హెచ్చరికలు.*
అటు హిమాయత్ సాగర్‌కు 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ ఒక గేటును ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదలచేయనున్నారు. మరోవైపు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద తాకిడి అధికంగా ఉంది. వరద పెరగడంతో మూసీ నది గర్భంలో నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇళ్లను ఖాళీ చేయించడం కోసం గేట్లను ఎత్తారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ సర్వాత్రా నెలకొంది..
కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ‌ కేటీఆర్ నేడు మంగళవారం నగరంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు కేటీఆర్ వస్తారు. 9:30 గంటలకు అంబర్ పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్ లంక తులసి రామ్ నగర్ ప్రాంతంలో ఆయన పర్యటిస్తారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలవనున్నారు. కేటీఆర్‌తో పాటు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర నేతలు పాల్గొననున్నారు. నిన్న సోమవారం హైదర్‌గూడ, కిషన్‌బాగ్‌లో వివిధ కాలనీలకు చెందిన మూసీ బాధితుల వెతలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. 30, 40 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నామని, ఉన్నపళంగా వెళ్లిపోవాలంటే ఎలా? అని బాధితులు విలపించారు.
*👉తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం సమీపంలో NBKR ఇంజనీరింగ్ కళాశాల బస్సు అదుపుతప్పి బోల్తా…👉ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు*ముత్తుకూరు నుండి విద్యానగర్ కళాశాల కు విద్యార్థులను తీసుకువెళుతుండగా మలుపు వద్ద బస్సు అదుపుతపడంతో రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా కొట్టింది..ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం… స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని విద్యార్థులను బస్సులోపల నుండి బయటకు తీశారు.. ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది… ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు….
👉కడప జిల్లా లో దారుణం. పక్కింటోడి పెళ్ళాం తో అక్రమ సంబంధం పెట్టుకున్న బాబు అనే వాడు ఆమె భర్త ను జిలెటిన్ స్టిక్స్ పేల్చి చంపేశాడు..కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లె లో నరసింహులు భార్య శివలక్ష్మి తో బాబు అనే వ్యక్తికీ అక్రమసంబంధం ఉండేది. తమ అక్రమ సంబందానికి నరసింహులు అడ్డుగా వున్నాడని భావించిన బాబు మొన్న రాత్రి నరసింహులు నిద్రిస్తున్న సమయంలో నరసింహులు మంచం కింద జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చగా నరసింహులు, శివలక్ష్మి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నరసింహులు చనిపోయాడు. గాయపడ్డ శివలక్ష్మి ని హాస్పిటల్ కు తరలించారు
👉 స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టుకు డీ. పలువురు స్కూల్ విద్యార్థులకు గాయాలు..కడప జిల్లా..కమలాపురం..కమలాపురం మండల పరిధిలోని జంగంపల్లె వద్ద ప్రగతీ జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టుకు డీ..బస్సు క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్.
వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
👉 ప్రకాశం జిల్లా కంభం మండలంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ బి.వి. రామకృష్ణ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లింగోజిపల్లి నందు సెమిస్టర్ 2 బుక్స్ పంపిణీ చేశారు.కార్యక్రమం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మీ కోట ప్రధానోపాధ్యాయులు బి .వి. రామకృష్ణ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లింగోజిపల్లి హెచ్ ఎం.అంకిరెడ్డి మరియు పాఠశాల చైర్మన్ ఖాసిం షరీఫ్ మరియు వైస్ చైర్మన్ షేక్ మాబున్ని, తోటి ఉపాధ్యాయునీ,ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

7k network
Recent Posts

రెండేళ్లలో చంద్రబాబుకు చెక్.. పవన్ కళ్యాణ్ సీఎం !..2027లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు..హరియాణా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన..మున్సిపల్ కార్మీకులకు మద్దత్తు పలికిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే….టీచర్లు రియల్ ఎస్టేట్, చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు..అనంతపురం డీఈవో బి.వరలక్ష్మి..ఆటో డ్రైవర్ స్థాయి నుండి విమానాన్ని నడిపే స్థాయికి..ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ..SVRK& శ్రీ వైష్ణవి విద్యాసంస్థల కస్పాండెంట్ పెనుగంటి మురళీమోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. 👉టీ షాపు పెట్టి రూ. లక్షలు సంపాదిస్తున్న యువతులు.. బాగుంట కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కే వి పి..

బిజెపికి ఓట్లు తగ్గాయి..సీట్లు పెరిగాయి..జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి దూకుడు..హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక సొంత సీఎంల ఎఫెక్ట్, సెల్ఫ్ గోల్..న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?..ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు?.ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకే కోర్టుకు వెళ్లారు..దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజించే గ్రామం..రాచర్లలో పొలం పిలుస్తుంది….

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?..పాలిటిక్స్‌లో ప‌వ‌న్ ఫుట్‌బాల్ లాంటివారు.. ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు.. సింగరేణి కార్మికులకు బోనస్ పంపిణీ..క్రిస్టియన్ అని టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే..భార్యతో విభేదాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూసైడ్.. మంత్రాల నేపంతో మహిళ సజీవ దహనం పలు సమస్యలపై చర్చించిన ఎంపీ మాగుంట..బెదిరించి రూ.2.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఎన్ఐఏ అధికారి..

గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..సిఎం రేవంత్ రెడ్డి ..రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!….తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు ..హడావుడి ఉండకూడదు: చంద్రబాబు.. మెహతాజ్ బేగం కు సన్మానం..అక్కినేని అమలకు ప్రియాంక గాంధీ ఫోన్..!..మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ గన్ మెన్ల తొలగింపు..బుర్కినా ఫాస్కో: ఘోరం..600 మందిని నిలువునా కాల్చేశారు..పలువురు చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. జమ్మలమడుగులో బయటపడ్డ విభేదాలు..

డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం..మహారాష్ట్రలో ఎన్సీపీ నేత దారుణ హత్య..సచివాలయం భవనం పైనుంచి దూకిన డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్యేలు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో 30 లక్షలు పోగొట్టుకున్న కొడుకు..యూనియన్ బ్యాంకు కస్టమర్లకు జాగ్రత్త..నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చల్లా సుబ్బారావు ?..హీరో నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌..