👉 సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించిన సిట్.. తిరుపతి..ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్‌కు పరిమితం కానున్న సిట్.. దిండిగల్ సహా ఇతర ప్రాంతాల్లో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్.. గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు
👉తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని ఏపీ ప్రభుత్వం కు సూచించిన నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియో విడుదల చేశారు. ‘పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. భక్తుల మనోభావాలను హింసించేశారు. రాజకీయ నాయకులను పక్కన పెడితే… ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు, చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు. ప్రాయశ్చిత శ్లోకాలు కనిపెట్టి మరీ రచ్చ చేశారు. వందల వేల మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. నిజమైన హిందువులైతే, వెంకటేశ్వరస్వామి భక్తులైతే క్షమాపణలు చెప్పాలి.’’ అని వీణా శ్రీవాణి డిమాండ్ చేశారు.
👉కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలని విరమించుకోవాలని, సెయిల్ లో విలీనం చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు SFI.AISF.DYFI.AIYF.PDSU ఆధ్వర్యంలో ఒంగోలు లోని కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది.
👉కొణిజేడు చెరువు కి శాశ్వత సాగర్ నీరు కనెక్షన్ ఇవ్వాలి.. సీపీఎం డిమాండ్*
కొణిజేడు సీపీఎం శాఖ 5 వ మహాసభలు ఎం. శ్రీనివాసరావు అధ్యక్షత న జరిగింది.ఈ సభలకు అతిధిలుగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. ఆంజనేయులు, సీపీఎం టంగుటూరు మండల కన్వీనర్ వి. మోజెస్, టీ. రాము హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆంజనేయులు మాట్లాడుతూ కొణిజేడు చెరువు కి సాగర్ నీరు వచ్చే విధంగా శాశ్వత అనుమతులు ఇవ్వాలని ఎన్. ఎస్. పి. అధికారులను డిమాండ్ చేశారు. అర, కొర గా నీళ్లు రావటం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చెరువు కి 3 వ తూము లేనందున 100 ఎకరాల వరకు నీళ్లు రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.రెండు దళిత పల్లెలకు స్మశాన స్థలం సమస్య ను పరిష్కారం చేయాలనీ, ఎస్.సి కాలనీ లోని ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు.కార్యక్రమం లో సీపీఎం కొణిజేడు గ్రామ శాఖ కార్యదర్శి షేక్ మీరాస్, ఎం. శ్రీనివాస్, ఎం. కోటయ్య, కె.మహేష్, జీ. దాసు,టీ. రామకోటయ్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
👉టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పెళ్ళి చెడ గొట్టారట.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్.. అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు చిత్రాలలో నటించి మెప్పించింది.ఈ అమ్మడు తన సినిమాల కంటే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వివాదాలకు తెర తీసుకుంటుంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ నే కాకుండా బడా హీరోలను కూడా టార్గెట్ చేసి కాంట్రావర్సీ క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.
ఇంతకీ ఆ షాకింగ్ కామెంట్స్ ఎవర్నీ ఉద్దేశించి చేస్తోందో తెలుసకోండీ. పూనమ్ కౌర్ పంజాబీ భామ తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్నది పూనమ్. ఈ తరుణంలో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మాయాజాలం మూవీతో నటించి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు తన అందం, అభినయంతో మెప్పించింది. వరుసగా అవకాశాలు తగ్గించుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించింది. అలాగే..తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ షోతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టింగ్ గా ఉండే హీరోయిన్ పూనమ్ కౌర్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది. అలాగే.. ఆమె పరోక్షంగా కౌంటర్లు వేస్తుంటుంది. ఎవర్ని ఉద్దేశించి ఆ పోస్టు పెట్టిందో కచ్చితంగా చెప్పలేం. ఇలా ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. సంచలన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. హీరోయిన్ పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని అవకాశం చిక్కినప్పుడల్లా హీరో పవన్ కల్యాణ్ ను, దర్శకుడు త్రివిక్రమ్‌లపై తన అక్కస్సును వెల్లాబుచ్చుతుంది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తాను ఇచ్చిన కంప్లయిట్‌ను తీసుకున్నారా? అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను ప్రశ్నించింది. తన లాంటి వాళ్లకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు. అందుకే తననీ సైలెంట్‌గా పక్కనబేట్టేశారనీ, తాను అప్పుడు మా అసోసియేషన్‌లో ఉన్న పెద్దవాళ్లకి కంప్లయింట్ చేశాననీ, ఇప్పుడైన ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని కోరుతున్నాను అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పూనమ్ కౌర్ చేసిన షాకింగ్ కామెంట్స్ ను సంబంధించిన ఓ పాత ఇంటర్య్వూ నెట్టింట్టో తెగ వైరలవుతోంది. ఇండస్ట్రీలో మిమ్మల్నీ ఇబ్బంది పెట్టారనే వార్తలొస్తున్నాయి వాటిపై మీ స్పందనేంటీ అని హీరోయిన్ పూనమ్ కౌర్ ను ప్రశ్నించగా.. ‘సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతా.. నేను ప్రెగ్నెంట్ అయి.. అబాషన్ అయిందనీ, నాకు డబ్బులు ఇచ్చారని ఎన్నో రకాల నాపై దుశ్ప్రచారం చేశారు. నాకు పెళ్లి అయ్యే టైం లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దాదాపు రెండు సంవత్సరాలు నన్ను సతాయించి సతాయించి చావు దాక తీసుకెళ్లారు. కొంత మంది నువ్వు చంపిపోతే.. ఒక వన్డే న్యూస్ ఉంటావ్ అని కామెంట్స్ చేశారు. ఆ మాటకి నేను చచ్చే వరకు ఆ మనిషి నన్ను చూడాలని నేను బ్రతుకుతున్న’ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఈ కామెంట్స్ ఎవర్నీ ఉద్దేశించి చేసిందో మాత్రం క్లారీటి ఇవ్వలేదు పూనమ కౌర్. పవన్ కల్యాణ్ గురించి నోరు విప్పను.. కొంత మంది దూరం చేశారు.. కాంట్రవర్సి అంటూ పూనమ్ కౌర్ త్రివిక్రమ్‌పై ఫిర్యాదు.. పూనమ్ కౌర్‌కు తమ్మారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ త్రివిక్రమ్‌ను ప్రశ్నించగలరా? జానీ మాస్టర్ కేసు నేపథ్యంలో పూనమ్ కౌర్ ట్వీట్ త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి.. నాకు ఏం చేశాడో వాళ్లను అడగండి:
👉 ముడా కేసు.. 14 ప్లాట్‌లను వదులుకుంటానన్న సీఎం భార్య..
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన కొన్ని గంటల తర్వాత, 14 ప్లాట్‌లను వదులుకుంటానని ఆయన భార్య పార్వతి ప్రకటించారు. “నా భర్త గౌరవం కంటే సైట్, ఇల్లు, ఆస్తి లేదా సంపద ముఖ్యమైనది కాదు’ అని పేర్కొన్నారు. మైసూరులోని విజయనగర్ లేఅవుట్ (3వ మరియు 4వ దశలు)లో ప్లానింగ్ అథారిటీ వినియోగించుకున్న 3.16 ఎకరాల భూమికి బదులుగా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వదులుకుంటానని తెలిపారు.
👉కానిస్టేబుల్ ఉద్యోగాలు అభ్యర్థులకు గమనిక*
*APలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
5 నెలల్లో PMT, PET పరీక్షలను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది.*రెండో దశ అప్లికేషన్ ఫాం నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైటులో పొందుపరుస్తాం..2వ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని ఆమె ప్రకటించారు.
👉మట్టిలో మాణిక్యం…చంద్ర కిరణ్..*
*రాష్ట్రపతి, తెలంగాణ సీఎం సమక్షంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా లా పట్టా ను అందుకున్న హెచ్ చంద్ర కిరణ్….
అత్యంత ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసి, 21వ, యూనివర్సిటీ యాన్యువల్ కాన్వకేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే చేతుల మీదుగా లా పట్టాను ను హెచ్. చంద్ర కిరణ్ అందుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్శింహులపేట మండలం పడమటి గూడెం అనే ఒక మారుమూల గ్రామంలో కడుబీద, దళిత కుటుంబంలో సంధ్య వెంకన్నల రెండవ సంతానంగా జన్మించి..చిన్నతనంలో గ్రామీణ పాఠశాలల్లో విద్యను అభ్యసించి, 2వ, తరగతి నుండి ఇంటర్ వరకు హైదరాబాదు పబ్లిక్ స్కూల్ రామంతపూర్ లో సాంఘీక సంక్షేమ శాఖ వారి సహకారం తో చదివి, అత్యంత, ప్రతిభ కనబరిచి, ఉన్నత శ్రేణి లో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం అత్యంత పటిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ లో లా ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేసుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా లా పట్టాను అందుకోవడం చాలా గర్వకారణమని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా చంద్ర కిరణ్ మాట్లాడుతూ… నా తల్లి తండ్రులు కాయ కష్టం చేసి నన్ను ఉన్నత చదువులు చదివించారు అని, నాకు మొదటినుంచి సహకరించిన నా మేనమామలు వీరస్వామి, రమేష్ మరియు నాకు స్పూర్తి నిచ్చిన మా తాతయ్య డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు అలాగే నాకు చదువు నేర్పిన నా గురువులందరికీ నా పాదాభివందనాలు అని భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. కాగా చంద్ర కిరణ్ నల్సార్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసిన సందర్భంగా యూనివర్సిటీ ప్లేస్మెంట్ విప్రో లీగల్ అడ్వైసర్ గా నియమితులై ఎందరికో ఆదర్శంగా నిలిచిన చంద్ర కిరణ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.
👉 హైదరాబాద్ లో డీజేలు, క్రాకర్స్ బంద్..సంచలన ఉత్తర్వులు జారీ..
ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు.
పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఇంట్లో అయినా వీధిలో అయినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా డీజేల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు. డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్ మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతోంది. డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతుండటం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో డీజేలు,సౌండ్ మిక్సర్‌లు, హైసౌండ్ ఎక్యూప్‌మెంట్, క్రాకర్లపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఊరేగింపులు,వేడుకల్లో ఇకపై వీటిని వాడరాదు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టులకు 100 మీటర్ల వరకు నిషేదం అమల్లో ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించారు.
కాగా, 4 జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబిల్స్ నిర్దేశించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టంలో వాడకూడదని చెప్పారు. రాత్రి వేళల్లో 45 డెసిబిల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్ లో వాడకూడదన్నారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల మత పెద్దలతో,రాజకీయ నేతలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
👉గచ్చిబౌలిలో అక్రమంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కూల్చివేత..
హైకోర్టు ఆదేశాల మేరకు రామమ్మకుంట చెరువు బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని నేలమట్టం చేసిన అధికారులు.
అన్ని తెలిసిన అధికారులే బఫర్ జోన్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నిర్మాణం జరిపితే, ఏమి తెలియని పేదలకు బఫర్ జోన్, FTL పరిధిలో నిర్మాణం చేస్తే తప్పు అని ఎలా తెలుస్తుంది?…
👉 శ్రీచైతన్య కాలేజీలో పరిస్థితిపై నేరెళ్ల శారద సీరియస్.. మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో మంగళ వారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబందించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్, స్టాల్ లలో సౌకర్యాలు సరిగా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపించారు.
👉ఇటు గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య.. పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం..!!* ఇక మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతిస్తాయని భావిస్తారు.
అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పిత్రు పక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య(మహాలయ అమావాస్య) అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ఇదే రోజు గాంధీ జయంతి. పెద్దల పండుగ అంటేనే శక్తికొద్దీ మాంసాహారం, మద్యం ఉంటాయి. స్వర్గస్తులైనవారికి అవి రెండూ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆతర్వాత ఇచ్చన వారు పుచ్చుకుంటారు. ఈసారి గాంధీ జయంతి రోజు రావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీ జయంతి రోజు ప్రభుత్వం మద్యం, మాంసం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు. దీంతో ఇప్పుడు పెద్దలకు మద్యం, మాంసం ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
అనుమతికి డిమాండ్..
గాంధీ జయంతి రోజు మహాలయ అమావాస్య వస్తున్నందున ఈసారి మాంసం విక్రయాలకు అనమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మాంసం విక్రయానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని భంగంపర్చడం సరికాదని పలువరు పేర్కొంటున్నారు. కొందరు మంగళవారం నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. కొందరు గురువారం పాటించాలని భావిస్తున్నారు.
బుధవారమే చేయాలంటున్న పండితులు..
ఇదిలా ఉంటే.. మహాలయ అమావాస్యను బుధవారం రోజే పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు పాటిస్తేనే స్వర్గస్తులైనవారి ఆత్మలు శాంతిస్తాయని పేర్కొంటున్నారు. ముందురోజు, లేదా తర్వాతి రోజు పాటించడం వలన ఎలాంటి ఫలితం ఉండదని పేర్కొంటున్నారు. దీంతో కొందరు బ్లాక్ దందాకు తెర తీస్తున్నారు. మద్యం అమ్మకాలు రహస్యంగా సాగించేందకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మాంసం కూడా షాపుల్లో కాకుండా ఇళ్లలో విక్రయించేందుకు చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మహాలయ అమావాస్య నేపథ్యంలో అధికారులు యూడా చూసీ చూడనట్లు ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
👉విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయలు సహాయాన్ని అందజేసిన:S.S IIT విద్యాసంస్థల అధినేత శ్రీనివాసరావు..
చిలకలూరిపేట:ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విద్యాప్రదాత, మానవతామూర్తి, ఎందరో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న మానవతామూర్తి ,S.S IIT విద్యాసంస్థల అధినేత శ్రీనివాసరావు విజయవాడ వరదబాధితుల సహాయార్థం 1,00,000/- డొనేట్ చేసారు.
👉పింఛన్ డబ్బుతో సర్వేయర్ పరార్*..అనంతపురం:*
*విడపనకల్లు సచివాలయం-2 సర్వేయర్ ఫించన్ డబ్బుతో పరార్ అయ్యారు.
*సుమారు రూ.2.52 లక్షల నగదును ఆయన పింఛన్ దారులకు పంపిణీ చేయకుండా ఉడాయించారు.
*ఈ ఉదంతంపై కేసు నేమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
👉రేపు మద్యం, మాంసం విక్రయాలు బంద్: ఎస్సై నరసింహారావు..
ప్రకాశం జిల్లా కంభం మండల పరిసర ప్రాంతాలలో రేపు అక్టోబర్ 2న మాంస విక్రయాలు, అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని కంభం ఎస్సై నరసింహారావు మండల ప్రజలను హెచ్చరించారు. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని మండలంలో మాంసం విక్రయాలు అక్రమంగా మద్యం అమ్మకాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు.ఎవరన్నా మాంసం విక్రయించినా లేదా అక్రమంగా మద్యం అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ నరసింహారావు అన్నారు…
👉ఘనంగా వయోవృద్దుల దినోత్సవం నిర్వహించిన ప్రజా సంకల్ప వేదిక..గిద్దలూరు ..
ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఓబిలిబోయిన వెంకటయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు అడపాల నాగమణి, జిల్లా మాజీ సైనికులు విభాగం అధ్యక్షులు బట్టబోతుల ఓబులేసు అధ్యక్ష్యతన గిద్దలూరు ప్రజా సంకల్ప వేదిక కార్యాలయంలో అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న వృద్దులకు ఆత్మీయ సన్మానం చేసి, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న వృద్ధుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, వారి అనుభవ పూర్వకమైన సలహాలు భావి తరాల వారికి ఎంతో అమూల్యమైనవని పలువురు వక్తలు తెలిపారు.
139 బీసీ కులాల జె.ఎ.సి. రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఇటీవల నియామకం కాబడిన ప్రజా సంకల్ప వేదిక గౌరవ సలహాదారులు జంగాల బాలయ్య యాదవ్ గారికి ప్రత్యేక సన్మానం చేయడం జరిగింది.
న్యాయ సేవా సాధికార సంస్థల ద్వారా వృద్దులు కోర్ట్ లో ఉచిత న్యాయ సహాయం పొందే వీలుంటుందని జిల్లా అధ్యక్షులు ఓ వెంకటయ్య తెలిపారు.
ప్రవచనకర్తలు,పండితులు, బ్రాహ్మణులు క్షమాపణ చెప్పాలి-ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి ..విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలని విరమించుకోవాలని నిరసన..కొణిజేడు చెరువు కి శాశ్వత సాగర్ నీరు కనెక్షన్ ఇవ్వాలి..టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పెళ్ళి చెడ గొట్టారట!..మట్టిలో మాణిక్యం..’చంద్ర కిరణ్’.హైదరాబాద్ లో డీజేలు, క్రాకర్స్ బంద్..వరద బాధితులకు లక్ష రూపాయలు సహాయాన్ని అందజేసిన:S.S IIT..పింఛన్ డబ్బుతో సర్వేయర్ పరార్..ఘనంగా వయోవృద్దుల దినోత్సవం
Recent Posts