👉వరదలా కాదు…ఏపీకి విదిలించిన కేంద్రం.. దాని కంటే ముందు తక్షణ సాయంగా కూడా బాగానే ఇచ్చి ఆదుకుంటారు అని తలచారు. ఏపీ ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు కనీ వినీ ఎరగని విధంగా అతలాకుతలం అయింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి భారీ ఆర్థిక సాయన్నే ఆశించింది. ఏడు వేల కోట్ల రూపాయలు ప్రాథమిక సాయంగా ఏపీ పేర్కొంటూ కేంద్రానికి నివేదించింది. వరదల నేపథ్యంలో వెంటనే కేంద్ర బృందాలు ఏపీకి రావడం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా విజిట్ చేయడంతో ఏపీకి పెద్ద ఎత్తున సాయం దక్కుతుందని అంతా ఆశించారు. దాని కంటే ముందు తక్షణ సాయంగా కూడా బాగానే ఇచ్చి ఆదుకుంటారు అని తలచారు. కానీ వరదలు వచ్చి వెళ్లిపోయిన నెల తర్వాత కేంద్రం సాయం చేసింది. అయితే ఇది వరదలా సాయం కాదు కేవలం విదిలింపు గానే ఉంది అని విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా వచ్చి పడిన వరదలకు ఏకంగా పద్నాలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. దాంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి ఏకంగా 5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో ఏపీకి దక్కింది ఎంత అంటే 1036 కోట్ల రూపాయల నిధులు మాత్రమే. ఏపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు సాయం ఇవ్వాలని కోరితే వచ్చినది వేయి కోట్ల రూపాయలు అని అంటున్నారు. ఇక కేంద్ర సాయం కంటే ముందే ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలను సాయంగా అందించారు. దాంతో చాలా వరకూ సహాయం అయితే సాగుతోంది. వీడియో వైరల్! అయితే ఏపీలో పూర్తిగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో కేంద్రం కనీసంగా నాలుగైదు వేల కోట్లు అయినా ఇస్తుంది అనుకుంటే వేయి కోట్ల రూపాయలకే పరిమితం చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మరో వైపు చూస్తే తెలంగాణా పది వేల కోట్ల రూపాయల వరద సాయాన్ని కేంద్రం నుంచి కోరింది. అయితే తెలంగాణాకు మరీ తక్కువగా 416.80 కోట్లు విడుదల చేశారు.అయితే ఈ మొత్తం 14 రాష్ట్రాలలో మహారాష్ట్రాకే ఎక్కువ నిధులు దక్కాయని అంటున్నారు. ఎందుకు అంటే మహారాష్ట్రకు తొందర్లో ఎన్నికలు ఉన్నందువల్లనే ఈ నిధులు బాగా ఇచ్చారు అని అంటున్నారు మహారాష్ట్రాకు 1432 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. మొత్తం మీద చూస్తే ఏపీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఎంపీలు 21 మంది ఉన్నారు. వీరి మద్దతే కేంద్రానికి కీలకంగా ఉంది. అలాంటిది ఇంత పెద్ద విపత్తు వస్తే కేంద్రం భారీగా సాయం చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ విదిలింపులతో సరిపెట్టడం పట్ల మాత్రం అంతటా చర్చ సాగుతోంది. మరి దీని మీద టీడీపీ కూటమి మిత్రులు ఏ విధంగా ఒత్తిడి తెచ్చి మరిన్ని నిధులు సాధిస్తారో చూడాల్సి ఉంది.
👉చీపురు పట్టిన చంద్రబాబు*
మచిలీపట్నం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. ఇందులోభాగంగా స్వచ్చతా హీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలసి ఆయన చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. పారిశుధ్య కార్మికలతో ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు వారి సమస్యలను తెలుసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నేషనల్ కాలేజీ ఆవరణలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ త్యాగనిరతిని ఆయన ఈ సందర్బంగా కొనియాడారు.
👉బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఫోర్జరీ కేసు నమోదు!*
బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రియల్టర్ పురుషోత్తం నాయుడుపై ఫోర్జరీ కేసు నమోదైంది.
విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ గంటా రాజశేఖర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.
తన ఇంట్లోకి చొరబడి సంతకాలు పెట్టమని ధర్మారెడ్డి బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన గంట రాజశేఖర్ రావు.తనకు తెలియకుండానే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు.
👉 నిజాయితీకి నిలువెత్తు రూపం, నిబద్ధత కలిగిన రాజకీయ నేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను..స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రధానిగా శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం.
…నారా లోకేష్.. విద్య, ఐటి శాఖల మంత్రి
👉 మూసీ నది ప్రక్షాళన, హైడ్రా అంశాలపై బీఆర్‌ఎస్ పార్టీ విమర్శలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి బీఆర్‌ఎస్ విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షీరసాగర మథనంలో మొదట విషమేవస్తుందని, ఆ తర్వాత వచ్చేది అమృతమేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అమృతం రావడానికి కొంత కాలం ఆగాలన్నారు. హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటి కూల్చివేతకు ప్రజలు సహకరించాలని మాజీ సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదా అని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా విషయంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది ఫాంహౌ్‌సలో పడుకోవడానికా అని నిలదీశారు. రాహుల్ గాంధీకి హరీశ్‌రావు లేఖ రాసింది మూసీ బాధితుల కోసం కాదని, సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకన్నారు.
👉 యువకుడి దారుణ హత్య..
గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు యువకుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు బుర్రిపాలెం వాసి పేరిశెట్టి కోటేశ్వరరావు (34)గా గుర్తించారు.
👉పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాము..మంత్రి నారాయణ
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం.
ప్రభుత్వ స్థలాలు,చెరువులు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి,అక్రమ కట్టడాల విషయంలో ఏ పార్టీ వారైనా,ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించేది లేదు.
అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉండే పేదలకు టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాటిని కూల్చివేస్తామన్నారు..ఏ పేదవారిని ఇబ్బంది పెట్టేది లేదు.
ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
👉పులివెందులలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి హాట్ కామెంట్స్…కడప జిల్లా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచక పాలన నడుస్తుంది…వంద రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసిపి నేతలపై దాడులు చేస్తున్నారు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తి మూటగట్టుకుంది.
పులివెందుల లో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు.గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.రాజగోపాల్ రెడ్డి నడి రోడ్డు పై కొట్టుకుంటూ టిడిపి ఆఫీస్ కు తీసుకెళ్ళారు.జగన్ మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేది.పులివెందుల లో అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంసృతి లేదు.లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది.కూటమి ప్రభుత్వం పులివెందుల కు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు.పులివెందుల లో జగన్ చేసిన అభివృద్ధి ని కొనసాగిస్తే చాలు.పులివెందుల లో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ కి అడ్మిషన్లు రాకుండా చేసింది కూటమి ప్రభుత్వం.వి కొత్తపల్లె గ్రామంలో విఆర్ఎ నరసింహ అనే వ్యక్తి ని జిలెటిన్ స్టిక్స్ పేల్చి హత్య చేశారు.ఇలాంటి ఘటనతో జిల్లాలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.పులివెందుల విచ్చలవిడిగా డిటోనేటర్లు,జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయి.వేముల మండలం లో అక్రమ మైనింగ్ వల్ల జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయి.అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు, జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశాం.అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని వైకాపా తరపున డిమాండ్ చేస్తున్నాం.తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు.దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయద్దని హితవుపలుకుతున్నాం.
👉GVMC గాంధీ చౌక్ వద్ద నివాళులు అర్పించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..విశాఖపట్నం..మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన పీసీసీ చీఫ్..వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్..
విభజించు..పాలించు అనాడు బ్రిటిష్ సిద్దాంతం.. బ్రిటిషర్ల చెర నుంచి….మన దేశానికి స్వాతంత్య్రం రావాలంటే హింస మార్గం కాదని….గాంధీజీ నమ్మారు అహింస,ఒక్కటే మార్గమని గాంధీజీ చెప్పారు..ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించిన మహానుభావుడు మన మహాత్మ… బాపూజీ మన ” ఫాదర్ ఆఫ్ ది నేషన్ ” మన దేశానికి గాంధీజి ఒక దిక్సూచి..సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటివి గాంధీజీ ఆయుధాలు..గాంధీజి సిద్ధాంతాలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం..గాంధీజీ మనకు నేర్పినవి సత్యం,అహింస ,శాంతి, సమానత్వం,బాపు దేశం మొత్తం ప్రేమతో జీవించాలని చెప్పారు..అన్ని మతాల మధ్య సమానత్వం ఉండాలని చెప్పారు..సత్యం కోసం బ్రతకాలని అన్నారు..ఇప్పుడు మన దేశంలో వీటికి విలువ ఉందా ?
బాపు బోధించిన విలువలకు గుర్తింపు ఉందా ?..గాంధీజి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో నడుస్తున్నది ” గాడ్సే” పాలన..మత సామరస్యాన్ని మంట కలిపి కులాల మధ్య ,మతాల మధ్య చిచ్చు పెట్టే పాలన సాగుతుంది.
గాంధీజీ నేర్పిన సిద్ధాంతాలు కాదు…RSS సిద్ధాంతాలు ఈ దేశంలో సాగుతున్నాయి..భారత రాజ్యాంగం కాదు… RSS రూపొందించిన రాజ్యాంగం ఈ దేశంలో సాగుతుంది.
కులాల మధ్య విభజన.. మతాల మధ్య విభజన
-రాష్ట్రాల మధ్య విభజనభాషల మధ్య విభజన-ఈ దేశంలో బీజేపీ అంటే… విభజన, ఘర్షణ…ఈ దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్…ఈ దేశంలో ప్రేమను పంచితే…. గత 10 ఏళ్లుగా దేశంలో బీజేపీ ద్వేషాన్ని పంచుతుంది.-కాంగ్రెస్ పార్టీ బాపు ఐడియాలజి తో పాలన చేస్తే…బీజేపీ RSS ఐడియాలజి నీ అమలు చేస్తోంది.
-అన్యాయానికి వ్యతిరేకంగా అనాడు ఈ దేశాన్ని బాపూజీ ఏకం చేసినట్లే..-రాహుల్ గాంధీ న్యాయకత్వం లో ఈ దేశాన్ని మళ్ళీ ఏకం చేస్తాం..ఈ దేశంలో ఐక్యత కోసం పోరాడుతాం-గాంధీజీ విలువలు కాపాడే వాళ్ళే నిజమైన దేశ భక్తులు.-బీజేపీ నుంచి విముక్తి కోసం మరొక స్వాతంత్య్ర పోరాటం జరగాల్సి ఉంది..లడ్డూ కల్తీ పై CBI విచారణ జరగాలని కోరిందే కాంగ్రెస్ పార్టీ..లడ్డూ కల్తిపై సుప్రీం సూచనను పరిగణనలోకి తీసుకోవాలి..మత రాజకీయాలు ఆపాలన్నారు.
👉ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది.
సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు సోమవారం లోహటియాలోని బడా గణేష్ ఆలయంలో సమావేశమయ్యారు. అనంతరం వారంతా సాయిబాబా విగ్రహాన్ని ఆలయంలో నుంచి తీసేసి ప్రాంగణం వెలుపల ఉంచారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని.. వాస్తవానికి శాస్త్రాల్లో బాబా ఆరాధన గురించి ఎక్కడా చెప్పలేదని సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు అంటున్నారు. అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు రాజుదాస్ సైతం ఈ చర్యను సమర్థించారు. సాయిబాబా ధర్మ గురువే కావచ్చు, దేవుడు కాదని ఆయన అన్నారు.
కాశీలో పరమేశ్వరుడి ఆరాధన మాత్రమే జరగాలని దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొన్నారు. వారణాసిలోని సంత్ రఘువర్ దాస్ నగర్‌లో వెలసిన బాబా ఆలయ పూజారి సమర్ ఘోష్ దీనిపై స్పందిస్తూ.. ”ఈరోజు సనాతనులమని అంటున్నవారే గతంలో ఈ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది సరైన చర్య కాదు” అన్నారు. ఈ చర్యల వెనుక బీజేపీ ఉందని యూపీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాబాను భగవంతుని అవతారంగా అన్ని మతాలవారు పూజిస్తారని శిర్డీ శ్రీ సాయిబాబా సనాతన్ ట్రస్టు వెబ్‌సైట్‌లో పేర్కొంది.
*సుప్రీం కోర్టు ఏమందంటే..*
ద్వారకాపీఠానికి చెందిన శంకరాచార్య.. సాయిబాబాను ఆరాధనపై చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవడానికి 2014లో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది జూన్‌లో.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
👉 ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్, నలుగురు అరెస్ట్..
రూ.2 వేల కోట్ల విలువైన 560 కిలోల డ్రగ్స్ స్వాధీనం..
ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ వాళ్ళు ఢిల్లీలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ ను చేధించారు.
ప్రముఖ తమిళ నిర్మాత దీని వెనుక ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు
👉2000 రూపాయల నోట్ల మీద బిగ్ అప్డేట్..
*ప్రజల వద్దనే ఉండిపోయిన రెండు వేల నోట్లు విలువ రూ.7117 కోట్లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మొదటి తేదీన రూ. 2000 నోట్లకు సంబంధించి పెద్ద అప్డేట్
ఇచ్చింది. 2000 నోట్లు చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి,మొత్తం 2000 రూపాయల నోట్లలో 98% శాతం తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ప్రజలు ఇప్పటికీ
రూ.7,117 కోట్ల విలువైన నోట్లను ప్రజలు కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
👉 పల్నాడు జిల్లా..నరసరావుపేట మండలం పమిడిపాడు శివారులో దారుణం. భార్య త్రివేణి 36 ని కత్తితో పొడిచి చంపిన భర్త మురళి 41 సం..అనంతరం పారిపోతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన భర్త మురళి…భర్త మురళి పరిస్థితి విషమం,నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు…వివాహేతర సంబంధంమే హత్యకు కారణంగా భావిస్తున్న పోలీసులు…త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం వన్నాయపాలెంగా గుర్తింపు.మహిళ హత్యపై వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు….
👉మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలు లో గాంధీజీ విగ్రహాన్ని నివాళులర్పిస్తున్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ అన్సా రియా
👉గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలులోని గాంధీ రోడ్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా. డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి,ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిమ్ అన్సారీయా, అయినాబత్తిన ఘనశ్యామ్ , తాతా ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
👉గాంధీ జయంతి సందర్భంగా ఒంగోలులోని మునిసిపల్ కార్యాలయం లో ఒంగోలు నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఉత్తమ పారిశుధ్య కార్మిక పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొని పరిశుద్ధ కార్మికులకు దుస్తులు మరియు పి.పి.ఇ. కిట్ల పంపిణి కార్యక్రమం లో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా ,నగర మేయర్ గంగాఢ సుజాత , నగర కమిషనర్ కె. వెంకటేశ్వర రావు మరియు తదితర కార్పొరేటర్లు,అధికారులు పాల్గొన్నారు.
👉 మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రవిప్రియ సంస్థల అధినేత శ్రీ కంది రవిశంకర్,జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ .
*జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*మార్కాపురం నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజి శాసన సభ్యులు,మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు గారు.*
👉వృద్దులు అనాధలతో కలిసి గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన ప్రజా సంకల్ప వేదిక..
గిద్దలూరు పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి ఉత్సవాలు ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి ఆదేశాలతో సంస్థ జిల్లా అధ్యక్షులు ఓబిలిబోయిన వెంకటయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంస్థ జిల్లా మహిళా అధ్యక్షురాలు అడపాల నాగమణి మరియు సంస్థ జిల్లా మాజీ సైనికులు విభాగం అధ్యక్షులు బట్టబోతుల ఓబులేసు, విశిష్ట అతిధిగా యశ్వంత్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు ఎం.పిచ్చయ్య పాల్గొన్నారు.
👉సంస్థ గిద్దలూరు కార్యాలయం లో గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా చిత్ర పఠానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని సంజీవని వృద్ధాశ్రమంలో వృద్దుల, ఆనాధల మధ్య కేక్ కోసి వారికి దుప్పట్లు, బ్రేడ్, పళ్ళను పంపిణీ చేసి ఆశ్రమ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు.
సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు కె. కోటి లింగం సొంత నిధులతో వృద్దులకు,అనాదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారులు జంగాల బాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు యన్. రాజయ్య, పి. మాబున్ని,కే. కోటిలింగం,బి. శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి యు ఖాదర్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శులు మదార్ బాషా,బ్రహ్మం,కార్యవర్గ సభ్యులు ఎం. ఉమా మహేశ్వర రావు, యు. కిరణ్ కుమార్, ఐతం రాజు, ఈ. రామయ్య,కె.విజయలక్ష్మి, యన్.పీరయ్య,వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్,నరసింహ చారీ,యన్.వెంకటేశ్వర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
👉మెప్మా సిఎంఎం మాలతికి ఘనంగా వీడ్కోలు*..*మెప్మా సిఎంఎం మహమ్మద్ అరిఫ్ సుల్తాన్ కు శుభాకాంక్షలు తెలిపిన సిఎంఎం మాలతి.
చిలకలూరిపేట : బదిలీపై వెళుతున్న బదిలీపై వెళుతున్న మెప్మా సి ఎమ్ ఎమ్ మాలతికి డ్వాక్రా సంఘాల కు చెందిన అర్పిలు ఘనంగా వీడ్కోలు పలికారు స్థానిక మైలవరపు గుండయ్యా మున్సిపల్ కౌన్సిల్సమావేశ మందిరంలో మంగళగిరిమున్సిపాలిటీ కి మెప్మా సి ఎమ్ ఎమ్ బదలీ పై వెళుతున్న మాలతి కి అర్పీలు,మెప్మా సీఓ లు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వీడ్కోలు కార్యక్రమం సుదీర్ఘ సమయం సుమారు 3గంటలకు పైనే జరిగింది
పలువురు ఆర్పిలు గద్గద స్వరంతో
కన్నీళ్ళ పర్యతంమయ్యారు.బదలీ పై వెళ్తున్న మెప్మా సి ఎమ్ ఎమ్ మాలతి మాట్లాడుతూ, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మార్గ దర్శకంలో మహిళా పొదుపు సంఘాలు అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో స్త్రినిధి సాధించుకొని పల్నాడు జిల్లా లో చిలకలూరిపేట మున్సిపాలిటీ ముందుండాలని ఆకాంక్షించారు. ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమని, మనకు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ అందరి సహకారంతో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించనని అన్నారు .గడచిన నాలుగు సంవత్సరాలుగా చాలా మంచి గా గడిచిందని, ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిచేయడంలో, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమములను అమలుచేయడంలో తనకు స్థానిక ప్రజాప్రతినిధులు,మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మహిళా సంఘాలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లు పూర్తిస్థాయిలో సహకరించారన్నారు.
డ్వాక్రా రుణాలను మంజూరు చేయంచటంలోనూ అదే విధముగా నేల నెల బ్యాంక్ రుణాలు చెల్లించటం లోమంచి మార్పులు తీసుకొని వచ్చే దిశగా మెప్మా సిబ్బంది తో కలసికృషి చేయడం జరిగిందని తెలిపారు,ఉద్యోగులు ప్రభుత్వ విధులను పకడ్బందీగా నిర్వ హించడంతో పాటు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,ప్రతి ఉద్యోగి ప్రభుత్వ విధులతో పాటు తమ కుటుంబానికి సమయం కేటాయించాలన్నారు. నూతన సీఎం ఎం గా ఇక్కడ కు బదలీ పై వచ్చిన మహమ్మద్ అరిఫ్ సుల్తాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
*సిఎంఎం గా మాలతి విశిష్టమైన సేవలు అందించారు…!*
డ్వాక్రా సంఘాల ఆర్పీలు సమైక్య గ్రూప్ లీడర్లు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో గడిచిన నాలుగేళ్లుగా మాలతి సీఎంఎం గా విశేషమైన సేవలు అందించారని, డ్వాక్రా సంఘాల నిర్వహణలో వివాద రహితంగా తమ విధులను నిర్వర్తించారని కొనియాడారు, సాధారణ బదిలీల్లో మంగళగిరి కి బదిలీ అయిన మాలతి ఇంకా మెరుగైన సేవలు
అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్పీలు, సమైక్య గ్రూపుల అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఈవోలు , సి ఓ లు శ్రీనివాసరావు,రవి,ఇందిరా ఆదినారాయణ,ఫరూక్ తదితరులు పాల్గొన్నారు
చీపురుపట్టిన సీఎం చంద్రబాబు..వంద రోజుల్లో అరాచక పాలన ఎంపీ అవినాష్ రెడ్డి…పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాము..మంత్రి నారాయణ..దేశంలో బీజేపీ ద్వేషాన్ని పంచుతుంది-వైయస్ షర్మిల.. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్, నలుగురు అరెస్ట్.. ప్రకాశం జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి.. మెప్మా సిఎంఎం మాలతికి ఘనంగా వీడ్కోలు…
Recent Posts