👉 “మోడీ-ముర్ము.. హిందువులు కాదు“దేశంలో గోవధను నిషేధించలేక పోతున్నారు.. యూపీలోనూ గోవద ఆగలేదు..జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి..!!!!
నిత్యం విమర్శలు,వివాదాలతో రాజకీయాల్లోనే నేతలు మాత్రమే కాదు..స్వాములు,సన్యాసులు కూడా కాలం వెళ్ల దీస్తున్నారు. నిత్యం విమర్శలు,వివాదాలతో రాజకీయాల్లోనే నేతలు మాత్రమే కాదు..స్వాములు, సన్యాసులు కూడా కాలం వెళ్ల దీస్తున్నారు. ఇలాంటి వారిలో *జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒకరు. *అయోధ్య రామమందిరంలో బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలోనూ అవిముక్తేశ్వరానంద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయం పూర్తికాకుండానే ప్రారంభం ఏంటని ఆయన ప్రధానిని నిలదీశారు. ఇక, గోవధపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి అవిముక్తేశ్వరానంద ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములపైనా కామెం ట్లు కుమ్మరించారు. మోడీ-ముర్ములు అసలు హిందువులే కారని అవిముక్త సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు.. తాము హిందువులమని చెప్పుకొనే వారు..**దేశంలో గోవధను నిషేధించలేక పోతున్నారని..ఇలాంటివారు హిందువులు ఎలా అవుతారని అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రశ్నించారు. దేశంలో ఇప్పటి వరకు ప్రధానులుగా, రాష్ట్రపతులుగా చేసిన వారు ఎవరూ కూడా హిందువులు కారని అవి ముక్తేశ్వర వ్యాఖ్యానించారు.దీనికి కారణం.. వారంతా గోవులను సంరక్షించలేక పోయారని.. గోవధను అడ్డు కోలేక పోయారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. *యూపీలో ఉన్న ముఖ్యమంత్రి పక్కా సాధువేనని.. సన్యాసం తీసుకున్నారని అలాంటి ఆయన పాలనలోనూ యూపీలో గోవధ ఆగలేదన్నారు. అంతేకాదు.. *యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింతగా గోమాంసం ఎగుమతి అవుతోందన్నారు**. ఇలాంటివారి వల్ల హిందూ ధర్మానికి, గోవులకు రక్షణ ఎక్కడుందో చెప్పాలని అవిముక్త ప్రశ్నించారు. పైకి హిందువుల మని చెప్పుకొంటున్నా.. వారికి ఆ ధర్మంపై విశ్వాసం లేదన్నారు. అందుకే వారిని హిందువు లుగా పరిగణించలేమన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
👉 ఈనెల 10వ తేదీన ఏపీ కేబినెట్ మీటింగ్..
ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీతో పాటు పలు కీలక అంశాలపై చర్చ..చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలపనున్న ఏపీ మంత్రి వర్గం..జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం అమరావతిలో రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలపై చర్చలు
👉అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్*
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటిఎమ్ లో ఫిబ్రవరి 18 , 2024 న అంతరాష్ట్ర దొంగల ముఠా ఏటీఎం ధ్వంసం చేసి సినీ ఫక్కీలో రూ. 28 లక్షల దొంగతనం చేసి పరారయ్యారు.. జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ఆదేశాల మేరకు సీఐ రవికుమార్ వారిని పట్టుకొని బయ్యారం పోలీస్ స్టేషన్ కు తీసుకవచ్చినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ జిల్లా పలోడి ప్రాంతానికి చెందిన అబ్దుల్ గని మరికొంత మందితో కలిసి కారులో వచ్చి గ్యాస్ కట్టర్ తో కేవలం గంట20నిమిషాలలో వ్యవధిలో ఏటీఎం దొంగతనం ఎలా చేశారో… ఏటీఎమ్ మిషన్ నుండి నగదు దొంగలించిన విధానాన్ని వివరించారు. ఇతనిపై రాష్ట్రంలో పలు ఏటిఎమ్ దొంగతనం కేసులు, పలు పోలీసు స్టేషన్ లలో చీటింగ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఇతనిపై ఏ1 నిందితునిగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర ఏటిఎమ్ దొంగలు పట్టుకున్న ఎస్ఐ తిరుపతి, ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పి సుధీర్ రాంనాద్ కేకన్ , డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో గార్ల ఎస్ఐ జీనత్ కుమార్, పోలీసు సిబ్బంది, అనిల్, రంజిత్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
👉విద్యుత్ షాక్ తో ఇద్దరు విద్యార్ధులకు గాయాలు*తిరుపతి జిల్లా..
👉గూడూరు పట్టణ ఎస్ కే ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం…*
*విద్యుత్ షాక్ తగలడంతో ఇద్దరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు గాయాలు…*
ట్రాన్స్ఫార్మర్ లో ఇరుక్కుపోయిన ద్విచక్ర వాహనం….
గాయపడిన విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం..గాయపడిన విద్యార్థులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు…
👉 గాంధీజయంతి నాడు న్యాయం చేయాలంటూ తహశీల్ధార్ కార్యలయం వధ్ధ ధర్నా చేపట్టిన బాదితులు.
కోటపాడులో 9రోజులుగా మూడు కుటుంబాలు గృహదిగ్భందం.
రాజకీయ గొడవలంటూ పట్టించుకోని తహశీల్దార్ ప్రశాంతి.
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలోపూర్వకాలం నుండి ఉన్న డొంక దారికి పెక్షింగ్ వేసి ఇంటిలో నుండి బయకు రాకుండా దిగ్బందం చేశారని, దారికి వేసిన పెక్షింగ్ తీయించి న్యాయం చేయాలని కోరుతూ బుదవారం గాందీజయంతినాడుచీపు ధర్మారావు, చీపువెంకటే శ్వరావు,చీపునాగరాజు మహిళలు పిల్లలతో కలిసి తహశీల్దారు కార్యలయం వద్ద ఉదయం నుండి ధర్నా చేపట్టారు. ఈ సంద ర్బంగా బాదితులు మాట్లా డుతూపూర్వకాలం నుండి ఉన్నడొంకదారినితీగరాళ్ళుతో పెక్షింగ్ వేసి దారి లేకుండా గృహదిగ్బందం చేసిన వేముల నాగేశ్వ రావు,వేముల శివకృష్ణ, వేముల దుర్గారావుఅను వారలపై చర్యలు చేపట్టి మాకు పూర్వకాలంనుండి ఉన్న డొంకదారి యదాతం గా ఉండేలా చేసి న్యాయం చేయాలని అదికారులను కోరుతున్నామని,9రోజులుగా ఇబ్బంది పడుతున్నామని తహశీల్దారు పట్టించు కోవటంలేదని అన్నారు.మాకు పూర్వకాలంనుండి ఆర్ఎస్,నంబర్251/2లో0.18 1/2 సేంట్లు ఇండ్ల స్థలం భూమి ఉన్నదని, అదేస్థలంలోఇండ్లునిర్మించుకోని పూర్వకాలంనుండి జీవిస్తున్నామని,మా ఇండ్ల నుండిబయటకువెళ్ళుటకు వచ్చుటకు పూర్వ కాలం నుండి ఉన్న డొంక దారిన నడచే వాళ మన్నారు.గత సంవ త్సర కాలం నుండి మా భూమికి పడమర ఉన్న వేముల తాతయ్య కుమారులు నాగేశ్వరావు, శివకృష్ణ, దుర్గారావు,అనువారులు మమ్ములను పూర్వం నుండి ఉన్న డొంక దారి వారి పట్టాభూమిలో ఉన్న దని ఈ దారిన నడవ నీయమని గొడవలు చేస్తూ మా పై దాడి చేసి మమ్ములను,అడ్డంవచ్చిన మా ఆడవాళ్ళను కొట్టి గాయపర్చారని, స్టేషన్లో కేసు నడుస్తున్నదని, ఇలా ఉండగా వారు సర్వే పెట్టా రని మండల సర్వేరు వచ్చి బౌండ్రిని కొస్తున్నామ ని చెప్పి 24-9-2024 మంగళవారంసర్వేచేసినారనీ,డొంకదారి మూడు వంతులు మా భూమిలో ఉండగా కేవలం 5 మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పున మాత్రమే వేరే నంబర్లోకి వెళ్ళిందని అన్నారు. సర్వేరుగారు చేసిన సర్వే రిపోర్టు ఎంఆర్ఓకి ఇస్తానని ఆమేగారు వచ్చి నిర్దారణ చేసేవరకు యదాతంగా ఉండాలని చెప్పి వెళ్ళి నారనీ,వారు వెళ్ళిపోగానే వేముల నాగేశ్వరావు, దుర్గారావు,శివక్రిష్ణ అనువారు.ఎస్సీ కులస్తులను తీగరాళ్ళు పాతమని ఎవ్వడు అడ్డు వస్తాడో చూస్తాం ఎవ్వడు అడ్డువచ్చిన ఇక్కడే చంపి పాతిపేడతామంటూ దౌర్జన్యంగా కేకలు వేస్తూ కర్రలు కత్తులు తీసుకొని సవాళ్ళు చేస్తూ,తీగరాళ్ళు పాతించి పెక్షింగ్ వేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇరువర్గాలను సంప్రదించి పరిస్కారం చేద్దామని మంచిన పూర్ణచంద్రా రావు,చీపు అన్నవరం తదితర పెద్దల మట కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా ఇనప తీగల తో పెక్షింగ్ వేసి డొంకదారిని మూసి వేసి మమ్ములను గృహనిర్బందంచేసినారని,ఇప్పుడు మేము బయట కు వెళ్ళటానికి రావటానికి దారి లేకుండా పోయింద న్నారు. ఇప్పుడు పిల్లల బడికి వేళ్ళటానికి,గేదెలు మేతకు తోలుకు వెళ్ళ టానికి, ఇబ్బంది పడుతు న్నాము. సదరు భూములు అన్నాదమ్ముల వాటాలై ఉన్నయని, పూర్వి కులు ఎలా పంచు కున్నారో తెలియదని,1971లో పబ్బు ఆదియ్య మాకు వ్రాసిన అగ్రమెంటు ప్రకారం మా భుమికి ఉత్తరం నుండి డోంక దారి అని వ్రాసి ఉన్నదని,అదే దారిన ఆనాటి నుండి ఇప్పటి వరకు నడుస్తు న్నామన్నారు.ఇప్పుడు ఇది వాళ్ళ పట్టాభూమి అని దారిని మూసివేసి నారని,ఈ దారితప్పా వారికివేరేదారిలేదని తెలిపారు. వారి కాగితాలు మా కాగితాలు, అదికారు లు స్వయంగా పరిశీలించి మాకు ఇంటిలోకి వెళ్ళి రావటానికి పూర్వకాలం నుండి మేము నడుస్తున్న దారిని యదాతంగా చూపించి న్యాయం చేయాలని లేకుంటే అందరం కలసి ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో గత్యంతరం లేదని వాపోయారు.
👉హన్మకొండ జిల్లా:*ఆత్మకూరు మండలం:* చౌవుల్ల పెల్లి గ్రామంలో పిడుగుపాటు తో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి. పత్తి ఏరడానికి వెళ్లిన కూలీలు వర్షం వస్తుండగా చెట్టు కింద ఉండగా పిడుగు పడడం తో ఇటుకాల నిర్మల (51)సోలెంక రమ (45) పిడుగు పడడం తో అక్కడి కక్కడే మృతి.
👉హైడ్రాకు ఫుల్ పవర్స్.. ఇక దూకుడే!*
*ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్
_తెలంగాణ సమయం ప్రతినిధి_
_హైదరాబాద్, అక్టోబర్ 02_
*హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం.*దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత.*ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించే యోచన.*అప్పటివరకు హైడ్రాకు రక్షణగా ఈ ఆర్డినెన్స్.*ఆక్రమణలు, వాటీ స్వాదినానికి సంబంధించి కావల్సిన దాదాపు అన్ని అధికారాలు కట్టబెట్టారు*ఆక్రమణల పరిశీలన, నోటీసుల జారీ, తొలిగింపు ఇక హైడ్రా చేతిలోనే..
*హైడ్రాకు అధికారం కల్పిస్తూ పొందుపరిచిన ఆర్డినెన్స్…*
*జీహెచ్ఎంసీ చట్టం1955లోని సెక్షన్ 374బీ
*పురపాలక చట్టం -2019..*బీపాస్ చట్టం -2020
*హెచ్ఎండీఏ చట్టం -2008
*తెలంగాణ భూ ఆదాయ చట్టం లోని సెక్షన్ 1317ఎఫ్
👉కే వీల్స్ లను ఎత్తుకెళ్లిన దొంగలను అరెస్టు చేసిన: ఎస్సై సృజన్ కుమార్..*
దేవరుప్పుల మండలంలోని గొల్లపల్లి క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా కామారెడ్డిగూడెం చెందిన వ్యక్తి తీగల సురేష్ టాటా ఏసీ ట్రాలీలో వాటిని వేసుకొని అమ్మడానికి వెళ్తున్నాడన్న పక్క సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసును దర్యాప్తు త్వరితగతన చేదించిన ఎస్ఐ సృజన్ కుమార్, సిబ్బందిని అభినందించిన సిఐ మహేందర్ రెడ్డి.
👉ఏపీలో మెడికల్ పీజీలో సర్వీస్ కోటా పెంపు*
*సర్వీస్ కోటా 15% నుంచి 20% శాతానికి పెంపు*
ఏపీలో మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC
వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఇన్సర్వీస్ రిజర్వేషన్ ను క్లినికల్ విభాగంలో 20% శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో
రిజర్వేషన్ మాత్రం 30% శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.
👉ఏపీలో సూపర్ సిక్స్ పధకాలు అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు.
సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడి..సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా ..పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం.. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు.. స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటాం-సీఎం చంద్రబాబు
👉 కరెంటు లేక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు..
మదనపల్లె పట్టణంలోని సర్వ బోధన ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక గర్భిణులు, శిశువులు, రోగులు,తీవ్ర అవస్థులు ఎదుర్కొన్నారు.బుధవారం కురిసిన వర్షానికి దాదాపు 3 గంటల పాటు జిల్లా కేంద్రంలో పవర్ కట్
ఉండగా, బుధవారం మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మదనపల్లె 400కేవీ పవర్హెడ్ ట్రిప్ అవడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. అయితే,ఆస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఉక్కపోతకు రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు
👉గుంటూరు నగరములో వున్న వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అరండల్ పేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు*
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించే ముందుగా సిబ్బందితో గౌరవ వందనం తీసుకున్నారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారు పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్న అధికారులతో సిబ్బందితో ప్రతి ఒక్కరితో మాట్లాడి వారు పోలీస్ స్టేషన్లో చేయుచున్న విధులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టు ఉన్న ప్రదేశాలను సందర్శించి పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు ఈసందర్భంగా జిల్లా ఎస్పీ స్టేషన్లో ప్రతి పని చేయుచున్న ప్రతి ఒక్క సిబ్బంది దర్యాప్తు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
అదేవిధంగా దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసులు ఏ విధంగా దర్యాప్తు జరుపుతున్న తీరును పెండింగ్ కేసుల సేధింపులకు దోహదపదే దర్యాప్తు విధానాలపై పలు సూచనలు సలహాలు తెలియజేశారు పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్న అధికారులతో సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యాకలాపాలు మరియు గంజాయి రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పోలీస్ స్టేషన్ లో పనిచేయుచున్న సిబ్బంది అందరిని వారి వారి సెక్టార్ల లో కేటాయించాలని SHO శ్రీనివాస రావుని ఆదేశించారు.కార్యక్రమంలో ఆయన తో పాటు వెస్ట్ డి ఎస్ పి జయరామ్ స్థానిక సి ఐ శ్రీనివాస్ రావు ఇతర ముఖ్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
👉కడప జిల్లా* ప్రొద్దుటూరు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం పండుగ.దినాల సందర్భంగా అధిక మొత్తంలో టికెట్స్ డబ్బులు వసూలు చేయడమే కాక ఒకరికి ఒకరు పోటీపడుతూ డ్రైవర్లు మార్గమధ్యంలో ,అలాగేజనాలు తిరిగే పట్టణ శివార్లలో స్పీడుగా డ్రైవర్లు నడుపుతూ ఉన్నారు అని ఒక. బస్సు(indu) యజమానిని వివరణ అడగ్గా అడ్డదిడ్డంగా సమాధానం చెప్పడమే గాక మేము స్పీడ్ గానే పోతాం నీకెందుకు అని జవాబు ఇచ్చారు అక్కడ తిరిగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుకే ఈ మధ్య తరచుగా యాక్సిడెంట్లు కూడా జరగడం ఎక్కువ అయ్యాయి ఇలా జరగకుండా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బస్సులు తిరిగే విధంగా సంబంధించిన అధికారులు నియంత్రించాలని పట్టణ ప్రజలు వాపోతున్నారు….
👉కొండా సురేఖ ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం-నాగార్జున
ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం..
రేపు LB నగర్ వెళ్తా..ఎవరు అడ్డొస్తారో చూస్తా-KTR
రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం..
ఢిల్లీలో రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి నవరాత్రులు..
జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు..
ఐక్యరాజ్య సమితి చీఫ్‌పై ఇజ్రాయెల్‌లో నిషేధం
వియత్నాంలో బర్డ్‌ఫ్లూతో 47 పులులు, 3 సింహాలు మృతి
👉సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి..14 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడి..ఇప్పటికే లక్ష్మీనారాయణకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం..14వ తేదీ వరకు జ్యూడిషల్ కస్టడీకి అనుమతినిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు..
ఇవాళ్టి నుండి లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీ విచారణ
👉కొండా సురేఖ వ్యాఖ్యలపై రాంగోపాల్‌వర్మ ట్వీట్..
కన్నులతో చూసి, చెవులతో విన్నట్టు చెప్పడం దారుణం
సమంత, నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను..
తీవ్రంగా ఖండించాలి-రాంగోపాల్‌వర్మ..
కేటీఆర్‌ను దూషించే క్రమంలో..సమంత, నాగార్జున ఫ్యామిలీని అవమానించడంలో అర్థమేంటో..ఆమెకైనా అర్థమైందో లేదో నాకు అర్థమడంలేదు-ఆర్జీవీ
👉ఆవేదనతోనే విమర్శలు చేశా-మంత్రి కొండా సురేఖ..
నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు..
అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను..
నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా..
అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా..
కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు-కొండా సురేఖ
పరువునష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా
కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి-కొండా సురేఖ
👉జగన్ రెడ్డిని నమ్ముకుని నట్టేట మునిగిపోయిన అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ ఒకరు.*
ఆయన ఏడేళ్ల ముందే వీఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చింది. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాతి రోజే కోర్టు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష విధించింది. కోర్టుతీర్పును పట్టించుకోకుండా తాము జగన్ రెడ్డి రాజ్యాంగంలో భాగమని నమ్మడం ద్వారా ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు అంటే ప్రతీ దానికి కోర్టులకు పరుగెడుతున్నారు కానీ.. జగన్ రెడ్డిహయాంలో కోర్టు ఆదేశాలను లెక్కచేసేవారు కాదు. కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేలల్లో పడినా అంతే .,
కోర్టు ఆదేశించినా అమలు చేయాల్సిన అవసరమే లేదని కనీసం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది జగన్ ప్రభుత్వ పాలసీ.దీన్ని ప్రవీణ్ ప్రకాష్ పక్కాగా అమలు చేశారు. చివరికి ఆయనకు ఓ ధిక్కారం కేసులో నెల రోజుల జైలు శిక్షపడింది. వైసీపీ హయాంలోఇలా జైలు శిక్ష పడిన సివిల్ సర్వీస్ అధికారుల సంఖ్యకు లెక్కేలేదు. వెంటనే డివిజన్ బెంచ్ కు వెళ్లి ఎలాగోలా శిక్షను ఆపుకున్నారు కానీ.. తమ సర్వీసు రికార్డుల్లో అది ఉంటుందన్న సంగతిని మాత్రం మర్చిపోతున్నారు.
ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ తో పాటు శేషగిరి అని మరో అధికారికి కూడా శిక్ష విధించింది. ఇప్పుడు వారికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం లభించడం కష్టం. ఎదుకంటే గత ప్రభుత్వ నిర్వాకాన్ని తమ పై వేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధపడదు. అందుకే వారి అప్పీల్ ప్రయత్నాలు ఫలిస్తాయా లేకపోతే జైలు శిక్ష అనుభవిస్తారా అన్నది సస్పెన్సే. జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రవీణ్ ప్రకాష్ చేసిన నిర్వాకాలకు సరైన శిక్షపడినట్లేనని సంతోషపడే ఆయన బాధితులు చాలా మంది ఉన్నారు.
👉దిగొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం..
కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం..
విధుల్లోకి 4,200 మంది కాంట్రాక్టు కార్మికులు..
వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానం పునరుద్ధరణ..
లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఒప్పందం..
ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన కాంట్రాక్టు కార్మికులు.
👉 కేపి.కొండారెడ్డి మాతృమూర్తి మృతి..
మార్కాపురం : మాజీ శాసనసభ్యులు కేపి.కొండారెడ్డి మాతృమూర్తి కుందూరు చెంచమ్మ (98) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర వృద్దాప్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తెల్లవారుజామున మార్కాపురం మండలం కొండేపల్లి లోని ఆమె మృతి చెందారు.
👉గడ్డం శివ శంకర్ పార్థివధేహనికి నివాళులు అర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*గిద్దలూరు మండలం మోడంపల్లి గ్రామానికి చెందిన గడ్డం శివ శంకర్ హార్ట్ స్టోక్ తో మరణించడంతో విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు అన్నా రాంబాబు శివ పార్థివధేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
👉ఒంగోలు .. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ దిశగా స్వర్ణాంధ్ర -2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో పాల్గొనాలని ఆమె సూచించారు. విధానాల రూపకల్పనలో ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. https://swarnandhra.ap.gov.in/Suggestions అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే ఒక అప్లికేషన్ వస్తుందని, దీనిలో పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ విధంగా సర్వేలో పాల్గొన్న వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన ఒక ప్రశంసా పత్రాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు.
👉కంభం పరిదిలోని ఎక్సైజ్ శాఖ నూతన మద్యం పాలసీలపై పలు అంశాలపై నూతన ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
కంభం ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ ఇన్స్పెక్టర్. ఈ సందర్బంగా స్టేషన్ కు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగింది.
కంభం పరిధిలో మూడు మండలాల కలవు 1) కంభం (5 షాపులు- లైసెన్స్ ఫీజు- 55 లక్షలు) 2) బేస్తవారిపేట (3 షాపులు – లైసెన్స్ ఫీజు 65 లక్షలు) 3) అర్ధవీడు (2 షాపులు – లైసెన్స్ ఫీజు 55 లక్షలు) ( మొత్తం లిక్కర్ షాపులు షాపులు 10).
. ప్రభుత్వ నిబంధనల మేరకు వారు షాపులకు టెండర్లు వేయవచ్చని అయితే ఏ షాపు కోసం ఏ ప్రాంతం వారు టెండర్లు వెస్తున్నారు. దానికి ఓ నెంబరు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నగదు అన్ లైన్ ద్వారా బ్యాంకు ల నుంచి డి డి ల రూపంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.
ఈ నగదు పూర్తిగా నాన్ రిఫండబుల్ నగదని దరఖాస్తు దారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
ఈ టెండర్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని వేసిన టెండర్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ సమక్షంలో తెరవబడతాయని వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని తెలియజేశారు.
ప్రభుత్వ విధి విధానాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దీని ప్రకారం షాపులను కేటాయింపు చేస్తామని తెలిపారు.
వాటికి సంబందించి ప్రతి షాపుకు ఎంత మంది అయిన టెండర్లు వేయవచ్చని దానికి సంబంధించి ఒక్కో టెండర్ కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు.
పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలియజేశారు.
ఇట్లు కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. S. కొండారెడ్డి.
👉బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్ట్*
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట టైలర్స్ కాలనీలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 12 (180) ml బాటిల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి
👉 ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం నటరాజు సెంటర్లో ఎస్సై. మహేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడంతో పాటు వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేని, వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీటు బెల్టును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓక్కరు వాహనాలతో బయటకు వెళ్లేటప్పుడు వాహనానికి సంబంధించిన ధ్రువ పత్రాలు, లైసెన్స్, ఉండాలని,హెల్మెట్,తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.
👉మాజి ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ని పరామర్శించిన అధిములపు,అన్నా..
*ఇటీవల కాలంలో అనారోగ్యంతో (వైరల్ ఫీవర్) వల్ల బాధపడుతూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి మార్కాపురం నివాసానికి రావడంతో పరామర్శించిన మాజి మంత్రివర్యులు అధిములపు సురేష్,గిద్దలూరు మాజి శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు
👉 మార్కాపురం లోని గడియార స్తంభం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల నిరసన. టీడిపి కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని నిరసన తెలిపిన కార్మికులు..
మోడీ-ముర్ము.. హిందువులు కాదు-అవిముక్తేశ్వరానంద సరస్వతి..అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..కోటపాడులో 9రోజులుగా మూడు కుటుంబాలు గృహదిగ్భందం..హైడ్రాకు ఫుల్ పవర్స్.. ఇక దూకుడే!..కరెంటు లేక మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల అవస్థలు..అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం..జగన్ రెడ్డిని నమ్ముకుని నట్టేట మునిగిపోయిన ప్రవీణ్ ప్రకాష్.. చెంకెను పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు, మాజీ ఎమ్మెల్యే అన్నా
Recent Posts