..ఈనెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు* _ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక…లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ విచారణ జరపాలి-కేఏ పాల్..చిలకలూరిపేట ICICI బ్రాంచ్ లో భారీ కుంభకోణం..హోంగార్డు కుటుంబానికి రూ.30 లక్షల చెక్కును అందచేసిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు ..గూడూరులో ముగ్గురు యువకులకు కత్తిపోట్లు..ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

👉లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ విచారణ జరపాలి-కేఏ పాల్..
సిట్‌ విచారణ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుంది
తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలి-కేఏపాల్‌
కొండా సురేఖకు మతిభ్రమించింది
72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలిసమంత, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలికొండా సురేఖ రాజీనామా చేయకపోతే కేసు వేస్తా-కేఏ పాల్..
👉పల్నాడు జిల్లా..*చిలకలూరిపేట ICICI బ్రాంచ్ లో భారీ కుంభకోణం… సుమారు 30 కోట్ల గల్లంతు….?*
గోల్డ్ అప్రైజర్ ,గతం లో ఉన్న మేనేజర్ గోల్ మాల్ చేసినట్లు బాధితుల ఆరోపణలు
👉సీఎం చంద్రబాబు పాదయాత్రకు 12 ఏళ్లు పూర్తి – హోం మంత్రి అనిత :* _ఏపీ ప్రజల భవితను మార్చడం కోసం 2012లో గాంధీ జయంతి రోజున నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’పేరుతో నాడు విపక్షనేతగా పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా నేటికి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు._
_రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 28పట్టణాలు, 5 నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాలలో మొత్తం 2,817 కిలోమీటర్లు ఎండనకా, వాననకా 63 ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా నడిచిన తీరును గుర్తు చేసుకున్నారు. CM చంద్రబాబు 208 రోజులు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను మేనిఫెస్టోలో హామీలుగా ప్రకటించి నెరవేర్చడం ఆయన అనుభవానికి, అంకితభావానికి నిదర్శనమని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు._
*అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు*
_ హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక..
*ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి*
_ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు
_ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ మా ప్రభుత్వ లక్ష్యం..*
_ విజయవాడ వరదల సమయంలో భద్రత బలగాల కృషి అనిర్వచనీయం
👉గురువారం నుంచి విజయవాడ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవములు జరుగుతున్నా సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నుండి విశాఖపట్నం వెళ్లే చిన్న లారీలు మరియు పెద్ద లారీలు గుంటూరు పట్టణం నుండి మరియు గుంటూరు జిల్లా పరిదిలో ట్రాఫిక్ మళ్లింపు గురించి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ ఈ క్రింది విధంగా తెలిపారు..
*గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు చిన్న లారీలు మరియు పెద్ద లారీలను అనుమతించబోమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపిఎస్ తెలిపారు..
*ఈ ట్రాఫిక్ మళ్లింపు ఈరోజు నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవములు ముగిసే వరకు జరుగునని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు*
గుంటూరు నుండి విజయవాడ వైపు వెళ్ళు లారీలు (చిన్నవి మరియు పెద్దవి) రాకపోకలు దారి మళ్లింపులు:..
*గుంటూరు నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళు పెద్ద లారీలు మరియు చిన్న లారీలు బుడంపాడు జంక్షన్ వద్ద హైవే దిగి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్,  అవనిగడ్డ , పామూరు – గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లవలెను..
*చెన్నై నుండి విశాఖ పట్నం వెళ్ళు లారీలు (చిన్నవి మరియు పెద్దవి) బుడంపాడు- తెనాలి -వేమూరు – వెల్లటూరు -పెనుమూడి-అవినిగడ్డ- పామర్రు-గుడివాడ -హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ పట్నం వెళ్ళవలెను..
*గుంటూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళు పెద్ద లారీలు మరియు చిన్న లారీలు పేరేచర్ల జంక్షన్ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లవలెను..
*చిలకలూరి పేట వైపు నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే చిన్న లారీలు మరియు పెద్ద లారీలు, చిలకలూరి పేట Y-junction (గుంటూరు) నుండి చుట్టుగుంట, పేరేచర్ల , సత్తనపల్లి, పిడుగురాళ్ల మీదుగా వెళ్ల వలెను..
*గుంటూరు నుండి విజయవాడ వైపుకు చిన్న మరియు పెద్ద లారీలు అనుమతించబడవు..
అత్యవసర వాహనాలను ఏ దారి నుంచి అయినా అనుమతించబడును.*
కనుక గుంటూరు నుండి ప్రయాణం చేసే చిన్న లారీలు మరియు పెద్ద లారీలు గుంటూరు నుండి విజయవాడ వైపు వెళ్ళుటకు అనుమతులు లేవని ప్రజలు
పోలీసు వారికి సహకరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రజలకు తెలిపారు.
👉ఈనెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
*ప్రధాని మోదీ, అమిత్‌ షాను కలవనున్న చంద్రబాబు..
*రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కలిసే అవకాశం..
*రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు.
*ఇతర కేంద్ర ప్రాజెక్ట్‌లపై చర్చించనున్న చంద్రబాబు…
*విశాఖ రైల్వేజోన్ భూమిపూజ ముహూర్తంపై..అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం*
👉 బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఇచ్చిన అజ్ఞాతవాసి..
నేటి నుంచి వజ్ర కిరీటంతో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ..
2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన అమ్మవారి కిరీటం..
నేడు వజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం
👉 ప్రమాదవశాత్తు రైతు తన వ్యవసాయ పొలం వద్ద మారం రెడ్డి సుబ్బారెడ్డి 45 సం” విద్యుత్ షాక్ తో మృతి.
మార్కాపురం మండలం భూపతి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.రూరల్ ఎస్సై సమాచారం ఇచ్చిన గ్రామస్తులు
సంఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేస్తున్న ఎస్సై అంకమ్మరావు
👉హోంగార్డు కుటుంబానికి రూ.30 లక్షల ప్రమాద బీమా చెక్కును అందచేసిన జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు
కడప జిల్లా ..
కమలాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ జులై 6 న రామాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన హోమ్ గార్డు పి.ఆంజనేయులు నాయక్ (హెచ్.జి 2083) కుటుంబానికి రూ. 30,00,000 ప్రమాద బీమా మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హోమ్ గార్డు (తల్లి )పి.ధార్మి కి గురువారం అందచేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి హోమ్ గార్డు కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించే హోమ్ గార్డు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందడం బాధాకరమన్నారు. పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
👉ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..
ప్రకాశం జిల్లా..మార్కాపూర్. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు సామాజిక దృక్పథంతో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ అన్ని వర్గాల ప్రశంసలు పొందుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు.
ఏపీయూడబ్ల్యూజే సహకారంతో శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షతన ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో వర్షాధారం తప్ప మరో నీటి ప్రత్యామ్నయం ఏమాత్రం లేని ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు ప్రజలను వెంటాడుతుంటాయని ఆంధ్ర వ్యక్తం చేశారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వైద్యశాలకు వెళ్లి చూయించుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారని అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని మా యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే జిల్లా కార్యదర్శి డి కనకయ్య ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ సురేష్ కుమార్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె బాజీవలి, కార్యదర్శి బి శంకర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి. మోహన్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
👉ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చొరవతో ఇసుక పై వీడిన సందిగ్ధత..
మంత్రి కొల్లు రవీంద్రతో ప్రత్యేకంగా భేటీ అయిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే..
ముఖ్యంగా ఇసుక సమస్యపై మంత్రితో చర్చించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి..
టన్నేజీతో సంబందం లేకుండా ఇసుక తీసుకెళ్లేలా మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపిన ఎమ్మెల్యే…
ఎస్టేట్ లోని పలకల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే.
రాయల్టీ ఫీజులు తగ్గించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే నారాయణరెడ్డిగారు
👉 చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి వైద్యుడిని కాల్చి చంపిన యువకులు
చికిత్స పేరుతో ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వైద్యుడిని కాల్చి చంపారు. ఢిల్లీ జైత్‌పూర్ ప్రాంతంలోని నీమా ఆసుపత్రిలో నిన్న జరిగిందీ ఘటన. వైద్యుడిని జావేద్‌గా గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది కథనం ప్రకారం ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు యువకులు ఆ తర్వాత డాక్టర్ జావేద్‌ను కలవాలని అభ్యర్థించారు.
వారు ఆయన క్యాబిన్ ‌లోకి వెళ్లిన వెంటనే తుపాకితో జావెద్‌పై కాల్పులు జరిపి పరారయ్యారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
👉పెరిగిన సిమెంట్ ధరలు!*
పలు సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరల్ని పెంచాయి. 50 కేజీల సిమెంట్ బస్తాపై రూ.20-30 చొప్పున ధరను
పెంచుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. తాజా ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. ధరలను సవరించిన కంపెనీల్లో రామ్, ఏసీసీ, దాల్మియా భారత్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. దీని ప్రభావం ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉండనుంది.
తిరుపతి జిల్లా..గూడూరు*
👉 రేపు అనంతపురానికి సినిమా హీరోయిన్లు..
సినీ హీరోయిన్లు పాయల్ రాజపుత్, నబా నటేశ్ రేపు అనంతపురం రానున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
👉 మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు
హైదరాబాద్‌: మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ గురువారం నోటీసులు అందజేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్‌కు సంబంధించి నోటీస్ లు అందజేశారు.
*👉గూడూరులో ముగ్గురు యువకులకు కత్తిపోట్లు..
*👉జెండా ఉత్సవాల్లో పేట్రేగిపోయిన రౌడీ మూకలు*
*👉రౌడీలు పోకిరీలకు అడ్డాగా మారిపోయిన గూడూరు పట్టణం*
*👉 అధికశాతం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో ఎక్కడ హత్యలు జరిగినా నేరస్తుల లింకులు గూడూరులోనే*
👉తిరుపతి జిల్లా గూడూరు లో జరిగిన ఆంజనేయస్వామి జెండా ఉత్సవంలో పోకీరల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి,పట్టణం లో పలు చోట్ల అర్థరాత్రి లో జండాల ఉత్సవాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులను ప్రత్యర్ధులు కత్తులతో పొడిచారు,ఈ కత్తి పొట్లలో
యశ్వంత్ ,హరీష్ ,అబ్దుల్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి..గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు… పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు… కత్తిపోట్లకు గురైన యువకులకు నిందితులకు మధ్యపాత కక్షలు ఉండొచ్చని పోలీసువారి అనుమానం…
👉 రేపు అనంతపురానికి సినిమా హీరోయిన్లు..
సినీ హీరోయిన్లు పాయల్ రాజపుత్, నబా నటేశ్ రేపు అనంతపురం రానున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
👉 మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు
హైదరాబాద్‌: మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ గురువారం నోటీసులు అందజేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్‌కు సంబంధించి నోటీస్ లు అందజేశారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి