గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!. “80 వేల ఇళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం రేవంత్…మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత..పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?-మంత్రి సీతక్క..ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ – పీసీసీ చీఫ్ మహేశ్..ఈటల నోరు అదుపులో పెట్టుకో-రావుల రమేష్ గౌడ్…

👉 హైదరాబాద్: కాకా చిత్రపటానికి సీఎం నివాళులు..
హైదరాబాద్: కాకా చిత్రపటానికి సీఎం నివాళులు
కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారంలో ఉన్న, లేకపోయినా ప్రభుత్వంపై ప్రభావం చూపిన వ్యక్తి కాకా అని అన్నారు. హైదరాబాద్ లో పేదలకు పెద్ద దిక్కుగా, సింగరేణి కార్మికులకు అండగా వెంకటస్వామి నిలిచారని కొనియాడారు.
👉 ఇండ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం..
పేదలకు 80, 000 ఇండ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా: సీఎం
రవీంద్ర భారతిలో శనివారం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. పేదలకు హైదరాబాద్ నగరంలో 80, 000 ఇండ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి కాకా అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, గడ్డం వంశీ, మధుయాష్కీ, వెంకట్ రెడ్డి, ప్రో, కోదండరాం పాల్గొన్నారు..
👉గాజా మసీదుపై వైమానిక దాడి….21 మంది మృతి!*
గాజాపై మరోసారి భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్.
సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి..ఈ దాడిలో మొత్తం 21 మంది పాలస్తీనియన్లు మృతి..మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడి.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో మరోసారి దాడి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.
👉హైదరాబాద్:*18 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్..
435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్‌ నేరగాళ్లు..
ముంబై కేంద్రంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా..
హైదరాబాద్‌లో రూ.7కోట్లకు పైగా డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటికి పైగా నగదును ఫ్రీజ్ చేసిన పోలీసులు.
👉 తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ..
ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు లేఖ పంపిన అగంతకుడు
సీఐఎస్‌ఎఫ్‌ అధికార వెబ్‌సైట్‌కు పంపిన లేఖ
గోప్యంగా ఉంచిన ఎయిర్‌పోర్టు అథారిటీ..
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు
ఈ-మెయిల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు..
బృందాలను ఏర్పాటు చేసిన ఏర్పేడు పోలీసులు
👉 కాంగ్రెస్ ఖాతాలో మరో రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా వెల్లడించిన జమ్మూ కశ్మీర్, హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ పార్టీకే అనుకూలంగా వచ్చాయి.
హర్యానాలో 55 స్థానాలు గెలిచి సింగిల్గా అధికారం
చేపట్టబోతోందని అంచనాల్లో తేలింది. ఇక జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 50 స్థానాలతో అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న జాబితాలో 6 రాష్ట్రాలు చేరనున్నాయి.
👉మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత.. లేదంటే కేటీఆర్ దుంకాలె
1,600 చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి..
మూసీకి, రాహుల్ గాంధీకి సంబంధమేంటి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మూసీకి, రాహుల్ గాంధీకి ముడిపెడుతూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ”మంత్రులతో కలిసి నేను పురాణాపూల్ బ్రిడ్జి వద్దకు వస్తాను. కేటీఆర్ నువ్వు కూడా రా.. మూసీ ప్రక్షాళన పేరుతో మేం ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపించినా నేను మూసీలో దుంకుత.. లేదంటే నువ్వు దుంకాలి’ అని సవాల్ విసిరారు.
బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. చెరువులను, కుంటలను కాపాడడమే హైడ్రా ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ”హైడ్రా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. హైడ్రాతో కేవలం బీఆర్ఎస్ నేతలే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్లే 1,600 చెరువులను కబ్జా చేశారు” అని అన్నారు. ”మూసీ చుట్టూ ఒక్క ఇంటిని కూడా ఇప్పటి వరకు తొలగించలేదు. దాని చుట్టూ ఉన్నోళ్లకు చట్టబద్ధంగానే నష్టపరిహారం ఇస్తాం. మూసీ సుందరీకరణకు చాలా సమయం పడుతుంది. మూసీ ప్రక్షాళనకు వందల కోట్ల రూపాయలు చాలు’ అని చెప్పారు. .
👉కేసీఆర్.. ఎక్కడ దాక్కున్నారు?*మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ అని పీసీసీ చీఫ్ మహేశ్ చెప్పారు. 2016లో మూసీ ప్రక్షాళనను ముందుకుతెచ్చింది కేసీఆరేనని గుర్తు చేశారు. గత ఆరు నెలలుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. ”మహిళా మంత్రి కొండా సురేఖపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇప్పటి వరకు కేటీఆర్ స్పందించలేదు. బావ హరీశ్ కు ఉన్న సోయి బామ్మర్దికి లేదు.అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ఇరిగేషన్, లిక్కర్ పేరు మీద రాష్ట్రాన్ని లూటీ చేశారు’ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని,సమయం చూసి తమ వద్దకు వస్తారని చెప్పారు.
👉ఈటల నోరు అదుపులో పెట్టుకో.. టిపిసిసి గీత సెల్ సెక్రటరీ రావుల వెంకట రమేష్ గౌడ్..
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని టిపిసిసి గీత సెల్ సెక్రెటరీ రావుల వెంకట రమేష్ గౌడ్ మండిపడ్డారు దేశంలో నియంతలు ,శాడిస్టులు, సైకోలు ఎవరో దేశ ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. 25 రోజుల్లో 18 వేలకోట్ల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని సైకో అంటే అన్నం పెట్టే రైతులను గాలికి వదిలేసి పెట్టుబడిదారులకు పట్టం కడుతున్న మోదీని ఏమని పిలవాలో ఈటెల రాజేందర్ చెప్పాలన్నారు గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఇండ్లు కోల్పోయిన 1000 కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా బిజెపి సర్కార్ గాలికి వదిలేసింది నిజం కాదా అని ప్రశ్నించారు ఈటల రాజేందర్ చౌకబారు విమర్శలతో తన స్థాయిని తగ్గించుకోవద్దని వెంకట రమేష్ గౌడ్ హితువు పలికారు
👉అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు!*

సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో బోర్డు మీటింగ్ పదేళ్లుగా నిర్వహించకపోవడం పట్ల మంత్రి సీతక్క విస్మయం వ్యక్తం చేశారు.’పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. SRDSలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 3700కు పైగా ఉద్యోగులు.. SRDSలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు వంటి ఉద్యోగులకు భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
👉మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ..
జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు నిలిపివేత..
తెలంగాణలో పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన..
రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమీక్ష..
ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31కు చేరిన మృతుల సంఖ్య..
ప్రపంచవ్యాప్తంగా కాంగోలోనే ఎంపాక్స్ మరణాలు అధికం..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ఏడాది పూర్తి..
ఇరాన్‌పై భీకరస్థాయిలో విరుచుకుపడతాం-ఇరాన్‌ సైన్యం..
నేటి నుంచి బంగ్లాదేశ్‌-భారత్ మధ్య టీ20 సిరీస్
👉 విజయవాడ : ఇంద్రకీలాద్రి నుంచి సరుకులు మరోసారి వెనక్కి. 200 బాక్సుల కిస్‌మిస్‌లను వెనక్కి పంపిన ఫుడ్‌ సెఫ్టీ అధికారులు. దసరా ఉత్సవాల్లో మొదటి రోజు పెద్దసైజులో కిస్‌మిస్‌ సరఫరా చేసిన కాంట్రాక్టర్‌.
ఇప్పుడు నాణ్యత, సైజు తక్కువగా ఉండటంతో వెనక్కి పంపిన ఫుడ్‌ సెఫ్టీ అధికారులు.దుర్గగుడి నుంచి ఇప్పటివరకు 10 రోజుల వ్యవధిలో 3 సార్లు సరుకులు వెనక్కి.
👉 నేడు పిఠాపురంలో ఎన్నికలు..
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేషన్ సొసైటీలో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఐదు డైరెక్టర్ పదవుల కోసం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీడీపీ మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు, జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
👉 ఆహారంలో బల్లి.. 50 మంది విద్యార్థినులకు అస్వస్థత..బల్లి పడిన ఆహారం తినడంతో 50 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగింది. ఇక్కడి పురన్‌మల్ లాహోటీ హాస్టల్‌లో విద్యార్థినులకు వడ్డించిన ఆహారంలో బల్లి కనిపించింది. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై హాస్టల్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.
👉ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి.. *30 తుపాకుల స్వాధీనం..*దంతెవాడకు మృతదేహాలు.. *15 మృతదేహాల గుర్తింపు.. వీరిపై రూ.1.30 కోట్ల రివార్డు.. *50 -70 మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బలగాల కూంబింగ్‌.. *వెల్లడించిన బస్తర్‌ ఐజీ సుందర్‌రాజన్‌* అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ బస్తార్‌ ఐజీ పి. సుందర్‌రాజన్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టులో 13మంది మహిళలున్నారని వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ పీఎల్‌జీఎ 6బెటాలియన్‌ సభ్యులని తెలిపారు. మృతుల్లో ఇప్పటివరకు 15 మందిని పోలీసులు గుర్తించారు.
వీరిపై రూ.1.30 కోట్లు రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇంకా 16మంది మావోయిస్టులను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు చెందిన 30 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అబూజ్‌మడ్‌ అడవుల్లో సుమారు 50నుంచి 70మంది మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, బీఆర్‌జీ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేందూరు, తూలితూలి అడవుల్లోకి జవాన్లు చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా బలగాలు ఎదురుకాల్పులు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయన్నారు.
ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో ఒక ఐఎంజీ మిషన్‌గన్‌, 4 ఏకే 47గన్స్‌, ఇతర తుపాకులు, బులెట్లు, బీజీయల్స్‌, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. దండకారణ్య కమిటీ సభ్యురాలు నీతి అలియాస్‌ ఉర్మిళపై రూ.21లక్షల రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇప్పటికి గుర్తించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ లేరని, మిగతా వారి గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని వెల్లడించారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌ ఆపరేషన్‌ తెలంగాణకు చెందిన అడిషనల్‌ ఎస్పీ స్మృతిక్‌ రాజనాల ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆయన దంతెవాడ జిల్లా ఏఎస్పీ (ఆపరేషన్స్‌)గా విధులు నిర్వహిస్తున్నారు.
మృతుల వివరాలు..
1. పాలసీ (డీకేఎస్‌ జెడ్సీ), 2, సురేష్‌ సలాం (డీవీసీఎం), 3. మీనా మడకం (డీవీసీఎం), 4. అర్జున్‌ (పీపీసీఎం, పీఎల్‌జీఎ కంపెనీ), 5. అంద మైనా (పీపీసీఎం పీఎల్‌జీఎ కంపెనీ, 6. భుద్రాం (పీపీసీఎం, పీఎల్‌జీఎ కంపెనీ,) 7, సుక్కు (పీపీసీఎం, పీఎల్‌జీఎ కంపెనీ), 8. సోహాన్‌ (ఎసీఎం భరోసు ఏసీ), 9. ప్లవర్స్‌ (పీపీసీఎం పీఎల్‌జీఎ కంపెనీ), 10. భసంతి (పీపీసీఎం, పీఎల్‌జీఎం కంపెనీ), 11. కోసీ (పీపీసీఎం పీఎల్‌జీఎ కంపెనీ), 12, జమీలా అలియాస్‌ బుద్రి (పీఎం పీఎల్‌జీఎ కంపెనీ), 13. రాండర్‌ (ఎసీఎం), 14. సుక్లు అలియాస్‌ విజయ్‌ (ఎసీఎం), 15. జమ్లీ (ఎసీఎం), 16. సోనూ కోర్రం (ఎసీఎం ఆడ్మే).. *కేపి*
👉పొదిలి ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ చోరీ ..బ్యాగ్ లో ఉన్న నాలుగు వేల రూపాయలు నగదు ఓ సెల్ ఫోన్ అపహరించిన దుండగుడు..దొంగతనాలకి నిలయంగా మారిన ఆర్టీసీ బస్టాండ్……దొంగతనాల పట్ల కొరవడిన ఆర్టీసీ యంత్రాంగం లోటు..సీసీ కెమెరాలు ఉన్న ఫలితం శూన్యం..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు..
👉 కీ”శే “షేక్.దావూద్ షరీఫ్, మరియు కీ”శే”షేక్.అజిమ జ్ఞాపకార్థం మైసూర్ ప్రీ మెడికల్ కేర్ వారి గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని పురుషోపట్నం సెయింట్ గ్లోబల్ స్కూల్ పక్కన ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ షేక్.రఫ్ఫాని ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న నేడు 300 వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ హారోన్ రషీద్ చైర్మన్ కి తెలియజేశారు.ఈ వైద్య శిబిరం విస్తృతంగా ఏర్పాటు చేయడానికి కావలసిన చర్యలు మాజీ మంత్రి మన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా చర్యలు తీసుకుంటామని డాక్టర్ కి తెలియజేశారు.

7k network
Recent Posts

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు