ఈవీఎంలపై మరో అడుగు-కాంగ్రెస్ వార్ షురూ?..సోమేష్ కుమార్ మెడకు చుట్టుకున్న ఈడీ కేసు !..వరద బాధితుల కోసం భారీగా విరాళాలు….ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు’.. ఉచిత ఇసుక టన్నుకు ₹832.00 పడింద..గుండిమేడ,చిర్రావూరు, ప్రాతూరు ఇసుక క్వారీల్లో అక్రమ తవ్వకాలు..14 రకాల నిత్యవసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేయాలి..ఆవాజ్ కమిటీ..జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన యువతిపై ఫిర్యాదు చేసిన యువకుడు..అత్తా కోడలు పై అత్యాచారం..అన్న క్యాంటీన్ కు 10 వేలు విరాళం (గిద్దలూరు)..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల,ఎమ్మెల్యే ముత్తుముల,మాజీ ఎమ్మెల్యే అన్నా..శుభాకాంక్షలు తెలిపిన కంభం, బిపేట ఎస్సైలు

👉ఈవీఎంలపై మరో అడుగు… కాంగ్రెస్ వార్ షురూ చేసినట్లేనా? “మనం ఎలా ఓడిపోయాం అని ఓటరు, కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటే.. అసలు మనం ఎలా గెలిచాం అని బీజేపీ నేతలు షాక్ కి గురైనట్లు” కార్టూన్లు హల్ చల్ చేస్తున్నాయి!.. గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంల పాత్ర కీలకంగా మారిందని.. వీటి పనితీరు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తుందంటూ పలు విమర్శలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గెలిచిన వారు మాత్రం.. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లు కామెంట్ చేస్తుంటే.. ఓడినవారు మాత్రం.. ఈవీఎంల పనితీరుపై పలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికలకు సంబంధించిన వచ్చిన ఫలితాల విషయంలోనూ ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా రాగా.. ఈవీఎం లు ఓపెన్ చేసిన తర్వాత లెక్కలు మారిపోయాయని.. ఇదే సమయంలో కొన్ని ఈవీఎంలలో 99 శాతం ఛార్జింగ్ ఉందని అంటున్నారు. ప్రధానంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 10ఏళ్ల బీజేపీ పాలన తర్వాత కూడా కాంగ్రెస్ సాధారణ మెజారిటీని కూడా
సాధించలేకపోవడంపై పలు చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా..
ఈవీఎంల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ కు మరిన్ని ఫిర్యాదులు చేసింది. అవును… హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. “మనం ఎలా ఓడిపోయాం అని ఓటరు, కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటే.. అసలు మనం ఎలా గెలిచాం అని బీజేపీ నేతలు షాక్ కి గురైనట్లు” కార్టూన్లు హల్ చల్ చేస్తున్నాయి!.. ఆచరణ మాటేంటి? ఈ సమయంలో… హర్యానాలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన, స్పష్టమైన అవకతవకలను ఎత్తిచూపుతూ మెమోను భారత ఎన్నికల కమిషన్ కు సమర్పించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ ‘ఎక్స్’ లోని పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ సమయంలో ఈసీ స్పందించి తగిన ఆదేశాలు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు! ఇలా ఫిర్యాదు చేసిన 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నార్నాల్, దుబ్వాలి, రేవారీ, కర్నాల్, హోడల్ (ఎస్సీ), పానిపట్ సిటీ, కల్కా, ఇంద్రి, ఫరీదాబాద్ ఎన్.ఐ.టీ, బద్ఖల్, రానియా, నల్వా, పల్వాల్, పటౌడీ (ఎస్సీ), బల్లభ్ గడ్, బర్వాలా, ఉచన కలాన్, కొస్లీ, ఘరౌండా, బాద్షాపూర్ లు ఉన్నాయి!
👉వరద బాధితుల కోసం భారీగా విరాళాలు..
లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు..
అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు ప్రముఖులు శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.విజయకుమార్ రూ.1,27,34,809,చిలకలూరపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ. 20,36,116, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రూ.8,81,748, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రూ.4,65,726, వాసి రెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ తరపున వాసిరెడ్డి విద్యాసాగర్ రూ.10,00,000, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మ్యానేజ్మెంట్ అసోసియేషన్ తరపున 31,50,000, కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపున రూ.10,00,000, చెరుకూరి నారాయణ రావు రూ.10,116, కంచెర్లపల్లి సతీష్ రూ.1,00,000, నందిపాటి జోగారావు రూ.1,92,000 లు సిఎంఆర్ఎఫ్ చెక్కులను లోకేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు అందజేశారు.
👉నాసిక్‌: మహారాష్ట్రలో ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్‌ సాధన చేస్తుండగా ఇండియన్‌ ఫీల్డ్‌ గన్‌లోని షెల్‌ పేలడంతో వారు మృతి చెందారని శుక్రవారం పోలీసులు వెల్లడించారు. నాసిక్‌లోని ఆర్టిలరీ కేంద్రంలో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇండియన్ ఫీల్డ్ గన్‌తో కొంతమంది అగ్నివీరుల బృందం ఫైరింగ్ సాధన చేసింది. ఆ సమయంలో ఒక షెల్ పేలిపోయింది. దాంతో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే వారిని దేవ్‌లాలీలోని ఎంహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. హవల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పేర్లు గోహిల్‌ విశ్వరాజ్‌ సింగ్‌, సైఫత్ అని తెలిపారు.త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్‌ 2022లో అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. అగ్నివీరులుగా విధులు నిర్వర్తిస్తున్నవారు నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వారిలో 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు.
👉సోమేష్ కుమార్ మెడకు చుట్టుకున్న ఈడీ కేసు !..
బీఆర్ఎస్ హయాంలో సీఎస్‌గా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పై ఈడీ కేసు కూడా నమోదు కానుంది. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కి సంబంధించి రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీసీఎస్‌ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్‌ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించింది. మొదట సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.
కుంభకోణం మొత్తం సోమేశ్‌కుమార్‌ కనుసన్నల్లోనే నడిచినట్లు ప్రభుత్వం భావిస్తోంది. బోగస్‌ ఇన్వాయిస్‌లను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ను క్లెయిమ్‌ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివర్లో నిర్వహించిన ఆడిట్‌లో గుర్తించింది. ఈ కేసులో వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని అధికారులు గుర్తించారు. సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారుఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ ఉండగా… సోమేశ్ కుమార్ ను ఏ5గా సీఐడీ పోలీసులు చేర్చారు. ఇందులో అక్రమ నగదు చెలామణి ఉన్నట్లుగా తేలడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది.
👉చెన్నై సమీపంలో రైలు ప్రమాదం ఆగి ఉన్న గూడ్స్ రైలు నుండి కొట్టిన ఎక్స్ప్రెస్ రైలు*..తమిళ నాడు ..చెన్నై..
*రెండు భోగిల్లో చెలరేగిన మంటలు*
తమిళనాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది, తిరువల్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది, ఈ ఘటనలో రెండు భోగిల్లో మంటలు చేకరేగినట్టు సమాచారం, ఈ ప్రమాదంలో ఎంత మందికి గాయాలయ్యాయి,ఎవరికైనా ప్రాణాపాయం సంభవించిందా అనేవివరాలు తెలియాల్సి ఉంది..
👉 ‘ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు’
‘ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు’
ఆరోగ్యశ్రీపై వస్తున్న వార్తలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం ఉన్న 3,257 చికిత్సలను 1,949కి తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఆరోగ్యశ్రీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం చేయట్లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
👉 కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాకినాడ అటవీశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రవీంద్రనాథ్‌రెడ్డి.. మైనింగ్‌ వాహనాల విషయంలో కొన్ని రకాల ఆంక్షలు విధించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయన పేషీలోని ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వారి పేర్లు చెప్పి.. మైనింగ్‌, అటవీశాఖ అధికారులకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నట్టు అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్‌ విచారణకు ఆదేశించారు.
👉కేరళ ప్రభుత్వం మాదిరి 14 రకాల నిత్యవసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేయాలి.. ఆవాజ్ కమిటీ డిమాండ్..
రాష్ట్ర ప్రభుత్వము నూనె ఉల్లిగడ్డలు టమోటా పండ్లు రైతు బజార్లలో ఇవ్వడం వలన పేదలందరికీ ఉపయోగం లేదు కేరళ ప్రభుత్వం మాదిరి 14 రకాల నిత్యవసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయడానికి చేతకాక పోవడం వల్ల 14వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అధిక ధరలను అదుపు చేయాలని నిరుద్యోగం పేదరికం నిర్మూలించాలని ప్రచార యాత్ర పిలుపు ఇవ్వడం జరిగింది అందరు పాల్గొని ప్రభుత్వానికి తెలియజేయాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా నాయకులు మస్తాన్వలి తెలిపారు.
👉బండి వారి వివాహానికి హాజరయిన మాజి ఎమ్మెల్యే అన్నా..*తర్లుపాడు మండలం కలూజువ్వాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓబాయిపల్లి గ్రామంలో బండి వెంకటేశ్వర రెడ్డి కూతురి వివాహానికి హాజరు అయి నూతన వధువును ఆశీర్వదించిన మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు*
👉 కంభం ,బి పేట మండలాల ప్రజలకు,పోలీసు అధికారులు, సిబ్బందికి, పోలీసు కుటుంబ సభ్యులకు కంభం ఎస్ ఐ బి. నరసింహారావు,బి పేట ఎస్ఐ ఎస్వీ రవీంద్రారెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.


విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూరాలని,సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రిపోర్టర్ ఎన్ వెంకటేశ్వర్లు..
👉అన్నమయ్య జిల్లా మదనపల్లె*
*మదనపల్లె రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి అనుమానస్పద మృతి*
సీటీఎం రైలు పట్టాలపై వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలంరేపుతోంది. అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం లోని సిటిఎం రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదస్థితిలో చనిపోయి ఉండటం శనివారం వేకువజామున స్థానికులు గుర్తించారు. సుమారు 26 సంవత్సరాల వయసున్న యువకుని మృతదేహం బోర్లపడి ఉంది. మృత దేహం పక్కనే పక్కనే ల్యాప్ టాప్ పగల కుండా కనిపించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరో ముందుగానే ఎక్కడైనా చంపి, ఆపై తీసుకొచ్చి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న అనుమానాలకు తవిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
👉 గుండిమేడ,చిర్రావూరు, ప్రాతూరు ఇసుక క్వారీల్లో అక్రమ తవ్వకాలు.*తాడేపల్లి:*
*రాత్రి సమయాల్లో భారీగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియా.*
*గత కొంతకాలంగా అనధికారంగా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్న చిర్రావూరు, ప్రాతూరు, గుండిమేడకు చెందిన ఇసుక మాఫీయా.*
*ఇసుక మాఫియా మధ్య విభేదాలు రావడంతో అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన ఓ వర్గం.*తాడేపల్లి తహసీల్దార్ ఆద్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు.*అనధికారకంగా ఇసుక తవ్వకాలకు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన తహసీల్దార్.*
*రాత్రి సమయాల్లో ఇసుక క్వారీల వద్ద గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపిన తహసీల్దార్.*
👉రాష్ట్రము కూటమి పాలనలో ఇసుక 20 టన్నుల ఇసుక ఖరీదు… *₹0*…. ఆ ఇసుక రవాణా ఛార్జీలు *₹9,276.19*… కానీ చెల్లించాల్సిన మొత్తము *₹16,640.00*..ఇదేం లెక్క….??అంటే టన్నుకు ₹832.00 పడింది…. అదే గతంలో లారీకి 30 టన్నుల ఇసుక వచ్చేది… లారీ ఇసుక ఖరీదు 15-20వేల రూపాయలు ఉండేది… పోనీ 20వేలే అనుకొన్నా… *టన్ను ₹667.00* పడేది… అంటే ఇప్పటి ఉచితం కన్నా గతంలో టన్నుకు *₹165.00* తక్కువ పడేది .. నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఎంత నిజమో….?? ఉచిత ఇసుకలో ఉచితం అంతే నిజం అని *పబ్లిక్ టాక్!!*
👉ఆయుధ పూజ కార్యక్రమం చేపట్టిన సిఐ సుబ్బారావు, ఎస్సైలు* మార్కాపురం:- ప్రకాశం జిల్లా మార్కాపురం విజయదశమి పర్వదినం సందర్భంగా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు శనివారం ఉదయం ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దసరా పండగను శక్తికి,సంకల్పానికి, విజయానికి,గుర్తుగా జరుపుకుంటామని అన్నారు. దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి ధర్మసంస్థాపన చేసిన సందర్భంగా అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా మనం విజయదశమి పండుగను సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవడంలో భాగమని తెలిపారు. పట్టణ ఎస్.ఐ సైదాబాబు మాట్లాడుతూ,ఆ శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని,సకల విజయాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ ఎస్సై అంకమ్మరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు, సుఖ సంతోషాలు,ఆయురారోగ్యాలతో జీవించాలని, కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైని, ఎస్సై డాక్టర్ ఎం.రాజమోహన్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఇంచార్జ్ ఫయాజ్..
👉పోలిస్ స్టేషన్ లో ఆయుధ పూజ*.
పల్నాడు జిల్లా..
వినుకొండ పట్టణ పోలిస్ స్టేషన్ లో విజయదశమి పండుగ శుభ సందర్భంగా సీఐ శోభన్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు… స్టేషన్ లో దసరా రోజు అనవాయితిగా వస్తున్న ఆయుధ పూజ నిర్వహించారు…
ఈ కార్యక్రమంలో ఏస్ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోం గార్డ్లు పొల్గొన్నారు.*పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల..
👉మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలం ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..*పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలోని అంకాలమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలలో అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న కందుల..
దసరా పర్వదిన సందర్భంగా అంకాలమ్మ తల్లి దేవస్థానంలో పల్లకి సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని,ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్న అని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బెల్లంకొండ విద్యాసంస్థల అధినేతలు శ్రీనివాసరావు, విజయలక్ష్మి మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా స్టాపర్ ఎస్ ఎస్ రహమాన్..
👉 జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన యువతిపై ఫిర్యాదు చేసిన యువకుడు..
జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన మామ జానీ మాస్టర్ తో కలిసి HYD, చెన్నైలలో షూటింగ్లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్ నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు…
👉 శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం..అత్తా కోడలు పై అత్యాచారం..ఈ దారుణానికి పాల్పడ్డ ఐదుగురు దుండగులు * చిలమత్తూరు మండలం నల్ల బొమ్మయ్య పల్లి లో ఘటన..*వాచ్ మెన్, కొడుకును కత్తులతో బెదిరించి అత్త కోడల పై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులు..*నిందితుల కోసం పోలీసుల గాలింపు.
👉అన్న క్యాంటీన్ కు 10 వేలు విరాళం*
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని పట్టణానికి చెందిన ముత్యాల రామయ్య మర్యాద పూర్వకంగా కలిసి వారికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియచేశారు.ఈ సందర్బంగా అన్న క్యాంటిన్ నిర్వహణకు తన వంతు సహకారంగా రూ. 10,000-00 లు అక్షరాల పదివేలు రూపాయలు ఎమ్మెల్యేకి అందచేశారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.కార్యక్రమంలో దామెర్ల బాలుడు,పవన్, ముత్యాల కిషోర్ పాల్గోన్నారు.
👉విజయదశమి సందర్బంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మొదటగా వీరన్న బావి వీధిలోని శ్రీ కాళీకాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం షరాఫ్ బజారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు,ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు..కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గోన్నారు..*
డివిజన్ రిపోర్టర్ అస్లాం బేగ్..
👉విజయవాడ: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట సహా విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మేనేజర్‌ నరేష్‌ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తాను మోసపోయానంటూ శుక్రవారం రాత్రి నరేష్‌ వీడియో విడుదల చేశాడు. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని, ఉన్నతాధికారులు, బ్యాంకు సిబ్బందంతా తననే తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారులను మోసం చేసే ఉద్దేశం తనకు లేదని, బంగారం రుణాలకు సంబంధించి కొందరి పేర్లు మాత్రమే మార్చామని.. ఎలాంటి మోసం చేయలేదని వీడియోలో వెల్లడించారు.ఖాతాదారులకు ప్రతి నెలా వడ్డీ సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నామని, ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని నరేష్‌ తెలిపారు. విజయవాడ భారతి నగర్ బ్రాంచ్‌కు వెళ్లిన తరువాత గత రెండు నెలలుగా జెడ్ హెచ్ సందీప్ మెహ్రా వల్ల బాగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. నరసరావుపేటలోని కరుణాకర్‌కు, చిలకలూరిపేటలోని బ్యాంకు ఉద్యోగులందరికీ అన్ని విషయాలు తెలుసని, తనను మాత్రమే దోషిగా నిలబెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. అధికారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, జోషి, పిల్లలను చూసి ఆ ఆలోచన విరమించుకున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనకు రావాల్సిన డబ్బు వస్తే మెుత్తం సర్దుబాటు చేసి తప్పుకోవాలనుకున్నానని, కానీ ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. అందరూ డబ్బు తీసుకున్నారు కానీ ఇప్పుడు నన్ను మాత్రమే తప్పు పడుతున్నారన్న నరేష్.. ఇక తనకు బతకాలని లేదని చనిపోదామనుకుంటున్నట్టు వెల్లడించాడు.
👉ఆన్ లైన్ బెట్టింగులకు బలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ !!!
మదనపల్లె (CTM) రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టాలపై శుక్రవారం ఉదయం యువకుడి డెడ్ బాడీ పడి ఉన్న విషయం తెలిసిందే. మృతుడు తంబళ్లపల్లె(M) దిగువ గాలిగుట్టపల్లెకు చెందిన నడిమింటి వెంకటరమణారెడ్డి కొడుకు ఎన్.పద్మనాభరెడ్డి(26)గా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి రూ. 24 లక్షలు పొగిట్టుకుని చనిపోతున్నట్లు షూసైడ్ నోట్ రాసి మృతి చెందినట్లు రైల్వే పిసి బాషా తెలిపారు.
👉రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి.. అత్యాచారం చేసి పడేసి ఉంటారానే అనుమానాలు..
హైదరాబాద్ – జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై మత్తులో నగ్నంగా పడి ఉన్న యువతి (30)..
108 వాహనంలో యువతిని ఆసుపత్రికి తరలింపు.

7k network
Recent Posts

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు