👉👉 మోడీ ఎఫెక్ట్: బాబుకు ఆప్షన్ లేదు ..! ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. నొప్పి తెలియకుండానే వాతలు పెడుతున్నారు. ఇవ్వాల్సిన సొమ్ములో కోతలు పెడుతున్నారు. ఇది ఇప్పుడే కాదు.. వైసీపీ హయాంలోనూ ఇలానే జరిగింది. కానీ, ఇప్పుడు నాటికి-నేటికి భిన్నమైన వాతావరణం ఉంది. అప్పట్లో బీజేపీ అధికారం పంచుకోలేదు.
మంత్రి పీఠాలు తీసుకోలేదు. కానీ,ఇప్పుడు ఉన్నది ఎన్డీయే కూటమి సర్కారు.మంత్రి పదవిని కూడా తీసుకున్నారు. దీంతో మునుపటికన్నా ఇప్పుడు మంచిజరుగుతుందని ప్రజలు భావించారు. డబుల్ ఇంజన్ సర్కారు దడదడలాడిస్తుందని.. సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా లెక్కలు వేసుకున్నారు. అయితే.. మోడీ తీరులో పెద్దగా మార్పులేదు. పైగా.. `అనుమానాలు` పెరుగుతున్నాయి. పోలవరానికి ఇచ్చిన అడ్వాన్సు నిధుల విషయంలో పెట్టిన షరుతులు దీనిని ప్రస్పుటం చేస్తున్నాయి. దీంతో కూటమి సర్కారులో లుకలుకలు వినిపిస్తున్నాయి. ఇక, వరద సాయం 6880 కోట్ల రూపాయలు కావాలని కోరితే..1430 కోట్లు ఇచ్చిన మోడీ సర్కారు చేతులు దులుపుకొంది.ఇది మరింతగా గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సర్కారుకు మారిపోయింది. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ తాడు తెగదు.. పాము చావదు! అన్నట్టుగానే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు..చంద్రబాబుకు “ట్రబుల్ ఇంజన్‌గా” మారిపోయిందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే.. అలాగని చంద్రబాబు మోడీని వదులుకునే పరిస్థితి లేదు.”మోడీ వదులుకుంటే.. ఆ గ్యాప్.. ఆ వెంటనే ఫిల్ చేయడానికి వైసీపీ కాచుకుని కూర్చుంది. ఏ క్షణాన బాబు మోడీని వదిలేసినా.. (2018లో మాదిరిగా) ఆ క్షణమే వైసీపీ మోడీని కౌగిలించుకునేందుకు రెడీగా ఉందని.. జాతీయ మీడియానే కాదు.. బీజేపీలోని నాయకులు కూడా చెబుతున్నారు.దీంతో చంద్రబాబుకు ఇప్పుడు మోడీని వదులుకునే ఆప్షనే కాదు..ఆయనను నొప్పించే ఆప్షన్ కూడా లేదు. ఆయన ఏం చేసినా.. అంతా బాగుందని చెప్పుకోవడం తప్ప..రెండో మాటే చంద్రబాబు నుంచి వినిపించే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
*👉నారా రోహిత్-సిరి లేళ్ల నిశ్చితార్థం…*
ప్రతినిధి-2 చిత్రంలో కలిసి నటించిన నారా రోహిత్, సిరి లేళ్ల..ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం..హైదరాబాదులో నేడు ఘనంగా నిశ్చితార్థం..హాజరైన నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు..
👉ఆగిన గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..*
వరంగల్ రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు హార్ట్ ఎటాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు…
వెంటనే గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు …..
👉రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న గోమాతలు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గోమాతలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. శనివారం గుర్తు తెలియని వాహనం ఓ గోమాతను ఢీకొట్టింది.దీంతో ఆ గోవుకు తీవ్ర రక్తస్రావం అయింది.రోడ్డంతా రక్తసిక్తంగా మారింది. గోవుల యజమానుల నిర్లక్ష్యం రోడ్డుమీద వదిలేయడం వల్లే గోమాతలు రోడ్డు ప్రమాదలకు గురవుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోని గోవులను సంరక్షించే విధంగా గోవుల యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
👉 రాష్ట్ర మారిటోరియం బోర్డు చైర్మన్ గా నియమితులైన దామచర్ల సత్య ను ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో
రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి యర్రమోతు శ్రీనివాసులు, మరిపూడి మండలాల అధ్యక్షులు గురజాల రాజేష్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
👉కూతురిని హత్య చేసేందుకు సుపారీ ఇచ్చిన తల్లి.. కూతురు బదులుగా తల్లిని చంపిన హంతకుడు..
యూపీ – ఎటాహ్‌లో కన్న కూతురు ప్రేమలో ఉందని హత్య చేయించాలనుకున్న తల్లి.. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కు సుపారీ ఇచ్చింది. అయితే ఆ హంతకుడు కూతురికి బదులుగా తల్లినే చంపేశాడు..అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కూతురిని చంపమని తన కూతురు ప్రేమించినవాడికే సుపారీ ఇచ్చిన తల్లి ..
దీంతో కూతురికి బదులుగా తల్లిని చంపేశాడు.. మృతురాలి కూతురు,ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
👉దోనపాటి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా..*కోమరోలు మండలం పొట్టిపల్లి గ్రామంలో దోనపాటి పిచ్చయ్య, లక్ష్మీ గుర్రమ్మల కుమారుడు విరశేఖర్,మౌనిక ల వివాహానికి హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు*
👉సూరా వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా..*కోమరోలు మండలం పోసుపల్లె గ్రామంలో గురువారెడ్డి, రమణమ్మ ల కుమారుడు భూపాల్ రెడ్డి,ప్రగతి గార్ల వివాహానికి హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు*
👉వేమన వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా..
*పొదిలి టౌన్ విశ్వనాథపురం సాయిబాబా గుడి సమీపంలో వేమన వెంకటేశ్వరరెడ్డి, ధనలక్ష్మిల నూతన గృహ ప్రవేశానికి హాజరుఅయిన మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యకర్త అన్నా వెంకట రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు*
*అవిత్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బూచేపల్లి వెంకయమ్మ,శివప్రసాద్ రెడ్డి,అన్నా రాంబాబు ..*పొదిలి మండలం రామాపురం గ్రామంలో కసిరెడ్డి అవిత్ మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారి అవిత్ ను ఆశీర్వదించిన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయమ్మ ,ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ,గిద్దలూరు మాజి శాసనసభ్యులు మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు*
👉శ్రీ లక్ష్మీ శ్రీనివాస గ్రానైట్స్ అండ్ టైల్స్ షాపును ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల..
*గిద్దలూరు పట్టణం,ఒంగోలు రోడ్డులో కొమ్మునూరు పంచాయతీ, బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన వేమిరెడ్డి కోటేశ్వర రెడ్డి మరియు పి. శ్రీనివాస రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస గ్రానైట్స్ & టైల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేశారు.కార్యక్రమంలో గిద్దలూరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
👉అన్న క్యాంటీన్ కు 10 వేలు విరాళం..
*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని రాచర్ల మండలం, జేపీ చెరువు గ్రామానికి చెందిన పసుపులేటి పెద్ద జమాలయ్య మర్యాదపూర్వకంగా కలిసి అన్న క్యాంటిన్ నిర్వహణకు తన వంతు సహకారంగా రూ. 10,000-00 లు అక్షరాల పదివేలు రూపాయలు ఎమ్మెల్యే గారికి అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సిద్ధం పెద్ద నరసింహులు తదితరులు పాల్గోన్నారు.
👉 గిద్దలూరు మండలం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి చెందిన అధికారిణి లంచం డిమాండ్ చేస్తున్న వైనం.. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని తొలగించకుండా ఉందేందుకు డబ్బులు డిమాండ్… డబ్బులు ఇవ్వకపోవడంతో ఉద్యోగిని తొలగిస్తానని బెదిరింపులు, వేధింపులు… ఉద్యోగిని బెదిరిస్తూ వేధింపులకు గురి చేసే ఆడియో టేపులు సోషల్ మీడియాలోకి… ఈ అధికారిణికి గత ప్రభుత్వానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు, జిల్లా అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ఎవరిని లెక్క చేయని వైనం.. ఆమె జాబితాలో పలువురు బాధితులు.. సదురు అధికారిణి పై సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులతో కాకుండా ఇతర శాఖ అధికారులతో కలెక్టర్ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న కార్యాలయ సిబ్బంది.
👉అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుండి డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 21.10.2024*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ, అమరావతి వారి ఉత్తర్వుల మేరకు, రాష్ట్రంలో షెడ్యుల్డ్ కులముల మరియు షెడ్యుల్డ్ తెగల అభ్యర్ధులకు డి యస్ సి పరీక్ష కొరకు ఉచిత బోధన, ఉచిత భోజన మరియు వసతి సౌకర్యములతో మూడు నెలల పాటు అభ్యర్ధులు శిక్షణ పొందుటకు http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు నమోదు చేసుకొనుటకు తేది: 11.10.2024 నుండి తేది: 21.10.2024 వరకు అవకాశం కల్పించడమైనది. అభ్యర్ధుల వార్షికాదాయం రూ.2,50,000/-ల లోపు కలిగిన విద్యార్థులు అందరూ అర్హులు. కావున ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయమును సద్వినియోగం చేసుకొని, మీ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొనుటకు ప్రభుత్వం కల్పించిన అవకాశమును సద్వినియోగము చేసుకొనవలసినదిగా జిల్లా లలోని ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారిని సంప్రదించాల ని పేర్కొన్నారు…
*-ది పెరెంట్స్ అసోసియేషన్
మోడీ ఎఫెక్ట్: బాబుకు ఆప్షన్ లేదు ..నారా రోహిత్-సిరి లేళ్ల నిశ్చితార్థం.. రాష్ట్ర మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు సన్మానం.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అన్నా.. ..అన్న క్యాంటీన్ కు 10 వేలు విరాళం..డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 21 వరకు..రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న గోమాతలు..
Recent Posts