శ్రీవారి లడ్డూపై బాబు కుట్ర? స్వామి కొత్త సందేహాలివే!..నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు డాక్టర్ల సంఘం పిలుపు!..హైదరాబాద్‌లోని DKZ టెక్నాలజీస్ స్కాంలో సంచలన నిజాలు..!.ఖాన్ సాబ్‌కు ఎంత కష్టం వచ్చే.. అధికార పార్టీలో ఉన్నా పోరాటమేనా!..ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు..డీజేతో గుండెపోటు..! డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి..కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్.. .ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం కొనసాగుతున్న లాటరీ ప్రక్రియ..పిల్లలను బావిలో తోసేసిన తండ్రి..ఆ తర్వాత దారుణం..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.

👉శ్రీవారి లడ్డూపై బాబు కుట్ర? స్వామి కొత్త సందేహాలివే! తాజాగా ఆయన చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించిన కొత్త లాజిక్కులను తెర మీదకు తీసుకొచ్చారు. యావత్ దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడటమే కాదు.. పెను సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన ఆవునెయ్యిలో జంతు కొవ్వులతో తయారు చేసినట్లుగా ఆరోపణలు చేయటం.. అది కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి రావటంతో షాకింగ్ గా మారింది. దీనిపై ఇప్పటికే బోలెడన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అయితే.. ఈ ఎపిసోడ్ మీద కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు ప్రముఖ న్యాయవాది.. మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. తాజాగా ఆయన చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించిన కొత్త లాజిక్కులను తెర మీదకు తీసుకొచ్చారు.తాజాగా జాతీయ మీడియాకు ఆయనో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.**అందులో కీలకమైన అంశాల్ని చూసినప్పుడు.. స్వామి వాదన.. చంద్రబాబు వ్యాఖ్యల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా కుట్ర కోణానికి తెర తీశారని ఆరోపించారు. ఇంతకూ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. – ఆవునెయ్యి శాంపిల్స్ పరీక్షలుచేసి.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవటంతో వెనక్కు పంపించినట్లు టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగంగా ప్రకటించటం దేనికి నిదర్శనం?👉 ఇలా ఆరోపణలు చేసిన తర్వాత దర్యాప్తునకు ఆదేశిస్తారా? నిజానిజాలను నిర్దారించుకోకుండా భక్తుల్లో అలజడిని క్రియేట్ చేసేందుకు ప్రయత్నించటం కుట్ర కోణం కాక మరేంటి? 👉లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా సీఎమ్మే సెప్టెంబరు 18న బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత ప్రసాదం కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను నియమిస్తున్నట్లుగా అదే నెల 26న ప్రకటించారు.ఇలాంటి తీవ్రమైన ఆరోపనలు చేసేటప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వారు అది నిజమా? కాదా? అని మొదటే దర్యాప్తు చేయించాలి కదా? ముందు ఆరోపణ చేసి తర్వాత సిట్ దర్యాప్తు అన్నారు. కల్తీపై దర్యాపతు కోసం ప్రభుత్వం సిట్ నియమించటం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవటం లేదు. – జులైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంతకాలం ఎందుకు సిట్ ను నియమించారు. గత ప్రభుత్వంపైనా.. నాటి ముఖ్యమంత్రి మీదా చాలా పెద్ద ఆరోపణలు చేశారు. – జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.👉 ఒక క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని హిందూవాదులు అగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగినా ఆయన హిందువనే చెబుతారు. – ఆయన 32 సార్లు మాల వేసుకొని శబరిమల వెళ్లి వచ్చారు. ఇంట్లో గోశాల నిర్వహిస్తూనే గోవులకు పూజ చేస్తున్నారు. – లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు పత్రికల్లో పతాక స్థాయిల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే అంశాలు చాలా ఉన్నాయి.👉 జులైలో నెయ్యి శాంపిల్ తీసుకొని పరీక్ష చేశారని టీటీడీ రిపోర్టులో ఉంది. అందులో కల్తీ జరిగిందని కానీ.. చేపనెయ్యి.. కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా లేదు. నెయ్యి నాణ్యత టీటీడీ ప్రమాణాలకు తగ్గట్లు లేని కారణంగా వెనక్కి పంపామనే ఉంది. ప్రసాదం తయారీకి పంపామని ఎక్కడా లేదు. – ఒకరి గుర్తింపును.. ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఏజెన్సీలు సైతం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం కొనసాగుతున్న లాటరీ ప్రక్రియ..ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో రెండు కౌంటర్ల ద్వారా నిర్వహణ.. స్వయంగా లాటరీ తీస్తున్న కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ..
జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలు. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో లాటరీ నిర్వహణ.. మొత్తం ప్రక్రియ వీడియో లైవ్ స్ట్రీమింగ్.
👉 నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్ల సంఘం..🙆
పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది. అయితే, ట్రైనీ డాక్టర్లకు సంఘీభావంగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని దాదాపు 79 మంది సీనియర్ వైద్యులు, అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు FAIMA ప్రకటించింది.
ఇక, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైద్యుల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. మా సహోద్యోగులకు సంఘీభావంగా వైద్యులపై నానాటికీ పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నేటి నుంచి అత్యవసర చికిత్సలు మినహా మిగతావి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
👉ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించే ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. మద్యం దుకాణాల వేలం ప్రక్రియతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. ఎన్నికల కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తకుండా లాటరీ కేంద్రాలవద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. 100మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు. లాటరీ దక్కిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.దక్కని వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది.
👉 లారెన్స్ బిష్ణోయ్ మరో దావూద్ !
ముంబై:
బాలీవుడ్ తారలకు అత్యంత సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లుగా ఆ గ్యాంగ్ సభ్యులు ప్రకటించారు. హత్యలో పాల్గొన్న నలుగురిలో ముగ్గుర్ని అరెస్టు చేశారు. గోల్డీ బ్రార్ అనే మరో గ్యాంగ్ స్టర్ తో కలిసి నేర సామ్రాజ్యాన్ని బిష్ణోయ్ నిర్వహిస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల వ్యవహారం కూడా తమ పనేనని బిష్ణోయ్ వర్గం ప్రకటించింది.
లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. పలు దేశాల్లో ఇతనికి గ్యాంగ్ ఉందని ఏడు వందల మంది షూటర్లు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హర్యానాకు చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడు అయిన లారెన్స్ బిష్ణోయ్ ముందు నుంచీ నేరస్వభావం ఉన్నవాడు. దోపిడీలు, దొంగతనాలతో ఎదిగారు. తర్వాత కిడ్నాపులు, హత్యలకు పాల్పడుతున్నాడు. పోలీసులు పట్టుకున్నా జైల్లో ఉన్నా.. తన నేర సామ్రాజ్య కార్యకలాపాలు ఆగడం లేదు.
దావూద్ ఇబ్రహీం తరహాలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లుగా ఇప్పటికే హర్యానా పోలీసులు గుర్తించారు. ఎన్ఐఏ చార్జిషీటు కూడా దాఖలు చేసింది. బాలీవుడ్ ప్రముఖుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు. గతంలో దావూద్ ను నిర్లక్ష్యం చేసి వదిలివేయడంతో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ ను ప ట్టుకున్నా.. జైల్లో ఉన్నా.. అతను ఓ మాజీ మంత్రిని.. అత్యంత కీలక నేతను హత్య చేయించగలిగాడంటే… చిన్న విషయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
👉 అధిక లాభాల పేరుతో రూ.229 కోట్లు వసూలు..
హైదరాబాద్‌లోని DKZ టెక్నాలజీస్ స్కాంలో సంచలన నిజాలు..!
👉 హైదరాబాద్ లోని డీకేజెడ్ (DKZ) టెక్నాలజీస్ స్కామ్ పై ఈడీ విచారణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసింది డీకేజెడ్ టెక్నాలజీస్. దాదాపు 17వేల మంది నుంచి రూ.229 కోట్లు వసూలు చేసింది. ఒకేవర్గం వారిని టార్గెట్ చేసి.. మీరు పెట్టే పెట్టుబడికి రెండింతలు లాభం ఇస్తామంటూ వసూలు చేసింది. ఈ స్కామ్ లో ఇప్పటికే డీకేజెడ్ టెక్నాలజీస్ డైరెక్టర్ అయేషాను అరెస్ట్ చేసి సీసీఎస్ కు తరలించారు. మిగిలిన 16 మంది నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. DKZ స్కామ్ లో హవాలా, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
*లక్ష రూపాయలు పెట్టుబడితే మరో లక్ష లాభం..*
లక్ష రూపాయలు పెట్టుబడితే మరో లక్ష లాభం వస్తుందంటూ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన DKZ టెక్నాలజీస్ కు సంబంధించిన స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే సంస్థ ఎండీతో పాటు డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 17వేల 500 మందికిపైగా సుమారు 229 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో హవాలా రూపంలో నగదు చేతులు మారినట్లు ఈడీ విచారణలో తేలింది.
*హవాలా రూపంలో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తింపు..*
ఈ కేసుకి సంబంధించి లోతైన దర్యాఫ్తు జరుగుతోంది. అందులో భాగంగానే 16 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పెద్ద మొత్తంలో హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. పెట్టుబడి పెడితే రెండింతలు లాభం అంటూ దేశవ్యాప్తంగా బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోనూ కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు.
*పరారీలో మరో 16మంది నిందితులు..*
ఈడీ పూర్తి స్థాయిలో దర్యాఫ్తు జరిపితే ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. డీకేజెడ్ టెక్నాలజీస్ కు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ అష్పాక్ రాహిల్, డైరెక్టర్ సైదా అయేషా నాజ్ భార్యభర్తలు. వీరిద్దరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేస్తున్నాయి. ఈ కేసుని ఇటు హైదరాబాద్ పోలీసులు, అటు సీసీఎస్ పోలీసులు చాలా చాలెంజింగ్ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఈడీ ఎంట్రీతో వెలుగులోకి రానున్న మరిన్ని నిజాలు..
తాజాగా ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయ్యింది. దీంతో ఈ స్కామ్ లో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 16మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటకు రానుంది. ఏ రూపంలో ఎక్కడెక్కడ బ్రాంచులు ఏర్పాటు చేశారు, కేవలం 17వేల 500 మందే కాకుండా ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా? అనే సమాచారం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రూ.229 కోట్ల స్కామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాఫ్తు జరుగుతోంది.
👉 ఖాన్ సాబ్‌కు ఎంత కష్టం వచ్చే.. అధికార పార్టీలో ఉన్నా పోరాటమేనా!
హైదరాబాద్:ఫిరోజ్ఖాన్.. కాంగ్రెస్ పార్టీ ఫైర్బ్రాండ్ లీడర్ అయిన ఈయనకు ఉన్న ఫాలోయింగే వేరు. హస్తం పార్టీ అంటే గిట్టని బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఫిరోజ్ భాయ్ అంటే ఫిదా అయిపోతారు. మసీదుకు వెళ్తారు.. గుడికి వస్తారు.. అన్ని మతాలు సమానం అంటారు. సాయం చేయడంలో ముందుంటారు. అలాంటి ఫిరోజ్ ఖాన్ గత ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసి.. ఎంఐఎం అభ్యర్థిని ఓడించినంత పనిచేశారు. స్వల్ప తేడాతో ఓడినా.. బాధ పడలేదు. తాను ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ పవర్లోకి వచ్చిందని సంతోషపడ్డ ఆ నేతకు.. ఎంఐఎం బెడద తప్పడం లేదట.
ఓల్డ్ సిటీలో భాగంగా ఉన్న నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు ఫిరోజ్ ఖాన్. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉందని తెలిసినా.. వెంటనే వాలిపోతున్నారు. ఇలాగే డ్రైనేజ్, సీసీ రోడ్ల విషయంలో కాంట్రాక్టర్ తీరుపై ప్రశ్నించేందుకు వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అతని అనుచరులు అక్కడికి వచ్చేశారు. *ఒకే తీరుగా నోటీసులు*
ఫిరోజ్ ఖాన్ అతని అనుచరులపై దాడి చేశారు. అతికష్టం మీద పోలీసులు రెండువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే.. దాడికి చేసిన ఎంఐఎంకు..ఫిరోజ్ ఖాన్‌కు పోలీసులు ఒకే తీరుగా నోటీసులు ఇచ్చారు. దీంతో ఫిరోజ్ ఖాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అధికార పార్టీ నేతగా ఉన్న తనపై దాడి జరిగితే.. దాడిచేసిన వారి మీద యాక్షన్ తీసుకోకపోగా తనను అవమానించడంతో పాటు తన క్యాడర్ నిరుత్సాహానికి గురిచేసేలా పోలీసుల నోటీసులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట..*
కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన నేతలనే నియోజకవర్గ ఇంచార్జ్లుగా అధికారం చెలాయిస్తున్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ ఇంచార్జిల మాటే వింటున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉంటుంది.
*లోకల్‌గా నో కాంప్రమైజ్:*
దీంతో చేసేదేమి లేక కాంగ్రెస్ నేతలు సైలెంట్ అవుతున్నారు. కానీ ఫిరోజ్ ఖాన్ వంటి నేతలు లోకల్‌గా కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఎంఐఎం విషయంలో ఫిరోజ్ ఖాన్ మొదటి నుంచి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు.. నాంపల్లిలో జరిగిన పరిణామాలపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు టాక్. ఫిరోజ్ ఖాన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతానంటున్నారు. అయితే సీఎం జోక్యం చేసుకుని సమస్యకు ఫుల్స్టాఫ్ పెడుతారా లేక నాంపల్లిలో వివాదం ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. అయితే అధికారంలోకి వస్తే పెద్ద పదవి వస్తుందని ఆశపడ్డ ఫిరోజ్‌ ఖాన్‌కు ఎంఐఎం రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాదు పతంగి పార్టీతో హస్తం పార్టీ దోస్తానా చేస్తుండటంతో.. ఫిరోజ్‌ ఖాన్‌ను కాంగ్రెస్‌ పట్టించుకుంటుందా లేదా అన్నది కూడా డౌట్‌గానే ఉంది.
👉 డీజేతో గుండెపోటు..! డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి..
అమలాపురం : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజే ప్రాణం తీసింది. డీజే సౌండ్ బ్యాక్సుల దగ్గర డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా పండుగ రోజున ఈ విషాదం చోటు చేసుకుంది. కొంకాపల్లిలో దసరా వేడుకల్లో భాగంగా డీజే ఏర్పాటు చేశారు. డీజే సౌండ్ బ్యాక్సుల దగ్గర కొందరు యువకులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు.వారిలో బండారులంక గ్రామానికి చెందిన పప్పుల వినయ్ కూడా ఉన్నాడు. డ్యాన్స్ చేస్తున్న వినయ్ సడెన్ గా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వినయ్ మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత దగ్గరగా ఉండటం వల్ల హార్ట్ బీట్ తప్పి గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. వినయ్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబసభ్యులు తెలిపారు. కేవలం డీజే బాక్సుల నుంచి వచ్చిన విపరీతమైన సౌండ్ కారణంగా అతడి గుండె ఆగిపోయిందని చెబుతున్నారు.
*డీజే బాక్సుల నుంచి వచ్చే సౌండ్ చాలా ప్రమాదకరం..*
ఉత్సవాలు, వేడుకలు ఏవైనా డీజేలు వాడకం సర్వ సాధారణంగా మారిపోయింది. డీజే సౌండ్ బాక్సుల ముందు కుర్రాళ్లు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు అది ఎంజాయ్ మెంట్ అనుకుంటున్నారు. కానీ, అదెంత ప్రాణాంతకమో అర్థం కావడం లేదు. డీజే బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తూ పలువురు చనిపోయారు. అప్పటివరకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. వారి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. చెవులకు చిల్లు పడేలా, గుండెలు అదిరేలా డీజే శబ్దాలు ఉంటున్నాయి. ఇదే ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. డీజే బాక్సుల నుంచి వచ్చే విపరీతమైన సౌండ్ తో గుండె లయ తప్పి కొట్టుకోవడం ఆగిపోతోంది. తాజాగా అమలాపురంలో ఈ తరహా విషాదమే చోటు చేసుకుంది.
*గుండెపోటుకు దారితీస్తున్న డీజే సౌండ్ బాక్సులు..*
ఎక్కువ సంఖ్యలో డీజే సౌండ్‌ బాక్సులు ఏర్పాటు చేయడం. పరిమితికి మించిన సౌండ్‌ పెట్టడం. దీని వల్లే కార్డియాక్ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత సమీపంలో డ్యాన్స్‌లు చేయడం చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. స్పీకర్ల నుంచే వచ్చే భారీ సౌండ్.. చెవులు, గుండెపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని గుండెపోటుకు దారి తీస్తుందని అంటున్నారు. దాని ఫలితమే అకాల మరణం అని డాక్టర్లు అంటున్నారు.
👉 కారు నంబర్ ప్లేట్‌పై తన పేరు పెట్టుకున్న మణికొండ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కొడుకు..
రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మణికొండ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ కుమారుడు కస్తూరి శ్రవణ్ కారు నంబర్ ప్లేట్‌పై తన పేరు వేసుకొని తిరుగుతున్నాడు.
సామాన్య ప్రజలకు ఒక రూల్, కాంగ్రెస్ నేతలకు ఒక రూలా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెటిజన్లు…
👉ఎస్ఐ సీట్లో కూర్చొని ఎస్ఐకే వార్నింగ్ ఇస్తున్న మంత్రి సురేఖ..
సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కుటుంబం మరియు సమంత పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..
ఆ సంఘటనపై అటు కేటీఆర్ ఇటు నాగార్జున కొండా సురేఖ పై క్రిమినల్ కేసులు వేయడం అవి కోర్టులో చర్చలో ఉండడం మరవకముందే, మరో వివాదంలో కొండా సురేఖ…
గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఎస్సై కుర్చీలో కూర్చుని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న కొండా సురేఖ ఫోటో వైరల్..
👉ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం..కామారెడ్డి..
దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. చిట్టపు శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు విగ్నేష్, అనిరుధ్‌లను రాత్రి సమయంలో బావిలో తోసి చంపేశాడు. ఆపై తాను కూడా బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కుమారులను బావిలో తోసి సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్‌ల కారణంగా అప్పుల బాధతో ఆ తండ్రి తన ఇద్దరు కొడుకులను చంపి, తాను కూడా చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇద్దరి పిల్లలను బావిలో తోసేసి
నందివాడకు చెందిన చిట్టపు శ్రీనివాస్ (35) – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విగ్నేష్ (6), అనిరుధ్ (4) ఉన్నారు. ఇప్పుడంతా దసరా వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇద్దరి పిల్లల్ని తీసుకుని రాత్రి 7.30 గంటల సమయంలో దుర్గమ్మ నిమజ్జనానికి శ్రీనివాస్ వెళ్లాడు. ఇక రాత్రి 10 గంటలు దాటినా వారు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అపర్ణ శ్రీనివాస్‌కు ఫోన్ చేసింది. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా అతడు లిఫ్ట్ చేయలేదు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారు పడిన అపర్ణ పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. కానీ శ్రీనివాస్ ఆచూకీ కనిపించలేదు. అయితే ఆ బావి వద్దే శ్రీనివాస్ సెల్‌ఫోన్‌, వాచ్, చెప్పులను గుర్తించారు. దీంతో అతడు బావి లోపల కూరుకుపోయినట్లు గుర్తించి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అతడి మృతదేహాన్ని బావిలో గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే శ్రీనివాస్ మృతికి బెట్టింగే కారణమని తెలుస్తోంది. శ్రీనివాస్ బెట్టింగ్‌లకు బాగా అలవాటు పడినట్లు సమాచారం. దీంతో శ్రీనివాస్, అపర్ణ మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా శ్రీనివాస్ చేసిన అప్పులు తీర్చడానికి ఎకరం పొలం అమ్మినప్పటికీ చేసిన అప్పులు తీరలేదని సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
👉తుపాను నేపథ్యంలో మరోసారి కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్..*విశాఖ బీచ్ లో రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించిన హోం మంత్రి అనిత..*వీకెండ్, దసరా సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ , పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై ఆరా*
*విశాఖపట్నం:* తుపాను నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారానికి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆమె హోం, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వరుస టెలికాన్ఫరెన్స్ లతో రాబోయే తుపాను నుంచి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది, ఆస్తి నష్టం కలగకుండా ఉండేలా నిరంతరం కీలక శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
తుపాను ప్రభావమున్న జిల్లాల కలెక్టర్లకు సైతం తగు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు రాబోయే రెండు రోజులు తుపాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా విపత్తు నిర్వహణ శాఖ ద్వారా సందేశాలు, ఫోన్ లు చేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికల ప్రకారం కలెక్టర్లు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని హోం మంత్రి మార్గనిర్దేశం చేశారు.
నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం ఉన్న అన్ని జిల్లాలు రాబోయే రెండు మూడు రోజులు జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేసే సందేశాలు, ఫోన్ ల ద్వారా విపత్తు శాఖ ఎప్పటికప్పుడు వెళ్లాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లే అవకాశమున్న వాగులు, కాలువలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండేలా సూచనలివ్వాలన్నారు.
విద్యుత్ స్తంభాలు, తీగలు,చెట్లు, హోర్డింగులు వంటి ప్రమాదాలకు ఆస్కారముండే ప్రాంతాల్లోనూ అన్ని శాఖలు సమన్వయంతో 24×7 అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విశాఖ బీచ్ లో రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించిన హోం మంత్రి అనిత..
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ బీచ్ లో ప్రజల రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించారు. వీకెండ్ , దసరా సెలవుల వల్ల భారీ రద్దీ నేపథ్యంలో బీచ్ కు వచ్చిపోయే పర్యాటకులు, ప్రజల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీచ్ కి వచ్చే వారిలో అనుమానాస్పద కదలిలకలపై నిఘా పెట్టే సీసీ కెమెరాల ఏర్పాట్లపైనా ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలు రాకుండా చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు.
👉 సినీ నటి కాదంబరి జేత్వానీ కేసు సీఐడీకి అప్పగింత..
దీనితో పాటు ఏపీలో పలు కీలక కేసులను సీఐడీకి బదిలీ చేసిన పోలీసులు..
👉చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దూకుడు పెంచిన ఏపీ ప్రభుత్వం..
👉టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే 110 మందికి పైగా కేసులు, 30 మందికి పైగా అరెస్టు..
👉నేడు కేసుకు సంబంధించిన ఫైళ్లు సీఐడీకి అప్పగించనున్న మంగళగిరి డీఎస్పీ.
👉గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అన్న క్యాంటీన్ నిర్వహణకు తన వంతు సహకారంగా 5,116లు నగదును అందజేసిన పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన గుర్రాల చంద్రశేఖర్*
👉గ్యార్మీ పండుగ వేడుకల్లో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*కొమరోలు మండలం, రాజుపాలెం గ్రామంలో నిర్వహించిన గార్మీ పండుగ వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక నాయకులు పూలమాల శాలవా వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు గోడి ఓబుల్ రెడ్డి మండల టిడిపి నాయకులు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవ రెడ్డి, లకుమారపు శ్రీనివాసులు, షేక్ ఖాజా పీరా, పఠాన్ గౌస్, షేక్ ఖాసీం మియా, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.*

7k network
Recent Posts

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు

కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు