ఆళ్లగడ్డలో హై టెన్షన్..భారత్ లోని దుర్భర పేదరికంపై ప్రపంచ బ్యాంక్ సంచలన నివేదిక!..వైభవంగా సత్యసాయి కన్వేషన్ హాల్..సగిలేరు ను పరిశీలించిన సబ్ కలెక్టర్. లో డాక్ఖర్ నిఖిత -డాక్టర్ అవినాష్ ల ఎంగేజ్ మెంట్..ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మైనింగ్ మాఫియా?.. రాచర్లలొ పొలం పిలుస్తుంది

👉ఆళ్లగడ్డలో హైటెన్షన్😯😯😯
ఏవీ సుబ్బారెడ్డికి భూమా అఖిలప్రియ అల్టిమేటం
ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఉండొద్దని వార్నింగ్
ఆళ్లగడ్డలో భారీగా మోహరించిన పోలీసులు
ఏం జరిగినా తేల్చుకుంటానంటున్న ఏవీ సుబ్బారెడ్డి*
👉అంగరంగవైభవంగా సత్యసాయి కన్వేషన్ హాల్ లో డాక్ఖర్ నిఖిత -డాక్టర్ అవినాష్ ల ఎంగేజ్ మెంట్💐💐💐 *హన్మకొండ జిల్లా మడికొండ సత్యసాయి కన్వేషన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌ *జంగా సుజాత-రాఘవరెడ్డి*ల కనిష్ట కూతురు డాక్ఖర్ నిఖిత* – *ఎరమద వెంకట్ రెడ్డి- రమాదేవిల* (రిటైర్ట్ ఆడిషన్ ఎస్.పి.)*కనిష్ట పుత్రుడు డాక్టర్ అవినాష్* ల ఎంగేజ్ మెంట్ కార్యక్రమం
అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్రమంత్రివర్యులు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ , ఎమ్మెల్యేలు పాలకుర్తి ఎమ్మెల్యే , యశస్విని రెడ్డి , పాడి కౌసిక్ రెడ్డి, నర్సం పేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు,వివిధ రంగాల ప్రముఖులు హాజరై, శుభాకాంక్షలు తెలిపారు.
👉కొత్తపట్నం లోని నల్లూరి గార్డెన్స్ నందు జరిగిన, మారిటైం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య మేనకోడలు ఓణిల ఫంక్షన్ వేడుకల్లో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి, తాతా ప్రసాద్, బెల్లం సత్యం, కుప్పా రంగసాయి,ఆళ్ల శ్రీనివాసరెడ్డి,కె. శ్రీమన్నారాయణ తదితర నాయకులు.
👉భారత్ లోని దుర్భర పేదరికంపై ప్రపంచ బ్యాంక్ సంచలన నివేదిక! ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ – 20లో కచ్చితంగా ఇద్దరు భారతీయులు ఉంటారు. ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ – 20లో కచ్చితంగా ఇద్దరు భారతీయులు ఉంటారు.. ఇక భారత్ లోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 2024 నాటికి తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది.. గత ఏడాదితో పోలిస్తే సుమారు 40% పెరిగింది.. 2024 జీడీపీ ప్రకారం టాప్ – 5 దేశాల్లో 3.41 ట్రిలియన్ డాలర్లతో భారత్ నిలిచింది.
28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.. ఈ విషయంలో యూకే, ఫ్రాన్స్, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, స్పెయిన్ వంటి దేశాలు భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి! అయినప్పటికి… దుర్భర పేదరికం ఈ దేశాన్ని వెంటాడుతోంది. అవును… భారతదేశంలో పెరుగుతున్న అసమానతలు శాపంగా మారాయనే చర్చ బలంగా నడుస్తుంటుంది.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారతీయులు ఉంటారు.. టాప్ – 5 జీడీపీ కలిగిన దేశాల్లోనూ భారత్ ఉంటుంది.. ఇదే సమయంలో దుర్భర పేదరికం కూడా దేశాన్ని వెంటాడుతోంది! ఈ క్రమంలో తాజాగా ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా… భారతదేశంలో 12.9 కోట్ల మంది ప్రజలు దుర్భర పేదరికంలో బ్రతుకుతున్నారని తెలిపింది. వీరి ఆదాయం రోజుకు $2.15 (సుమారు రూ.181) కంటే తక్కువగా ఉందని తాజా నివేదికలో పేర్కొంది. మధ్యస్థ ఆదాయ దేశాల్లో రోజుకు $6.85 (సుమారు రూ.576) సంపాదించేవారిని పేదలుగా పరిగణిస్తూ రూపొందించిన ఈ నివేదికలో.. రూ.181 రూపాయలతో భారతదేశ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. రూ.576 రోజువారీ సంపాదనను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 1990ల కంటే భారత్ లో పేదరికం దారుణంగా ఉందని వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం జనాభా పెరుగుదలేనని వివరించింది. పలు నివేదికల ప్రకారం అక్టోబర్ 13 – 2024 నాటికి భారతదేశ జనాభా 145.46 కోట్లుగా చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో ఇది 17.78%. ఫలితంగా…ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారింది. ఇది కూడా పేదరికానికి ఓ కారణం అని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది!.. అయితే… ఇటీవల భారత ప్రభుత్వ విడుదల చేసిన గృహవినియోగం – వ్యయ సర్వే (హెచ్.సీ.ఈ.ఎస్)లో ఈ వివరాలను వెల్లడించలేదని పేర్కొంది! ప్రస్తుత పురోగతి ప్రకారం.. ప్రజలు రోజుకి $6.85 (సుమారు రూ.576) కంటే ఎక్కువ సంపాదించేలా చేయడానికి ఒక శతాబ్ధం కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని నివేదిక పేర్కొంది. ఇదే క్రమంలో… ప్రపంచ వ్యాప్తంగా ఈ పేదరిక నిర్మూలనా చర్యలు చాలా మందగమనంలో ఉన్నాయని ఆక్షేపించిన ప్రపంచ బ్యాంక్.. ఆఫ్రికా సహా పలు దేశాలు 2030 నాటికి దుర్భర పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది. అయితే.. ప్రపంచ పేదరికంలో భారత్ వాటా కొన్ని దశాబ్ధాలలోనే తగ్గే అవకాశం ఉందని తెలిపింది!
👉సగిలేరు ను పరిశీలించిన సబ్ కలెక్టర్*
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం గిద్దలూరులో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ఫ్లాష్ ఫ్లాడ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో. మార్కాపురం సబ్ కలెక్టర్ సహధిత్ వెంకట త్రివినాగ్ గిద్దలూరులోని సగిలేరు వాగు పరివాహ ప్రాంతాలను పరిశీలించారు. సగిలేరు వాగుకు సంబంధించి పూర్తి వివరాలను గిద్దలూరు ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డి సబ్ కలెక్టర్ కు వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ వల్ల పరిస్థితులను ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ వైపి రంగయ్య తదితరులు పాల్గొన్నారు
👉చీమకుర్తి గ్రానైట్ – ప్రకాశం పాలిట శాపం..గ్రానైట్ అక్రమ రవాణా ద్వారా వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మైనింగ్ మాఫియా…
ప్రకాశం జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణాపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.
గత 5 సంవత్సరాలలో గ్రానైట్ అక్రమ రవాణా ద్వారా వందలు కోట్లు గడించిన వైసీపీ పార్టీ నాయకులు, అధికారులు..
గ్రానైట్ అక్రమ రవాణా ద్వారా వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన మైనింగ్ మాఫియా…
ప్రపంచ ప్రసిద్ధి చెందిన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ను 45 గ్రానైట్ క్వారీల ద్వారా
అధికారికంగా రోజుకి 300 వాహనాల ద్వారా 3200 క్యూబిక్ మీటర్ల గెలాక్సీ గ్రానైట్ రాయి తరలింపు…
కానీ అనధికారికంగా మరో 3000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయి అక్రమ తరలింపు చేస్తున్నట్లు సమాచారం…
ప్రభుత్వం మారిన మైనింగ్ మాఫియాకు అడ్డుకట్టం వేయలేదు, అధికారుల తీరు మారలేదని ఆరోపించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ మాఫియా అత్యంత ఖరీదైన చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ని కొండలను పిండి చేసి క్వారింగ్ చేస్తుందని ఆరోపించారు ..
అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న వాహనాలను ముక్కుబడిగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు వదిలేస్తారన్నారు.
ఈ అక్రమ రవాణాకు కారణమైన గ్రానైట్ క్వారీ అక్రమార్జకులపై కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే అవినీతి ఏ స్థాయిలో తాండవిస్తుందో సామాన్యుడికి సైతం అర్ధమవుతుందని,
ముఖ్యంగా చీమకుర్తి RL పురం లో గల కొన్ని గ్రానైట్ క్వారీల యాజమాన్యం భారీ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందన్నారు..
అలాగే అక్రమార్జనకు అలవాటు పడి మైనింగ్ మాఫియా కి సహకరిస్తున్న కొందరు మైనింగ్, వాణిజ్య, ట్రాన్స్పోర్ట్, రెవిన్యూ, పోలీస్ యంత్రాంగం…
ఈ రోజు చీమకుర్తి దగ్గర రోడ్డు పరిస్థితి చూస్తుంటే ఇటు మనుషుల ప్రాణాలకు, అటు వాహనాల పటిష్టతకు పెను ప్రమాదం ఏర్పడింది…
జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న ఈ దురదుష్టకర పరిస్థితికి కారణం ఎవరైనా బాధితులు మాత్రం అందరూ…
ఈడి, సిబిఐ, విజిలెన్స్ చేత విచారణ జరిపించి మైనింగ్ మాఫియాకు ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే అడ్డుకట్ట వేయాలని,
మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాల నిప్రజా సంకల్ప వేదిక ద్వారా డిమాండ్ చేశారు.
👉 రాచర్ల మండలంలోని ఆరవీటి కోట, గంగంపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి షేక్. అబ్దుల్ రఫీక్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలో సాగు చేసినటువంటి ప్రధాన పంటలను సందర్శించడం జరిగింది, ప్రస్తుతం రెండు, మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వలన తగ్గునున్న పొలాలలో నీళ్లు నిలబడడం జరుగుతుంది కాబట్టి వెంటనే నిలబడినటువంటి నీరును బయటికి పంపవలెనని తెలిపారు, భూమిలో అధిక తేమ ఉండటం వలన మొక్కలు వేర్ల ద్వారా పోషకాలు తీసు కోలేవు కాబట్టి పై పాటుగా 19-19-19 లేదా 13-0-45 ఎకరాకు రెండు కేజీలు పిచికారి చేయవలెనని తెలిపారు, అలాగే ప్రస్తుతం కంది పంట కళ్ళే దశలో ఉందని శనగపచ్చ పురుగు మరియు మరూక మచ్చల పురుగు గుడ్లు పెట్టకుండా వేప నూనె 5 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేయవలెనని తెలిపారు అనంతరం గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సభలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించి 25% రాయితీపైన పప్పు శనగ విత్తనాలు ఇస్తున్నట్లు తెలిపారు కావాల్సినటువంటి రైతులు రైతు సేవ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు, అనంతరం వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్నటువంటి వివిధ రకాల పథకాలు గురించి రైతులకు వివరించడం జరిగింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ యన్. మోహన్ కృష్ణ మాట్లాడుతూ 90 % రాయితీపై చిన్న సన్న కార్ రైతులకు డ్రిప్పు అందిస్తున్నట్లు తెలిపారు, 55% రాయితీపైన స్ప్రింకలర్స్ అందిస్తున్నట్లు తెలిపారు కావాల్సినటువంటి రైతులు రైతు సేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ వాసం. ప్రీతి మాట్లాడుతూ పాడిలోని సమస్యలను అధిగమించి ఎక్కువ లాభాలు ఏవిధంగా పొందాలో రైతులకు వివరించడం జరిగింది, పశుసంవర్ధక శాఖ నుండి అమలవుతున్నటువంటి వివిధ పథకాలను గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి. సంపత్ కుమార్, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎన్. మధు శంకర్, పి. శ్రీలక్ష్మి గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది.

7k network
Recent Posts

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు