కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర .. మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టాం సీఎం రేవంత్..”మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుంది..మంత్రి జూపల్లి..”పంటలుపరిశీలించిన రైతు,కౌలురైతు సంఘాల నాయకులు..పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు..”చట్టాన్ని ఉల్లంఘించిన విద్యాసంస్థల యాజమాన్యాలపై ఫిర్యాదు చేయండి- ది పేరెంట్స్ కమిటీ ఆఫ్ ఎపి

👉 ఘనంగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర.. హైదరాబాద్: చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
👉 కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర..
ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారు.. సీఎం
రేవంత్ రెడ్డి..
తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు
హైదరాబాద్‌ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు
మా ప్రభుత్వం అలాంటి వారి భరతం పడుతుంది-సీఎం
హైడ్రా అనగానే కేటీఆర్, హరీష్‌రావు, ఈటల బయటకు వచ్చారుమూసీ మురికిలోని పేదలను ఆదుకోవడానికి యత్నిస్తున్నాం.బుల్డోజర్లు సిద్ధం చేశా..ఎవరు వస్తారో రండి-సీఎం..ఫామ్ హౌస్‌లపై బుల్డోజర్లు వస్తాయనే భయంతో..
కేటీఆర్, హరీష్‌రావు నాటకాలు ఆడుతున్నారు
వాళ్ల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికే
మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరు- రేవంత్
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజులు..
హరీష్‌రావు మర్చిపోయారా-సీఎం రేవంత్.
👉 మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు.
🔹 మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును మాజీ మంత్రి గీతారెడ్డికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపడటానికి చేపట్టిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రను స్పూర్తిగా తీసుకుని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగుతామన్నారు.
🔹 ట్రాఫిక్ నియంత్రణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుషితాలను నిలుపుదల చేయడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించడం వంటి ఎన్నో ప్రజాసౌలభ్యాల కోసం హైడ్రా పనిచేస్తుందని, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు, 111 జీవోను ఉల్లఘించిన వారు మాత్రమే హైడ్రాను చూసి భయపడుతున్నారన్నారు.
🔹 మదపుటేనుగులను అణచడానికి అంకుశం తరహాలో హైడ్రా పనిచేస్తుంది. అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సామాన్యులకు అండగా ఉంటా మన్నారు.మూసీ పునరుజ్జీవం, హైడ్రాను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మురికికూపంలో నలిగిపోతున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించి వారి పిల్లలకు మంచి చదువులు అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని, హైదరాబాద్ నగరంలోని బోజగుట్ట ప్రాంత వాసుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు…
👉మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుంది..మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా..మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుందని,మూసీ పరీవాహక ప్రాంత వాసులు డబుల్‌ బెడ్రూం ఇళ్లల్లోకి వెళ్లొద్దా.? రాజకీయ బాధ తప్పితే కేటీఆర్‌కి ఇంకో బాధ లేదు. గతంలో హరీష్‌రావు మంత్రి అయ్యిందే కాంగ్రెస్‌ భిక్షతోని. ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యావు.. అదేనా నీ జ్ఞానం అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు.
👉గిరిజన క్రీడల ఎంపికల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు …
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలో గవర్నమెంట్ TW AHS కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాల మైదానంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి గిరిజన క్రీడల ఎంపికల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , ఐటిడిఏ పి ఓ . రాహుల్ .
మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలి. క్రీడలో ఆడడం వల్ల యువతకి ఆరోగ్యానికి మంచిది.
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు చేతుల మీదుగా క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.. తెలంగాణ ఇన్చార్జ్ హైదరలి..
👉 ఎలిమెంటరీ స్కూలును సందర్శించిన మంత్రి లోకేష్..*నెహ్రూబజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ*
విశాఖపట్నం: విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేష్… కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎబిసిడి లు, రైమ్స్ వచ్చా అని అడగ్గా… వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి లోకేష్ ఫోటో దిగారు.
*గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ.
అంతకుముందు నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ… 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో
పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
👉పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.. గిద్దలూరు విద్యుత్ కార్యాలయం దగ్గర పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది.
*సిఎస్పురం మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ కార్యకర్తలు అనంతరం అర్జీ సమర్పించారు..”ప్రకాశం జిల్లా ఇన్చార్జి షేక్ ఫయాజ్”
*ముండ్లమూరులో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో చార్జీలు పెంచడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
*ప్రజలపై విద్యుత్ సర్ధుబాటు ఛార్జీలు 8,113 కోట్ల రూపాయలను రద్దు చేయాలని దరిశి విద్యుత్ EE ఆఫీసు వద్ద నిరసన తెలిపి అధికారులకు సిపియం నాయకులువినతిపత్రం అందజేశారు.
*సంతనూతలపాడు లో జరిగిన నిరసన కార్యక్రమం.
*విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలని విద్యుత్ కార్యాలయం ముందు నిరసన….. టంగుటూరు..
*ప్రజలపై విద్యుత్తు బారాలు వేయడాన్ని ఉపసంహరించు కోవాలని హనుమంతునిపాడు మండలం లోని తిమ్మారెడ్డిపల్లి సబ్ స్టేషన్ దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేశారు.
*ప్రజలపై విద్యుత్ బారాలు ఉపసంహరించుకోవాలని కొండేపి మండలం లోని ఆర్టీసీ డిపో వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం జరిగినది
*మార్కాపురం..పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎలక్ట్రికల్ డి ఈ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది

👉పామూరు.. ట్రూ of చార్జీలను, ఇధనం ఆ దనపు అదన చార్జీలను, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ..రాష్ట్ర ప్రజల మీద విద్యుత్తు బారాలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు
👉 మాగాణికి అపార నష్టం..అడుగుఅడగున గండ్లు..
నీటిలోనే పంటలుపరిశీలించిన రైతు,కౌలురైతు సంఘాల నాయకులు..మరల అల్పపీడనం ఆందోళనలో రైతులు
ప్రకాశం జిల్లా.నాగులుప్పలపాడు
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు వరదలు వచ్చి మాగాణి భూములు ముంచెత్తాయి.దాంతో వారంరోజుల నుండి నీటిలోనే ఉన్నాయి. దాంతో వేసిన పంటలన్ని పూర్తిగా కుళ్ళీపోయి దెబ్బతిన్నాయి దాదాపు కొమ్మమూరు కాలువ కొత్తకాలువ పరిదిలో ఘమారు 1500ఏకరాల్లో నాట్లు వేసారు ఏకరానికి ఈపాటికే 25వేల రూపాయలు పెట్టుబడి అయ్యిందని రైతులు తెలిపారు పెట్టిన పెట్టుబడి ఓక్క రూపాయి కూడ తిరిగిరాదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు దాంతో పాటు కొత్తకాలువకు నాలుగు చోట్ల పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి దాంతో ఆవరదనీరు ప్రక్కనే ఉన్న మురుగుకాలువ పూడికతో ఉండి వరదనీరు పోయే మార్గం లేక ఆవరదనీరు అంతా పొలాలపై ప్రవహించిందని తెలిపారు పడినగండ్లు వెంటనే పూడ్చక పోతే తిరిగి మరలా నాట్లువేసే పరిస్దితి లేదన్నారు ఈనేపద్యంలో మిర్చి పంట కూడ భయటపడినప్పటికీ నేలఆరితేగాని వాటిపరిస్దితి అర్దంకాదని రైతులు అంటున్నారు మరలా అల్పపీడనం ఉందని చెప్పడంతో రైతులు అవికూడ దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు ఈనేపద్యంలో శనివారం ఉప్పగుండూరులో కొత్తకాలువ పరిదిలో దెబ్బ తిన్న మాగాణి భూములను కాలువలకు పడిన గండ్లును రైతుసంఘం,కౌలురైతు సంఘాల నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు ఈసందర్బంగా రైతుసంఘం జిల్లాఅద్యక్షులు జె జయంతిబాబు, కౌలురైతుసంఘం జిల్లాఅద్యక్షులు ఎస్ కె మాబు మాట్లాడుతూ వాయుగుండం ప్రభావంతో రైతులు రెండు విదాలుగా నష్టపోయారన్నారు ఒకప్రక్క వరదలతో పంటలన్ని నీటమునిగి నేటికి నీరు భయటకు పోక పూర్తిగా దెబ్బతిన్నారన్నారు మరోప్రక్క కాలువలకు గండ్లుపడి నష్టపోయారన్నారు ఈకాలువల పరిదిలో ఘమారు 1500ఎకరాల్లో నాట్లువేసారన్నారు ఎకరానికి 25వేల పెట్టుబడి పెట్టారని తిరిగి ఓక్కరూపాయి కూడ తిరిగి రాక కోట్లాది రూపాయలు నష్టపోయారన్నారు దాంతో పాటుగా ప్రక్కనే ఉన్న మురుగు కాలువ పూడికతో నిండుకొని వరదనీరు పోయేమార్గంలేక ఆనీరుంతా పొలాలపైపడి ముంచెత్తున్నారు అదేవిదంగి 216జాతీయరహదారి నిర్మాణంలో డైనెజి సౌకర్యం కల్పించక పోవడంతో ఆవరదనీరు పొలాలపైపడి ప్రతిసారి నష్టపోతున్నారు గతఏడాదికూడ నష్టపోయారని మురుగు కాలువ పూడికతీయాలని పలుమార్లు అదికారుల దృష్టికి తీసుకువెళ్ళిన పరిష్కారినికి నోచుకోలేదన్నారు అదేవిదంగా కొత్తకాలవకు పలుచోట్ల గండ్లుపడి మరింత నష్టపోయారన్నారు ఆగండ్లు తక్షణమే పూడ్చకపోతే తిరిగి వ్యవసాయం చేసుకొనే పరిస్దితి లేదని తెలిపారు ఈనేపద్యంలో పడిన గండ్లు యుద్దప్రాతికపదికన పూడ్చాలని దెబ్బతిన్న పంటలను పూర్తిస్దాయిలో ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహరం అందించి తిరిగి వ్యవసాయం చేయడానికి ఆర్దికసాయం అందించాలని డిమాండ్ చేసారు.ఈకార్యక్రమంలో రైతుసంఘం మండల అద్యక్షులు జి బసవపున్నయ్య, కౌలురైతుసంఘం జిల్లా సహయకార్యదర్శి టి శ్రీకాంత్ , రైతులు మాదాసు నాగేశ్వరరావు, పెంట్యాల వెంకటేశ్వర్లు, బెల్లం బాబురావు, నల్లూరి బాస్కరరావు, అత్తంటి సురేష్ , బెల్లం వెంకటరత్నం, దేవరకొండ వెంకటేశ్వర్లు, నరేంద్ర ,శాంతారావు, తదితరులు ఉన్నారు.

*”విద్యా హక్కు చట్టం 2009…మన పిల్లల హక్కు “*
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్…
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో 25,125 మంది పిల్లలకు విద్యా హక్కు చట్టం (RTE), 2009 కింద ఉచిత విద్య అందించబడుతుంది…
RTE చట్టంలోని సెక్షన్ 12(సి) ప్రకారం, ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలలు బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి. ఫస్ట్ క్లాస్ లేదా ప్రీ-స్కూల్ మొత్తం బలంలో కనీసం నాలుగింట ఒక వంతు ఉచిత విద్యను అందించాలి.
చట్టాన్ని ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఏదైనా పాఠశాల అడ్మిషన్ నిరాకరించడం, ఏరకమైన ఫీజు వసూలు చేయడం ఒత్తిడి చేయడం లేదా RTE చట్టం అమలుకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకున్న తల్లిదండ్రులు..
@AP స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్
CH76+2H8, NH 16 సర్వీస్ Rd, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ 522503
మెయిల్ ఐడి apscpcr2018@gmail ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. మరియు
@ నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్5వ అంతస్తు, చందర్‌లోక్ బిల్డింగ్, 36 జనపథ్, న్యూ ఢిల్లీ-110001. ……..ఫ్యాక్స్ : 011-23724026
ఫిర్యాదు కోసం: www.ebaalnidan.nic.in ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)ఆంధ్ర ప్రదేశ్ కమిటీ. ప్రకాశం జిల్లా ఇన్చార్జ్ షేక్ ఫయాజ్..

7k network
Recent Posts

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు