👉 భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..
ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
నవంబర్ 11న కొత్త సీజేఐ ప్రమాణస్వీకారం..
ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్.
👉ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు*
వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్ను ప్రమాణికంగా తీసుకుంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం నిర్ణయించేందుకు ఆధార్ను ప్రమాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గడంపై ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.
👉 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గురువారం విశాఖ, విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఆస్తుల పంపకం వ్యవహారంతో తల్లి, చెల్లిపై జగన్‌కు ఎంత ప్రేమ ఉందో వెల్లడైందని చెప్పారు. రాష్ట్రంలో ‘అమ్మ, చెల్లి వద్దు’ అనే సినిమా నడుస్తోందన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయని వారు రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు ఎలా విలువిస్తారని ప్రశ్నించారు. సీఎం కుర్చీకోసం సొంత బాబాయినే హత్య చేయించారని ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విజయలక్ష్మికి, షర్మిలకు రక్షణ కల్పిస్తామన్నారు.
👉ఏపీలో పింఛన్లపై మరో శుభవార్త.. ఇకపై సులభంగా!
ఏపీలో పింఛన్లపై మరో శుభవార్త.. ఇకపై సులభంగా!
ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లకు సంబంధించి ఆరంచెల విధానం అమలు చేశారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ విధానం తలనొప్పిగా మారింది. ఈ విధానాన్ని చంద్రబాబు సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ నెలాఖరులోపు ఈ దరఖాస్తుల్ని ఫైనల్ చేసి జనవరి నుంచి పింఛన్లను అందించనున్నారు.
👉న్యాయదేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్..
న్యాయ దేవత విగ్రహం, సర్వోన్నత న్యాయస్థానం చిహ్నంలో మార్పులపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.బార్‌ను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈమేరకు బార్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దానిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్‌సిబల్ తదితరులు సంతకాలు చేశారు.
👉 ఫ్యాన్ కు ఉరి వేసుకొని లాయర్ ఆత్మహత్య ???
అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డు లో రుక్సానా (27) అనే అమ్మాయి ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది. రుక్సానా జూనియర్ లాయర్ గా అనంతపురం కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంది. మృతురాలి సొంతవూరు సత్యసాయి జిల్లా రాం పురం గ్రామం కాగా..రెండు సంవత్సరాల క్రితం అనంతపురం వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతి పై అనంతపురం టు టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లాయర్ మృతిపై అనుమానం!?
2024 – 27 ఏళ్ల జూనియర్ లాయర్ రుక్సానా మరణం, మొదట ఆత్మహత్యగా నివేదించబడింది, దృశ్య సాక్ష్యం మరియు తదుపరి దర్యాప్తు ఆధారంగా ఫౌల్ ప్లే అనుమానాలు లేవనెత్తింది. ఈరోజు అనంతపురం కోర్టు రోడ్డులోని తన నివాసంలో రుక్సానా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది.
సత్యసాయి జిల్లా రాంపురం గ్రామానికి చెందిన రుక్సానా స్థానిక కోర్టులో న్యాయవాద వృత్తి చేసేందుకు రెండేళ్ల క్రితం అనంతపురం వెళ్లింది. ఆమె శ్రద్ధగల మరియు అంకితమైన వృత్తినిపుణురాలిగా న్యాయ సంఘంలో ప్రసిద్ధి చెందింది.
అయితే, నేరస్థలం మరియు ఇంటి నుండి ప్రారంభ విజువల్స్ యొక్క వివరణాత్మక తనిఖీ తర్వాత, పరిశోధకులు ఇప్పుడు హత్య యొక్క అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. విజువల్స్‌లో గమనించిన కీలక సంకేతాలు, మృతదేహం మరియు ఇతర ఆధారాలతో సహా అనంతపురం టూ టౌన్ పోలీసులు ఫౌల్ ప్లే అనుమానిస్తున్నారు.
అధికారులు ఇప్పుడు కేసును సంభావ్య హత్యగా పరిగణిస్తున్నారు మరియు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మరియు పొరుగువారిని ప్రశ్నించే ప్రక్రియలో ఉన్నారు. విచారణకు సహకరించేందుకు ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. ఈ ఘటనపై న్యాయవాద సంఘం ఆందోళన వ్యక్తం చేసి, త్వరితగతిన, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దర్యాప్తు ముదిరిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు భావిస్తున్నారు.
👉విశాఖ శారదా పీఠానికి మరో బిగ్ షాక్ 😱
*తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాలకు అనుమతులు రద్దు చేసింది.*
*గత ప్రభుత్వ హయాంలో తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో భూమి లీజుకు ఇచ్చారు.*
*అయితే, నిబంధనలు అతిక్రమించారంటూ*
*అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు*
*జారీ చేశారు.*నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు.*
👉రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వేదాంత గ్రూప్ కంపెనీ సెరెంటికా గ్లోబల్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌శాఖ మంత్రి లోకేశ్‌కు ప్రతిపాదన చేశారు. గురువారం ముంబైలోని ఆ సంస్థ కార్యాలయంలో మంత్రి లోకేశ్ వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తమ సంస్థ ఏపీలో 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు లోకేశ్‌కు వివరించారు. 2030 నాటికి రాష్ట్రంలో 72 గిగావాట్ల పునరుద్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్య సాధనలో సెరెంటికా భాగస్వామి అవుతుందని మంత్రి వెల్లడించారు.
👉దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత* దెందులూరు. ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19టన్నుల రేషన్ బియ్యం పట్టివేత..18లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు సీజ్..పల్నాడు జిల్లా కు చెందిన బాలినేని తేజ , వెల్పుర్ల వాసు లపై కేసు నమోదు.
👉 జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఆర్మీ వాహనంపై దాడి.ఇద్దరు సైనికులు,ఇద్దరు పౌరులు మృత్యువాత
బారాముల్లాలో భద్రతా బలగాలు-ముష్కరుల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్..తీవ్రవాదుల దుశ్చర్యలపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు. ఎల్‌వోసీకి సమీపంలో ఉండే బొటాపత్రి ప్రాంతంలోని నాగిన్ పోస్ట్‌కి దగ్గరలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు ఇద్దరు పౌరులు చనిపోయారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు (సహాయ కార్మికులు) మృత్యువాతపడ్డారు. వైద్య కోసం తక్షణమే హాస్పిటల్‌కు తరలించాం. ఎన్‌కౌంటర్ పురోగతిలో ఉంది’’ అని పేర్కొంది.ఈ ఘటన ఉగ్రవాదుల చొరబాట్లపై ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దులో చొరబాట్లు మళ్లీ మొదలయ్యాయని ఆర్మీ మూలాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి బలగాలు నిఘాను పెంచాయి. నిజానికి ఈ ప్రాంతమంతా ఆర్మీ ఆధీనంలోనే ఉంటుంది. వేసవి ప్రారంభంలో ఒక ఉగ్రవాద గ్రూపు భారత్‌లోకి చొరబడి అఫ్రావత్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలలో దాగినట్టు గతంలో రిపోర్టులు వెలువడ్డాయని ఆర్మీ అధికారులు చెప్పారు.
కాగా ఉగ్రవాదుల దుశ్చర్యపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ లోయలో ఇటీవల వరుస ఉగ్ర దాడులు జరుగుతుండడం కలవరపరుస్తోందని ఆయన అన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని బొటాపత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి చాలా దురదృష్టకర వార్త అని అన్నారు. మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ దాడిని ఖండించారు.
కాగా గత ఐదు రోజుల వ్యవధిలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండవ ఉగ్రవాద దాడి ఇది. గత ఆదివారం గందర్‌బల్ జిల్లాలో గగాంగీర్ ప్రాంతంలోని జెడ్-మోర్ సొరంగం నిర్మాణ స్థలంలో కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు, ఒక డాక్టర్ చనిపోయిన విషయం తెలిసిందే.👉 ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుండి దేశంలో ఉగ్రవాద దాడులు, ఆలయాల పై దాడులు విగ్రహాలపై దాడులు ఎక్కువయ్యాయి గమనించాల్సిన విషయమే..
👉పక్కా ఆధారాలు.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి..
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయని ..
గత ప్రభుత్వంలోని కీలక నేతలు జైలుకే..
స్కాంల్లో ఒకటి దీపావళిలోపే పేలుతుంది..
బీఆర్‌ఎస్ ముఖ్యుల అక్రమాలపై ఫైళ్లు సిద్ధం..
ఎవరినీ వదలం.. సినిమా ముందుంది..
మీరు హైదరాబాద్‌లో దిగేటప్పటికే సంచలనం..
కొరియాలో మీడియాతో మంత్రి పొంగులేటి..
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయని బుధవారం ప్రకటించిన పొంగులేటి.. గురువారం నాటి సియోల్ పర్యటనలోనూ ఈ అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ప్రముఖులకు సంబంధించిన ఫైళ్లు సిద్ధం అయ్యాయన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందన్నారు. మీరు సియోల్ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే (26వ తేదీ ఉదయం) కొన్ని బాంబులు పడతాయని మీడియా ప్రతినిధులతో చెప్పారు. అన్నింటికీ పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఫోన్‌ట్యాపింగ్, ధరణి, భూ అక్రమాలు, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారని.. వీటిలో ఏదో ఒకటి దీపావళికి ముందే పేలుతుందని తెలిపారు. అక్రమార్కులను ఎలా శిక్షించాలన్నది చట్టం చూసుకుంటుందన్నారు. కుంభకోణాలు, అవినీతిలోని ఆస్తుల రికవరీని కూడా చట్టమే చూసుకుంటుందని చెప్పారు. ఇందులో తమ నిర్ణయం ఏమీ ఉండదన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లా చట్టాలను అతిక్రమించి సంపాదించారని ఆరోపించారు. మాజీ మంత్రులు, వారి తొత్తులు మూసీ వెంట కబ్జాలు చేశారని, అవి ఖాళీ చేయిస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని నటిస్తున్నారని ధ్వజమెత్తారు.
బావ, బావమరిది ఇద్దరూ పబ్లిసిటీతో పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. చట్టాలు ఉల్లంఘించి చేసిన పనుల రికార్డులను సిద్ధం చేశామని.. రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి పేర్కొన్నారు. ఎవరూ తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో ముందుకెళ్తు న్నామని చెప్పారు. ఇప్పటి వరకు సాక్ష్యాల ధ్రువీకరణ కోసం ఆగామని.. అసలు సినిమా ముందుందని అన్నారు.
భూ అక్రమాల కేసేనా?
ఏ కేసులో రాష్ట్ర ప్రభుత్వం బాంబులు పేలుస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ధరణి–భూముల అక్రమాలకు సంబంధించిన అంశాలనే వెలుగులోకి తెచ్చి కేసులు పెడతారని సమాచారం. ధరణి చట్టం వచ్చాక అనేక భూ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంలో సీసీఎల్‌ఏ స్థాయిలో క్లియర్ చేయాల్సిన కొన్ని భూములకు సంబంధించిన అంశాలను.. కలెక్టర్ల స్థాయిలోనే చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ధరణి వ్యవహారాలను ఒక ప్రైవేటు సంస్థ టెరాసిస్‌కు ఇచ్చి, దాన్ని అడ్డుపెట్టుకుని కూడా కొన్ని లావాదేవీలు అక్రమంగా చేశారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
👉హైదరాబాద్‌లో బిచాన ఎత్తేసిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ..!..స్క్వేర్ అండ్ యార్డ్స్ ఫామ్‌హౌస్ విల్లాల పేరుతో భారీ మోసం..స్క్వేర్ అండ్ యార్డ్స్ యాజమాన్యంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు..
స్క్వేర్ అండ్ యార్డ్స్ యజమాని బైరా చంద్రశేఖర్ అరెస్ట్.. బైరా చంద్రశేఖర్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌస్‌లో విల్లాల పేరుతో డబ్బులు వసూలు..రూ.24 కోట్లు వసూలు చేసి చేతులెత్తేసిన బైరా చంద్రశేఖర్.. ఫామ్‌హౌస్, విల్లా కోసం పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మోసం…
👉హైదరాబాద్: డ్రగ్స్‌పై ప్రభుత్వం సరికొత్త తరహా యుద్ధం..!..ప్రభుత్వ ఉద్యోగులను డ్రగ్ సోల్జర్స్‌గా నియమించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లు, ప్రిన్సిపల్, రెవెన్యూ అధికారులతో సోల్జర్స్ నియామకం..
పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలతో కమిటీలు..డ్రగ్ సోల్జర్స్‌కు శిక్షణ
*👉కడప సిడిపిఓ ను సస్పెండ్ చేయాలి*
*అంగన్వాడి వర్కర్ రజిని..
అనారోగ్యానికి కారణమైన కడప సిడిపిఓ ను సస్పెండ్ చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి పి. వెంకటసుబ్బయ్య ప్రెసిడెంట్ పి చంద్రారెడ్డి లు ఒక సంయుక్త ప్రకటనలో డిమాండు చేశారు. ఆరోగ్యం బాగాలేక జి జి హెచ్ హాస్పటల్ లో అడ్మిట్ అయిన రజనీని అంగన్వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, అంజలీదేవి,వినీల తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటసుబ్బయ్య చంద్రారెడ్డిలు మాట్లాడుతూ అర్బన్ సిడిపిఓ సునందకుమారి వేధింపుల వల్ల భయభ్రాంతులకు గురై గత ఐదు రోజుల నుండి జ్వరముతగ్గలేదని తెలిపారు. గుండెకు సంబంధించిన నొప్పి రావడం వల్ల మరింత భయానికి లోనై గుండెకు సంబంధించిన ఇబ్బంది వస్తుందేమో అనే భయంతో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగిందన్నారు.
కడప అర్బన్ లో పనిచేస్తున్న అంగన్వాడి కార్యకర్తల ఆయాల పైన సిడిపిఓ సునంద చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారనీ కడప నగరంలో ఉండే సున్నపు బట్టిలు 1 సెంటర్లో పనిచేస్తున్న కార్యకర్త సీఎస్ రజనీ సెంటర్ ను ఈనెల 19వ తేదీన పర్యవేక్షణ పెరుతో వెళ్లి వర్కర్లను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిందని తెలిపారు. బాలింతలకు గర్భిణీలకు ఇచ్చే పౌష్టి కహారం అయిన రాగి పిండి కాలం చెల్లినవి ఇచ్చిన సిడిపిఓ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం అని తెలిపారు. కార్యకర్త ఈనెల 6 తేదీన మాకు పౌష్టికాహారం అందినది మేము వేసిన కాంట్రాక్టర్ వారికి తెలియజేసిన మా మాట వినకుండా వెళ్లిపోయారు. డేట్ అయిపోయిన వి సప్లై చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా వర్కర్ల ను బెదిరించడం దాడి చేయడం దారుణమని తెలిపారు.
కడప అర్బన్ సిడిపిఓ పైన అంగన్వాడి పిడి కి చాలాసార్లు వారిపైన కంప్లైంట్ చేసినా కూడా పట్టి పట్టనట్టు పిడి వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. ఇప్పటికైనా కడప అర్బన్ సిడిపిఓ పైన ఎంక్వైరీ కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలని వారు తెలియజేశారు. అలాగే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సిడిపిఓ ను సస్పెండ్ చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
👉ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే, వారి మీద పిడి యాక్ట్ ప్రయోగిస్తాం మంత్రి కొల్లు రవీంద్ర*
మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక విధానంలో జరుగుతున్న మార్పులు, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పిదాలు, మరియు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు.గత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్ దళారులు, మాఫియా ఇసుకను దోచుకున్నారని, ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకతతో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా, ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తరలింపు అవకాశాన్ని పునరుద్ధరించి, సీనరేజీ, డీఎంఎఫ్ వంటి రుసుములను రద్దు చేశారని తెలిపారు.
మాజీ ప్రభుత్వ తప్పిదాల కారణంగా NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) పెనాల్టీలు విధించిందని, అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఇసుక సరఫరాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, 35 లక్షల టన్నులు పారదర్శకంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇసుక రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాల కోసం మాత్రమే జరుగుతాయని, నిర్మాణ రంగానికి మరింత అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే, వారి మీద పిడి యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా…మర్రిపాడు*
*💥డిసీపల్లిలో ఎరువుల దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్ ఈశ్వర్ దాడులు*💥
నెల్లూరు జిల్లా డీసీ పల్లి లోని పలు ఎరువుల దుకాణాలపై దాడులు చేసిన మెట్రాలజీ శాఖ అధికారులు, ఈ సందర్భంగా ఒక షాప్ లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విత్తనాలు, పురుగుమందులు అమ్ముతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు…
👉కరీంనగర్ పట్టణంలో ఆపిల్ ఫోన్ కంపెనీ సింబల్ తో డూప్లికేట్ ఎయిర్ బర్డ్స్,పవర్ ఎడాప్టర్,లైటింగ్ కేబుల్ మరియు బ్యాక్ కవర్లు అమ్ముతున్నారని ఆపిల్ కంపెనీ ఏజెన్సీ వారు ఫిర్యాదు చేయగా అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని
*పంచరతన్ మార్కెటింగ్ షాప్, శ్రీ జి మొబైల్ స్పేర్ పార్ట్స్, మహాలక్ష్మి సెల్ వరల్డ్ మరియు చాముండా మొబైల్ షాప్ లపై రైడ్ చేసి డూప్లికేట్ వస్తువులను సీజ్ చేసి అట్టి షాపుల యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని కరీంనగర్ వన్ టౌన్ పి. యస్. ఎస్సై బిల్లా కోటేశ్వర్ తెలిపారు..
👉 హువాంగ్ ను కలిసిన నారా లోకేష్
ముంబైలోని జియోకన్వెన్షన్ లో జరిగిన ఏఐసమ్మిట్లో మంత్రి నారా లోకేష్ NVIDIA CEO జెన్సన్ హువాంగ్ను కలిశారు. ఈ మేరకు నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘హువాంగ్ను కలవడం ఆనందంగా ఉంది. NVIDIA ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థ. అమరావతిలో రాబోయే Al విశ్వవిద్యాలయం ఏర్పాటులో అతని మద్దతును కోరాను. మళ్లీ సమావేశానికి ఎదురుచూస్తున్నాను’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
👉 పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ పోలీసులు,ప్రభుత్వ అధికారులు న్యాయంగా, ధర్మంగా పని చేయండి.అంతే కాని మంత్రులు ఫోన్ చేశారని,కంత్రులు ఫోన్ చేశారని ఎక్కువ చేస్తే మిత్తితో సహా తిరిగిస్తాం – కేటీఆర్.
👉అనంతపురం : జిల్లా ఎస్పీ ఆదేశాలతో మట్కాపై ఉక్కుపాదం
*తాడిపత్రిలో అర్బన్ పోలీసుల ఆధ్వర్యములో దాడులు..ఒక మట్కా నిర్వకుడి అరెస్టు… రూ.3 లక్షల రూపాయలు,మట్కా చిటీలు స్వాధీనం
జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో తాడిపత్రి అర్బన్ పోలీసులు మట్కాపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రి పట్టణంలోని నందలపాడు ఏరియాలో మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో అర్బన్ సి.ఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడి లో చుక్కలూరు చాంద్ భాష అను మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి . అతని వద్ద నుండీ రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు అతనిపై కేసు నమోదు చేయడమైనది
👉ఐరాస సమావేశాలకు ఎంపీ శబరికి ఆహ్వానం
ఐరాస సమావేశాలకు ఎంపీ శబరికి ఆహ్వానం
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికాలో నవంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో దేశ ప్రతినిధిగా మాట్లాడే అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎంపీ బైరెడ్డి శబరి ధన్యవాదాలు తెలిపారు.
👉రాత్రివేళ నిద్రలేపి.. ఆస్పత్రిలో ఉన్న రోగులకు బీజేపీ సభ్యత్వం !!!🤭
ఆస్పత్రిలోని కంటి రోగులను ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్ర లేపాడు. మొబైల్ ఫోన్‌లో వారి వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యులుగా చేర్చుకున్నాడు. ఒక రోగి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో ఈ సంఘటన జరిగింది. రాజ్‌కోట్‌లోని రాంచోడ్ దాస్ ట్రస్ట్ హాస్పిటల్ వార్డులో కంటికి శస్త్ర చికిత్స కోసం సుమారు 350 మంది రోగులు ఉన్నారు. రాత్రివేళ వారు నిద్రిస్తుండగా ఒక వ్యక్తి ఆ వార్డులోకి వచ్చాడు. మొబైల్ ఫోన్‌లో వారి వివరాలు నమోదు చేశాడు. వారి మొబైల్‌కు ఓపీటీ వచ్చింది. ఆ తర్వాత ‘మీరు బీజేపీ సభ్యులయ్యారు’ అన్న మెసేజ్ అందింది. ఒక రోగి దీని గురించి నిలదీయగా ‘బీజేపీ సభ్యత్వం లేని వారిని ఎవరూ రక్షించరు’ అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. కాగా, ఆ వార్డులోని ఒకరు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షుడు గోర్ధన్ జడాఫియా దీనిపై స్పందించారు. ఈ సంఘటనకు తమ పార్టీ ప్రమేయం లేదని తెలిపారు. ప్రజలను ఈ విధంగా బీజేపీలోకి చేర్చుకోమని ఎవరినీ ఆదేశించలేదని చెప్పారు. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
👉ఈడీ మౌనానికి అర్థాలే వేరులే !‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరటే.. క్లీన్‌చిట్ ఇవ్వని దర్యాప్తు సంస్థ..పూర్తికాని విచారణ..అన్ని ఆప్షన్లూ బీజేపీ వద్దే.. అడకత్తెరలో పోకచెక్కలా ఏపీ సీఎం 😯😯😯
ఈడీ అధికారులు ఈ నెల 15వ తేదీన హైదరాబాదులో రూ.23.54 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశారు. ఇవి సీమెన్స్ ఇండిస్టీ సాఫ్ట్‌వేర్ అండ్ డిజైన్‌టెక్ సిస్టమ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్‌లకు చెందిన ఆస్తులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) కుంభకోణానికి సంబంధించి ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ కేసులోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం 53 రోజులు జైలులో గడిపారు. ఇదంతా గత చరిత్ర. అయితే రూ.371 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నదా లేదా అనే విషయంపై ఈడీ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. దర్యాప్తు సంస్థ నుండి అధికారిక ప్రకటన ఏదీ విడుదల కానప్పటికీ పలు మీడియా సంస్థలు, సీనియర్ పాత్రికేయులు ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చారు.
అయితే ఇదంతా బీజేపీ ‘వాషింగ్ మిషన్’ వ్యూహంలో భాగమేనని కొందరు విమర్శకులు వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి కేసులు ఎదుర్కొంటున్న నాయకులు ఎన్డీఏలో చేరగానే పునీతులవుతున్నారని, వారిపై ఉన్న కేసులన్నీ అటకెక్కుతున్నాయని వారు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
ఏమిటీ కేసు?..తాను రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశానని ఈడీ ఓ పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. అయితే చంద్రబాబు పేరును అందులో ప్రస్తావించలేదు. అదే సమయంలో ఆయన ప్రమేయంపై నిర్ధారణకు వచ్చానని కూడా చెప్పలేదు. 2002వ సంవత్సరపు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద సీమెన్స్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులు జప్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కోసం ఉద్దేశించిన నిధులను దుర్వినియోగం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే ఆస్తుల జప్తు జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 కాలంలో ఏపీఎస్ఎస్‌డీసీ ప్రాజెక్టును చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం దీనిని ఉద్దేశించారు. అయితే దీనికి కేటాయించిన రూ.371 కోట్ల నిధులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. పరికరాలు, సేవల పేరుతో సిమెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు, కొందరు కీలక వ్యక్తులు నిధులను పక్కదారి పట్టించారన్నది ప్రధాన అభియోగం.
ఈడీ ప్రకటనలో ఏముంది?
ఈడీ పత్రికా ప్రకటన నేపథ్యంలో దర్యాప్తు సంస్థ చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు ప్రమేయంపై ఈడీ మౌనం వహించడం అంటే ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పడమేనని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈడీ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతోంది ఏమిటంటే…ఇప్పటి వరకూ జరిగిన విచారణలో చంద్రబాబు ప్రమేయం ఏమీ కన్పించలేదని ఈడీ చెప్పింది. అదే సమయంలో విచారణ పూర్తయినట్లు ఆ ప్రకటనలో తెలుపలేదు. ఎన్డీఏతో దోస్తీ కారణంగానే చంద్రబాబుకు ఈ కుంభకోణంలో తాత్కాలిక ఊరట లభించి ఉండవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి నుండి బాబు బయటికి వస్తే పరిస్థితిలో మార్పు రావచ్చునని కూడా వారు చెప్పారు.
‘వాషింగ్ మిషన్’ వ్యూహం
గడచిన దశాబ్ద కాలంలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ పావులుగా వాడుకున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. బీజేపీతో చేయి కలపడమో లేదా చట్టపరంగా సవాళ్లను ఎదుర్కోవడమో తప్ప ప్రతిపక్ష నేతలకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరిన తర్వాతే వారిపై కేసుల విచారణ నెమ్మదించింది. కేసులు పూర్తిగా అటకెక్కిన ఉదంతాలూ ఉన్నాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌పై నమోదైన ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసు విచారణ ఆయన బీజేపీలో చేరగానే నిలిచిపోయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌పై నమోదైన సహకార బ్యాంక్ కుంభకోణం కేసు సైతం ఆయన బీజేపీ శిబిరంలోకి రాగానే కోల్డ్‌స్టోరేజీలో చేరింది. ఒకప్పటి టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిపై దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులు సైతం వారు బీజేపీ పంచన చేరగానే నీరుకారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డిపై ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని చూసి నత్త కూడా సిగ్గు పడుతోంది. జగన్ ఎన్డీఏకు ‘అనధికారిక భాగస్వామి’గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
చక్రబంధంలో చంద్రబాబు
కేంద్రంలో చంద్రబాబు కింగ్‌మేకర్ అని, మోడీ దూకుడుకు ఆయన కళ్లెం వేస్తారని రాజధానిలోని పలువురు పరిశీలకులు తొలుత భావించారు. అయితే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు కేంద్ర నిధులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు ఏటా రూ.1.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో మోడీని ప్రసన్నం చేసుకోవడం మినహా చంద్రబాబుకు మరో దారి లేకుండా పోయింది. తిరుపతి లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయడం ద్వారా బీజేపీ ఇప్పటికే ఏపీలో పునాదులు వేసుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీకి అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ‘సనాతన ధర్మం’ వాదాన్ని తలకెత్తుకున్నారు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేవే. ఈడీ కేసు విచారణను సజీవంగా ఉంచడం ద్వారా చంద్రబాబును, టీడీపీని బీజేపీ అదుపులో ఉంచవచ్చు. ఏదేమైనా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
టీడీపీ సైతం…
ఆశ్చర్యకరమైన విషయమేమంటే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించడం. పార్టీ ప్రతినిధులు అప్పుడప్పుడు చంద్రబాబు నిర్దోషిత్వాన్ని గురించి చెబుతున్నప్పటికీ ఈడీ ప్రకటన తర్వాత విజయోత్సవ పత్రికా గోష్టులు, సమావేశాలు జరగలేదు. ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ స్పష్టం చేయకపోవడమే దీనికి కారణం. మున్ముందు జరిగే విచారణలో చంద్రబాబు ప్రమేయం బయటపడినా, లేదా విచారణ కొత్త రూపు తీసుకున్నా ఇబ్బందులు తప్పవన్న భావనతోనే టీడీపీ ఎలాంటి సంబరాలు జరుపుకోలేదు.
ఈడీ మౌనానికి అర్థాలే వేరులే !‘స్కిల్’ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరటే.. విశాఖ శారదా పీఠానికి మరో బిగ్ షాక్. రాత్రివేళ నిద్రలేపి ఆస్పత్రిలో ఉన్న రోగులకు బీజేపీ సభ్యత్వం !..జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించాం- హోంమంత్రి అనిత. ..కడప సిడిపిఓ ను సస్పెండ్ చేయాలి.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి.. న్యాయదేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం .. జమ్ము కాశ్మీర్లో మరో ఉగ్రదాడి.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని లాయర్ ఆత్మహత్య..డ్రగ్స్‌పై ప్రభుత్వం సరికొత్త తరహా యుద్ధం..హైదరాబాద్‌లో బిచాన ఎత్తేసిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ..ఆపిల్ ఫోన్ కంపెనీ సింబల్ తో నకిలీ విక్రయాలు
Recent Posts