అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్?..జనసేన Vs టీడీపీ..సైబర్ నేరాలకు అడ్డాగా భారత్.. రంగంలోకి డిప్యూటీ సీఎం..టపాసులు పంపిణీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ సతీమణి ..ఏపీలో లిక్కర్ స్కామ్ పై .. CID సోదాలు..ఒక మహిళ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..ఎల్ కోట పాఠశాలను సందర్శించిన ఎంపీడీఓ..ఆస్తి కోసం తన కొడుకునే హత్య చేపించిన కసాయి తల్లి..నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు..కాలి బూడిద అయిన ద్విచక్ర వాహనం

👉జనసేన Vs టీడీపీ.. రంగంలోకి డిప్యూటీ సీఎం..
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. జనసేన, టీడీపీ నేతల మధ్య వరుస ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం రోజు పైడిచింతపాడులో టీడీపీ, జనసేన వర్గాలు మరోసారి గొడవపడ్డాయి. దాంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. శుక్రవారం పవన్ దెందులూరులో పర్యటించి జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ని కలిసి సమస్యలు తెలుసుకోనున్నారు.

👉అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్???*
ఏపీలో అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ ఆసక్తి
కనబరుస్తున్నట్లు సమాచారం. మొదటి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదన అందించినట్లు తెలుస్తోంది. ప్లాంట్ నిర్మాణానికి 2 వేల ఎకరాలు అవసరమని, 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇది పూర్తయితే 20 వేల మందికి : పేలిన టపాసులు.. 👉ఢిల్లీని కమ్మేసిన పొగ(వీడియో)
దీపావళి బాణాసంచా పేలుళ్ల తర్వాత శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీని పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఢిల్లీలో బాణసంచా నిషేధం ఉన్నప్పటికీ గురువారం(అక్టోబర్ 31) రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. ఈ మేరకు రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AQI) శుక్రవారం ఉదయం 395గా నమోదైంది.ఈ గాలి పీల్చుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు.
👉పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు 4+4 భద్రత కల్పించాలని కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌, విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు, ఏసురత్నం తదితరులు డీజీపీ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణలో షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. దాన్ని రాష్ట్రంలోనూ కొనసాగించాలి.రాజకీయంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో వై కేటగిరి…4+4 భద్రత కల్పించాలి’అని వారు కోరారు.
👉 టపాసులు పంపిణీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ సతీమణి కుమారి..
సత్తెనపల్లి పట్టణంలోని పరివర్తన ఆశ్రమంలోని చెవిటి, మూగ, మానసిక వికలాంగులు పిల్లల అందరికీ కలిపి, సుమారుగా అక్కడ ఉన్న 30 మందికి, *వారి కళ్లలో ఆనందం నింపేందుకు మానవతా దృక్పథం,సహృదయంతో ముందుకు వచ్చి,అందరూ పండుగు చేసుకొనేలా టపాసులు స్వయంగా అందించిన పల్నాడు జిల్లా ఎస్పీ సతీమణి కంచి కుమారి.*ఆమె అక్కడ ఉన్న పిల్లలుతో ఆనందకరంగా గడిపారు.అనంతరం వారి సైగలతో ఎస్పీ సతీమణికి తిరిగి వెళ్లేపుడు ప్రత్యేకంగా అభినందలు తెలిపారు.*
ఈ కార్యక్రమంలో పట్టణ యస్ఐ సంధ్య,మహిళా సిబ్బంది ఆశ్రమ నిర్వహకులు ఉన్నారు.
👉సైబర్ నేరాలకు అడ్డాగా భారత్*
2024 సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లను సైబర్ నేరగాళ్లు దేశ ప్రజల నుంచి కొల్లగొట్టారు.జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో 7.4లక్షల కేసులు నమోదు అయ్యాయి.’ప్రహర్’ సంస్థ ఒక నివేదిక
‘ది ఇన్విజబుల్ హ్యాండ్’ను ప్రచురించింది.’2033 నాటికి భారత్ లక్ష కోట్ల సైబర్ దాడులను ఎదుర్కొంటుంది. 2047 నాటికి ఆ సంఖ్య 17లక్షల కోట్లకు చేరుకుంటుందని’ నివేదికలో పేర్కొంది.
👉ఏపీలో లిక్కర్ స్కామ్ పై .. CID సోదాలు*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పై సిఐడి దూకుడు పెంచింది. బుధవారం సీఐడి ఏకంగా 18 ప్రాంతాల్లో సోదాలును నిర్వహించింది. కీలక రికార్డులను సీఐడిఅధికారులు స్వాధీనం చేసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం కుంభకోణం పై దర్యాప్తు చేయాలని సీఐడి కి అప్పగించింది.
👉వామ్మో ..ఎంత ఘోరం …ఒక మహిళ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఎంతకీ దారి తీసిందో తెలుసా?*..కాకినాడ జిల్లా..
గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, శలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతిచెందారు.
గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శలపాక గ్రామం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
కాకినాడ సర్కిల్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఆయన ఏర్పాట్లు చేశారు.
కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రఘవీర్ విష్ణు, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కాకినాడ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంఘటన స్థలం వద్దకు చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
👉 ఆస్తి కోసం తన కొడుకునే హత్య చేపించిన కసాయి తల్లి..పల్నాడు జిల్లా… క్రోసూరు మండలం హస్సనాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఆస్తి కోసం…తన పేగు తెంచుకున్న కొడుకుల మధ్య చిచ్చు పెట్టి…చిన్న కొడుకు చేత..పెద్ద కొడుకును చంపించింది.. కసాయి తల్లి.చిన్న కొడుకు అబ్దుల్.ఖాసిద్ మరియు వారి బంధువులు తో కలిసి మరణాయుధాలుతో..పెద్ద కొడుకు బాషా పై దాడి చేపించగా గాయాలు పాలై చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించే మార్గం లో మృతి చెందాడు…. కేసు నమోదు చేసిన పోలీసులు వారి విచారణ లో నివ్వెర పోయే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి…సత్తెనపల్లి డిఎస్పీ.ఎమ్.హనుమంతరావు మరియు సి ఐ,ఏస్ఐ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కేసు వివరాలు తెలియచేశారు..
👉జవహర్ నవోదయపాఠశాలల్లో చేరాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చేనెల 9వ తేదీలోగా విద్యార్థులు నవోదయవిద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
👉ఏపీలో గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలు: మంత్రి కొల్లు రవీంద్ర*
ఏపీలో మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.డిస్టిలరీసు టెండర్ కమిటీ సంప్రదించి ధరలు నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే
నాణ్యమైనమద్యాన్ని అందుబాటులో తెచ్చామని వివరించారు. మద్యం దుకాణాలను పారదర్శకంగా
కేటాయించాలని కోరారు. గీత కార్మికులకు 340 దుకాణాల కేటాయింపునకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అలాగే నవంబర్ 15లోపు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయించ నున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
👉తడ: గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్..
తడ: గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్
తిరుపతి జిల్లా తడ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను తడ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ వద్ద బ్యాగ్స్ నలుగురు అనుమానస్పదంగా ఉన్నారని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు ఉన్నారు.
👉పెద్దమండ్యం: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడని పోక్సో కేసు..మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు పెద్ద మండ్యం సబ్ ఇన్స్పెక్టర్ పివి రమణ తెలిపారు. దామ్లా నాయక్ తండాకు చెందిన నాన్ కే నాయక్ (24) పదహారేళ్ల బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని తెలిపారు. తంబళ్లపల్లె మల్లయ్య కొండకు తీసుకెళ్లి 16వ తేదీన వివాహం చేసుకున్నారని కుటుంబీకులు తెలుసుకొని ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
👉కాలి బూడిద అయిన ద్విచక్ర వాహనం*
కంభం పట్టణంలో సాయిబాబా గుడి దగ్గర నుండి కోనేటి వీధికి పోవు మార్గాన ద్విచక్ర వాహనం కాలి బూడిద అయినది, సుమారు రాత్రి 11:30 సమయంలో ద్విచక్రవాహనం కాలుతున్నప్పుడు,అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్లు మంటలను చూసి భయభ్రాంతులకు గురై, ఎవరిదో ద్విచక్ర వాహనం కాలుతోందని, పక్కనే ఆటో ఉండగా, ఆటో వాళ్లను పిలిపించి ఆటోను పక్కకు జరిపినారు, అక్కడున్న వారిని అడగగా ఆ ద్విచక్ర వాహనం ఎవరిదో తెలియదని, ఎవరు కాల్చారు తెలియదని చెబుతున్నారు, ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి బూడిద అయినది. రాత్రి ఆ సమయంలో ఈ సంఘటన జరగడం వలన ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు,ఈ సంఘటన రాత్రి జరగడం వలన ఎవ్వరికి తెలియదని అక్కడి ప్రజలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.👉కాలి బూడిద అయిన ద్విచక్ర వాహనం విచారణ చేపట్టిన ఎస్ ఐ*
కంభం పట్టణంలో సాయిబాబా గుడి దగ్గర నుండి కోనేటి వీధికి పోవు మార్గాన ద్విచక్ర వాహనం కాలి బూడిద అయిన విషయం తెలుసుకున్న కంభం ఎస్ ఐ బి.నరసింహారావు సంఘటన స్థలానికి చేరుకుని,విచారణ చేపట్టి అక్కడి ప్రజలను అడిగి వివరాలు సేకరించారు,కాలిపోయిన ద్విచక్రవాహనాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.
👉ఎల్ కోట పాఠశాలను సందర్శించిన ఎంపీడీఓ*
కంభం: మండలంలోని ఎల్కోట అంగన్వాడీ కేంద్రాన్ని మరియు ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో వీరభద్రాచారి,ఆర్ఐఓ సైమన్ విక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను, పాఠశాల వసతులు,సౌకర్యాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయిలో బోధించడం ఉపాధ్యాయులకు వున్నటువంటి ఓ ప్రత్యేక కళ అనీ, తమ కళలతో విద్యార్థుల కలల సాకారానికి పునాదులు వేస్తూ ప్రజ్ఞా సౌధాలను నిర్మించడం గురువుల ప్రతిభకు,ప్రతిష్టకు నిర్వచనమంటూ కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని జి.అభిగైల్, ఉపాధ్యాయుడు వై.వేణుగోపాలాచారి,అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి పాల్గొన్నారు.

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి