కెసిఆర్ అంటే ఇష్టం- రఘురామ సంచలన వ్యాఖ్యలు .. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై హత్య…. జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గుమన్న విభేదాలు

👉 అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని మంత్రి నారా లోకేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు (CEOs), ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్‌లతో నారా లోకేష్ భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను నారా లోకేష్ వివరించారు.
కాగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ పర్యటన అమెరికా లో కొనసాగింది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియాస్పోరా యుఎస్ ఇండియా ప్రతినిధుల సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి, సంస్థ సిఈవో, వైస్ ప్రెసిడెంట్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
👉కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల వద్ద క్షుద్ర పూజలు కలకలం..*అన్నమయ్య జిల్లా..*
సుండుపల్లి మండలం కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల వద్ద క్షుద్ర పూజలు చేశారని కలకలం రేగింది.
సదరు క్షుద్ర పూజల అనుమానంపై విద్యార్థులు ఉపాధ్యాయుల్లో భయం అలుముకుంది.
అసలు కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై పూజలు చేయవలసిన అవసరం ఏముంది అన్న అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
చేసిన వ్యక్తి ఎవరు దేనికోసం చేశారు, ఏదైనా దురుద్దేశంతో సదరు పూజలు చేశారా అని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఇది క్షుద్ర పూజలేనా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సదరు విషయంపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు దృష్టిని కేంద్రీకరించి ఈ విధంగా భయాన్ని కలిగించే పూజలు చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని, విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో భయాన్ని పోగొట్టాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
👉చిన్నారిని రేప్ చేసి దారుణ హత్య!..నగరి నియోజక వర్గం..వడమాలపేట మండలం..

వడమాల పేట మండలం ఎ యం పురం(అబ్బీ కండ్రిగ) పంచాయతీ యానాది కాలనీకి చెందిన మధు కుమార్తె మూడున్నర సంవత్సరం కలిగిన చిన్నారి చెంచమ్మ అలియాస్ సాన్విక ను,అదే కాలనీలో వారికి సమీప బంధువు అయినా సుశాంత్(22)యువకుడు, చెంచమ్మను చాక్లెట్లు లేస్ తీస్తానని శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా రేప్ చేసి, చంపి అక్కడే పూడ్చి పెట్టేశాడు.చిన్నారి కోసం వెతుకులాడిన తల్లిదండ్రులు విచారించగా అసలు విషయం బయట చెప్పాడు.చిన్నారి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నిందితుడు సుశాంత్ పోలీస్ అదుపులో ఉన్నాడు.నిందితున్ని కఠినంగా శిక్షించాలని నగిరి నియోజవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదేశం…
👉 ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి*
*నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని హోమంత్రి ఆదేశం*
మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనలో నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
👉ఆడపిల్లల పెళ్లిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు*
అమరావతి :తల్లిదండ్రుల కుటుంబంలో కుమార్తె స్థానాన్ని పెళ్లి అనేది అంతం చేయదని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఓ కేసు విచారణలో ఈ కామెంట్స్ చేసింది. పెళ్లయిన కూతురికి తన పేరెంట్స్ కుటుంబంలో సభ్యురాలు కాదనడాన్ని తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కుమారులను, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించడం సరికాదని హై కోర్ట్ తెలిపింది. ఆడపిల్లలు పెళ్లయినా, కాకున్నా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో భాగమేనని కోర్టు స్పష్టం చేసింది.
👉తెలంగాణ విలువ పెంచింది కేసీఆరే..!కేసీఆర్‌ అంటే ఇష్టం..ఆయన పాలన బాగుండేది..పదేండ్లలో రాష్ట్రం విలువను పదిరెట్లు పెంచి చూపారు..పర్మిషన్లున్నా హైడ్రా ఇండ్లు కూల్చివేయడం అన్యాయం..బడ్జెట్‌ 3 లక్షల కోట్లుంటే..మూసీకి లక్షన్నర కోట్లా?..టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు..హైదరాబాద్‌..

‘నాకు వ్యక్తిగతంగా కేసీఆర్‌ అంటే చాలా ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. కేసీఆర్‌ పదేండ్లలో తెలంగాణ విలువను పది రెట్లు పెంచి చూపించారు’ అని టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని ఉండి 5వ పేజీలో
నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌ చేశారు. ఉదాహరణకు కరీంనగర్‌లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉండే ఎకరం ధర కేసీఆర్‌ హయాంలో రూ.70 లక్షలకు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల కూడా భూముల విలువ బాగా పెరిగిందని వివరించారు. హైడ్రా కూల్చివేతల విషయంపై స్పందిస్తూ.. ‘ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చిన నివాసాలను కూల్చివేయడం చూస్తుంటే మనస్తాపానికి గురిచేస్తున్నది. అది ఎంతమాత్రం న్యాయం కాదు’ అని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టు పునర్జీవంపై మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్‌ రూ.మూడు లక్షల కోట్లు ఉంటే, మూసీకి రూ.1.54 లక్షల కోట్లు ఖర్చుచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
👉హైడ్రా కమిషనర్‌కు అమీన్‌పూర్‌ బాధితుల ఫిర్యాదు*
ముగ్గురు వ్యక్తులు తమను మోసం చేశారని ఫిర్యాదు
తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూమిని అమ్మారని..
మాధవరెడ్డి, చంద్రశేఖర్‌, కోటేశ్వరరావుపై ఫిర్యాదు
ప్రభుత్వ భూమిలో పూర్తి సర్వే చేయించి..
బాధితులకు న్యాయం చేస్తానన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
👉బ్లడ్ శాంపిల్ తీయకుండానే.. రోగికి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు* కామారెడ్డి – రామవ్వ అనే పేషెంట్ వాంతులు, విరోచనాలతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేరింది.అయితే రోగికి రక్తం తీసుకోకుండానే బ్లడ్ శాంపిల్ రిపోర్టును రోగి బంధువుల చేతులో పెట్టడంతో వాళ్లు కంగుతిన్నారు
👉జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం..
జమ్ముకశ్మీర్‌లో ఏపీ విద్యార్థులు దుర్మరణం
జమ్ముకశ్మీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా.. వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతులు కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఆనంద రెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన కావ్య రెడ్డి (19)గా గుర్తించారు. పంజాబ్‌లోని లవ్‌వీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరిద్దరూ బీటెక్ చదువుతున్నారు.
👉 మైనారిటీ యువకులను కర్రలతో చితకబాదిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మనుషులు..శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని గోపనపల్లి డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మైనారిటీ యువకులను చితకబాదిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మనుషులు.బీఆర్ఎస్ పార్టీకి పని చేయకూడదని,గాంధీ చెప్పినట్టు వినాలని కర్రలతో దాడి చేసి, దారుణంగా కొట్టిన గాంధీ మనుషులు…
👉 తాడిపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్ పర్సన్ జేసి.ప్రభాకర్ రెడ్డి, జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డిఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంటకు తాడిపత్రి ఎమ్మార్వో ఆధ్వర్యంలో దీపం-2 పథకం(సూపర్ సిక్స్ పథకమైన ఉచిత గ్యాస్ సిలిండర్లు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ లు మరియు కౌన్సిల్ సభ్యులు,తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి, నాయకులు, కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది
👉ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బీటెక్ విద్యార్థిని చందన..

గుంటూరు విద్యానగర్ కు చెందిన పోతుగుంట్ల చందన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. నగరానికి చెందిన పోతుగుంట్ల అనిల్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె చందన అక్టోబర్ 20వ తేదిన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన ఫోటోలను కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో పంచుకున్నారు. అమరావతిలోని ఎస్ ఆర్ ఎం యూనివర్శిటిలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న చందన ,సిద్ధార్థ త్రిపాఠి ఆధ్వర్యంలో 18 మంది విద్యార్థుల బృందం అక్టోబర్ 11న గన్నవరం నుండి బయలుదేరి వెళ్లారు.హిమాలయ ఎవరెస్ట్ శిఖర బేస్ క్యాంప్ ను అధిరోహించి చందన బృందం రికార్డు నెలకొల్పింది. హిమాలయాన్ని అధిరోహించిన దేశంలోని తొలి ప్రైవేట్ కళాశాల విద్యార్థుల బృందం ఇదేనని నిర్వాహకులు తెలిపారు.
👉 గుత్తి రోడ్డు మార్కెట్ యార్డు గేటు వద్ద మద్యం బాగా తాగి రోడ్డుపై సేదదీరుతున్నాడు..బైక్ కు పోలీస్ అని స్టిక్కర్ వేసుకున్నాడు. దీంతో ఎవరూ అతన్ని లేపడానికి సాహసం చేయడంలేదు. పోలీస్ తాగి రోడ్డుపై పడిపోయాడంతూ రోడ్డున వెళ్లేవాళ్లంతా నవ్వుకుంటూ పోతున్నారు. మద్యం తాగి రోడ్లపై పడిపోయేవాడు,గంజాయి రవాణా చేసే క్రిమినల్స్ బైక్ లు, కార్లపై పోలీస్,ప్రెస్ స్టిక్కర్లు వేసుకొని నిర్భయంగా తిరుగుతున్నారు.ఈ స్టిక్కర్లు వేసుకొని తిరిగేవారిని పట్టించుకోని మన పోలీసులు గ్రేట్ కదా….
👉టీడీపీ – జనసేన పార్టీల మధ్య మరోసారి భగ్గు మన్న విభేదాలు..
టీడీపీ – జనసేన పార్టీల మధ్య పిఠాపురం వేదికగా మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే గత నెలలో పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైట్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సమయంలోనూ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. తాజాగా దెందులూరులోనూ పెన్షన్ కార్యక్రమంలో భాగంగా… ఇరు పార్టీల మధ్య తీవ్ర వేడి పరిస్థితులు తలెత్తాయి! దీనిపై ఇప్పటికే దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్… జనసేన నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇదే సమయంలో తాజాగా పిఠాపురంలో మరోసారి టీడీపీ – జనసేనల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి! ఇందులో భాగంగా… శుక్రవారం స్థానిక మున్సిపల్ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. ఇటు జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. ఈ సమయంలో మైకందుకున్న జనసేన నేత కురుమళ్ల రాంబాబు కండువాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ కూటమి అభ్యర్థా? టీడీపీ అభ్యర్ధా? అని జనసేన నేత కురుమల్ల రాంబాబు ప్రశ్నించారు. ఎందుకంటే.. ఆయన మెడలో మూడు కండువాలు ఉన్నాయి కానీ.. ఆయనతో వచ్చిన ఎవరిలోనూ మూడు కండువాలు లేవన్నట్లుగా వ్యాఖ్యానించడంతో గొడవ మొదలైంది.ఈ క్రమంలో ఆయన దగ్గర నుంచి మైకు తీసేసుకునే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు! ఈ క్రమంలో కూటమి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆ సమయంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ అక్కడే ఉన్నారు. కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?