జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

👉పిఠాపురం పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలు…
*ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..*పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
*క్రిమినల్స్ కు కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి..?..*అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి..*హోంమంత్రి అనిత కూడా ఇటీవల జరుగుతున్న ఘటనలపై బాధ్యత వహించాలి..*నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి..
*నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా’ అని వ్యాఖ్యా నించారు..

👉 కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు. ప్రకాశం జిల్లా మార్కాపురం..
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద దీక్షలు 20వ రోజు చేరుకున్న సందర్భంగా కార్మికులు కాళీ ప్లేట్లను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీక్షల ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి డి కె ఎం రఫీ మాట్లాడుతూ కార్మికులను తిరిగి వీధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆడదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 20 రోజులుగా పోరాడుతున్న కార్మికుల పట్ల అధికారుల మొండి పట్టుదల విడనాడి కార్మికుల పొట్ట కొట్టే చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు పోరాడుతున్న కార్మికులకు సమస్యలు తెలుసుకోవడం కూడా శిబిరం వద్దకు రాకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్మికుల పట్ల పెద్దల మాటలు కోటలు దాటుతున్నాయని ఆచరణ చేతలు దిగజారిపోతున్నాయని ఆయన అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని తిరిగి విధులకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కె సుబ్బరాయుడు జి హరి, నాగయ్య,హుస్సేన్, చెన్నకేశవులు, రమణ, సుబ్రహ్మణ్యం, సలాం ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
👉 గత ఐదేళ్లూ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. గుణదల ఈఎ్‌సఐ ఆస్పత్రి రోడ్డులోని రోటరీ క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.9.64 లక్షల కోట్ల అప్పు ఉందని, వచ్చే ఆదాయంలో సగం వడ్డీలకే సరిపోతుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతగా అప్పులు లేవని, గత వైసీపీ ప్రభుత్వం సంపద సృష్టిపై కాకుండా.. బటన్లు నొక్కడంపైనే దృష్టి పెట్టిందని అన్నారు. రాష్ట్రాన్ని దివాళా పరిస్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం ఆయనకే ఉందని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందాలని జేపీ ఆకాంక్షించారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేలా నేతలు చర్యలు తీసుకోవాలని కోరారు.
👉 ‘జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి
‘టివికె’ పార్టీ డిమాండ్‌..
నీట్‌, వక్ఫ్‌ సవరణలతో సహా పలు అంశాలపై 26 తీర్మానాలు..చెన్నై : ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తమిళనటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్ట్రి కజగం (టివికె) పార్టీ డిమాండ్‌ చేసింది. వక్ఫ్‌ సవరణ బిల్లు, నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)లను కూడా అది వ్యతిరేకిం చింది. పార్టీ మొదటి కాన్ఫరెన్స్‌ విజయవం తంగా నిర్వహించిన నేపథ్యంలో ఆదివారం నాడిక్కడ నిర్వహించిన టివికె కార్యనిర్వాహక మండలి, జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం వివిధ అంశాలపై 26 తీర్మానాలు ఆమోదించింది. ఈ తీర్మానాల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని, తమిళనాడులో డిఎంకెను విమర్శించింది.
ఒక దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన బిజెపిని, ఆ పార్టీ ఆధ్వర్యంలోని కంద్ర ప్రభుత్వాన్ని టివికె తీవ్రంగా విమర్శించింది. ప్రమాదకరమైన ఈ ప్రతిపాదనను అది వెనక్కి తీసుకోవాలని ఆ తీర్మానంలో డిమాండ్‌ చేసింది. సమావేశం అనంరతం టివికె పార్టీ అధ్యక్షుడు విజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఒక దేశం-ఒకే ఎన్నిక అనేది ప్రజాస్వామ్యం, ఫెడరలిజం సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. ప్రజాస్వామ్య రక్షణకు తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మరో తీర్మానం చేశారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ సమీక్షలో ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను ‘సమాఖ్య వ్యవస్థపై దాడి’గా తీర్మానం పేర్కొంది. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరింది.
నీట్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానంలో ‘రాష్ట్ర స్వయంప్రతిపత్తి విధానం మా డిమాండ్‌, దీని ప్రకారం విద్య రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. రాష్ట్ర జాబితాలోకి విద్యను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగానే నీట్‌ను రద్దు చేయగలదు’ అని పేర్కొన్నారు. విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులను సృష్టించడాన్ని టివికె కార్యనిర్వాహక కమిటీ వ్యతిరేకిస్తుందని, తప్పుడు వాగ్దానాలతో తమిళనాడు ప్రజలను మోసం చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు.
టివికె పార్టీ సిద్ధాంతాలు, విధానాలను పూర్తి హృదయపూర్వకంగానూ, బలంగానూ అనుసరించా లని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత డిఎంకె ప్రభుత్వ పాలనలో తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని సమావేశం ఆరోపించింది. ఈ మేరకు మరో తీర్మానాన్ని ఆమోదించారు.
👉కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్* ..సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న ప్రజాదర్బార్
కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 45 ప్రజాదర్బార్ ల నిర్వహణప్రజల నుంచి 4,753 విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ 2,219 సమస్యలకు పరిష్కారం చూపిన ప్రజాదర్బార్- విన్నపాల్లో సగానికి పైగా రెవెన్యూ, హోంశాఖకు సంబంధించిన సమస్యలే- విజ్ఞప్తుల త్వరితగతిన పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న మంత్రి
అమరావతిః రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, అనుకోని ఆపద ఎదురైనా మొదటగా గుర్తుకువచ్చేది విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపడుతున్న ప్రజాదర్బార్. ఇక్కడకు వస్తే చాలు.. తమ సమస్యలకు, కన్నీళ్లకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. మంత్రి లోకేష్ కు తమ గోడు వినిపిస్తే.. ఆలకించి అండగా నిలుస్తారని గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న ప్రజాదర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొదట మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ ఏర్పాటుచేయగా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బాధితులు తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.
*ఇప్పటివరకు 2,219 సమస్యలకు పరిష్కారం*
ప్రజాదర్బార్ ద్వారా ఇప్పటివరకు 4,753 విజ్ఞప్తులు స్వీకరించారు. 2,219 సమస్యలకు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ పరిష్కారం చూపింది. విజ్ఞప్తుల్లో సగానికి పైగా భూవివాదాలు, హోంశాఖకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్య, ఇళ్ల నిర్మాణం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన విజ్ఞప్తులు ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ అదనంగా 863 మంది ప్రజాదర్బార్ ద్వారా విన్నవించారు. ఆయా విన్నపాల్లో మొదటివిడతగా 350 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. త్వరలోనే వీరికి నియామక పత్రాలు అందించనున్నారు.
*సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం*
ప్రజాదర్బార్ కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ప్రజా విజ్ఞప్తులను శాఖల వారీగా విభజించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. ప్రజాదర్బార్ సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల వారీగా వచ్చిన సమస్యలు ఎన్ని పరిష్కారం చేయగలిగాం అని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా తానే మంత్రులతో మాట్లాడి సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటివరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిబ్బంది సంబంధిత శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
👉సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు !
వైసీపీ హయాంలో ఇష్టారీతిన తప్పుడు కేసులు టీడీపీ నేతల్ని వేధించే విభాగంగా మారిన సీఐడీ నడిపించిన ఇద్దరిలో ఒకరు సంజయ్. ఇలా చేసినందుకు వారికి అధికారికంగా డబ్బుులు దోచి పెట్టారు. ఆ వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎస్సీ,ఎస్టీ చట్టంపై అవగాహన సమావేశాలు పెడతానంటూ ఆయన కోటికిపైగా డబ్బులు డ్రా చేసుకున్నారు. కానీ మూడు లక్షలే ఖర్చు పెట్టారు. మిగతా అంతా దొంగ బిల్లులు పెట్టుకుని కొట్టేశారు. విజిలెన్స్ విచారణలో బయటపడటంతో ఇప్పుడు ఆయన కేసుల పాలై… ఉన్న సర్వీసు కాలంలో జైలుకెళ్లడమో లేకపోతే విచారణ ఎదుర్కోవడమో జరుగుతుంది. ఇక పోస్టింగ్ అనే ఆశలు లేనట్లే.
ఎస్సీ ,ఎస్టీలను అడ్డం పెట్టుకుని ఆయన ఇలా ప్రజాధనం దోచుకోవడంపై సివిల్ సర్వీస్ అధికారుల్లోనే అసహ్యం వ్యక్తమవుతోంది. నిజానికి ఆయన చాలా కుత్సిత మనస్థత్వం ఉన్న అధికారి అని ప్రచారం ఉంది. కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ అని అధికార వర్గాలు బహిరంగంగానే చెబుతూంటాయి. అలాంటి అధికారి ఓ సారి పోలీసు బదిలీల్లో లంచాలు తీసుకుని దొరికిపోవడంతో ఆ నివేదికను అడ్డంపెట్టుకుని ఆయనతో రాజకీయంగా తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు గతపెద్దలు. ప్రతిఫలంగా కొంత సొమ్ము దోపిడీకి అవకాశం ఇచ్చారు. ఇదే చాలని అనుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీలకు చట్టంపై అవగాహన కల్పిస్తానని చెప్పి డబ్బులు డ్రా చేసుకుని పెద్ద స్కామ్ చేశారు.
సంజయ్ కు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోస్టింగ్ లేదు. ఇస్తారని కూడా ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఆయనను అలా వదిలేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టి ఎంత మంది టీడీపీ నేతల్ని వేధించారో లెక్కే లేదు. తప్పుడు డాక్యుమెంట్లు కూడా తయారు చేశారు. ఇలాంటి వాటన్నింటికీ సరైన శిక్ష పడాల్సి ఉంది. ఇలాంటి వారిని వదిలేస్తే సివిల్ సర్వీస్ అధికారులు తాము ఏం చేసినా చెల్లుతుందనుకునే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది.
👉అధ్యక్షురాలిగా ఎన్నికైతే గాజా యుద్ధాన్ని ఆపుతా: కమలా హారిస్‌..
మిషిగాన్ ర్యాలీలో ఆదివారం డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ మాట్లాడారు. ఈ ర్యాలీలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే గాజా యుద్ధాన్ని ఆపుతానని వెల్లడించారు. తన శక్తినంతా ఉపయోగించి గాజా యుద్ధానికి ముగింపు తీసుకొస్తానని ప్రకటించారు. అక్కడ బందీలుగా చిక్కుకున్న వారిని విడిపిస్తానని వెల్లడించారు. కాగా, రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
👉తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ షాక్ తో యువకుల మృతి విషాదకరం: హోంమంత్రి వంగలపూడి అనిత*
*సామాజిక విప్లవకారుడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఘటన జరగడం మరింత బాధాకరం*
*ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం*
*క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని హోంమంత్రి ఆదేశం*
👉విశాఖ స్టీల్కు రూ.1650 కోట్ల సాయం*
ఏపీలో ఆర్థిక, నిర్వహణ సవాళ్లతో ఇబ్బందిపడుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.1650 కోట్ల
సాయం అందించింది. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 19న ఈక్విటీ కింద రూ.500 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద రూ.1150 కోట్లు అందించినట్లు వివరించింది.
సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకునేలా SBI ఆధ్వర్యంలో ఒక నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
👉 విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. పరిహారం ప్రకటన..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. పరిహారం ప్రకటన..ఆంధ్రప్రదేశ్ : తూ.గో. జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ తగిలి నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై సోమవారం సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం విషాదకరమన్నారు.
👉ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు!…
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం
గుర్తించింది. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్
వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో పదో తరగతి తర్వాత వారు 1,55,427 మంది ఉన్నట్లు తెలిపింది. 1-10 తరగతుల్లో చదువు మానేసిన 2.02 లక్షల మందిని గుర్తించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీకాకుళం…*
👉పలాసలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్*
పలాస రైల్వే స్టేషన్ లో మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిను తరలించేందుకు రైల్వే ప్లాట్ఫారం పై వేచి ఉన్న ముగ్గురు వ్యక్తులను పలాస జీఆర్పి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద ఉన్న సుమారు 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మీడియాతో ఆదివారం తెలిపారు.
👉 ఒంగోలులోని ప్రకాశం భవనంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రకాశం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు మరియు రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామాత్యులు, ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి . జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ , మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య , 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంక దినకర్ జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ,దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ,యర్రగొండ పాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉పొదిలి సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని, అభినందించిన జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్
*గంజాయి మరియు చోరి కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*
*కేసును ఛేదించుటలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
👉కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో “అన్నా”

*మార్కాపురం పట్టణంలో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే,YSRCP సమన్వయకర్త అన్నా రాంబాబు ప్రారంభించారు.పట్టణ ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా,నిబంధనలు అనుసరించి బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలని,అందరికీ ఆమోదయోగ్య సేవలందించాలని ఆయన అభిలషించారు.అనంతరం బ్రాంచ్ అధికారులు, సిబ్బంది అన్నా రాంబాబును సత్కరించారు*

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?