👉మహారాష్ట్ర 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు..మోడీ నల్ల చట్టాలు అదానీ,అంబానీలకే మేలు.. మోసగించిన మోడీని ఓడించండి..మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.
ప్రధాని మోడీని టార్గెట్ చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ రోజు ఉదయం మహారాష్ట్రకు చేరుకున్నారు. అక్కడ ఎన్నికల తంతు జరుగుతుండడంతో.. ప్రచారంలో భాగంగా రేవంత్ అక్కడికి వెళ్లారు. ఈ నెల 20న మహారాష్ట్రలో పోలింగ్ జరగబోతోంది.అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రచారంలో పాల్గొంటు న్నారు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొంత కాలంగా మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు. చివరకు ప్రధాని కూడా తెలంగాణలో అమలవుతున్న గ్యారంటీలపై అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారని ఆరోపించారు. మోడీ, బీజేపీ నేతలు ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు తాము నిజాలు వెల్లడిస్తూనే ఉంటామని రేవంత్ తనదైన స్టైల్‌లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న గ్యారంటీ గురించి మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకే తాను వచ్చానని తెలిపారు.
👉మోడీ నల్ల చట్టాలు తీసకొచ్చి అదానీ, అంబానీలకే మేలు చేయాలని మోడీ అనుకున్నారని, దేశంలోనే మహారాష్ట్రలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని రేవంత్ వెల్లడించారు. తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. వాటికి సంబంధించిన లెక్కలు కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశంలో మోడీ రైతుల సంక్షేమం మరిచిపోయారన్నారు. రైతుల విషయంలో మోడీ విమర్శలకు తాము గట్టి సమాధానం ఇచ్చామని, దాంతో మోడీ తన ట్వీట్‌ను దెబ్బకు డెలిట్ చేశారని అన్నారు. 👉కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 👉మహాలక్ష్మీ పథకం ద్వార రూ.500లకే గ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు.👉 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 50 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని అక్కడి ప్రజలకు వివరించారు. ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని రేవంత్ కొనియాడారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగంగాధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ఇక్కడి వారే అని చెప్పారు. వీరంతా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ఎందరికో దారిచూపారని అన్నారు. 👉అయితే.. మహారాష్ట్రకు 17 మెగా ప్రాజెక్టులు రావాల్సి ఉందని, కానీ వాటిని మోడీ గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. మోసం చేసిన బీజేపీని ఓడించండి అంటూ రేవంత్ పిలుపునిచ్చారు.😲😲😲
👉హమాస్ ను బహిష్కరించిన ఖతర్*
హమాస్ను బహిష్కరించాలని ఖతర్ నిర్ణయించింది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా బందీల విడుదల, కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హమాస్ను బహిష్కరించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలను ఈ మేరకు ఖతర్ అంగీకరించింది. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని హమాస్ నాయకులకు స్పష్టం చేసింది. దీనిపై హమాస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
👉 వల్లభనేని వంశీపై మళ్లీ నకిలీ ఇళ్ల పట్టాల కేసు !
ఏ కేసు భయంతో అయితే పార్టీ మారిపోయారో అదే కేసు ఇప్పుడు మళ్లీ వల్లభనేని. వంశీ మెడకు చుట్టుకుంటోంది. 2014-19 మధ్య కాలంలో వల్లభనేని వంశీ బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేయించి పంచారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ వైసీపై అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. వెంటనే ఆయన కొడాలి నానిని పట్టుకుని వైసీపీలో చేరిపోయారు. ఆయన భయాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడించారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఆయన ఎటూ కాకుండా పోయారు…పోనీ కేసు అయినా లేకుండా పోయిందా అంటే అదీ లేదు. ఆ కేసు మళ్లీ తిరిగి వచ్చింది. తమ పార్టీలో చేరిన వంశీపై నకిలీ పట్టాల కేసును పట్టించుకోలేదు వైసీపీ. కానీ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. అన్ని ఆధారాలు ఉన్నాయన్నది కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు వంశీపై కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి అవకాశం వస్తే టీడీపీ అయినా ఊరుకుంటుందా ?
వంశీ ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా కోర్టుల్లో వాయిదాలు ఉంటే అనుచరులకు నల్లకోట్లు వేయించి సెక్యూరిటీతో వస్తున్నారు. తర్వతా మాయమవుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ థర్డ్ ఫేజ్‌లో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంగతి తెలుస్తామన్న సంకేతాలు ఇచ్చిన సందర్భంలోనే.. కొత్తగా ఇళ్ల పట్టాల కేసు బయటకు రావడం వంశీకి బ్యాడ్ సిగ్నలే.
👉 ఫైళ్ల దహనం కేసులో సీఐడీ దూకుడు
ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత అనుచరుడుగా ఆర్డీవో మురళి వ్యవహరించారు. ఈయన హయాంలోనే, ఫోర్జరీ సంతకాలతో వైసీపీ ప్రధాన నాయకులు పేదల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన భూములను ఫ్రీ హోల్డ్ జాబితాలో ఎక్కించడంలో ఆర్డీవో మురళి కీలక పాత్ర పోషించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
👉మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసు ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం (AP Govt) చాలా సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో పైళ్ల దహనం కేసు విచారణలో సీఐడీ (CID) అధికారులు దూకుడు పెంచారు. ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూర్వపు ఆర్డీవో మురళికి చెందిన నివాసాలలో ఈరోజు (శనివారం) ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మదనపల్లి పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లోని మురళి నివాసంతో పాటు, తిరుపతిలో ఆయన కుమారుడు నివసిస్తున్న ఇంటిలోను ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఫ్రీ హోల్డ్ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించడంలో మురళి కీలక పాత్ర పోషించారనే అభియోగాలు ఉన్నాయి.
👉 తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం..
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం
తెలంగాణ : తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొంది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా.. అక్కడి ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అంతేగాకుండా తెలంగాణ అధికారులకు ఇక్కడ ఏం పని అంటూ.. అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మునుపటి ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
👉పొదిలి మానవతా సేవలు అభినందనీయం: స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి* రాష్ట్రంలోని అన్ని శాఖలలోనూ పొదిలి మానవత శాఖ సేవలు అభినందనీయమని ఆ సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తో కలిసి స్థానిక కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో పొదిలి యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వారు పర్యవేక్షించారు. రాష్ట్రలోని ఇతర శాఖల కంటే పొదిలి శాఖతీరు బాగుందని అభినందించారు. రాష్ట్రంలోనే తమ సంస్థ పొదిలి శాఖను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తుందన్నారు.కార్యక్రమంలో పొదిలి అధ్యక్షులు నాగేశ్వరరావు, కే. ఎలమందారెడ్డి, డైరెక్టర్స్ పార్థసారథి, బీవీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
👉 కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు-
సిఎస్ పురం కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శీలంవారిపల్లి గ్రామంలో శనివారం ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది ద్వారా గ్రామంలోని ప్రజలకు ఉచితంగా రక్తపరీక్షలు చేసిన పలు రకాల మందులు పంపిణి చేశారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ పి రఘుపతి,వైద్యసిబ్బంది,నర్సు రమ,విద్యార్దులు,అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. శ్రీవిద్యా,తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ఎస్ రహమాన్..
👉 కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా
1. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి) 2. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్ – చాగంటి కోటేశ్వర్ రావు
3. ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టిడిపి)
4. ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర ( అనకాపల్లి – టిడిపి )
5. ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టిడిపి )
6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల – టిడిపి )
7. ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప ( ఆదోని – టిడిపి )
8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ ( తిరుపతి – టిడిపి )
9. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – పాలవలస యశస్వి (శ్రీకాకుళం – జనసేన )
11.ఏపీ వాల్మీకి -బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ (బోజమ్మ) (ఆలూరు – టిడిపి )..12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి)..13. ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ ( తిరుపతి – టిడిపి )
14. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన)
15. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టిడిపి )
16. ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి ( పెందుర్తి – టిడిపి)
17. ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటిచింతల – ( మాచర్ల – టిడిపి)..18. ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టిడిపి )
19. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి ( మార్కాపురం – టిడిపి )..20 . ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ -మన్నవ మోహన్ కృష్ణ (గుంటూరు వెస్ట్ టిడిపి )
21. ఏపీ కల్చరల్ కమిషన్ – తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టిడిపి)..22. ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టిడిపి )..23. ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టిడిపి )
24. ఏపీ గ్రంధాలయ పరిషద్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట – టిడిపి )
25. ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టిడిపి )
26. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టిడిపి )
27. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
28. ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టిడిపి )
29. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టిడిపి )
30. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి )
31. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టిడిపి )
32. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టిడిపి )
33. ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టిడిపి )
34. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావాలి గ్రీష్మ ( రాజాం – టిడిపి )
35. ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ),పోలా నాగరాజు – టిడిపి (కడప జోన్ )
36. ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలతా ( చీరాల – టిడిపి )
37 . ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టిడిపి )
38. ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టిడిపి )
39. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి )
40 . అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టిడిపి )
41. అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి . వరుణ్ – అనంతపూర్ – జనసేన )
42. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టిడిపి )
43. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టిడిపి )
44. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టిడిపి )
45. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత ( చిత్తూరు – టిడిపి )
46. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన )
47. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టిడిపి )
48. మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ )
49. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టిడిపి )
50. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )
51. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )
52. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )
53. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టిడిపి )
54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టిడిపి)
55 . ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )..56. ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన)
57. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టిడిపి )
58. ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన )..59. ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ ( అరకు)
మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు…తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం..వల్లభనేని వంశీపై మళ్లీ నకిలీ ఇళ్ల పట్టాల కేసు..కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు….కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండో జాబితా ..హమాస్ ను బహిష్కరించిన ఖతర్.. ఫైళ్ల దహనం కేసులో సీఐడీ దూకుడు..మానవతా సేవలు అభినందనీయం
Recent Posts